01.12.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వ ఖజానాలకు తాళంచెవి - ఏక్ నామిగా (ఒకే బాబా యొక్క పేరు) అవ్వటం.

భగవంతుడిని కూడా వశం చేసుకునే పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -

బాప్ దాదా సదా పిల్లల యొక్క అదృష్టాన్ని చూసి ఓహో అదృష్టం! ఓహో అదృష్టం! అని హర్షిస్తున్నారు. ఎంత శ్రేష్ట అదృష్టం అంటే ఆ స్నేహ సంబంధం బాబాని కూడా తమ స్నేహ సంబంధంతో నిరాకారుడిని కూడా సాకారంగా చేస్తుంది. మాటలకు అతీతమైన బాబాని కూడా మాటలలోకి తీసుకువస్తుంది. స్వయం భగవంతుడిని ఏ స్వరూపంలోకి కావాలంటే ఆ స్వరూపంలోకి తీసుకువచ్చే యజమానికి సేవాధారిగా చేస్తుంది. బాబా యొక్క సర్వ ఖజానాలకు అధికారిగా అయ్యే మరియు బాబాని కూడా స్వయానికి సమర్పణ చేసుకునే తాళం చెవి పిల్లల చేతిలో ఉంది. ఏ పిల్లల చేతిలో అయితే ఈ తాళంచెవి ఉంటుందో వారి కంటే శ్రేష్టమైన వారు ఇంకెవరైనా ఉంటారా? ఈ తాళం చెవిని సంభాళించే జ్ఞాన సాగరులుగా మరియు తెలివైనవారిగా అయ్యారా? తాళం చెవి అయితే బాబా ఇచ్చేసారు. దీని ద్వారా ఒక్క సెకనులో ఏది కావాలంటే అది పొందవచ్చు. ఎప్పుడైతే రచయిత మీకు సేవాధారి అయ్యారో అప్పుడు సర్వ రచనలు శ్రేష్ట ఆత్మలైన మీ ముందు సేవ కోసం బందీ అయ్యి ఉంటాయి. అసురీ రావణుడు తన విజ్ఞాన శక్తితో ప్రకృతి అంటే తత్వాలను ఈరోజు కూడా తన ఆధీనంలో ఉంచుకుంటున్నాడు. మరి మీరు ఈశ్వరీయ సంతానం, మాస్టర్ రచయితలు, మాస్టర్ సర్వ శక్తివంతుల ముందు ప్రకృతి లేదా పరిస్థితులు దాసి అవ్వలేవా? మీ శాంతి శక్తి గురించి మంచిగా తెలుసుకుంటున్నారా లేక చాలా శక్తులు లభించిన కారణంగా దాని యొక్క గొప్పతనాన్ని మర్చిపోతున్నారా? విజ్ఞాన శక్తి యొక్క అణుశక్తి గొప్ప కర్తవ్యాన్ని చేయగలుగుతున్నప్పుడు, ఆత్మిక శక్తి మరియు పరమాత్మ శక్తి చేయలేదా? దాని అనుభవాన్ని ఇప్పుడు చాలా తక్కువగా మరియు అప్పుడప్పుడు చేసుకుంటున్నారు. పరమాత్మ శక్తిని మీదిగా చేసుకున్నారు, రూపాన్ని కూడా పరివర్తన చేయగలుగుతున్నారు. అయితే ప్రకృతి మరియు పరిస్థితుల రూపాన్ని, గుణాలను పరివర్తన చేయలేకపోతున్నారా? తమోగుణి ప్రకృతిని స్వయం యొక్క సతోగుణి స్థితి ద్వారా పరివర్తన చేయలేరా? స్వస్థితి ద్వారా పరిస్థితిపై విజయం పొందలేకపోతున్నారా? ఇలాంటి మాష్టర్ రచయితగా, శక్తిశాలిగా అయ్యారా? బాప్ దాదా పిల్లల యొక్క శ్రేష్ట ప్రాప్తిని చూసి ఒక్కొక్కరు ఎంత శ్రేష్ట ఆత్మ అంటే ఒక్కొక్క బిడ్డ చాలా అద్భుతాలు చేయగలడు అని సంతోషిస్తున్నారు. అంటే ఇంతమంది ఇంకెంత చేస్తారు? చాలా గొప్ప తాళంచెవి అయితే లభించింది. కానీ ఉపయోగించుకునేవారు ఉపయోగించటం లేదు. అందరికీ తాళంచెవి లభించిందా లేక కొంతమందికే లభించిందా! క్రొత్తవారు, పాతవారు, పెద్దవారు, చిన్నవారు అందరూ అధికారులే! ఈరోజుల్లో ఎవరినైనా పెద్దవారిని పిలిస్తే వారికి స్వాగతం చెప్పినప్పుడు, ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మొత్తం పట్టణం యొక్క తాళంచెవి ఇస్తారు కదా! అలాగే బాప్ దాదా పిల్లలకు ప్రోగ్రామ్ చేస్తూ స్వయం యొక్క మరియు ఖజానాల యొక్క తాళంచెవి రాగానే ఇస్తున్నారు. ఇది గారడీ తాళంచెవి. దీని ద్వారా ఏ శక్తిని ఆహ్వానిస్తే ఆ శక్తి స్వరూపంలోకి వచ్చేస్తుంది. ఈ గారడీ తాళం చెవి ద్వారా ఒక్క సెకనులో ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళగలరు. ఏ కాలాన్ని తెలుసుకోవాలంటే ఆ కాలాన్ని తెలుసుకునే ఆత్మిక జ్యోతిష్యులుగా కాగలరు. సంకల్ప శక్తిని ఏ వేగంతో, ఏ మార్గంలోకి తీసుకువెళ్ళాలో ఆవిధంగా తీసుకువెళ్ళే విధంగా సంకల్ప శక్తిపై అధికారం వస్తుంది. ఇటువంటి తాళం చెవి ఎందుకు ఉపయోగించటం లేదు? దాని గొప్పతనాన్ని తెలుసుకోలేదా? దాచి పెట్టుకునే సంస్కారం బయటికి వస్తుందా! సమాయానికి ఉపయోగపడుతుంది అని మంచి వస్తువుని దాచి పెట్టుకుంటారు కదా! కానీ మీరు ఈ తాళం చెవిని ప్రతి సమయం కార్యంలో ఉపయోగించండి. తాళంచెవిని ఉపయోగించుకోండి మరియు ఖజానాలను పొందండి. దీనిలో పొదుపు చేయకండి. కానీ (ఏక్ నామి) ఒకే పేరుని ప్రసిదద్ధి చేసేవారిగా అవ్వండి. ఏక్ నామిగా అవ్వటమే తాళం చెవిని ఉపయోగించే పద్ధతి. కానీ ఇది రావటం లేదా? ఈరోజుల్లో తాళంచెవిని వెంట ఉంచుకోవటం ష్యాషన్ కదా! కానుకగా కూడా తాళాల గుత్తిని (కీ చైన్) ఇస్తారు కదా! కానీ దీనిని సంభాళించుకోవటం కష్టం అవుతుందా? ఏదైనా పని చేసేటప్పుడు ఏ శక్తిని కావాలంటే ఆ శక్తిని ఈ తాళం చెవి ద్వారా ఆహ్వానించండి. అప్పుడు ప్రతి శక్తి మాష్టర్ రచయితలు అయిన మీకు సేవాధారిగా అయ్యి సేవ చేస్తాయి. ఆహ్వానించటం లేదు కానీ కర్మ యొక్క అలజడిలోకి వచ్చి ఆహ్వానానికి బదులు రాకపోకల యొక్క చక్రంలోకి వచ్చేస్తున్నారు. మంచి, చెడు, సఫలత, అసఫలత అనే రాకపోకల చక్రంలోకి వచ్చేస్తున్నారు. ఆహ్వానం చేయండి అంటే యజమానిగా అయ్యి ఆజ్ఞ ఇవ్వండి. ఈ సర్వ శక్తులు మీకు భుజాల వంటివి. మీ భుజాలు మీ ఆజ్ఞ లేకుండా ఏమైనా చేస్తాయా? కార్యం సఫలం చేయాలి అని సహనశక్తిని ఆజ్ఞాపించండి. అప్పుడు సదా సఫలత వచ్చే ఉంటుంది, చూడండి కానీ ఆజ్ఞ చేయటం లేదు ఏం చేస్తున్నారో తెలుసా? ఆజ్ఞ చేయటానికి బదులు భయపడుతున్నారు. ఎలా సహించగలం? ఎలా ఎదుర్కోగలం? చేయగలమా లేదా? ఇలా భయపడి ఆజ్ఞ ఇవ్వటం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? భయపడతారా లేదా ఆజ్ఞాపిస్తారా? మహాకాలుని యొక్క పిల్లలే భయపడితే ఇక ఎవరు నిర్భయంగా ఉంటారు? ప్రతి విషయంలో నిర్భయంగా అవ్వండి. సోమరితనం, నిర్లక్ష్యంలో నిర్భయంగా అవ్వవద్దు. మాయాజీతులుగా అవ్వటంలో నిర్భయంగా అవ్వండి. గారడీ యొక్క తాళం చెవి గురించి విన్నారు కదా? కానుకను సంభాళించుకోవటం నేర్చుకోండి మరియు సదా కార్యంలో ఉపయోగించండి.

ఈవిధమైన శ్రేష్ట అదృష్టవంతులకు, ఆత్మిక శక్తి స్వరూపాలకు, మాస్టర్ రచయితలకు, ప్రకృతి మరియు పరిస్థితుల యొక్క అధికారం పై విజయం పొందే సదా విజయీ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.