02.01.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంపూర్ణత యొక్క సమీపతయే విశ్వ పరివర్తనా ఘడియకు సమీపత.

పిల్లల యొక్క జాతకము తెలిసిన దయాహృదయుడైన శివబాబా మాట్లాడుతున్నారు -

ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక బిడ్డ యొక్క ఆది నుండి అంతిమం వరకు సంగమయుగీ అలౌకిక జన్మ యొక్క జాతకం చూస్తున్నారు. ప్రతి ఒక్కరు దివ్య జన్మ తీసుకుంటూనే బాప్ దాదాతో లేదా స్వయంతో ఏమేమి ప్రతిజ్ఞలు చేసారు? మరియు ఇప్పటి వరకు ఏయే ప్రతిజ్ఞలను ఎంత శాతంలో నిలుపుకున్నారు, ప్రతిజ్ఞ చేయటం మరియు నిలుపుకోవటంలో ఎంత తేడా ఉంది లేదా చేయటం మరియు నిలుపుకోవటం రెండూ సమానంగా ఉన్నాయా అని జన్మపత్రాన్ని చూస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి బిడ్డ శక్తిననుసరించి బాబా ముందు ప్రతిజ్ఞ చేస్తున్నారు. కానీ ఫలితంలో ఏమి చూశారు? ప్రతిజ్ఞ చేసే సమయంలో చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో ధైర్యంతో సంకల్పం చేస్తున్నారు. కొంచెం సమయం సంకల్పాన్ని సాకారంలోకి తీసుకురావడానికి, సమస్యలను ఎదుర్కోవడానికి శుభభావనతో, కళ్యాణకారి కామనతో, సంపర్కంలోకి వచ్చి సఫలతా మూర్తులుగా అవుతున్నారు. కానీ నడుస్తూ నడుస్తూ కొంచెం సమయం తర్వాత పూర్తి ధ్యాస పెట్టుకోవటానికి బదులు కేవలం ధ్యాస పెట్టుకుంటున్నారు. మరియు ఆ ధ్యాస మధ్యమధ్యలో మారిపోయి అలజడి రూపంగా అయిపోతుంది. విజయం మా జన్మ సిద్ధాధికారం అనే సమర్థ సంకల్పం యొక్క రూపం నెమ్మది నెమ్మదిగా పరివర్తన అయిపోయి జన్మ సిద్ధాధికారానికి బదులు అప్పుడప్పుడు బాప్ దాదా ముందు అధికారం ఇవ్వు, శక్తి ఇవ్వు అనే మాటలు మాట్లాడుతున్నారు. మాట ఒకటి అయితే అది ఇంకొక మాటలోకి మారిపోతుంది. మాస్టర్ దాత, వరదాత అవ్వటానికి బదులు తీసుకునేవారిగా అయిపోతున్నారు. ఇలా పురుషార్థం యొక్క స్థితి అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థంగా, అప్పుడప్పుడు పురుషార్థంగా, ఒక్కొక్కసారి అలజడిగా, ఒక్కొక్కసారి అచంచలంగా నడుస్తున్నారు. మరియు నడుస్తూ నడుస్తూ ఆగిపోతున్నారు. ఇప్పటి వరకు ఫలితంలో మార్గంలో ఉండే దృశ్యాలు గమ్యానికి దూరం చేసేస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఇదే ఆటని చూపిస్తున్నారు కానీ ఇది ఎప్పటి వరకు?

బాప్ దాదా ఇప్పుడు క్రొత్త ఆటను చూడాలనుకుంటున్నారు. అందువలన ఈ క్రొత్త సంవత్సరంలో ప్రతి దృశ్యం యొక్క లక్ష్యం సదా విజయీగా ఉండాలి ఈ క్రొత్త ఆటని చూపించండి. మేము విజయీలమే, విజయీలుగానే ఉంటాము అనే సంకల్పం సదా ప్రతి కర్మలో ప్రత్యక్షంగా కనిపించాలి. ఎలా అయితే కల్పపూర్వం యొక్క స్మృతిచిహ్నం ఉంది కదా! ప్రతి ఒక శక్తిసేన యొక్క చేతిలో విజయీ జెండా ఎగురుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా శ్రేష్టాత్మలైన మిమ్మల్ని విజయీ రత్నాల రూపంలో ప్రపంచంవారు స్మరణ చేస్తున్నారు మరియు పూజిస్తున్నారు. పురుషార్థం చేయటానికి కూడా చాలా సమయం లభించింది. నెంబర్ వారీగా శక్తిననుసరించి పురుషార్ధం కూడా చేసారు. ఇప్పుడు ఏమి చేయాలి? ఇప్పుడు పురుషార్ధం యొక్క ప్రత్యక్ష ఫల స్వరూపంగా అంటే సఫలతా స్వరూపంగా అయ్యి స్వయం కూడా ప్రతి కార్యంలో సఫలులుగా అవ్వండి మరియు సర్వాత్మలకు కూడా సఫలతామూర్తి యొక్క వరదానం ఇవ్వండి. పురుషార్థి స్వరూపానికి బదులు వరదాని, మహాదాని స్వరూపంలో ఉండండి దీని ద్వారా స్వయం కూడా ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకోగలరు మరియు ఇతరాత్మలని కూడా ప్రత్యక్ష ఫలానికి అధికారిగా చేయగలరు. ఇప్పుడు భాషని పరివర్తన చేసుకోండి. స్వభావ, సంస్కారాలని కూడా పరివర్తన చేసుకోండి. స్వయాన్ని కూడా పరివర్తన చేసుకోండి. స్వభావ, సంస్కారాలు సర్వాత్మలను కూడా ప్రత్యక్షఫలం యొక్క అధికారిగా చేస్తాయి. ఇప్పుడు భాషను కూడా పరివర్తన చేసుకోండి. ఎలా అయితే విశ్వపరివర్తన యొక్క ఘడియారం సమీపంగా పరుగు పెడుతుందో అలాగే మన సంపూర్ణత యొక్క సమీపతయే విశ్వ పరివర్తనా ఘడియకు సమీపత. అందువలన ఇప్పుడు జరిగిపోయిందేదో జరిగిపోయింది అని భావించి వ్యర్థ ఖాతాని సమాప్తి చేసుకోండి. సదా ప్రతి సంకల్పంలో సమర్థ ఖాతాని జమ చేసుకోండి. ఇప్పటి నుండి సదాకాలికంగా స్వయాన్ని కిరీటధారిగా, తిలకధారిగా మరియు సింహాసనాధికారిగా అనుభవం చేసుకోండి. తిలకం చెరిగిపోవటం అంటే స్మృతి నుండి క్రిందికి వచ్చేయటం. ఇప్పుడు ఈ విషయాలను కలలో కూడా సమాప్తి చేసేయండి. ఇటువంటి సమాప్తి సమారోహం జరుపుకోండి. విశ్వ సేవలో సంకల్పం, మాట, కర్మతో రాత్రి, పగలు సత్యమైన సేవాధారులుగా అయ్యి సంఘటిత రూపంలో సదా తత్పరులై ఉండండి. ఈ విశ్వసేవ ద్వారా స్వ ఉన్నతిలో స్వతహాగానే ఎక్కేకళ ఉంటుంది. పుణ్యాత్మగా అయ్యి పుణ్యం యొక్క ఫలాన్ని పొందుతున్నాను అని సదా అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే సమయం యొక్క సమీపతననుసరించి ప్రతి శ్రేష్టకర్మకు ఫలంగా సదా సంతుష్టత వర్తమానంలో మరియు భవిష్యత్తులో కూడా లభిస్తుంది. ఇప్పుడు ప్రాప్తి యొక్క మిషనరీ చాలా తీవ్రగతితో అనుభవం చేసుకుంటారు. వ్యర్థానికి మరియు సమర్ధానికి రెండు కర్మలకి ఫలితం లక్ష రెట్లు ప్రాప్తి ఏమి లభిస్తుంది అనేది ఇప్పుడు అనుభవం చేసుకుంటారు. అందువలన ఇప్పుడు లక్ష రెట్లు జమ చేసుకునే సమయం ఇప్పుడు చాలా కొద్దిగా మిగిలి ఉంది. ఇప్పుడు జమ చేసుకోవటమే జన్మ జన్మాంతరాల ప్రాలబ్దాన్ని తయారుచేసుకోవటం. దీని కొరకు విశేషంగా ఏమి చేయాలి? కేవలం రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. 1. సదా స్వయాన్ని విశేషాత్మగా భావించి ప్రతి సంకల్పం, కర్మ చేయండి. 2. సదా ప్రతి ఒక్కరిలో విశేషతలనే చూడండి. ప్రతి ఆత్మపై విశేషాత్మ అనే భావన పెట్టుకోండి. వెనువెంట విశేషంగా తయారుచేసే శుభ కళ్యాణ కామన పెట్టుకోండి. సదా ఒక విషయం యొక్క ధ్యాస ఉంచుకోండి - ఏ బలహీనత లేదా అవగుణాన్ని ప్రతి ఆత్మ వదలటానికి పురుషార్ధం చేస్తుందో అలా ఇతరులు వదిలేసిన వస్తువుని స్వయం ఎప్పుడు ధారణ చేయకండి. ఇతరులు పాడేసిన వస్తువులని తీసుకోవటం ఇది ఈశ్వరీయ వ్యక్తిత్వం (రాయల్టీ) కాదు. ఉన్నత ఆత్మలు ఇతరులు పాడేసిన గొప్ప వస్తువులు కూడా తీసుకోరు. ఈ అవగుణాలు అనేవి మురికి వాటిని సంకల్పంలో అయినా ధారణ చేయటం మహాపాపం. అందువలన ఈ విషయంపై ధ్యాస ఉంచుకోండి. ఎవరి బలహీనతలు లేదా అవగుణాలను చూసే నేత్రాన్ని సదా కాలికంగా మూసేయండి. ధారణ చేయకండి, వర్ణన చేయకండి. భక్తులు మీ చిత్రాలకి కూడా మహిమ చేసేటప్పుడు ప్రతీ అవయవానికి మహిమ చేస్తున్నారు, పాడుతూ కీర్తన కూడా చేస్తున్నారు. అలాగే మీరు కూడా చైతన్య రూపంలో ఒకరికొకరి గుణగానం చేయండి. విశేషతలను వర్ణన చేయండి. ఒకరికొకరు స్నేహం మరియు సహయోగం అనే పుష్పాలను ఇచ్చి పుచ్చుకోండి. ప్రతి కార్యంలో అలాగే మరియు ముందు మీరు అనే చేతిని అందించండి. సదా ప్రతి విశేషాత్మ ముందు ఆత్మిక వృత్తి, ఆత్మిక తరంగాల అనే ధూపాన్ని వెలిగించండి. ఏ ఆత్మలు సంపర్కంలోకి వచ్చినా వారికి సదా మీ ఖజానాలతో వెరైటీ భోగ్ (నైవేద్యం) చేయండి. అంటే ఖజానాలను పంచి పెట్టండి. ఎప్పుడైతే ప్రత్యక్షంగా ఈ ఆత్మిక ఆచారం ప్రారంభించారో అప్పుడే భక్తిలో ఈ ఆచారం నడుస్తూ వస్తుంది. ఈ సంవత్సరం ఏమి చేయాలో విన్నారా? ఈరోజు స్వ పరివర్తన యొక్క విషయాలు వినిపించారు. సేవాక్షేత్రంలో ఏమి చేయాలి అని సేవ గురించి మరోసారి వినిపిస్తాను.

ఈవిధంగా సదా సంపన్న మూర్తులకు, వ్యక్తిత్వం యొక్క నిజ సంస్కారం కలిగిన ఆత్మలకు, సదా తిలకం, కిరీటం, సింహాసనాధికారిగా ఉండే ఆత్మలకు, సదా ప్రతి కర్మ యొక్క ప్రత్యక్ష ఫలం తినే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.