12.12.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పరోపకారిగా ఏవిధంగా అవ్వాలి?

గుణాల సాగరుడు, సదా దాత, సర్వశక్తివంతుడు అయిన శివబాబా మాట్లాడుతున్నారు -

ఈరోజు ఆత్మిక పూలతోటను అనగా సదా ఆత్మిక గులాబీలు అయిన పిల్లల యొక్క సంఘటనను చూసి బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క విశేషతను చూస్తున్నారు. మూడు రకాలైన విశేషతలు ఉన్నాయి. 1. సదా తమ ఆత్మీయత యొక్క స్థితిలో సితులయ్యేవారు అంటే సదా వికసించి ఉన్నవారు. 2. ఆత్మీయత యొక్క స్థితిని అనుసరించి సదా వికసించి లేరు, కాని నిశ్చయ స్వరూపులుగా ఉన్న కారణంగా రూపం యొక్క సుందరత మంచిగా ఉంది. 3. బాబాతో స్నేహం మరియు సంబంధం ఆధారంగా సగం వికసించి ఉన్నా కూడా స్నేహం మరియు సంబంధం యొక్క సువాసనాభరితంగా ఉన్నారు. ఇలా మూడు రకాలైన ఆత్మిక గులాబీలు ఉన్న ఆత్మిక పూల
తోటను చూసి బాప్ దాదా సదా సువాసనను ఆస్వాదిస్తూ ఉంటారు. నేనెవరు? అని ఇప్పుడు స్వయాన్ని చూస్కోండి. మొదటి నెంబరు అవ్వటంలో ఏది లోపంగా ఉందో దానిని నింపుకుని సంపూర్ణంగా అవ్వండి. ఎందుకంటే సంపూర్ణుడైన తండ్రి యొక్క పిల్లలు కూడా తండ్రి సమానంగా సంపూర్ణంగా ఉండాలి. ప్రతి బిడ్డ యొక్క లక్ష్యం కూడా సంపూర్ణంగా అవ్వాలనే. కనుక లక్ష్యం అనుసరించి సర్వ లక్షణాలను స్వయంలో నింపుకుని సంపన్నంగా అవ్వండి. దీని గురించి విశేష ధారణలు ఇంతకు ముందు కూడా చెప్పాను - సదా బ్రహ్మచారి అంటే బ్రహ్మాచారి మరియు సదా పరోపకారి.

పరోపకారి యొక్క పరిభాష సహజమైనది కూడా మరియు అతిగుహ్యమైనది కూడా. 1. పరోపకారి అంటే ప్రతి సమయం బాబా సమానంగా ప్రతి ఆత్మలో గుణాలనే చూస్తారు. 2. పరోపకారులు ఎవరి యొక్క బలహీనత లేదా అవగుణాన్ని చూసినా కానీ తమ శుభ భావనతో, సహయోగం యొక్క కామనతో ఆ ఆత్మకు కూడా గుణవంతంగా అయ్యే శక్తిని దానమిస్తారు. 3. పరోపకారి అంటే సదా బాబా సమానంగా స్వయం యొక్క ఖజానాలను సర్వాత్మలకు ఇచ్చే దాత రూపంగా ఉంటారు. 4. పరోపకారులు సదా స్వయాన్ని ఖజానాలతో సంపన్నంగా నిశ్చింతా చక్రవర్తిగా అనుభవం చేసుకుంటారు. నిశ్చింత అంటే ఏ చింత ఉండదు. సంకల్పంలో కూడా చింత యొక్క సంస్కారం అనుభవం అవ్వదు. 5. పరోపకారి అంటే సదా విశేషంగా తమ మనస్సు అనగా సంకల్ప శక్తి ద్వారా, వాణి శక్తి ద్వారా, తమ సాంగత్యం యొక్క రంగు ద్వారా, సంబంధం యొక్క స్నేహం ద్వారా, సంతోషం యొక్క తరగని ఖజానా ద్వారా అఖండ దానం చేస్తూ ఉంటారు. ఏ ఆత్మ వారి సంపర్కంలోకి వచ్చినా కానీ సంతోష ఖజానాతో సంపన్నమై వెళ్తారు. అటువంటి అఖండ దానిగా ఉంటారు. విశేష సమయంలో లేదా సంపర్కంలో ఉండే కొద్దిమంది ఆత్మలకే దానిగా ఉండరు, సర్వుల కొరకు సదా మహాదానిగా ఉంటారు. పరోపకారులు స్వయం సంపన్నంగా ఉంటారు, కనుక ఏ ఆత్మ నుండి అయినా ఏదైనా తీసుకోవాలనే కోరిక ఉండదు. వీరు చేస్తే నేను చేస్తాను, వీరు మారితే నేను మారతాను, కొంచెం వారు మారితే కొంచెం నేను మారతాను, ఆ ఆత్మ ఒక విషయం పరివర్తన అయితే నేను పది విషయాలలో పరివర్తన అవుతాను... ఇలా సంకల్పంలో కూడా రాదు. ఇటువంటి భావనలు పెట్టుకునే వారిని పరోపకారి అని అనరు. మహాదానిగా అవ్వడానికి బదులు వ్యాపారం చేసే వ్యాపారస్థులుగా అయిపోతున్నారు. వారు ఇంత ఇస్తే నేను ఇంత ఇస్తాను, ఎప్పుడూ నేనే వంగి ఉండాలా, నేనే ఇస్తూ ఉండాలా ఎంత వరకు మరియు ఎప్పటి వరకు అలా చేస్తాను... ఇలాంటి సంకల్పాలు ఇచ్చే దాతలకు ఉండవు. ఇతరాత్మ ఏ బలహీనతకు అయినా వశం అయ్యి ఉంటే, సంస్కారానికి లేదా స్వభావానికి వశం అయ్యి ఉంటే లేదా ప్రకృతి సాధనాలకు వశం అయ్యి ఉంటే అటువంటి పరవశ ఆత్మ ఆ సమయంలో బికారి ఆత్మ. బికారి అంటే శక్తిహీనం, శక్తుల ఖజానాతో ఖాళీ.

మహాదాని అయిన వారు బికారి నుండి ఒక పైసా కూడా తీసుకోవాలనే కోరిక పెట్టుకోరు. వీరు మారాలి లేదా వీరు ఇది చేస్తే లేదా వీరు కొంచెం సహయోగం ఇస్తే, అడుగు ముందుకి వేస్తే .... ఇలాంటి సంకల్పాలు లేదా సహయోగం యొక్క భావన పరవశ, శక్తిహీన, బికారి ఆత్మలతో ఏమి కోరిక పెట్టుకుంటారు? కొంచెం తీసుకుని కొంచెం ఇచ్చే వారిని పరోపకారి అని అనరు. 7. పరోపకారి అంటే బికారిని సంపన్నం చేసేవారు, అపకారికి ఉపకారం చేసేవారు, నిందించేవారిని దగ్గరకి తీసుకునేవారు. పరోపకారులు తమ శుభ భావనతో, స్నేహంతో, శక్తితో, మధుర మాటతో, ఉత్సాహ ఉల్లాసాల యొక్క సహయోగంతో బలహీన ఆత్మను శక్తివంతులుగా తయారు చేస్తారు అంటే బికారిని చక్రవర్తి చేస్తారు. 8. పరోపకారులు త్రికాలదర్శిగా ఉంటారు. కనుక ప్రతి ఆత్మ యొక్క సంపూర్ణ సహయోగాన్ని ఎదురుగా ఉంచుకుని ప్రతి ఆత్మ యొక్క బలహీనతను పరిశీలించి ఆ బలహీనతను స్వయంలో ధారణ చేయరు కానీ ఆ ఆత్మ యొక్క బలహీనత అనే ముల్లుని కళ్యాణకారి స్వరూపంతో సమాప్తి చేస్తారు. ముల్లుకి బదులు ముల్లుని కూడా పువ్వుగా చేస్తారు. ఇటువంటి పరోపకారి సదా సంతుష్టమణి వలె స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు సర్వులను కూడా సంతుష్టం చేసేవారిగా ఉంటారు. అద్భుతం ఏమిటంటే నిరాశలో ఉన్నవారికి ఆశను ఉత్పన్నం చేస్తారు. 9. ఎవరి గురించి అయితే అందరు నిరాశ వ్యక్తం చేస్తారో అటువంటి వ్యక్తి లేదా అటువంటి స్థితిలో కూడా వారిలో సదాకాలికంగా ఆశాదీపాన్ని వెలిగిస్తారు. మీ జడచిత్రాలు ఇప్పటి వరకు కూడా అనేకాత్మల యొక్క అల్పకాలిక మనోకామనలను పూర్తి చేస్తున్నాయి. అయితే చైతన్య రూపంలో ఒకవేళ మీ సహయోగి అన్నయ్య లేదా అక్కయ్య పరివారంలోని ఆత్మలు తెలివితక్కువతనంతో లేదా చిన్న పిల్లల్లా మొండిగా అల్పకాలికమైనవాటిని సదాకాలిక ప్రాప్తిగా భావించి అంటే అల్పకాలిక పేరు, గౌరవాలను, ప్రఖ్యాతిని లేదా మరే అల్పకాలిక ప్రాప్తిని అయినా కోరుకుంటుంటే వారికి గౌరవం ఇచ్చి స్వయం నిర్మాణంగా ఉండటమే పరోపకారిగా అవ్వటం. ఇలా ఇవ్వటమే సదాకాలికంగా తీసుకోవటం. ఏమీ తెలియని చిన్న పిల్లలు నష్టం చేసే వస్తువులను కూడా ఆటబొమ్మగా భావిస్తుంటే, వారికి ఏదోకటి ఇచ్చి అప్పుడు చేతిలో ఉన్న దానిని తీసుకుంటారు, మొండిగా తీసుకుంటే సదాకాలికంగా నష్టం జరుగుతుంది అలాగే తెలివి తక్కువ ఆత్మలు కూడా ఆ సమయంలో అల్పకాలిక ప్రాప్తిని అంటే సదాకాలికంగా నష్టం చేసే విషయాలను తమ కళ్యాణ సాధనంగా అనుకుంటారు. వారిని బలవంతంగా ఆ విషయాల నుండి తొలగిస్తే చింతలోకి వచ్చేసి వారి పురుషార్ది జీవితాన్ని సమాప్తి చేసేసుకుంటారు. అందువలన ఏదోకటి ఇచ్చి సదాకాలికంగా విడింపించాలి. ఇలా యుక్తీయుక్తంగా నడవటం ద్వారా అల్పకాలిక బికారీ ఆత్మ స్వతహాగానే తెలివి తక్కువ నుండి తెలివైనదిగా అయిపోతుంది. ఇవి అల్పకాలిక సాధనాలు అని స్వయం అనుభవం చేసుకుంటుంది. ఇలా తెలివి తక్కువ ఆత్మలపై కూడా పరోపకారి అవ్వాలి. ఇటువంటి పరోపకారులు స్వతహాగానే స్వ ఉపకారిగా ఉంటారు. ఇవ్వటమే స్వయానికి తీసుకోవటం. మహాదానులు స్వతహాగానే సర్వ అధికారిగా అవుతారు. పరోపకారి యొక్క పరిభాష ఏమిటో అర్థమైందా!
ఇటువంటి పరోపకారులే సర్వాత్మల ద్వారా మనస్సు యొక్క ఆశీర్వాదాలకు అధికారిగా అవుతారు. ఇటువంటి పరోపకారి ఆత్మలపై సదా సర్వాత్మల ద్వారా ప్రశంసల పూలవర్షం కురుస్తుంది. అర్థమైందా! మంచిది.

ఈవిధంగా బాబా సమానంగా సదా ఉపకారి ఆత్మలకు, స్వయం మరియు సర్వుల పట్ల శుభ భావన, శ్రేష్ట కామన పెట్టుకునేవారికి, తరగని ఖజానాలకు యజమాని అఖండ దానులకు, మానసికంగా బలహీనంగా ఉన్నవారిని శక్తిశాలిగా తయారు చేసేవారికి, బికారిని సదాకాలిక చక్రవర్తిగా తయారు చేసేవారికి ఇటువంటి శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.