07.01.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంగమయుగీ చక్రవర్తిత్వం పేరు మీద సత్యయుగీ చక్రవర్తిత్వం.

బాప్ దాదా ఈ రోజు సంగమయుగీ నిశ్చింతా చక్రవర్తుల సభను చూస్తున్నారు. సంగమయుగమే నిశ్చింతపురం. సంగమయుగీ బ్రాహ్మణాత్మలందరు నిశ్చింతా చక్రవర్తులు. సత్యయుగీ చక్రవర్తిత్వం ఈ సంగమయుగీ నిశ్చింతా చక్రవర్తిత్వం ముందు గొప్పదేమీకాదు. వర్తమాన సమయంలోని ప్రాప్తి యొక్క నషా మరియు సంతోషం, సత్యయుగీ చక్రవర్తిత్వం కంటే కోటానుకోట్లరెట్లు శ్రేష్టమైనది.

ఈరోజు వతనంలో సత్యయుగీ చక్రవర్తిత్వం మరియు సంగమయుగీ చక్రవర్తిత్యం రెండింటి తేడా గురించి ఆత్మిక సంభాషణ జరిగింది. సత్యయుగీ చక్రవర్తిత్వం యొక్క విషయాలైతే ఆరోజు చాలా విన్నారు మరియు చాలా సంతోషపడ్డారు కూడా. కానీ సంగమయుగం యొక్క శ్రేష్టత ఎంత శ్రేష్టమైనదో దీని యొక్క అనుభవీలు కూడా కదా?

1.సత్యయుగీ దినచర్యలో ప్రకృతి యొక్క సహజపాట మిమ్మల్ని మేల్కొల్పుతుంది కానీ సంగమయుగీ బ్రాహ్మణుల యొక్క ఆదికాలం అంటే అమృతవేళ నుండి శ్రేష్టతను చూడండి, అది ఎంత గొప్పదో! అక్కడ ప్రకృతి యొక్క సాధనాలు మేల్కొల్పుతాయి కానీ సంగమయుగంలో ఆదికాలం అంటే అమృతవేళ ఎవరు మేల్కొల్పుతారు? ప్రకృతికి యజమాని అయిన భగవంతుడు స్వయంగా మిమ్మల్ని మేల్కొల్పుతారు.

2. ఏ మధుర పాటను వింటున్నారు? బాబా రోజూ పిల్లలూ!, మధురమైన పిల్లలూ! అంటూ పిలుస్తారు. ఈ స్వతహసిద్ధమైన పాట, ఈశ్వరీయ పాట సత్యయుగ ప్రకృతి యొక్క పాట కంటే ఎంత గొప్పది! దీని అనుభవీలే కదా? అయితే సత్యయుగీ పాట గొప్పదా లేదా సంగమయుగీ పాట గొప్పదా? దాంతోపాటు ఇప్పుడు సత్యయుగీ సంస్కారాలను నింపుకునే మరియు ప్రాలబ్ధాన్ని తయారుచేసుకునే సమయం ఇదే. సంస్కారాలను నింపుకుంటున్నారు, ప్రాలబ్ధం తయారవుతుంది. ఇవన్నీ ఈ సంగమయుగంలోనే జరుగుతాయి.

3. అక్కడ సతో ప్రధానమైన చాలా రుచికర రసభరిత కలిగిన వృక్షం యొక్క ఫలాలు తింటారు ఇక్కడ వృక్షపతి ద్వారా సర్వ సంబంధాల యొక్క రసం, సర్వ ప్రాప్తి సంపన్న ప్రత్యక్షఫలం తింటున్నారు.

4. అక్కడ బంగారుయుగం యొక్క ఫలం మరియు ఇక్కడ వజ్రయుగం యొక్క ఫలం. ఏది శ్రేష్టమైనది?

5. అక్కడ దాసదాసీల చేతుల మీద పాలింపబడతారు మరియు ఇక్కడ బాబా చేతులు మీద పాలింపబడుతున్నారు.

6. అక్కడ మహానాత్మలు తల్లితండ్రులుగా ఉంటారు మరియు ఇక్కడ పరమాత్మయే తల్లి, తండ్రి.

7. అక్కడ రత్నజడిత ఊయలలో ఊగుతారు. ఇక్కడ అన్నింటికంటే ఉన్నతమైన ఊయల ఏమిటో తెలుసా? బాబా ఒడియే ఊయల. పిల్లలకు అన్నింటికంటే ప్రియమైన ఊయల తలితండ్రుల ఒడి. ఇక్కడ కేవలం ఒక ఊయలే కాదు, రకరకాల ఊయలలో ఊగవచ్చు. అతీంద్రియ సుఖం యొక్క ఊయల, సంతోషమనే ఊయల, అక్కడ రత్నజడిత ఊయల కంటే ఈ ఊయల ఎంత గొప్పది.

8. అక్కడ రత్నాలతో ఆడుకుంటారు, ఆటబొమ్మలతో ఆడుకుంటారు, పరస్పరం ఆడుకుంటారు కానీ ఇక్కడ బాబా చెప్తున్నారు - సదా నాతో ఆడుకోండి, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఆడుకోవచ్చు. స్నేహితునిగా అయ్యి ఆడుకోవచ్చు బంధువుగా చేసుకుని కూడా ఆడుకోవచ్చు. బిడ్డ అయ్యి ఆడుకోవచ్చు మరియు బిడ్డగా చేసుకుని కూడా ఆడుకోవచ్చు. ఇటువంటి అవినాశి ఆటబొమ్మ ఎప్పుడూ దొరకదు, విరగదు, పగలదు మరియు దీని కొరకు ఏ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
9. అక్కడ విశ్రాంతిగా పరుపులపై పడుకుంటారు, ఇక్కడ స్మృతి అనే పరుపుపై పడుకోండి.

10. అక్కడ నిద్రాలోకంలోకి వెళ్ళిపోతారు కానీ సంగమయుగంలో బాబాతో పాటు సూక్ష్మవతనానికి వెళ్ళిపోండి.

11. అక్కడ విమానాలలో కేవలం ఒక లోకంలోనే విహరించగలరు ఇప్పుడు బుద్ది రూపి విమానం ద్వారా మూడు లోకాలు విహరించవచ్చు.

12. అక్కడ విశ్వనాధులుగా పిలవబడతారు మరియు ఇప్పుడు త్రిలోకనాధులు.

13. అక్కడ రెండు నేత్రాలే ఉంటాయి, ఇక్కడ త్రినేత్రులు.

14.సంగమయుగంలో జ్ఞానవంతులుగా, శక్తివంతులుగా, దయాహృదయులుగా ఉంటారు, దీనికి బదులుగా అక్కడ ఎలా ఉంటారు?

రాయల్ మొద్దులుగా అయిపోతారు.

15.ప్రాపంచిక లెక్క ప్రకారం పరమపూజ్యులుగా ఉంటారు, విశ్వమంతటి ద్వారా గౌరవించబడతారు. కానీ జ్ఞానపరంగా చూస్తే చాలా తేడా వచ్చేస్తుంది.

16.ఇక్కడ అయితే శుభోదయం మరియు శుభరాత్రి బాబాతో చెప్తారు.. అక్కడ ఆత్మలు ఆత్మలతో చెప్తారు.

17. అక్కడ విశ్వరాజ్యాధికారిగా ఉంటారు, రాజ్యకర్తగా ఉంటారు మరియు ఇక్కడ విశ్వకళ్యాణకారిగా, మహాదానిగా, వరదానిగా ఉంటారు. కనుక ఎవరు శ్రేష్టమైనవారు? సత్యయుగీ విషయాలు వింటూ సదా సంతోష స్వరూపంగా అయిపోండి.

18. అక్కడ విభిన్న రకాల భోజనం తింటారు, కానీ ఇక్కడ బ్రహ్మాభోజనం తింటున్నారు. దీని మహిమ దేవతల భోజనం కంటే కూడా చాలా శ్రేష్టమైనది. సదా సత్యయుగీ పాలబ్దాన్ని మరియు వర్తమాన సమయం యొక్క గొప్పతనాన్ని మరియు ప్రాప్తిని వెనువెంట ఉంచుకోండి. వర్తమాన సమయాన్ని తెలుసుకుని ప్రతి సెకను మరియు సంకల్పాన్ని శ్రేష్టంగా చేసుకోగలరు. మంచిది. అర్ధమైందా!

ఇలా సదా బాబాతో కలయిక జరుపుకునేవారికి, రాత్రి - పగలు ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు అనే ధ్యాసలో నిమగ్నమై ఉండేవారికి, సదా విశ్వాత్మలకు సర్వఖజానాలతో మహాదానం మరియు వరదానం ఇచ్చేవారికి, సదా సంగమయుగం యొక్క విశేషతను ఎదురుగా ఉంచుకుని శ్రేష్ట భాగ్యం యొక్క స్మృతి స్వరూపులకు, ఇలా సదా శ్రేష్ట వృత్తి, శ్రేష్ట తరంగాల ద్వారా విశ్వకళ్యాణకారి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.