03.12.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విశ్వకళ్యాణకారియే విశ్వయజమానిగా కాగలరు.

బాప్ దాదా విశ్వకళ్యాణకారి పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు. బాబా ఎలాగైతే బెహద్ విశ్వ కళ్యాణకారియో, బాబా యొక్క సంకల్పంలో సదా ఒకే సంకల్పం ఉంటుంది - ఇప్పుడిప్పుడే అందరి కళ్యాణం అయిపోవాలని. సంకల్పానికి విశేషంగా ఈ విషయమే ఆధారం. సంకల్ప బీజం, మిగిలినది వృక్షం యొక్క విస్తారం. అదేవిధంగా బాబా మాటలో సదా పిల్లల కళ్యాణం కోసం రకరకాల యుక్తులు ఉంటాయి. నయనాలలో పిల్లల కళ్యాణం కొరకు శక్తి నిండి ఉంటుంది. మస్తకంలో కళ్యాణకారి పిల్లలకు స్మృతిచిహ్నంగా మణి ఉంటుంది. ప్రతి కర్మ కళ్యాణకారి కర్మ. ఏవిధంగా అయితే బాబా యొక్క సంకల్పం, మాట లేదా నయనాలలో సదా కళ్యాణ భావన లేదా శుభ కామన ఉంటుందో అదేవిధంగా ప్రతి బిడ్డ యొక్క సంకల్పంలో విశ్వ కళ్యాణం యొక్క భావన లేదా కామన నిండి ఉండాలి. హద్దులోని కుటుంబాన్ని నడిపించుకునేటందుకు ఏ పని చేస్తున్నా కానీ లేదా ఏ సేవాకేంద్రాన్ని నడిపించడానికి నిమిత్తమైనా కానీ భావన మాత్రం సదా విశ్వకళ్యాణకారి భావన ఉండాలి. ఎదురుగా సదా విశ్వంలోని సర్వాత్మలు ఉండాలి. మీ స్మృతి ఆధారంగా ఎంత దూరంలో ఉండే ఆత్మలు అయినా కానీ మీకు సదా సమీపంగా మరియు సన్ముఖంగా కనిపించాలి. సేవార్థం మీ చిత్రం ఒకటి ఉంటుంది -భవిష్య శ్రీకృష్ణుని రూపం. ఆ చిత్రంలో విశ్వం అనే గోళం అంతా ఆయన చేతిలో చూపించారు. విశ్వ యజమాని కనుక విశ్వ గోళాన్ని ఆయన చేతిలో చూపించారు. అదేవిధంగా వర్తమాన సమయంలో కూడా విశ్వకళ్యాణకారులు కనుక మీ మస్తకంలో సర్వాత్మలు సమీపంగా ఉండాలి. అమెరికాలో లేదా ఎంత దూరంలో ఉన్న ఆత్మ అయినా కానీ ఇక్కడ కూర్చుని ఉండగానే సెకండులో ఆ ఆత్మకు మీ శ్రేష్ట భావన లేదా శ్రేష్ట కామన ఆధారంగా శాంతి లేదా శక్తి యొక్క కిరణాలను ఇవ్వగలరు. ఇలా మాస్టర్ జ్ఞాన సూర్యులై విశ్వానికి కళ్యాణం యొక్క కాంతిని ఇవ్వగలరు. విజ్ఞాన సాధనాల ద్వారా సమయం మరియు ధ్వని ఎంత దూరం అయినా కానీ సమీపం అయ్యింది కదా! విమానం ద్వారా సమయం ఎంత తక్కువ పడుతుంది! తక్కువ సమయంలోనే ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళవచ్చు. అదేవిధంగా టెలిఫోన్ ద్వారా ధ్వని ఎంత సమీపం అయిపోయింది. లండన్లో ఉన్న వ్యక్తి యొక్క మాట ఈ ఫోన్ ద్వారా వారు ఎదురుగా ఉండి మాట్లాడినట్లే ఉంటుంది. అదేవిధంగా టెలివిజన్ అనే సాధనం ద్వారా ఏ దృశ్యం లేదా వ్యక్తి దూరంగా ఉన్నా కానీ ఎదురుగా ఉన్నట్లు అనుభవం అవుతుంది. విజ్ఞానం అనేది మీ రచన, మీరు మాస్టర్ రచయిత. శాంతిశక్తి ద్వారా మీరందరు కూడా విశ్వంలో ఎంత దూరంలో ఉండే ఆత్మ యొక్క మాటను అయినా వినగలరు. ఏ మాట? విజ్ఞానం నోటి యొక్క మాటను వినిపించే సాధనం కానీ మనస్సు యొక్క మాటను చేర్చలేదు. కానీ శాంతిశక్తి ద్వారా ప్రతి ఆత్మ యొక్క మనస్సు యొక్క ధ్వని ఎంత సమీపంగా వినిపిస్తుందంటే ఎవరో ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నట్లు ఉంటుంది. అంతేకాకుండా టి.వి. ద్వారా దృశ్యం లేదా వ్యక్తిని ఎంత స్పష్టంగా చూస్తారో అంత స్పష్టంగా ఆత్మల యొక్క మనస్సులో అశాంతి, దు:ఖ స్థితి యొక్క చిత్రాలు కూడా అంతే స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సాధనాల యొక్క కనెక్షన్ కలపాలి, స్విచ్ వేయాలి, అప్పుడు స్పష్టంగా చూడవచ్చు మరియు వినవచ్చు. అదే విధంగా బాబాతో సంబంధం జోడించారు, శ్రేష్ట భావన మరియు కామన అనే స్విచ్ వేశారు. అప్పుడు దూరంగా ఉన్న ఆత్మలు కూడా సమీపంగా అనుభవం అవుతారు. అటువంటి వారినే విశ్వ కళ్యాణకారి అని అంటారు. ఇటువంటి స్థితిని తయారు చేసుకునేటందుకు విశేషంగా ఏ సాధనను అవలంభించాలి?

వీటన్నింటికీ ఆధారం - శాంతి, వర్తమాన సమయంలో శాంతిశక్తిని జమ చేసుకోండి. మనస్సు యొక్క మాట సంకల్పాల రూపంలో ఉంటుంది. మనస్సు యొక్క మాటలను అనగా వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేసుకుని ఒకే సమర్థ సంకల్పంలో ఉండండి. సంకల్పాల విస్తారాన్ని ఇముడ్చుకుని సార రూపంలోకి తీసుకురండి, అప్పుడు శాంతిశక్తి స్వతహాగానే పెరుగుతుంది. వ్యర్ధం అంటే బాహర్ముఖత; సమర్థం అంటే అంతర్ముఖత. ఇదేవిధంగా నోటి మాటల్లో కూడా వ్యర్థాన్ని తొలగించుకుని సమర్ధం అంటే సారంలోకి తీసుకురండి, అప్పుడు శాంతిశక్తిని జమ చేసుకోగలరు. శాంతిశక్తి యొక్క విచిత్ర రుజువులు చూడగలరు. దూరంగా ఉండే ఆత్మలు మీ ఎదురుగా వచ్చి - మీరు నాకు సరైన మార్గం చూపారు, మీరు నాకు సరైన గమ్యానికి దారి చూపారు, మీరు నన్ను పిలిచారు, నేను వచ్చాను అని అంటారు. మీ దివ్యస్వరూపం వారి మస్తకం అనే టి.విలో స్పష్టంగా కనిపిస్తుంది మరియు మిమ్మల్ని ఎదురుగా కలుసుకున్నటు అనుభవం చేసుకుంటారు. అంత స్పష్టంగా అనుభవం చేసుకుంటారు. శాంతిశక్తి అంతటి ఆత్మిక రంగుని చూపగలదు. ఆదిలో కూడా దూరంగా ఉండగానే బ్రహ్మాబాబా యొక్క స్వరూపాన్ని స్పష్టంగా చూస్తూ ఈ స్థానానికి వెళ్ళండి అని సైగ చేస్తున్నట్లు అనుభవం చేసుకునేవారు. అదేవిధంగా అంతిమంలో కూడా విశ్వకళ్యాణకారి ఆత్మలైన మీ అందరి ద్వారా ఇటువంటి విచిత్ర పాత్ర జరుగుతుంది. దీని కొరకు ఆత్మ సర్వ బంధనాల నుండి ముక్తిగా, స్వతంత్రంగా ఉండాలి. ఏది ఎప్పుడు కావాలంటే, ఎక్కడ కావాలంటే అక్కడ ఆ శక్తి పనిచేయగలిగి ఉండాలి. ఇటువంటి నిర్బంధన ఆత్మ అనేకులను జీవన్ముక్తులుగా తయారుచేయగలదు. ఎంత ఉన్నత గమ్యమో, ఎక్కడి వరకు చేరుకోవాలో, బేహద్ సేవ యొక్క రూపురేఖ ఎంత శ్రేష్టమైనదో అర్థమైందా? దీని ద్వారా అనేక శ్రమల నుండి ముక్తులవుతారు. కానీ ఈ ఒక్క శ్రమ చేయవలసి ఉంటుంది. ఇంత ధైర్యం ఉందా?

ఈవిధంగా సదా సమర్దులు, సదా ఒకే శ్రేష్ట సంకల్పం మరియు శ్రేష్ట స్థితిలో స్థితులయ్యేవారికి, బాబా సమానంగా సదా విశ్వ కళ్యాణకారి, సదా ఒకే సంలగ్నతలో నిమగ్నం అయ్యి ఉండేవారికి, ఇటువంటి శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.