05.12.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విజయీ జెండా ఎగురవేసేటందుకు అనుభూతి కోర్సును ప్రారంభించండి.

ఈరోజు బాప్ దాదా తన ఆత్మిక సేనను చూస్తున్నారు. సేనలో స్థితిననుసరించి నెంబర్ వారీగా మహారథీలు, గుఱ్ఱపు సవారీలు, కాలిబలం వారిని చూశారు. మహారథీల మస్తకంలో అంటే స్మృతిలో సదా విజయీ జెండా ఎగురుతూ ఉంది. గుఱ్ఱపు సవారీలు అంటే రెండవ నెంబర్ వారి మస్తకంలో అంటే స్మృతిలో విజయీ జెండా అయితే ఉంది కానీ సదా ఎగరటంలేదు. ఒకొక్కసారి సంతోషం యొక్క మెరుపుతో మరియు నిశ్చయం యొక్క నషాతో జెండా ఎగురుతుంది. కానీ ఒక్కొక్కసారి మెరుపు మరియు నషా అనే గాలి తక్కువ అయిపోవటంతో జెండా ఎగురటానికి బదులు ఒకే స్థానంలో నిలబడిపోతుంది. మూడవ వారు కాల్బలం వారు చాలా ప్రయత్నంతో నిశ్చయం అనే త్రాడుతో, సంతోషం యొక్క మెరుపుతో జెండా ఎగరవేసే ప్రయత్నంలో బాగా ఉన్నారు. కానీ అక్కడక్కడ బలహీనత అనే ముడి పడటం వలన జెండా చిక్కుకుపోతుంది కానీ ఎగరటం లేదు. అయినా కానీ చాలా పురుషార్థంలో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది జెండా అయితే పురుషార్ధం తర్వాత ఎగురుతుంది కానీ అది కూడా కొంచెం సమయం తర్వాత మరియు కొంచెం శ్రమ చేశాక. అందువలన అంత మెరుపు లేదా నషా ఉండటం లేదు. బాప్ దాదా పిల్లల యొక్క శ్రమ చూసి దూరం నుండి శక్తిని కూడా ఇస్తున్నారు అనగా ఈ విధంగా చేయండని సైగ చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఆ సైగను చూసి సఫలత పొందుతున్నారు. కానీ కొంతమంది వారి శ్రమలో ఎంతగా లీనం అయిపోయారంటే వారికి బాబా యొక్క సైగ అందుకునే ఖాళీ కూడా లేదు. ఇలా సేనలో మూడురకాలైన యుద్దసైనికులను చూశారు. ఎప్పుడైతే శ్రమతో అయినా లేదా సహజంగా అయినా అందరి జెండా ఎగరవేయాలని అనుకున్నప్పుడే మరియు జెండా ఎగిరినప్పుడే విజయీ పుష్పాల వర్షం అనగా బాబా మరియు పిల్లల యొక్క ప్రత్యక్షత పుష్పాల వర్షం వలె మెరుస్తుంది. పిల్లలు ఏదైతే శ్రమ చేస్తున్నారో దాని కోసం బాప్ దాదా సహజ సాధనం వినిపిస్తున్నారు.

నిరంతర యోగిగా అవ్వటానికి ఆధారం సర్వసంబంధాల యొక్క సహయోగం: -

సమయానికి లేదా నిరంతరం విజయీ జెండా ఎందుకు ఎగరటం లేదు. దానికి కారణం ఏమిటి? మీరు కూడా ఏదైనా కార్యక్రమంలో జెండా ఎగరవేస్తున్నప్పుడు అది సమయానికి ఎందుకు ఎగరదు? కారణం? ముందుగా ప్రయత్నం చేసి చూడలేదు. అలాగే విజయీ జెండా ఎగరకపోవటానికి ముఖ్య విషయం అనుభూతి అనేది లేదు. అమృతవేళ నుండి అనుభూతి కోర్సుని ప్రారంభించండి. వర్ణన అయితే అందరూ చేస్తున్నారు కాని వర్ణన చేయటంలో మరియు అనుభూతి చేసుకోవటంలో చాలా తేడా ఉంటుంది. బాబాతో సర్వసంబంధాలు అని వినటం మరియు చెప్పటం ఒకటి కానీ ప్రతీ సంబంధం యొక్క అనుభూతి మరియు ప్రాప్తి ఎవరిది వారిది. అందువలన సర్వ సంబంధాల అనుభూతిలో లేదా ప్రాప్తిలో లీనమై ఉండండి. అప్పుడు పాత ప్రపంచం యొక్క ఆకర్షణ నుండి స్వతహాగానే అతితంగా ఉండగలరు. ప్రతి పని చేసే సమయంలో భిన్నభిన్న సంబంధాల యొక్క అనుభూతి చేసుకోవచ్చు. మరియు ఆ సంబంధం యొక్క సహయోగంతో నిరంతర యోగాన్ని అనుభవం చేసుకోగలరు. ప్రతి సమయం బాబాతో రకరకాల సంబంధాల యొక్క సహయోగం తీసుకోవటం అనగా అనుభూతి చేసుకోవటమే యోగం. ఇలా సహజయోగిగా లేదా నిరంతర యోగిగా ఎందుకు అవ్వటం లేదు? బాబా ఎలాంటి సమయంలో అయినా సంబంధాన్ని నిలుపుకోవటానికి బందీగా ఉన్నారు. బాబా తోడు ఇస్తున్నప్పుడు తీసుకునేవారు ఎందుకు తీసుకోవటం లేదు. సహయోగం తీసుకోవటమే యోగం. ఇది ఎలా ఉంటుందో అనుభవం చేసుకోండి. తల్లి యొక్క సంబంధం ఏమిటి? తండ్రి సంబంధం ఏమిటి? సఖుడు మరియు బంధువు సంబంధం ఏమిటి? సదా ప్రియుని సాంగత్యం యొక్క అనుభవం ఏమిటి? ఇలా వేర్వేరు సంబంధాల యొక్క రహస్యం అనుభవంలోకి వచ్చిందా? ఒకవేళ ఒక్క సంబంధం యొక్క అనుభూతి నుండి అయినా వంచితులుగా ఉండిపోతే కల్పమంతా వంచితులుగానే ఉండిపోతారు. ఎందుకంటే కల్పమంతటిలో ఇప్పుడే సర్వ అనుభవాల ఖజానా ప్రాప్తిస్తుంది. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. అందువలన మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - ఏ సంబంధం యొక్క అనుభూతి ఇంత వరకూ చేసుకోలేదని. అలాగే జ్ఞానం అనే సబ్జెక్టులో ఏ విషయాలను అయితే వర్ణన చేస్తున్నారో ఆ ప్రతీ విషయాన్ని అనుభవం చేస్తుకున్నానా అని చూసుకోవాలి. మేము స్వదర్శన చక్రధారులం అని వర్ణన చేస్తారు కదా. అయితే స్వ దర్శనం యొక్క అనుభూతిని అని ఏ ఆధారంతో అంటున్నారు? దర్శనం అంటే తెలుసుకోవటం. తెలుసుకున్నవారు ఆ తెలిసిన విషయం యొక్క అధికారంతో ఉంటారు. ఈ రోజుల్లో శాస్త్రవాదులు కేవలం శాస్త్రాలు చదువుకుంటారు, వల్లె వేస్తారు. ఆ తర్వాత తమకు శాస్త్రాల అధికారం ఉన్నట్లు భావిస్తారు. కానీ మీరందరూ కేవలం వల్లె వేయటం లేదు, అనురక్తిలో ఉంటున్నారు. అనురక్తి అనగా మననం చేసి స్వరూపంలోకి తీసుకుని వచ్చేవారు. అదేవిధంగా సదా జ్ఞానం యొక్క అధికారం అనగా సదా జ్ఞానం యొక్క ప్రతీ విషయం యొక్క నషాలో ఉండేవారు. అలాగే జ్ఞానం యొక్క ప్రతీ విషయం యొక్క అనుభవం యొక్క నషాలో ఉంటున్నారా? ఇదేవిధంగా ధారణ విషయంలో రకరకాల గుణాల గురించి ఏదైతే వర్ణన చేస్తున్నారో ఆ గుణం యొక్క అనుభవానికి అధికారిగా అయ్యారా? ఉపన్యాసకులా లేక శ్రోతలా లేక అధికారులా? దీని ఆధారంగానే నెంబర్ తయారవుతుంది.

మహారథీ అనగా ప్రతీ మాట యొక్క అనుభవానికి అధికారులు. గుఱ్ఱపు సవారీలు అంటే వినటం, విన్పించటంలో ఎక్కువగా ఉంటారు. అనుభవం యొక్క అధికారం తక్కువగా ఉంటుంది. అయితే సహజ సాధనం ఏది? అనుభవ లోపం అంటే అనుభవీ మూర్తిగా అవ్వటంలో లోటు ఉంది. భక్తి మరియు జ్ఞానంలో విశేషమైన తేడా ఇదే. అది వర్ణన, ఇది అనుభవం. నిరంతర యోగిగా అవ్వటానికి ఆధారం సదా సర్వ సంబంధాల సహయోగం తీసుకోండి, అనుభవీగా అవ్వండి. అర్థమైందా? అనుభవం అనే ఖజానాను మంచిగా పొందండి. కొంచెంగా కాదు అంతా పొందండి. రెండు మూడు సంబంధాల యొక్క లేదా రెండు మూడు విషయాల యొక్క అనుభవం కాదు. అన్నింటిలో అనుభవీ మూర్తిగా అవ్వండి. మాస్టర్ సర్వ శక్తివంతులుగా అవ్వండి. అప్పుడు విజయీ జెండా సదా ఎగురుతూ ఉంటుంది.

ఈవిధంగా సదా విజయీలకి, సర్వ సంబంధాల అనుభవం యొక్క అధికారం గలవారికి, జ్ఞానం యొక్క ప్రతి విషయం యొక్క అధికారం గల వారికి, ప్రతి గుణం యొక్క అనుభవానికి అధికారులైన వారికి, సేవా సబ్జెక్టులో ఆల్ రౌండర్ మరియు ఎవరెడీ అనే విశేషత గల అధికారులకి బాబా సమానమైన శ్రేష్టాత్మలకి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.