23.01.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సదా సౌభాగ్యమే సదా సంపన్నత.

అమరనాథుడైన శివబాబా యొక్క సత్యమైన సౌభాగ్యశాలి పార్వతులతో పతి పరమేశ్వరుడైన శివబాబా మాట్లాడుతున్నారు:-

ఈరోజు బాప్ దాదా పిల్లల యొక్క శ్రేష్ట భాగ్యాన్ని మరియు సదా సౌభాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. ప్రతి బిడ్డ భాగ్యశాలి మరియు సదా సౌభాగ్యశాలి. భాగ్యవిధాత ద్వారా లభించిన భాగ్యం గురించి మంచిగా తెలుసుకుంటున్నారా! విశ్వంలో జీవితం యొక్క శ్రేష్టత ఈ రెండు విషయాల ద్వారా ఉంటుంది. 1. సౌభాగ్యం 2. భాగ్యం. సదా సౌభాగ్యశాలిగా లేకపోతే మొత్తం జీవితం వ్యర్థంగా అనుభవం చేసుకుంటారు మరియు నీరసంగా భావిస్తారు. కానీ మీది అవినాశి సౌభాగ్యం. ఇది ఎప్పుడు తొలగిపోయేది కాదు. ఎందుకంటే మీకు అవినాశి అమరనాధుడే మీ సౌభాగ్యం. ఎలాగైతే బాబా అమరమైన వారో అలాగే మీ సౌభాగ్యం కూడా అమరమైనది. సౌభాగ్యవంతులు స్వయాన్ని సదా ప్రపంచంలో శ్రేష్టంగా భావిస్తారు. సౌభాగ్యవంతులకు సదా తోడు ఉన్న కారణంగా స్వయాన్ని సంతుష్టంగా భావిస్తారు. ఈ రోజుల్లో ప్రపంచంలో దేనిని శ్రేష్ట కార్యంగా భావిస్తారో ఆ శ్రేష్ట కార్యానికి సౌభాగ్యవంతులనే నిమిత్తం చేస్తారు. సౌభాగ్యవంతులు సదా అలంకరణకి అధికారిగా ఉంటారు. సౌభాగ్యం లేకపోతే అలంకరణ కూడా ఉండదు. సౌభాగ్యానికి గుర్తు - తిలకం మరియు గాజులు. సౌభాగ్యవంతులు సదా సౌభాగ్యం కారణంగా సౌభాగ్యం యొక్క అన్ని ఖజానాల యొక్క అనుభవం చేసుకుంటారు అంటే స్వయాన్ని సంపన్నంగా భావిస్తారు. ఈ ఆచారాలన్నీ అవినాశీ సౌభాగ్యం యొక్క స్మృతిచిహ్న రూపంలో నడుస్తూ వస్తున్నాయి. మీరందరు సత్యమైన సౌభాగ్యవంతులు. విశ్వంలో శ్రేష్టాత్మలుగా కీర్తించబడుతున్నారు మరియు పూజింపబడుతున్నారు. ఈనాటి విశ్వం సదా సౌభాగ్యవంతులైన మీ యొక్క జడ చిత్రాలను చూసి ఈ ఆత్మలు అమరనాథుడు అంటే పతీ పరమేశ్వరుడైన సత్యమైన పార్వతులు అని సంతోషపడుతున్నారు. సత్యమైన సౌభాగ్యవంతులు అయిన మీరు సదా స్మృతి తిలకధారులు మరియు మర్యాదలు అనే కంకణాలు ధరించే ఆత్మలు. సదా దివ్య గుణాలు అనే అలంకరణతో అలంకరించబడిన ఆత్మలు. మీరు సదా సౌభాగ్యశాలి ఆత్మలు అంటే సదా సర్వఖజానాలతో సంపన్న ఆత్మలు మరియు విశ్వ పరివర్తన అనే శ్రేష్ట కార్యానికి లేదా శుభకార్యానికి నిమిత్తులు. సంగమయుగం యొక్క ఈ శ్రేష్ట, అవినాశి, బేహద్ సౌభాగ్యం యొక్క ఆచారాలే హద్దులో సౌభాగ్యంలో కూడా నడుస్తూ వస్తున్నాయి. సదా సౌభాగ్యవంతులుగా అంటే సదా సంపన్నగా మరియు సదా హర్షితంగా అనుభవం చేసుకుంటున్నానా? అని స్వయాన్ని పరిశీలించుకోండి. సదా స్వయాన్ని ఆత్మ మరియు పరమాత్మతో కంబైండ్ రూపాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఒంటరిగా ఉన్నారా లేక దంపతులుగా ఉన్నారా? ఒంటరిగా భావిస్తే వియోగి జీవితాన్ని అనుభవం చేసుకుంటారు. సదా సౌభాగ్యశాలిగా అంటే కలిసి ఉన్నట్లుగా భావిస్తే సదా కలయిక సభలో ఉన్నట్లు స్వయాన్ని అనుభవం చేసుకోగలరు.

చాలా కాలం నుండి వేరు అయిపోయారు, కనుక మీ అవినాశి తోడుని కూడా మర్చిపోయారు. సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నారు. తిలకాన్ని చెరిపేసుకున్నారు, అలంకరణని పోగొట్టుకున్నారు, ఖజానాల నుండి కూడా వంచితం అయిపోయారు. సదా సౌభాగ్యశాలుల నుండి ఎలా అయిపోయారు? బికారీలుగా అయిపోయారు, వియోగిగా అయిపోయారు. మరలా అమరునాధుడు వచ్చి చాలా కాలం నుండి తప్పిపోయిన పార్వతులను తన స్మృతి అనే తిలకం ఇచ్చి మరలా సౌభాగ్యశాలిగా తయారు చేసారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత అందమైన కలయిక జరిగింది. ఈ కలయిక నుండి ఇప్పుడు ఒక్క సెకను కూడా వంచితం కాకూడదు. ఈవిధమైన తోడుని నిలుపుకునేవారే కదా! ఈరోజు బాప్ దాదా తన పార్వతుల యొక్క అలంకరణను చూస్తున్నారు - ప్రతి ఒక్క పార్వతి ఎంత వరకు అలంకరించబడి ఉంటుంది అని. అలంకరణ అయితే అందరు చేసుకుంటున్నారు. అయినా కానీ నెంబర్ వారీ. మాల అయితే అందరు వేసుకుంటున్నారు కానీ ఎక్కడ తొమ్మిది లక్షల హారం, ఎక్కడ సాధారణ ముత్యాల హారం! అలాగే బాబా యొక్క గుణాల మాల, అమరనాధుని మహిమ యొక్క మాల అందరి మెడలో ఉంది. అయినా కానీ తేడా ఉంది. తేడా అయితే తెలుసుకుంటున్నారు కదా! పాటలు పాడేవారా? లేక తయారయ్యేవారా? దీనిలో తేడా వచ్చేస్తుంది. అలాగే మర్యాదలు అనే గాజులు అయితే అందరు వేసుకున్నారు. అన్ని మర్యాదలు అనే గాజులతో అలంకరించుకుంటున్నారు. కానీ సదా మర్యాదా పురుషోత్తములుగా అవ్వటంలో కొంత మంది వజ్ర సమానంగా అయ్యారు కొంతమంది బంగారం సమానంగా అయ్యారు మరియు కొంతమంది వెండి సమానంగా అయ్యారు. ఎక్కడ వజ్రాలు మరియు ఎక్కడ వెండి అంటే నెంబర్ వారీగా అయినట్లే కదా. అందువలనే నెంబర్ వారీ అలంకారం చూస్తున్నాను అని చెప్పాను.

రెండవ విషయం సౌభాగ్యంతో పాటు భాగ్యం కూడా చూసారు. లౌకికంలో కూడా భాగ్యానికి ఆధారం - శారీరక ఆరోగ్యం, మానసిక సంతోషం, ధనం యొక్క సమృద్ధి, సంబంధీకుల ద్వారా సంతుష్టత మరియు సంపర్కంలో సదా సఫలతమూర్తిగా ఉంటారు. ఈ అన్ని విషయాలలో భాగ్యాన్ని చూస్తారు. ఇప్పుడు సంగమయుగం యొక్క శ్రేష్ట బాగ్యాన్ని అనుభవం చేసుకుంటున్నారు కదా! సంగమయుగీ అలౌకిక జీవితం యొక్క విశేషతలు తెలుసు కదా! సదా ఆరోగ్యం అంటే సదా స్వ స్థితిలో ఉండటం వలన తనువు యొక్క కర్మభోగం కూడా కర్మ యోగం ద్వారా శూలం నుండి ముళ్ళులాగ అయిపోతుంది. కర్మ భోగాన్ని కూడా అనంతమైన డ్రామాలో ఆటగా భావించి ఆడతారు. అప్పుడు తనువు యొక్క రోగం కూడా యోగంలోకి పరివర్తన అయిపోతుంది. అందువలన సదా ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్యాన్ని కూడా అనారోగ్యంగా భావించరు కానీ అనేక జన్మల భారం తేలికగా అయిపోతుంది, కర్మలఖాతా పూర్తి అయిపోతుంది అని భావిస్తే సదా ఆరోగ్యంగా భావిస్తారు మరియు వెనువెంట మానసిక సంతోషం కూడా సదా ప్రాప్తించే ఉంది, మన్మనాభవగా ఉండటం అంటే సంతోషం యొక్క ఖజానాలతో సంపన్నంగా ఉండటం. జ్ఞాన ధనం అన్ని ధనాల కంటే శ్రేష్టమైనది. జ్ఞాన ధనం కలవారికి ప్రకృతి కూడా స్వతహాగానే దాసి అయిపోతుంది. ఎక్కడ జ్ఞాన ధనం ఉంటుందో అక్కడ స్థూల ధనం యొక్క లోటు ఉండదు. ధనం యొక్క భాగ్యం కూడా సదా లభిస్తుంది.

మూడవది సంబంధం - సర్వ సంబంధాలు నిలిపే పరమాత్మని మీ వారిగా చేసుకున్నారు. ఎప్పుడు కావాలంటే, ఏ సంబంధం కావాలంటే అలా ఆ సంబంధం యొక్క రసాన్ని ఒకని ద్వారా సదా నిలుపుకుంటున్నారు, ఎప్పుడు మోసం చేసేవారు కాదు. సదా ప్రీతి యొక్క రీతిని నిలుపుకునేవారు. ఇలా అమర సంబంధాన్ని అనుభవం చేసుకుంటున్నారు కదా? మరొక విషయం - సంపర్కం, సంగమయుగ జీవితంలో సంపర్కం కూడా సదా పవిత్ర హంసలతోనే ఉంది. బాబా సంపర్కం ఆధారంగా బ్రాహ్మణ పరివారం యొక్క సంపర్కం ఉంటుంది. హంసలు మరియు కొంగల సంపర్కం కాదు, కానీ ఇది బ్రాహ్మణాత్మల సంపర్కం. కొంగలతో కేవలం సేవార్థం సంబంధం ఉండాలి. సేవా సంపర్కంలో ఉండటం వలన విశ్వ కళ్యాణి భావన మరియు విశ్వపరివర్తన యొక్క కామన ఉంటుంది. దీని కారణంగా సేవా సంపర్కంలో కూడా ఎటువంటి దు:ఖం యొక్క అల ఉండదు. నిందించినా కానీ మిత్రులు, గుణగానం చేసినా కానీ మిత్రులు. సదా సోదరులు అనే దృష్టి మరియు దయావృత్తి ఉంటుంది. కనుక సంపర్కం కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఈవిధమైన శ్రేష్ట భాగ్యం భాగ్య విధాత ద్వారా లభించింది. అంటే సదా శ్రేష్టభాగ్యవంతులు అయినట్లే కదా. ఈరోజు పిల్లల యొక్క ఈ సౌభాగ్యం మరియు భాగ్యాన్ని చూస్తున్నారు. సదా సంపన్న ఆత్మలు అంటే ఈ బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి వస్తువు ఏదీ లేదు. ఇలా అనుభవం చేసుకుంటున్నారు కదా? సదా సౌభాగ్యం యొక్క తిలకం, భాగ్యం యొక్క సితార మెరుస్తుంది కదా? మెరుపు యొక్క శాతం ఎంత ఉంది? మెరుపు అయితే అందరిలోను ఉంది కానీ శాతాన్ని అనుసరించి నెంబర్ వారీగా ఉన్నారు. విదేశీయుల నెంబర్ ఏమిటి? విజయీ మాలలో నెంబర్ ఉంది కదా! దేశం వారైనా, విదేశం వారైనా మాల ఒక్కటే. ఎవరైతే సదా సౌభాగ్యం మరియు భాగ్యానికి అధికారులుగా ఉంటారో వారే విజయీ మాలకు కూడా అధికారులు.

బాప్ దాదాకి విశేషమైన పని ఏమిటంటే సదా పిల్లల మాల జపిస్తూ ఉంటారు. బాబా మాల ఆత్మలు జపిస్తారు కానీ పిల్లల మాల పరమాత్మ జపిస్తారు. మరి ఎవరు భాగ్యశాలులు అయ్యారు? మంచిది.

ఈవిధంగా సదా సౌభాగ్యశాలులకు, సదా శ్రేష్ట భాగ్యానికి అధికారులకు, సదా తోడుని నిలుపుకునే వారికి, సదా స్మృతి తిలకధారులకు, మర్యాదా సంపన్న శ్రేష్ట ఆత్మలకు, విశ్వ కళ్యాణకారి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.