09.01.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అలౌకిక దుస్తులు మరియు అలౌకిక అలంకరణ.

ఈరోజు బాప్ దాదా విశేషంగా నలువైపుల ఉన్న పిల్లల యొక్క రమణీయ రంగుని చూస్తున్నారు. చూసి నవ్వుకుంటున్నారు కూడా మరియు అక్కడక్కడ విశేషమైన నవ్వు కూడా వస్తుంది. ఆ రంగు ఏమిటి? బాప్ దాదా చూస్తున్నారు - సంగమయుగి సర్వశ్రేష్ట వజ్రతుల్య యుగవాసీలు మరియు సర్వశ్రేష్ట బాప్ దాదా యొక్క పిల్లలు, ఈశ్వరీయ సంతానం మరియు

బ్రాహ్మణకులం యొక్క శ్రేష్టాత్మలకు, గారాభమైన, ప్రియమైన పిల్లలకు బాప్ దాదా విశేషంగా రోజంతటి కొరకు రకరకాలైన దుస్తులు మరియు అలంకారాలు మరియు కూర్చునేటందుకు స్థానం లేదా ఆసనాలు ఎంత శ్రేష్టమైనవి ఇచ్చారు. ఎలాంటి సమయమో అలాంటి దుస్తులు మరియు అలంకారం చేసుకోవచ్చు. సత్యయుగంలో రకరకాలైన దుస్తులు మరియు అలంకారాలు మార్చుకుంటూ ఉంటారు కానీ ఆ సంస్కారాలను అయితే ఇక్కడి నుండే నింపుకోవాలి కదా! బ్రహ్మాబాబా సంగమయుగం యొక్క రకరకాలైన దుస్తులతో మరియు అలంకారాలతో బ్రాహ్మణ పిల్లలను అలంకరించారు. కానీ ఏ రమణీయ రంగుని చూసారు? ఇంత సుందరమైన దుస్తులు మరియు అలంకరణలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది పిల్లలు పాత దుస్తులు, మురికి దుస్తులు వేసుకుంటున్నారు. ఎలాంటి దుస్తులో అలాంటి అలంకారం అమృతవేళ యొక్క దుస్తులు మరియు అలంకారం ఏమిటో తెలుసా? రోజంతటి రకరకాల దుస్తులు మరియు అలంకారాలు

ఏమిటో తెలుసా? బాప్ దాదా ద్వారా రకరకాల బిరుదులు పిల్లలకు లభించాయి. ఆ రకరకాలైన బిరుదుల యొక్క స్థితి అనే దుస్తులు మరియు రకరకాల గుణాల యొక్క అలంకారాల సెట్. ఎన్ని రకాల దుస్తులు మరియు అలంకారాలు ఉన్నాయి. ఎలాంటి దుస్తులో అలాంటి ఆభరణాల సెట్ తో అలంకరించబడిన సీట్ పై సెట్ అయ్యి ఉండండి. మీ దుస్తులను లెక్కించండి, ఎన్ని ఉన్నాయి? బిరుదు యొక్క స్థితిలో స్థితులవ్వటమే దుస్తులు దరించటం. అప్పుడప్పుడు విశ్వకళ్యాణకారి దుస్తులు వేసుకోండి, అప్పుడప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క దుస్తులు మరియు అప్పుడప్పుడు స్వదర్శచక్రధారి యొక్క దుస్తులు ఇలా ఏవిధమైన సమయమో, ఏవిధమైన కర్తవ్యమో, ఆవిధమైన దుస్తులు ధరించండి. దాంతో పాటు రకరకాల గుణాలతో అలంకరించుకోండి. రకరకాలైన అలంకారాల జతలను ధరించండి. చేతులకు, కంఠానికి, చెవులకి మరియు మస్తకానికి అలంకారం ఉండాలి. మస్తకంలో నేను ఆనంద స్వరూపాన్ని అనే స్మృతిని ధారణ చేయండి - ఇదే మస్తకం యొక్క తిలకం. కంఠానికి అంటే నోటి ద్వారా ఆనందాన్ని కలిగించే మాటలు మాట్లాడాలి -ఇదే కంఠహారం. చేతుల ద్వారా అంటే కర్మలో ఆనంద స్వరూపం యొక్క స్థితి ఉండాలి - ఇదే చేతి గాజులు. చెవుల ద్వారా కూడా ఆనంద స్వరూపంగా అయ్యే విషయాలు వింటూ ఉండాలి - ఇది చెవులకు ఆభరణం. పాదాల ద్వారా ఆనంద స్వరూపంగా తయారుచేసే సేవ వైపు పాదం పెట్టాలి, అంటే అడుగుఅడుగు ఆనంద స్వరూపంగా తయారయ్యే మరియు తయారుచేసే వైపు వేయాలి - ఇదే పాదాలకు అలంకారం. ఇప్పుడు ఒక సెట్ గురించి అర్ధమైంది కదా? సెట్ అంతా ధరించారా? ఇలా వేర్వేరు సమయాలలో వేర్వేరు సెట్లను ధరించండి. సెట్లు ధరించటం వస్తుంది కదా? లేదా చెవులకు పెట్టుకుంటే కంఠానికి వదిలేసారా? ఈరోజుల్లో ప్రపంచంలో కూడా సెట్స్ ధరించే పద్ధతి ఉంది. మీకు ఇంత శ్రేష్టమైన ఆభరణాల సెట్స్ ఉన్నాయి. వాటిని ఎందుకు ధరించటం లేదు? ఎందుకు పెట్టుకోవటం లేదు? ఇన్ని రకాల సుందర దుస్తులను వదిలి దేహాభిమానం యొక్క స్మృతి అనే మట్టి పట్టిన దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారు!

అద్భుతమైన దుస్తుల పోటీ ఈ రోజు దుస్తులు మరియు అలంకరణ పోటీ చూసారు, ఏ పిల్లలు రోజంతటిలో అలంకరించుకుని ఉంటున్నారు మరియు ఏ పిల్లలు దుస్తులు మార్చుకోవటం మరలా వేసుకోవటం, తీసేయటంలో ఉంటున్నారని. ఇప్పుడిప్పుడే ఒక డ్రెస్ వేసుకుంటున్నారు మరియు ఇప్పుడిప్పుడే ఆ డ్రెస్ తీసేసి నాణ్యత లేని డ్రెస్ వేసుకుంటున్నారు, ఎక్కువ సమయం శ్రేష్టమైన, సుందరమైన డ్రెస్ ధరించి ఉండలేకపోతున్నారు. ఇంకా ఏమి చూసారు? కొంతమంది పూర్తిగా దుర్వాసనతో కూడిన దుస్తులు వేసుకుంటున్నారు. అది ఏ దుర్వాసన? దేహ సంబంధాలు మరియు దేహపదార్ధాలపై తగుల్పాటు యొక్క చెడువాసన గల దుస్తులు, ఈ దుర్వాసన దూరం నుండే వస్తుంది. కొంతమంది మురికితో ఉన్న చర్మదుస్తులు వేసుకుంటున్నారు అంటే చెడు దృష్టి, దేహాన్ని చూసే దృష్టి యొక్క మురికి చర్మదుస్తులు కూడా వేసుకుని ఉన్నారు. కొంతమంది దుస్తులపై మురికి మచ్చలు కూడా ఉన్నాయి. మురికి మచ్చలు అంటే ఇతరుల అవగుణాలు అంటే మచ్చను మీలో ధారణ చేయటం. అవే మురికిమచ్చలున్న దుస్తులు. కొంతమంది దుస్తులు అయితే చాలా చెడు రక్తపు మరకలతో ఉన్నాయి. అవి ఎందుకు పడ్డాయి? మాటిమాటికి వికర్మ చేయటం అంటే ఆత్మహత్య చేసుకోవటం. ఆత్మ యొక్క శ్రేష్టస్థితిని హత్య చేయటం ఇలాంటి దుస్తులు వేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, సుందరమైన బిరుదుల యొక్క స్థితి రూపీ దుస్తులు ఎక్కడ మరియు ఈ మురకి దుస్తులు ఎక్కడ! శ్రేష్టాత్మల దుస్తులు కూడా శ్రేష్టంగా ఉండాలి. ఏమి చూసారు? కొంతమంది పిల్లలు రోజంతా ఆ శ్రేష్ట దుస్తులతో అలంకారాల సెట్లను ధరించి సీట్ పై బాగా సెట్ అయ్యి ఉంటున్నారు మరియు కొంతమంది ఉన్నతమైన దుస్తులు ధరించాలనుకుంటున్నా, ఎదురుగా ఉన్నప్పటికీ ధరించాలనుకున్నా ధరించలేకపోతున్నారు. కనుక అమృతవేళ నుండి శ్రేష్ట అలంకారాల సెట్ ని ధరించండి. ఇలా ఎప్పుడైతే శ్రేష్ట బిరుదులనే దుస్తులు వేసుకుంటారో, గుణాల అలంకారాలను ధరిస్తారో అప్పుడు ఎలా అయితే సత్యయుగంలో విశ్వమహారాజు లేదా విశ్వమహారాణీల దుస్తులను వారి వెనుక దాసదాసీలు సంభాళన చేస్తారో అలాగే ఇప్పుడు మాయాజీత్ సంగమయుగీ స్వరాజ్యాధికారులు ఈ బిరుదుల రూపీ దుస్తుల యొక్క స్థితిలో స్థితులయ్యినప్పుడు పంచతత్వాలు మరియు పంచవికారాలు మీ దుస్తులను మీ వెనుక సంభాళిస్తూ ఉంటాయి అనగా మీకు ఆధీనమై నడుస్తాయి. ఉరికంబాన్ని వదిలి సింహాసనాధికారిగా అవ్వండి.

ఈ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకోండి - ఇటువంటి మాయాజీతుల వెనుక రావణుని యొక్క పది తలలు పది సేవాధారులుగా అయ్యి వెనుక ఎలా వస్తాయో ఆ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకొండి. కానీ ఎప్పుడైతే మీ దుస్తులు బిగుతుగా ఉండాలి మరియు బాగా పొడవుగా అంటే నిరంతరం ఆ స్థితిలో ఉండటం అప్పుడే అవి మీ దుస్తులను సంభాళిస్తాయి. ఒకవేళ నిరంతరం అనే పొడవు లేకపోతే, బిరుదులనే దుస్తులు బిగువుగా లేకపోతే ఆ సేవాధారులు మీదుసులను తీసేస్తాయి ఎందుకంటే వదులుగా ఉన్నాయి కనుక. కాబట్టి ఇప్పుడు ధృడసంకల్పంతో బిరుదుల యొక్క దుస్తులను బిగువుగా చేసుకోండి. ధృడసంకల్పమే బెల్ట్. దీనితో బిగువుగా చేసుకోటం ద్వారా సదా రక్షణగా ఉంటారు మరియు సదా సేవాధారులు కూడా ఆధీనమై ఉంటారు. చెప్పాను కదా - వికారాలు పరివర్తన అయ్యి సహయోగి, సేవాధారులు వేసుకోండి. కానీ మురికి డ్రెస్ వేసుకోకూడదు. వెరైటీ డ్రెస్ మరియు వైరైటీ అలంకారాల లాభం పొందండి. బ్రహ్మబాబా మరియు బాప్ దాదా సంగమయుగం యొక్క వరకట్నం ఇచ్చారు. ప్రేమ వివాహం చేసుకున్నారు కనుక కట్నం కూడా లభిస్తుంది కదా! వరకట్నం ఏమిటంటే ఈ వెరైటీ అలంకారాల సెట్ మరియు సుందర దుస్తులు, బాప్ దాదా ఇచ్చే వరకట్నాన్ని వదిలి పాత వరకట్నాన్ని ఉపయోగించుకోకండి. కొంతమంది పిల్లలు బాప్ దాదా ఇచ్చే వరకట్నాన్ని కూడా తీసుకుంటున్నారు మరియు తీసుకున్నారు, కానీ దాంతోపాటు పాత దుస్తులను కూడా దాచుకుని ఉంచుకున్నారు. అందువలన అప్పుడప్పుడు వాటిని ధరిస్తున్నారు. పాత తగుల్పాటు వస్తే పాత దుస్తులు వేసుకుంటున్నారు. అమూల్యమైన దుస్తులను వదిలి చినిగిపోయిన డ్రెస్ వేసుకుంటున్నారు, ఇలా చేయకండి. ఒకవేళ ఇప్పటికీ పాతవాటిని దాచి ఉంచితే కాల్చేయండి మరియు కాల్చేసిన తర్వాత బూడిదను కూడా మీ దగ్గర ఉంచుకోకండి. దానిని కూడా సాగరంలో స్వాహా చేసేయండి అప్పుడు సదా అలంకరించబడి ఉంటారు మరియు బాబా హృదయసింహాసనాధికారిగా ఉంటారు. సింహాసనం నుండి దిగిపోతే కనుక ఉరికంబం ఎక్కాల్సి వస్తుంది. అప్పుడప్పుడు లోభం యొక్క, అప్పుడప్పుడు మోహం యొక్క ఉరికంబం వస్తుంది. కనుక ఉరికంబాన్ని వదిలి సింహాసనాధికారి అవ్వండి. వరకట్నం జాగ్రత్తగా ఉంది కదా! దానిని ఉపయోగించుకోండి. వరకట్నాన్ని దాచుకోకండి. చాలా బావుంది, చాలా బావుంది అని కేవలం చూస్తూ ఉండిపోకండి కానీ ధరించండి మరియు దుస్తుల పోటీలో మొదటి నెంబర్ అవ్వండి. చెప్పాను కదా - నిరంతరం అనే దానిపై నెంబరు ఆధారపడి ఉంటుంది. డ్రెస్ ధరించడం అందరికి వస్తుంది కానీ సదా టిప్-టాప్ గా ఉండటం రావటంలేదు. సదా అలంకరించబడి ఉన్న దానికి నెంబర్ వస్తుంది. ఈ పోటీలో విదేశీయులు మొదటి నెంబర్ తీసుకుంటారా లేక భారతీయులు తీసుకుంటారా! ఎంత కావాలంటే అంతమంది తీసుకోవచ్చు. అక్కడైతే బహుమతి కారణంగా ఒకరికే మొదటి నెంబర్ లభిస్తుంది ఇక్కడైతే చాలామంది మొదటి నెంబర్ అవ్వవచ్చు. ఇక్కడ లెక్కలేనంత ఖజానా ఉంది. ఎంతమంది మొదటి నెంబర్ లోకి వస్తే అంతమందికి మొదటి బహుమతి లభిస్తుంది. మంచిది, రేపటి నుండి ఏమి చేస్తారు?

అమృతవేళ నుండి రకరకాలైన డ్రెస్లు మరియు అలంకారాల సెట్లతో అలంకరించుకుని రోజంతా బాబా వెంట ఉండాలి. అమృతవేళ నుండే మొదటి నెంబర్ దుస్తులు ధరించాలి. ఇలా అలంకరించబడిన ప్రేయసీలనే వెంట తీసుకువెళ్తారు. ఇతరులను కాదు. ఎవరైతే పోటీలో మొదటి నెంబర్ వస్తారో వారే వెంట ఉంటారు మరియు వెంట వెళ్తారు. ఎవరైతే వెంట ఉండరో వారు వెంట వెళ్ళరు కూడా. సదా ఈ సూక్తి జ్ఞాపకం ఉంచుకోండి అంటే ఈ తిలకం పెట్టుకోండి వెంట ఉంటాము, వెంట వెళ్తాము అని. పోటీ ఎంత బావుంటుందో అని అనుకుంటున్నారు కదా! బాబా, బ్రహ్మాబాబాకి వతనంలో ఇది చూపిస్తూ ఉంటారు. పిల్లల సృతి అయితే బ్రహ్మబాబాకి కూడా ఉంటుంది. పిల్లల పరిస్థితి చూపిస్తూ ఉంటాను.

ఇలా సదా అలంకరించడి ఉండే మూర్తులకు, సంగమయుగ శ్రేష్ట జీవితం యొక్క మహత్వాన్ని తెలుసుకునే మహానాత్మలకు, శత్రువులను కూడా సేవాధారులుగా చేసుకునే వారికి సహయోగిగా చేసుకునేవారికి, ఇలా మాస్టర్ సర్వశక్తివాన్, సదా బాబా మరియు మీరు ఈ విచిత్ర దంపతుల రూపంలో ఉండేవారికి, ఇలా పరమపూజ్య మరియు మహిమాయోగ్య ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.