03.02.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వులపై దయ చూపించండి, పొరపాటు భావాన్ని మరియు అహంభావాన్ని సమాప్తి చేయండి.

విశ్వకళ్యాణకారి రాజ్య భాగ్యాన్ని పొందేవారు, దేవతా పదవిని పొందే ఆత్మలతో శివబాబా మాట్లాడుతున్నారు -

బాప్ దాదా పిల్లలందరినీ సంపన్న స్వరూపం మరియు విశ్వ కళ్యాణకారి రూపంలో చూస్తున్నారు. వర్తమాన సమయంలో అంతిమ స్వరూపం లేదా అంతిమ కర్తవ్యం - విశ్వకళ్యాణం. ఈ అంతిమ స్వరూపంలో స్థితులయ్యేటందుకు ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ శక్తిననుసరించి పురుషార్థం చేస్తున్నారు. లక్ష్యం అందరికీ ఒక్కటే - విశ్వ కళ్యాణం చేయటం కానీ కొంతమంది ఇప్పటికి స్వకళ్యాణంలో నిమగ్నం అయ్యి ఉన్నారు. మరియు కొంతమంది స్వదేశం యొక్క కళ్యాణం చేయటంలోనే నిమగ్నం అయ్యి ఉన్నారు. చాలా కొద్దిమంది బేహద్ బాబా సమానంగా బేహద్ గా అంటే విశ్వ సేవలో లేదా విశ్వ కళ్యాణకారి స్వరూపంలో స్థితులై ఉంటున్నారు. విశ్వ

కళ్యాణకారి శ్రేష్ఠ ఆత్మల గుర్తులు ఏమిటి?

1. విశ్వ కళ్యాణకారులకు తెలుసు సమయం తక్కువ మరియు కర్తవ్యం గొప్పది అని. అందువలన విశ్వకళ్యాణకారులు ప్రతి సెకను లేదా సంకల్పం విశ్వకళ్యాణం పట్ల ఉపయోగిస్తారు.

2 తనువు, మనస్సు మరియు ధనం సదా విశ్వ సేవలోనే అర్పణ చేస్తారు.

3. వారి మస్తకం మరియు నయనాలలో మరియు వారి స్మృతిలో మరియు దృష్టిలో సదా విశ్వంలో సర్వ ఆత్మలు స్మృతిలో ఉంటారు. ఈ అప్రాప్తి ఆత్మలను తృప్తి ఆత్మగా ఎలా చేయాలి అని అనుకుంటారు. బికారీ ఆత్మలను సంపన్నం చేయాలి. వంచిత ఆత్మలను సంబంధ సంపర్కాలలోకి ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తారు. రాత్రి పగలు బాబా ద్వారా లభించిన శక్తుల యొక్క వరదానం తీసుకుంటూ సర్వులకు ఇచ్చే దాతగా ఉంటారు.

4. అలసిపోని, నిరంతర సేవాధారులుగా ఉంటారు. కార్యక్రమం ఉన్నప్పుడే సేవాధారిగా కాదు కానీ సదా సిద్ధంగా(ఎవరెడి) మరియు అన్ని రకాలైన సేవ చేసేగా (ఆల్ రౌండ్ సేవాధారిగా) ఉంటారు.

5. ఈ విధంగా విశ్వ కళ్యాణకారీలు అంటే దయా హృదయులు. ఎటువంటి అవగుణాలు గల ఆత్మ అయినా కానీ, కఠిన సంస్కారాలు గల ఆత్మ అయినా కానీ, తెలివి తక్కువ వారినైనా,రాతి బుద్ధి కలిగిన ఆత్మలైనా కానీ, సదా మనల్ని నిందించేవారు. అయినా కానీ, సర్వాత్మల పట్ల కళ్యాణకారిగా అంటే నియమ పూర్వకంగా (లాఫుల్) మరియు ప్రేమ పూర్వకంగా (లవ్ వుల్) ఉంటారు. లక్ష్యం అందరిదీ ఇదే. కానీ ఏమి చేస్తున్నారు? నడుస్తూ నడుస్తూ దయకి బదులు రెండు విషయాలలోకి మారిపోతున్నారు. కొంతమందికి దయా భావం పెట్టుకోవడానికి బదులు ఆత్మలపై పొరపాటు భావం పెట్టుకుంటున్నారు. వీరు ఎప్పుడూ మారరు, వీరు ఇలాగే ఉంటారు. అందరు రాజుగా అయ్యేవారు కాదు కదా అని. ఇలా అనేక రకాలైన పొరపాటు భావాలు దయను సమాప్తి చేసేస్తున్నాయి. రెండవ విషయం - దయా భావనకి బదులు అహంభావం వచ్చేస్తుంది. నేనే అన్నీ, వీరు ఏమీ కాదు, వీరు ఏమీ చేయలేటం లేదు, నేనే అన్నీ చేయగలను ఇలా అహంభావం అంటే అంటే నేను అనే అభిమానం దయా హృదయులుగా కానివ్వటం లేదు. ఈ రెండు విషయాలు బేహద్ విశ్వకళ్యాణకారీగా అవ్వనివ్వవు. అందువలన స్వ కళ్యాణంలో లేదా స్వదేశం యొక్క కళ్యాణంలో ఉండిపోతున్నారు. విశ్వ కళ్యాణకారీగా అయ్యే సహజ సాధనం తెలుసు కూడా కానీ సమయానికి మర్చిపోతున్నారు. ఎటువంటి అవగుణాలు ఉన్న ఆత్మ అయినా కానీ, ఎటువంటి పతిత ఆత్మ అయినా కానీ లేదా పురుషార్థహీన ఆత్మ అయినా కానీ ఇద్దరిలో ఎవరైనా కానీ అజ్ఞానీ పతిత ఆత్మయైనా, బ్రాహ్మణ పరివారంలో పురుషార్థ హీన ఆత్మ అయినా ఇద్దరి పట్ల విశ్వ కళ్యాణకారి అంటే బేహద్ దాత ఆత్మ, విశ్వ పరివర్తనకు అధికారి ఆత్మ సదా ఆ ఆత్మల యొక్క చెడుని లేదా బలహీనతలను కళ్యాణకారి సంబంధంతో మొదట క్షమిస్తారు. బేహద్ బాబా కూడా పిల్లలను క్షమిస్తారు. ఏ విషయంలో? పిల్లల బలహీనతలు లేదా అవగుణాలు మనస్సులో పెట్టుకోకుండా క్షమిస్తారు. పూజ్య దేవత కూడా భక్తులను క్షమిస్తుంది. అలాగే విశ్వ కళ్యాణకారులు, మాస్టర్ రచయితలు, విశ్వ అధికారులు అంటే చిన్నవారి ముందు పెద్ద రాజుతో సమానం. బాబా సమానం. పూజ్యాత్మలు ఈ మూడు సంబంధాల ఆధారంగా చెడుని లేదా బలహీనతలను మనసులో ఉంచుకోకుండా క్షమిస్తారు. మరియు ఆ ఆత్మల కళ్యాణం కోసం సదా ప్రతి ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపాన్ని మరియు గుణాలను ఎదురుగా ఉంచుకుని వారి మహిమ చేస్తారు అంటే ఆ ఆత్మ యొక్క మహానతను (గొప్పతనం) స్మృతి ఇప్పిస్తారు. మీరు ఎవరి పిల్లలు? ఏ కులంవారు? సంగమయుగం యొక్క విశేషత లేదా వరదానం ఏమిటి? బాబా యొక్క కర్తవ్యం - అసంభవాన్ని సంభవం చేయటం. మీరు ఆత్మలు. ఆది కాలంలో రాజవంశీయులు. ఇప్పుడు బ్రహ్మ వంశీయులు, మాస్టర్ సర్వ శక్తివంతులు. ఈ విధంగా మహిమ చేస్తారు. ఇలా ఆ ఆత్మ తన గుణాలను వింటూ స్మృతిలోకి మరియు సమర్థతలోకి వస్తుంది మరియు బలహీనతలను లేదా చెడుని తొలగించుకునే ధైర్యం వస్తుంది.

ఎలాగైతే ఈ ప్రపంచంలో రాజ పుత్రులకు తమ వంశం యొక్క స్మృతి ఇప్పిస్తే బలహీనులకు కూడా ధైర్యం వచ్చేస్తుంది. అలాగే విశ్వ కళ్యాణకారులు కూడా బలహీన ఆత్మలను మహిమ ద్వారా మహానుగా తయారుచేస్తారు అంటే తమ దయా హృదయం యొక్క శక్తితో స్వయం వారి అవగుణాలను ధారణ చేయరు కానీ వారికి తమ అవగుణాలను మరిపింపచేసి వారిని కూడా సమర్థంగా చేస్తారు. ఇలా సమర్థ భూమిని తయారుచేసిన తర్వాత ఆ ఆత్మ కొరకు కొంచెం శ్రమ చేసి పొరపాటు భావన, అహంభావం ఉంచుకోకుండా ఆ ఆత్మను కూడా పరివర్తన చేస్తారు. ఎప్పుడు బ్రాహ్మణ పరివారంలోని బలహీన ఆత్మను 'నీవు బలహీన ఆత్మవు, బలహీన ఆత్మవు' అని అనకూడదు. ఎలాగైతే శారీరకంగా బలహీన ఆత్మకి వైద్యుడు నువ్వు చనిపోతావు అని చెప్తే వెంటనే గుండె ఆగిపోతుంది. అలాగే మీరందరూ కూడా మాస్టర్ అధికారులు, శ్రేష్ఠ ఆత్మలు, విశ్వ పరివర్తకులు. అందువలన మీ నోటి నుండి సదా ప్రతి ఆత్మ పట్ల శుభమైన మాటలే రావాలి. మనస్సు బలహీనం చేసే మాటలు రాకూడదు. మనస్సుని బలహీనం చేయటం అంటే గుండె ఆగిపోయినట్లే. ఎంత బలహీన ఆత్మ అయినా కానీ వారికి సైగ చేయాలి, శిక్షణ ఇవ్వాలి, కానీ ముందు వారిని సమర్థంగా చేసిన తర్వాత శిక్షణ ఇవ్వాలి. మొదట వారి విశేషత యొక్క మహిమ చేయండి. అప్పుడు వారిని ఇక ముందు శ్రేష్ఠాత్మగా చేసే సాధనం - బలహీనతపై ధ్యాస ఇప్పించండి. మొదట భూమిని ధైర్యం మరియు ఉత్సాహం యొక్క నాగలితో దున్నండి తర్వాత విత్తనాలు వేస్తే అప్పుడు సహజంగానే ఆ బీజానికి ఫలాలు వస్తాయి. లేకపోతే ధైర్యహీన, బలహీన సంస్కారాలకు వశీభూతం అయిపోయిన ఆత్మకు శిక్షణ ఇవ్వటం అంటే బంజరు భూమిలో విత్తనాలు వేస్తున్నారు. అందువలనే శ్రమ మరియు సమయం ఎక్కువ పడుతుంది మరియు సఫలత తక్కువగా వస్తుంది. విశ్వ కళ్యాణం యొక్క కార్యం గురించి ఆలోచించటానికి లేదా చేయటానికి ఖాళీయే లభించదు. స్వ కళ్యాణంలో మరియు దేశం యొక్క కళ్యాణంలోనే నిమగ్నంగా అయ్యి ఉంటారు. విశ్వకళ్యాణకారి స్వరూపంలో స్థితులు అవ్వలేకపోతున్నారు. అర్థమైందా? విశ్వ కళ్యాణకారిగా అవ్వాలంటే ఏమి చేయాలో? ఏమి చేయకూడదో? అప్పుడే విశ్వకళ్యాణం యొక్క సేవా వేగం తీవ్రం అవుతుంది. ఇప్పుడు మధ్యమంగా ఉంది. అందువలన ఈ సంవత్సరంలో విశ్వకళ్యాణకారి స్థితి యొక్క విధి ద్వారా విశ్వకళ్యాణం యొక్క సేవా వేగాన్ని తీవ్రం చేయండి. దయా హృదయులుగా అవ్వండి. ఇప్పటి వరకు డ్రామానుసారం నడవాల్సింది నడిచింది. దీని ద్వారా కూడా ఇక ముందు కొరకు కళ్యాణ భావనతో, వృద్ధి కళ యొక్క భావనతో ముందుకు వెళ్ళిపోండి. బలహీనతలను సదాకాలికంగా దృఢ సంకల్పం ద్వారా వీడ్కోలు ఇచ్చేయండి మరియు వీడ్కోలు ఇప్పించండి. అప్పుడు విశ్వ పరివర్తనా కార్యం తీవ్రం అయిపోతుంది. వేగాన్ని మరియు స్థితిని పెంచుకోండి అంటే ప్రతి విషయంలో జ్ఞాన సాగరులుగా, సమర్థ స్థితి ద్వారా సదా సహజంగా దాటండి మరియు సదా పాస్ అవ్వండి. అప్పుడే అంతిమంలో శిక్షలు లేకుండా గౌరవయుక్తంగా పాస్ (పాస్వర్ఆనర్) అవ్వగలరు. అర్థమైందా? ఇటువంటి తయారీలు చేయండి. మరలా సీజన్లో బాప్ దాదా అందరినీ తీవ్ర పురుషార్థ రూపంలో చూడాలి. అందరు మొదటి తరగతిలోని ఆత్మలే, అటువంటి గొప్ప ఆత్మలను కలుసుకోవటానికి వచ్చాను. ప్రతి బ్రాహ్మణ బిడ్డ కిరీటం, తిలకం మరియు సింహాసనాధికారులు. అటువంటి రాజ్య సభలోకి బాబా వచ్చారు. ఎప్పుడైతే ఇక్కడ రాజ్యాధికారుల సభ తయారవుతుందో అప్పుడే అక్కడ రాజ్య సభ ఉంటుంది. విశేషాత్మలను ఆహ్వానం చేస్తే విశేషాత్మల కోసం విశేష వేదిక తయారుచేయాల్సి ఉంటుంది కదా! అలాగే మీరు మరలా బాప్ దాదాని ఆహ్వానిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా సంపూర్ణ స్థితిని తయారు చేసుకుంటేనే బాప్ దాదా వస్తారు. అందువలన ప్రతి ఒక్కరు ఒకరికంటే ఇంకొకరు శ్రేష్ఠమైన లేదా సుందరమైన వేదిక తయారుచేయండి. మంచిది. అప్పుడు చూస్తాను. ఏ జోన్ వారు నెంబర్ వన్ లోకి వస్తారో? విదేశం ముందు వస్తుందా లేక దేశం ముందు వస్తుందా అని. మంచిది.

ఈవిధంగా సదా విశ్వ కళ్యాణకారులకు, సర్వుల పట్ల దయా హృదయులకు, సదా శుభ చింతనలో ఉండేవారికి మరియు సదా శుభ చింతకులుగా అయ్యేవారికి, ప్రతి ఆత్మకు ధైర్యం మరియు ఉల్లాసం ఇచ్చేవారికి, ఇలా సదా రాజ్యా ధికారులకు, సర్వులను సదా సంపన్నంగా చేసేవారికి, సమర్థ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే,