07.12.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బాబా సమానంగా సంపూర్ణంగా అయిన దానికి గుర్తులు.

సదా సర్వులకు ఉపకారం చేసే బాప్ దాదా పిల్లలతో మాట్లాడుతున్నారు -

సదా మీ స్మృతి యొక్క సమర్థత ద్వారా మూడు స్థానాలు మరియు మూడు స్థితులు నిరాకారి, ఆకారి మరియు సాకారి ఈ మూడు స్థితులలో సహజంగా స్థితులవ్వగలుగుతున్నారా? ఎలా అయితే ఆది స్థితి అయిన సాకార స్వరూపంలో సహజంగా స్థితులు అవ్వగలుగుతున్నారో అలాగే అనాది నిరాకారి స్థితి కూడా ఇంత సహజంగా అనుభవం అవుతుందా? ఇప్పుడిప్పుడే అనాది స్థితి మరలా ఇప్పుడిప్పుడే ఆది స్మృతి యొక్క సమర్ధత ద్వారా రెండు స్థితులలో సమానత అనుభవం అవ్వాలి. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? ఎలా అయితే సాకార స్వరూపం మీదిగా అనుభవం అవుతుంది మరియు స్థితులవ్వటం కూడా సహజంగా అనుభవం చేసుకుంటున్నారు. అలాగే మీ అనాది, నిరాకారి స్వరూపంలో,సదా ఒకే అవినాశి స్వరూపంలో స్థితులవ్వటం కూడా సహజంగా ఉండాలి. సంకల్పం చేసిన వెంటనే స్థితులైపోవాలి. దీనినే బాబా సమానమైన సంపూర్ణ స్థితి లేదా కర్మాతీత స్థితి అంటారు. అంతిమ స్థితికి ఎంత సమీపంగా చేరుకున్నాను? అని స్వయాన్ని అడగండి. ఎంత సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తారో అంటే బాబాకి సమీపంగా అవుతారో దానిని అనుసరించే భవిష్య ప్రాలబ్దంలో కూడా రాజ్యాధికారిగా అవుతారు మరియు వెనువెంట ఆది భక్తి జీవితంలో కూడా సమీప సంబంధంలో ఉంటారు. పూజ్య మరియు పూజారి రెండు జీవితాలలో సాకార బాబాకి సమీపంగా ఉంటారు. అంటే మొత్తం కల్పం ఆది ఆత్మ యొక్క సంబంధ సంపర్కాలలో ఉంటారు. హీరో పాత్రధారితో మీకు కూడా రకరకాలైన నామరూపాలతో విశేష పాత్ర ఉంటుంది. ఇప్పటి సంపూర్ణ స్థితికి సమీపంగా అంటే బాప్ దాదాకి ఎంత సమీపంగా ఉంటామో దాని ఆధారంగా కల్పమంతటి సమీపత ఆధారపడి ఉంటుంది. అందువలన ఎంత కావాలంటే అంత మీ కల్పం యొక్క ప్రాలబ్దం తయారు చేసుకోండి. సమీపతకి ఆధారం శ్రేష్టత. శ్రేష్టతకు ఆధారం - మీ మరజీవా జీవితంలో విశేషంగా రెండు విషయాలు పరిశీలించుకోండి. 1. సదా పరోపకారిగా ఉన్నానా? 2. ఆది నుండి అంతిమం వరకు సదా బాల బ్రహ్మచారిగా ఉన్నానా? అని. మరజీవా జీవితం యొక్క ఆదికాలం నుండి అంటే చిన్నతనం నుండి ఇప్పటి వరకు సదా బ్రహ్మాచారిగా ఉండాలి. బ్రహ్మాచారి జీవితం అంటే బ్రహ్మాబాబా సమానమైన పవిత్ర జీవితం. దీనినే బ్రహ్మచారి లేదా బ్రహ్మాచారి అనండి, ఆది నుండి అంతిమం వరకు అఖండంగా ఉండాలి. మాటిమాటికి ఖండితం అయిపోతే బాల బ్రహ్మచారి లేదా సదా బ్రహ్మాచారి అని అనరు. ఏ రకమైన పవిత్రత అంటే స్వచ్చత ఖండితం అయినా పరమ పూజ్యనీయులుగా కాలేరు. బాబా సమానంగా అవ్వని కారణంగా సమీప సంబంధాలలోకి కూడా రాలేరు. అందువలన శ్రేష్టతకు ఆధారం, సమీపతకి ఆధారం బాల బ్రహ్మచారి అంటే సదా బ్రహ్మాచారి. వీరినే తండ్రిని అనుసరించేవారు అని కూడా అంటారు. కనుక స్వయాన్ని అఖండంగా ఉన్నానా? అని పరిశీలించుకోండి. అఖండంగా ఉండేవారికి సర్వ ప్రాప్తులు కూడా అఖండంగా అనుభవం అవుతాయి. ఖండిత పురుషార్థులకు ప్రాప్తులు కూడా అల్పకాలికంగానే అనుభవం అవుతాయి. మీ రిజిష్టరుని సదా స్వచ్చంగా ఉందా అని పరిశీలించుకోండి. ఏ రకమైన మచ్చతో రిజిష్టరు పాడు చేసుకోలేదు కదా? సదా బ్రహ్మచారి అంటే సంకల్పంలో కూడా ఏ రకమైన అపవిత్రత వృత్తి యొక్క చంచలంగా చేయకూడదు. మొదట వృత్తి యొక్క చంచలతయే ఓడిస్తుంది తర్వాత దృష్టి మరియు కర్మ యొక్క చంచలత వస్తుంది. వృత్తి యొక్క చంచలతయే రిజిష్టర్‌పై మచ్చ పడేలా చేస్తుంది. అందువలన సదా వృత్తిలో కూడా సదా బ్రహ్మాచారిగా ఉండాలి.

ఈరోజు బాప్ దాదా పిల్లల యొక్క రిజిష్టరును చూస్తున్నారు. ఎంత మంది పిల్లలు సదా బ్రహ్మచారిగా ఉన్నారు మరియు ఎంత బ్రహ్మచారిగా ఉన్నారు అని. బాల బ్రహ్మచారులకు గొప్పతనం ఉంటుంది. బాల బ్రహ్మచారులు వర్తమాన సమయంలో కూడా పూజ్యులుగా అంటే శ్రేష్టంగా ఉంటారు. బాబా కూడా అటువంటి పిల్లలను పూజ్య రూపంలో చూస్తారు మరియు విశ్వం ముందు కూడా అంతిమంలో పూజ్యరూపంలో ప్రత్యక్షం అవుతారు. బాబా ముందు పూజ్యులుగా ప్రసిద్ధమైనవారు సదా సమీప సంబంధాలలో ఉంటారు. ఇలా మీ రిజిష్టరుని చూసుకోవాలి. రెండవ విషయం పరోపకారం. దీని విస్తారం చాలా గుహ్యమైనది. దీని విస్తారం స్వయం ఆలోచించండి. విశ్వం పట్ల మరియు బ్రాహ్మణుల పట్ల రెండు సంబంధాలలో సదా పరోపకారిగా అయ్యారా లేక ఒక్కొక్కసారి స్వ ఉపకారిగా, ఒక్కొక్కసారి పరోపకారిగా ఉన్నారా? వాస్తవానికి పరోపకారమే స్వ ఉపకారం. ఈ విధంగా ఈ విషయంలో కూడా మీ రిజిష్టరుని పరిశీలించుకోవాలి, తర్వాత బాప్ దాదా కూడా చెప్తారు. మంచిది.

సదా మీ యొక్క ఆది, అనాది స్వరూపంలో సహజంగా స్థితులయ్యే వారికి, సదా స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉండే పూజ్య ఆత్మలకు, మొత్తం కల్పంలో సమీప సంబంధాలలోకి వచ్చే ఆత్మలకు, సదా బ్రహ్మచారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.