07.12.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వ బంధనాలను తొలగించుకొని ఫరిస్తాగా అవ్వండి.

సంగమయుగ వరదాని యుగం - ఈ సమయంలోనే మిమ్మల్ని మీరు వరదానాలతో సంపన్నం చేసుకోండి. అందరూ సంగమయుగం యొక్క విశేష వరదానాలతో మిమ్మల్ని మీరు సంపన్నం చేసుకుంటున్నారా? సంగమయుగాన్నే వరదాని యుగం అని అంటారు. సంగమయుగంలోనే అసంభవం సంభవం అవుతుంది. సర్వ పరివర్తనా యుగం సంగమయుగం. ఇటువంటి యుగంలో శ్రేష్ట పాత్రను అభినయించే హీరో, హీరోయిన్ పాత్రధారులు మీరు. ఇంత నషా సదా ఉంటుందా? సంగమయుగంలోనే సదా సంపన్నంగా ఉండే వరదానం లభిస్తుంది. ద్వాపరయుగం నుండి అప్పుడప్పుడు అల్పకాలికంగా లభిస్తుంది. సంగమయుగానికి సదాకాలిక వరదానం ఉంది. ఒకవేళ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పొందితే, సదాకాలికంగా ఎప్పుడు పొందుతారు? సంగమయుగంలో మీ పేరే శివశక్తి. ఎలాగైతే పేరులో కలసి ఉన్నారో అలాగే సదా బాబాతో కలసి ఉండండి, అప్పుడు మాయాజీత్ అయిపోతారు. ఇప్పుడు శివశక్తిగా కలిసి ఉంటారు మరియు భవిష్య లక్ష్యం అయిన లక్ష్మీనారాయణులు కలసి విష్ణు రూపంలో ఉంటారు. కనుక డబల్ కంబైన్డ్ రూపాలు గలవారు. పాండవులు అయితే సదా స్మృతిలో ఉంటారు. పాండవులకి మరియు శక్తులకి ఇప్పటికీ మహిమ జరుగుతుంది. ఎవరికైతే ఇప్పటి వరకు కూడా మహిమ జరుగుతుందో వారి ప్రత్యక్ష స్వరూపం ఏవిధంగా ఉంటుంది? సదా శ్రేష్ట స్వరూపంలో ఉంటారు. అసలు క్రిందకి ఎందుకు వస్తున్నారు?

ఎవరికైనా ఉన్నతమైన సీట్ లభిస్తే వదలిపెడతారా? ఈరోజుల్లో ముళ్ళ కుర్చీ (పదవి) అయినా కానీ ఎవరూ వదలటం లేదు. మీకయితే బాప్ దాదా సదా సుఖదాయి స్థితి అనే ఆసనాన్ని ఇచ్చారు. శ్రేష్ట స్థితిలో కూర్చోబెడుతున్నారు, మరలా ఎందుకు క్రిందకి వచ్చేస్తున్నారు? వారయితే ఆ కుర్చీ కోసం ఎంతగా ప్రయత్నిస్తారు. అది దు:ఖదాయి అని తెలిసినా వదలరు. కానీ మీరు మాత్రం మీ శ్రేష్ఠ స్థితి అనే కుర్చీని ఎప్పుడు వదలకండి. సదా ఫరిస్తా అనే కుర్చీలో ఆసీనులై ఉండండి. అప్పుడు సదా అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. బాబా ద్వారా వారసత్వం ఇంత సహజంగా లభిస్తుంటే మీకు ఇంకేమి కావాలి? అవినాశి వారసత్వాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? కేవలం ఒకే సహజ విషయాన్ని సదా జ్ఞాపకం ఉంచుకోండి మేము బాబా వాళ్ళం, బాబా మా వారు. ఈ ఒక్క విషయంలోనే అన్ని నిండి ఉన్నాయి. ఇది బీజం. బీజాన్ని పట్టుకోవటం సహజమే కదా! వృక్షం యొక్క విస్తారాన్ని పట్టుకోవటం కష్టం అవుతుంది. కేవలం ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మర్చిపోనివారిగా అవ్వండి. ద్వాపర కలియుగాల నుండీ మర్చిపోయేవారిగా అయ్యారు. కానీ ఈ సమయంలో మర్చిపోనివారిగా అవుతున్నారు. ఈ వరదాన భూమి నుండి విశేషంగా మర్చిపోనివారిగా అయ్యే వరదానం అంటే స్మృతి స్వరూపంగా అయ్యే వరదానం తీసుకువెళ్ళండి. విస్మృతిని ఇక్కడే వదిలేయాలి. విస్మృతి యొక్క సంస్కారం సమాప్తి అయిపోవాలి. ఎప్పుడైనా ఏదైనా విషయం వస్తే ఈ వరదానాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. బాబా పిల్లలను కలుసుకునేటందుకు ఎక్కడి నుండి వస్తున్నారు? పిల్లలు వస్తున్నప్పుడు బాబా కూడా రావలసి ఉంటుంది కదా! మీరయితే ఈ సాకార లోకం నుండి వస్తున్నారు కానీ బాబా అయితే ఈ లోకం కంటే అతీతమైన లోకం నుండి వస్తున్నారు. బాబా యొక్క స్నేహం సదా పిల్లలతో ఉంటుంది. సదా పిల్లల స్మృతియే బాబాకి ఉంటుంది. బాబాకి ఇక వేరే పని ఏమైనా ఉందా? పిల్లలని జ్ఞాపకం చేయటం, ఇదే పని కదా! తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా కానీ బాబా అయితే స్మృతి చేస్తూ ఉంటారు. ఎలాగైతే బాబా పని పిల్లలని జ్ఞాపకం చేయటమో అలాగే పిల్లల పని కూడా బాబాని జ్ఞాపకం చేయటం. సదా లవలీనమై ఉండండి.

సదా రక్షణగా ఉండటానికి సాధనం స్మృతి యొక్క భట్టీ:

డ్రామానుసారం కలియుగీ ప్రపంచం యొక్క దు:ఖం, అశాంతి యొక్క దృశ్యాలను చూసి బేహద్ వైరాగిగా అయిపోతారు. ఏది జరిగినా మీ వృద్ధి కళ కోసమే. ప్రపంచం వారికి హాహా కారాలు, మీకు జయజయకారాలు. మీకు తెలుసు కదా ఈ ప్రపంచంలో హాహాకారాలు రానున్నవని మీకు తెలుసు. హాహా కారాలు చేయటం అంటే వెళ్ళిపోవటం. ఎట్టి పరిస్థితులల్లోను భయపడకూడదు. మన కోసం తయారీలు అవుతున్నాయి. సాక్షియై అన్ని రకాల ఆటలను చూడండి. కొంతమంది ఏడుస్తారు, అరుస్తారు. కానీ సాక్షిగా చూస్తే మజా వస్తుంది. ఏమి జరుగుతుందో అనే ప్రశ్న కూడా రాదు. ఇలా జరగాల్సిందే! ఇంత అచంచలం కదా! ఏమి జరుగుతుందో అనే ప్రశ్న రావటం లేదు కదా! అనేకసార్లు ఈ అలజడులన్నీ చూసారు మరియు ఇప్పుడు కూడా చూస్తున్నారు. ప్రపంచంలో ఏమి జరుగుతున్నా కానీ స్మృతి అనే భట్టీలో ఉండేవారు రక్షణగా ఉంటారు.

అందరూ సదా ఫరిస్తాల వలె డబల్ లైట్ స్థితిలో స్థితులై ఉంటున్నారా? ఫరిస్తాల మహిమ, మా మహిమయే అని అనుభవం అవుతుందా? ఈ పాత దేహంలో ఉంటూ దేహాభిమానానికి అతీతంగా ఉండాలి, దానినే ఫరిస్తాజీవితం అని అంటారు. ఈ ఫరిస్తా జీవితం సదా తేలికగా ఉంటుంది. అందువలన ఉన్నత స్థితిలోనే ఉంటారు. ఎందుకంటే తేలికైన వస్తువు ఎప్పుడు క్రిందికి రాదు. ఒకవేళ క్రింద స్థితికి వచ్చేస్తున్నారంటే తప్పక భారం ఉన్నట్లే. ఫరిస్తా అంటే నిర్బంధన. ఏ బంధన ఉండదు. దేహ బంధన కూడా ఉండదు. నిమిత్తమాత్రంగా కార్యం చేయటానికి ఆధారంగా తీసుకుంటారు, మరలా అతీతం (ఉపరామ్) అయిపోతారు. మంచిది.