21.12.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ప్రతీ కల్పంలో అతి సమీప ఆత్మల యొక్క రూపం, రేఖ మరియు వేళ.

సర్వుల భాగ్యవిధాత అన్నీ తెలిసిన శివబాబా తన పిల్లలతో మాట్లాడుతున్నారు -

ఈరోజు బాప్ దాదా అమృతవేళ పిల్లలతో మధుర కలయిక జరుపుకుంటూ, నలువైపులా ఉన్న పిల్లలను చూసి పరస్పరం ఒక విశేషమైన విషయంపై ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ఏ విషయం గురించి? ప్రతీ బిడ్డ యొక్క దివ్యజన్మ యొక్క రూపురేఖలు లేదా జన్మించిన ఘడియని అనగా వేళని చూస్తున్నారు. ప్రతీ ఒక్కరి వేళ మరియు రూపురేఖల ఆధారంగా వర్తమాన సంగమయుగీ జీవితం మరియు భవిష్య జీవితం ఆధారపడి ఉంది. రూపంలో ఏమి చూశారు? జన్మిస్తూనే శక్తిరూపం యొక్క మెరుపు ఉందా, వియోగం నుండి యోగం యొక్క రేఖ ఉందా అంటే చాలా దప్పికతో ఉన్న రూపం ఉందా మరియు సేవాధారి స్వరూపం ఉందా, రాగానే సదా అతీంద్రియ సుఖం యొక్క రూపం ఉందా అని చూశారు. వాటితో పాటు రేఖలు ఏమి ఉన్నాయి? వస్తూనే సంపూర్ణ దీపపుపురుగుల యొక్క రేఖ ఉందా? లేదా పురుషార్థీ రేఖ ఉందా? వరదాని రేఖ ఉందా? ధైర్యం మరియు ఉల్లాసం యొక్క రేఖ ఉందా లేక జన్మ తీసుకుంటూనే సహయోగం ఆధారంగా నడిచే రేఖ ఉందా అని చూస్తున్నారు. అలాగే వేళని కూడా చూస్తున్నారు. సెకనులో నిశ్చయబుద్ధి అయ్యారా? ఏడు రోజుల కోర్సు తర్వాత అయ్యారా లేక చాలా సమయం తర్వాత నిశ్చయబుద్ధి అయ్యారా లేక సంశయం మరియు నిశ్చయం యొక్క యుద్ధం జరుగుతూ జరుగుతూ నిశ్చయబుద్ధి అయ్యారా లేక ఇప్పటికీ ఇంకా యుద్ధమే జరుగుతుందా? ఒక సెకనులో నిశ్చయం అంటే దృష్టి ద్వారా అద్భుతం. రెండవ నెంబర్ - శ్రేష్ఠ మాట ద్వారా అద్భుతం జరిగినవారు. మూడవ నెంబర్ - వ్యాపారస్తునితో వ్యాపారం చేసినట్లుగా విలువను మాటిమాటికీ తెలుసుకుని ఆ తర్వాత మరజీవ అయినవారు. నాలుగవ నెంబర్ - కొంచెం ప్రాప్తి, స్నేహం, సాంగత్యం, పరివర్తన ఆధారంగా ఇప్పుడే సంశయం మరలా ఇప్పుడే నిశ్చయం ఇలా ఉన్నవారు. ఈ రోజు బాప్ దాదా ప్రతీ బిడ్డలో ఈ మూడు విషయాలను చూసి ఆత్మిక సంభాషణ చేసుకున్నారు. 1. మరజీవ జీవితంలో సదా నిర్విఘ్నంగా తీవ్ర పురుషార్థంలో వెళ్ళేవారు. 2. ప్రాప్తి ద్వారా అనుభవీ మూర్తులుగా అయ్యే పురుషార్థీ జీవితం. 3. ఎక్కటం, దిగటం ఈ వేగంతో నడిచే జీవితం. ఈ మూడు జీవితాలు రంగు, రూపు. వేళపై ఆధారపడి ఉన్నాయి.

ఎవరైతే ప్రతి కల్పం యొక్క అతి సమీప ఆత్మలు లేదా పదమాపదమ్ భాగ్యశాలి ఆత్మలు ఉంటారో వారి రూపం, రేఖ మరియు వేళ ఏమి ఉంటాయో తెలుసా? అటువంటి వారు సెకనులో చేరుకుంటారు మరియు బాబా వారిగా అయిపోతారు. కల్పపూర్వ భాగ్యం యొక్క ప్రేరణ ఆధారంగా జన్మతోనే బ్రాహ్మణులుగా అవ్వటం కాదు, మేము బ్రాహ్మణులమే, మొదట కూడా ఉన్నాము, ఇప్పుడు కూడా ఉన్నాము అని అనుభవం చేసుకుంటారు. సెకనులో మనది అనేది అనుభవం అవుతుంది. చూసారు మరియు తెలుసుకున్నారు. ఇటువంటి వేళ వారి రూపం, రేఖ ఎలా ఉంటుంది? మొదటి నెంబర్ వారి వేళ గురించి ఇప్పుడు చెప్పాను. వారి రూపం ఏమి ఉంటుంది? జన్మతోనే ఒకే రూపంలో ఉంటారు. శక్తి, శాంతి మరియు సుఖమే కాదు జన్మతోనే అన్ని వారసత్వాలకు అధికారిగా ఉంటారు. ఇలా అన్ని స్వరూపాల యొక్క అధికారం యొక్క అనుభూతిని చేసుకుంటారు. ఎలా అయితే బీజంలో మొత్తం వృక్షం యొక్క సారం నిండి ఉంటుందో అలాగే నెంబర్ వన్ అంటే బాబా సమాన సమీప ఆత్మలు లేదా నెంబర్ వన్ వేళ కలిగిన ఆత్మలు సర్వ స్వరూపాల యొక్క ప్రాప్తి యొక్క ఖజానాలను వస్తూనే అనుభవం చేసుకుంటారు. ఇదే స్వరూపం నిజ స్వరూపం అని అనుభవం చేసుకుంటారు.సుఖం యొక్క అనుభవం అవుతుంది, శాంతి అనుభవం అవ్వటంలేదు, శాంతి అనుభవం అవుతుంది కానీ సుఖం, శక్తి యొక్క అనుభవం అవ్వటం లేదు ఇది మొదటి నెంబర్ వేళ వారి అనుభవం కాదు. సెకనులో వారసత్వం తీసుకోవటమనేది వారి వేళ మరియు స్వరూపం.

ఇప్పుడు రేఖ ఏమి ఉంటుంది? నిశ్చయబుద్ధిగా అవ్వాలి, నిశ్చయం చేసుకోవాలి అనేది సంకల్పమాత్రంగా ఉండదు. జన్మతోనే స్వతహాగా నిశ్చయబుద్ధి యొక్క రేఖ ఉంటుంది. ఎలా, అలా అనే విస్తారంలోకి వెళ్ళరు. అలా ఉండేవారము అనే దానిలో ఇలా, అలా అనే ప్రశ్నలే రావు. ఇలా జీవితమంతా తెగిపోని నిశ్చయబుద్ధి యొక్క రేఖ ఇతరాత్మలకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నిశ్చయ రేఖ యొక్క లైన్ అఖండంగా ఉంటుంది. మధ్య, మధ్యలో ఖండితం అవ్వదు. ఇటువంటి రేఖ కలిగిన వారి మస్తకంలో అంటే స్మృతిలో సదా విజయం యొక్క తిలకం కనిపిస్తుంది. ఇటువంటి రేఖ కలిగిన వారు ఎలా అయితే బ్రాహ్మణుల యొక్క భవిష్య రూపమైన శ్రీకృష్ణుడిని కిరీటధారిగా చూపించారో అలాగే జన్మతోనే సేవ యొక్క బాధ్యతా కిరీటధారులుగా ఉంటారు. సదా జ్ఞానరత్నాలతో ఆడుకునేవారిగా ఉంటారు. సదా స్మృతి మరియు సంతోషమనే ఊయలలో ఊగుతూ జీవితం గడిపేవారిగా ఉంటారు. సదా ప్రతి కర్మలో వరదానీ హస్తం తమపై ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. ప్రతి దినచర్యలో తమతో సర్వ సంబంధాలతో సమీపంగా మరియు సాకార రూపంలో తోడుని అనుభవం చేసుకుంటారు. స్వతహా యోగులుగా మరియు సహజయోగులుగా ఉంటారు. ఇది నెంబర్ వన్ రూపం, రేఖ, వేళ వారి గుర్తులు. స్వయాన్ని పరిశీలించుకోండి. మొదటి నెంబర్ రూపం, రేఖ, వేళ కలిగిన వారు ఎంతమంది ఉంటారు? 18 మందా లేక 108 మందా? మీరందరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు కూడా పరివర్తన చేసుకోవచ్చు. చివర వచ్చినా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా పరివర్తనకు అవకాశం ఉంది. ఇప్పుడింకా బాగా ఆలస్యమనే బోర్డ్ పెట్టలేదు. గుప్త పురుషార్థులు రాత్రి, పగలు ఒకే ధృడసంకల్పంతో పురుషార్థం చేసి హైజంప్ చేయగలరు అందువలన ఇప్పుడు కూడా మీ భాగ్యాన్ని నెంబర్ వన్ చేసుకునేటందుకు పురుషార్థం యొక్క లాటరీ వేస్తే నెంబర్ వస్తుంది. ఏమి చేయాలో అర్థమైందా? చివరి అవకాశం అందువలన జరిగిపోయిందేదో జరిగిపోయింది కనుక భవిష్యత్తుని శ్రేష్ఠముగా చేసుకోండి అందువలన బాప్ దాదా అందరికీ మరలా అవకాశం ఇస్తున్నారు. ఇక మరలా నిందించకండి. మేము చేయగలము కానీ చేయలేదు, సమయం లభించలేదు, పరిస్థితులు అనుకూలించలేదు అని. ఇప్పుడు కూడా దయాహృదయుడైన బాబా యొక్క దయ అనే చేయి అందరి పైన ఉంది కనుక స్వయంపై స్వయం కూడా దయాహృదయులుగా అవ్వండి. మంచిది. .

ఇలా సదా బాబా యొక్క వరదాలనే హస్తం మీపై ఉన్నట్లు అనుభవం చేసుకునేవారికి, సదా స్వయంపై మరియు సర్వులపై దయాహృయులు, తెగిపోని, అఖండ నిశ్చయబుద్ధి, అఖండ యోగులకు, సదా విజయీ తిలకధారులకు, జన్మతోనే కిరీటధారులకు, ఇలా సదా సింహాసనాధికారులకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.