28.12.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారం - సత్యత.

అవ్యక్త బాప్ దాదా మాట్లాడుతున్నారు...

ఈ రోజు బాప్ దాదా పిల్లలందరిని శక్తి సేన మరియు పాండవసేన రూపంలో చూస్తున్నారు. సేనాపతి తన సేనను చూసి హర్షిస్తున్నారు కూడా మరియు వెనువెంట తన సేన యొక్క మహారథీలు మరియు గుఱ్ఱపు సవారీలు ఇద్దరి కర్తవ్యం కూడా చూస్తున్నారు. మహారథీలు ఏమి చేస్తున్నారు మరియు గుఱ్ఱపు సవారీలు ఏమి చేస్తున్నారు అని. ఇద్దరు ఎవరి పాత్ర వారు అభినయిస్తున్నారు. ఇప్పటి వరకు డ్రామానుసారం ప్రతి ఒక్కరు ఏ పాత్ర అభినయించారో అది నెంబర్‌ వారీగా మంచిగా ఉంది కానీ ఇప్పుడు ఏమి చేయాలి? మహారథీలు ఇప్పుడు తమ యొక్క ఏ మహావీరతను చూపించాలి? బాప్ దాదా విశేషంగా మహావీరీనీలు మరియు మహావీరుల సేవా పాత్రను చూస్తున్నారు. ఇప్పటి వరకు సేవా క్షేత్రంలో ఎంత వరకు చేరుకున్నారు అని. ఎలా అయితే స్థూల సైన్యం యొక్క సేనాధిపతి దేశపటం ఆధారంగా సేన ఎంత వరకు చేరుకున్నారు, ఎన్ని స్థానాలలో విజయీగా అయ్యారు. అస్త్ర శస్త్రాలు మరియు సామాగ్రి యొక్క స్టాక్ ఎంత ఉంది. ఇక ముందు లక్ష్యం ఏమిటి! లక్ష్యం యొక్క గమ్యానికి ఎంత దూరంలో ఉన్నారు, ఏ వేగంతో వెళ్తున్నారు అనేది చూస్తారో అలాగే ఈరోజు బాప్ దాదా కూడా ఆది నుండి ఇప్పటికి వరకు చేసిన సేవాపటాన్ని చూస్తున్నారు. ఫలితం ఏమి చూసి ఉంటారు! మహావీర్ లేదా మహావీరినీలు సేవా క్షేత్రంలో ముందుకు వెళ్తున్నారు. అందరి వెంట శస్త్రాలు కూడా ఉన్నాయి, స్థానాలు కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆత్మిక బాంబ్ వేసారు. కానీ ఇప్పుడు పరమాత్మ బాంబ్ వేయాలి. ఆత్మిక సుఖం లేదా ఆత్మిక శాంతి యొక్క అనుభూతి, ఆత్మీయత యొక్క అనుభూతి యొక్క రకరకాలైన శస్త్రాలు నెంబర్ వారీగా సమయానుసారం కార్యంలో ఉపయోగించారు కానీ చివరి బాంబ్ పరమాత్మ బాంబ్ అంటే పరమాత్మ ప్రత్యక్షత యొక్క బాంబ్ వేయాలి. ఎవరు చూసినా, సంపర్కంలోకి వచ్చి విన్నా వారి ద్వారా బాబా వచ్చారు, స్వయంగా సర్వశక్తివంతుని కర్తవ్యం నడుస్తుంది అనే మాట రావాలి. ఇది అంతిమ బాంబ్ దీని ద్వారా నలువైపుల నుండి ధ్వని వస్తుంది ఇప్పుడు ఈ కార్యం మిగిలి ఉంది. ఇది ఎలా జరుగుతుంది మరియు ఎప్పుడు జరుగుతుంది? పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారం - సత్యత. సత్యతయే ప్రత్యక్షత. ఒకటి - స్వయం స్థితి యొక్క సత్యత మరియు రెండు - సేవలో సత్యత. సత్యతకు ఆధారం--స్వచ్ఛత మరియు నిర్భయత. ఈ రెండు ధారణల ద్వారా సత్యత ద్వారానే ప్రత్యక్షం అవుతుంది. ఏ రకమైన అస్వచ్ఛత అంటే కొద్దిగా అయినా సత్యత మరియు స్వచ్ఛత యొక్క లోపం ఉంటే కర్తవ్యం యొక్క సిద్ధి, ప్రత్యక్షత జరుగదు.

సత్యత మరియు స్వచ్ఛత. సత్యత అంటే ఎవరు, ఏవిధంగా ఉంటామో ఆ స్వతహా స్వరూపంలో స్థితులవ్వాలి. అంటే ఆత్మ యొక్క స్వతహా సత్వ ప్రధాన స్థితిలో స్థితులవ్వాలి. రజో మరియు తమో ప్రధాన స్థితులు సత్యత యొక్క స్వతహా స్థితులు కాదు. ఇవి సాంగత్యదోషం యొక్క స్థితులు. ఎవరి సాంగత్యం? రావణుడు లేదా మాయ యొక్క సాంగత్యం. ఆత్మ యొక్క సత్యత - సత్వప్రధాన స్థితి. ఇది మొదటి సత్యత. రెండవ విషయం - మాట మరియు కర్మలో కూడా సత్యత అంటే సత్యత యొక్క స్థితి సత్వధానంగా ఉందా లేక రజో మరియు తమో ప్రధానంగా ఉందా? సత్యత అనేదా స్వతహా సంస్కారంగా ఉందా లేక పురుషార్థంతో సత్యతా స్థితిని ధారణ చేయవలసి వస్తుందా? ఎలా అయితే బాబాని సత్యం అని అంటారో వాస్తవిక ఆత్మిక స్వరూపం కూడా సత్యం. సత్యతను సత్వప్రధాన స్థితి అని అంటారు. ఇటువంటి సత్యత ఉందా!

శుభ్రత అంటే స్వచ్ఛత. కొద్దిగా కూడా సంకల్పం ద్వారా కూడా అశుద్ధత అంటే చెడుని లేదా అవగుణాలను టచ్ చేయకూడదు. ఒకవేళ బుద్ది లేదా సంకల్పం ద్వారా అయినా స్వీకరించారు అంటే ధారణ చేసారు అంటే దానిని సంపూర్ణ శుభ్రత అని అనరు. ఎలా అయితే స్థూలంగా కూడా ఏ రకమైన మురికిని చూడటం కూడా ఇష్టమనిపించదు, చూడటంతోనే తొలగించేస్తారు అలాగే చెడుని ఆలోచించటం కూడా చెడుని టచ్ చేయటం అవుతుంది. వినటం, మాట్లాడటం మరియు చేయటం ఇలా స్వయమే చెడుని ధారణ చేస్తున్నారు. శుభ్రత అంటే స్వచ్చత. సంకల్పంలో కూడా అశుద్ధత ఉండకూడదు. దీనినే సత్యత మరియు శుభ్రత అంటే స్వచ్ఛత అంటారు. రెండవ విషయం, నిర్భయత. నిర్భయత యొక్క పరిభాష కూడా చాలా గుహ్యమైనది.

మొదటి విషయం - మీ స్వభావ, సంస్కారాలలో విజయీగా అవ్వటంలో నిర్భయత. ఏం చేయము, అవ్వటంలేదు, చాలా ప్రబలంగా ఉంది. ఇలా అనటం కూడా నిర్భయత కాదు. సంబంధం మరియు సంపర్కంలో సంస్కారాలు కలుపుకోవటం మరియు ఇతరాత్మల సంస్కారాలను పరివర్తన చేయటంలో కూడా నిర్భయంగా ఉండాలి. నడవగలమో లేదో తెలియదు, నిలుపుకోగలమో లేదో, అంగీకరిస్తారో, అంగీకరించరో ఇలా భయంతో ఉండటాన్ని కూడా నిర్భయత అని అనరు. మూడవ విషయం - విశ్వసేవలో అంటే సేవా క్షేత్రంలో వాయుమండలాన్ని మరియు ఇతరాత్మల సిద్ధాంతాల యొక్క పరిపక్వతను చూసి సంకల్పంలో అయినా వారి పరిపక్వత లేదా వాయుమండలం యొక్క ప్రభావం పడటం కూడా భయం.వారు గొడవ చేస్తారు, అలజడి అయిపోతుంది. ఇలా కూడా ఆలోచించకూడదు దీనిలో కూడా నిర్భయంగా ఉండాలి. ఆత్మ జ్ఞానులైన మీ కాండం ద్వారా వచ్చిన శాఖలు వారు తమ అల్పజ్ఞ మాన్యతలలో నిర్భయంగా ఉంటున్నారు, అల్ప మతాన్ని ప్రత్యక్షం చేయటంలో నిర్భయంగా ఉంటున్నారు. అసత్యాన్ని సత్యంగా ఋజువు చేయటంలో అటలంగా, అచంచలంగా ఉంటున్నారు. మరి సర్వజ్ఞుడైన బాబా యొక్క శ్రేష్ఠమతం లేదా అనాది, ఆది సత్యాన్ని ప్రత్యక్షం చేయటంలో సంకోచించటం కూడా భయం. శాఖలు చలించేవిగా ఉంటాయి కానీ కాండం స్థిరంగా ఉంటుంది. శాఖలు నిర్భయంగా ఉంటున్నాయి, కాండం చలిస్తుంది అంటే దీనిని ఏమంటారు! అందువలన ప్రత్యక్షతకు ఆధారమైన స్వచ్చత మరియు నిర్భయతను పరిశీలించుకోండి. దీనినే సత్యత అని అంటారు. ఈ సత్యత ఆధారంగానే ప్రత్యక్షత జరుగుతుంది. అందువలనే అంతిమ శక్తిశాలి బాంబ్ పరమాత్మ ప్రత్యక్షత ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఇప్పటి వరకు ఫలితంలో రాజయోగి ఆత్మలు శ్రేష్ఠము, రాజయోగం శ్రేష్ఠము, కర్తవ్యం శ్రేష్ఠము, పరివర్తన శ్రేష్ఠము అనేది ప్రత్యక్షం అయ్యింది కానీ నేర్పించేవారు డైరెక్ట్ సర్వశక్తివంతుడు, జ్ఞానసూర్యుడు సాకార సృష్టిపై ఉదయించారు ఇది కూడా ఇప్పుడు గుప్తంగా ఉంది. పరమాత్మ బాంబ్ యొక్క ఫలితం ఏముంటుంది!

విశ్వంలో సర్వాత్మలకు అల్పకాలిక తోడులన్నీ సమాప్తి అయ్యి ఒకే బాబా యొక్క తోడు అనుభవం అవుతుంది. ఎలా అయితే విజ్ఞాన సాధనాలైన బాంబుల ద్వారా దేశ, విదేశాలు సమాప్తి అయిపోయి మొదటి దృశ్యం ఏదీ కనిపించదు. అన్నీ సమాప్తి అయిపోతాయి అలాగే ఈ అంతిమ బాంబ్ ద్వారా సర్వ అల్పకాలిక సాధన రూపి సాధనాలు సమాప్తి అయ్యి ఒకే యదార్థ సాధన అయిన రాజయోగం ద్వారా ప్రతి ఒక్కరి మధ్యలో బాబా ప్రత్యక్షం అవుతారు. విశ్వంలో విశ్వపిత స్పష్టంగా కనిపిస్తారు. ప్రతి ధర్మంలో ఆత్మ ద్వారా మా తండ్రి హిందువులకు, ముస్లింలకు తండ్రి కాదు, అందరికీ తండ్రి అనే మాట వస్తుంది. దీనినే పరమాత్మ బాంబ్ ద్వారా అంతిమ ప్రత్యక్షత అని. ఇప్పుడు ఏమి చేస్తున్నారు మరియు ఏమి చేయాలి అనే ఫలితం విన్నారు కదా! ఇప్పుడు ఈ సంవత్సరం పరమాత్మ బాంబ్ వేయండి. బాబాని స్వచ్ఛత మరియు నిర్భయత ఆధారంగా సత్యత ద్వారా బాబాని ప్రత్యక్షం చేయండి. మంచిది.

సదా బాబాని విశ్వం ముందు ప్రత్యక్షం చేసేవారికి, సదా నిర్భయులుగా, సదా ఒకే ధ్వనిలో నిమగ్నమై ఉండే సహజ రాజయోగులకు, అంతిమ సమాయాన్ని సమీపంగా తీసుకువచ్చేవారికి అంటే సర్వాత్మల మనోకామనలను పూర్తి చేసేవారికి, బాబా సమానంగా దయాసాగరులుగా ఉండేవారికి, దయాహృదయులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.