14.01.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఆత్మిక సైనికులతో ఆత్మిక సేనాధిపతి యొక్క సంభాషణ.

ఈరోజు విశేషంగా ఏ సంఘటన? ఇది డబుల్ సేవాధారి పిల్లల సంఘటన, దీంట్లో ప్రతి ఒక్కరు డబుల్ సేవాధారులు మరియు జ్ఞానసాగరులు, ఇటువంటి గ్రూపుని చూసి ఈరోజు వతనంలో ఒక విశేషమైన సంభాషణ జరిగింది -

బ్రహ్మాబాబా అన్నారు - వీరు నా విశేష భుజాలు అని, శివబాబా అన్నారు - నా రుద్రమాల, రుద్రమాలలో విశేష మణులు. ఇలా సంభాషించుకుంటూ శివబాబా బ్రహ్మాబాబాను అడిగారు - నీ యొక్క ఈ భుజాలు అందరు కుడిభుజాలా లేదా ఎడమభుజాలు కూడా ఉన్నారా? కుడి భుజాలు అంటే సదా సమానంగా, స్వచ్చంగా మరియు సత్వవాదిగా ఉంటారు. మరయితే అందరు కుడిభుజాలేనా? బ్రహ్మబాబా నవ్వుకుంటున్నారు మరియు నవ్వుతూ చెప్పారు - ప్రతి ఒక్కరి ఖాతా అయితే మీ దగ్గరే ఉంటుంది కదా! ఎప్పుడైతే ఖాతా చూసే విషయం వచ్చిందో అప్పుడు ప్రతి బిడ్డ యొక్క ఖాతా ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షం అయ్యింది? ఒక గడియారం రూపంలో ప్రత్యక్షం అయ్యింది. దానిలో ప్రతి ఒక్కరి నాలుగు సబ్జక్టులు నాలుగు భాగాలుగా ఉన్నాయి. ఇక్కడ సృష్టిచక్రం యొక్క చిత్రం ఎలా తయారుచేస్తారు కదా! అలాగే ఈ గడియారంలో కూడా ప్రతి భాగంలో ముల్లు ఉంది, అది ప్రతి ఒక్కరి యొక్క నాలుగు సబ్జక్టుల శాతాన్ని చూపిస్తుంది. అందరి లెక్కలఖాతా స్పష్టంగా కనిపిస్తుంది. లెక్కల ఖాతా చూస్తూ బాప్ దాదాలు ఇరువురు మాట్లాడుకుంటున్నారు. సమయం యొక్క గడియారం మరియు పురుషార్ధం యొక్క గడియారం రెండింటిని చూస్తే ఏమి కనిపించింది? సమయం యొక్క గడియారం వేగంగా ఉంది. మరియు పిల్లల పురుషార్థం యొక్క గడియారంలో ఎక్కువమందికి రెండు భాగాలు అంటే రెండు సబ్జక్టుల ఫలితం 75% మంచిగా ఉంది. కానీ మిగిలిన రెండు సబ్జక్టుల యొక్క శాతం చాలా తక్కువగా ఉంది. అప్పుడు బాప్ దాదా అన్నారు - ఈ ఫలితానుసారం చూస్తే ఎవరెడీ గ్రూప్ అని అంటారు. ఎలా అయితే వినాశనానికి బటన్ నొక్కటమే ఆలస్యం, ఒక్క సెకండు యొక్క విషయం అదేవిధంగా స్థాపనకి నిమిత్తమైన పిల్లలు ఒక్క సెకనులో తయారైపోవాలి అలా స్మృతి అనే సమర్ధ బటన్ తయారుగా ఉందా? సంకల్పం చేయగానే అశరీరి అయిపోవాలి. సంకల్పం చేశారు అంతే సర్వుల విశ్వకళ్యాణకారి అనే వేదికపై స్థితులై ఆ స్థితిలో ఉంటూ సాక్షిదృష్టితో వినాశనం యొక్క లీలను చూడగలగాలి. దేహం యొక్క సర్వ ఆకర్షణలు అనగా సంబంధాలు, పదార్థాలు, సంస్కారాలు వీటన్నింటి ఆకర్షణకు అతితంగా, ప్రకృతి అలజడి యొక్క ఆకరణకు అతితంగా ఫరిస్తా అయ్యి ఉన్నత స్థితిలో స్థితులై శాంతి మరియు శక్తి కిరణాలు సర్వాత్మలకు ఇవ్వాలి. ఈ విధంగా స్మృతి అనే బటన్ తయారుగా ఉందా? ఎప్పుడైతే రెండు బటన్ లు తయారయిపోతాయో అప్పుడు సమాప్తి అయిపోతుంది.

వతనంలో ఈ గ్రూపుని చూసి లెక్కలఖాతా ప్రత్యక్షం అయ్యింది. బాహుబల సైనికులలో కూడా రకరకాలైన వారు ఉంటారు. కొంతమంది సరిహద్దుల వరకు వెళ్ళేవారు అంటే యుద్ధమైదానం వరకు వెళ్ళేవారు అంటే డైరెక్టర్ గా యుద్ధం చేసేవారు మరియు రెండవవారు వారిని పాలన చేసేవారు. వారు వెనుక ఉంటారు. డైరెక్టర్ అయితే వెన్నెముకగా ఉంటారు. అలాగే ఈ గ్రూప్ మైదానంలో సేవ చేసే గ్రూప్. మైదానంలో ఉండే సైన్యం ఆధారంగానే విజయం లేదా ఓటమి అనేది ఉంటుంది. ఒకవేళ మైదానంలోకి వచ్చినవారు బలహీనంగా, శస్త్రహీనంగా, భయపడేవారిగా ఉంటే డైరెక్టర్ విజయం పొందలేడు. అదేవిధంగా విశ్వకళ్యాణం యొక్క మైదానంలో ఉన్న సేవాధారి గ్రూప్ మీరు. ఈ గ్రూప్ వారు శక్తివంతులు. ఎదుర్కునే శక్తి అంటే అనుభవం చేయించే శక్తి, శ్రేష్టచరిత్ర ద్వారా అందరికీ బాప్ దాదా యొక్క చిత్రాన్ని చూపించే శక్తి - ఇలాంటి శస్త్రధారులేనా? ఏమని భావిస్తున్నారు? ఈ విధమైన శక్తిస్వరూప గ్రూపేనా? నాలుగు సబ్జక్టుల యొక్క నాలుగు అలంకారధారులేనా? రెండు భుజాలు గల శక్తిస్వరూపులా లేదా నాలుగు భుజాలు కలిగినవారా? ఆ నాలుగు అలంకారాలు నాలుగు సబ్జక్టులకు గుర్తు. అన్ని అలంకారాలను ధారణ చేసారా? లేదా కొంతమంది రెండు ధారణ చేశారా, కొంతమంది మూడు ధారణ చేశారా లేదా ఒకటి ధారణ చేస్తే మరొకటి వదిలేస్తున్నారా? ఈ గ్రూప్ యొక్క గొప్పతనం అర్థమైందా!

శ్రీమతరూపి ముల్లు సరిగ్గా ఉంటే త్రాసు యొక్క రెండు పళ్ళాలు సమానంగా ఉంటాయి. సేవా మైదానంలోకి వచ్చేవారి గ్రూప్ అంటే విజయానికి ఆధారమూర్తులైన వారి గ్రూప్ ఆధారమూర్తులు బలంగా ఉన్నారు కదా? ఆధారం కదిలేదిగా లేదు కదా! ఎలా అయితే జ్ఞానం మరియు సేవ ఈ రెండు సబ్జెక్టుల ఫలితం 75% చూసారో అలాగే స్మృతి మరియు ధారణ ఈ రెండు సబ్జెక్టులపై కూడా మరింత ధ్యాస పెట్టి నాలుగు అలంకారధారులుగా అవ్వండి. లేకపోతే సృష్టిలోని ఆత్మలకు సంపూర్ణ సాక్షాత్కారం చేయించలేరు. అందువలన ఈ రెండు అలంకారాలు ధారణ చేయడానికి విశేషంగా ఏమి ధ్యాస పెట్టుకుంటారు? డబుల్ సేవాధారులేనా? లౌకికం మరియు ఈశ్వరీయ సేవ. శరీర నిర్వహణార్థం మరియు ఆత్మ నిర్వహణార్థం డబుల్ సేవ లభించింది కదా! మరియు రెండు సేవలు బాప్ దాదా సలహానుసారం లభించాయి. కానీ రెండు సేవలలో సమయాన్ని మరియు శక్తులను సమానంగా పెడుతున్నారా? సమాన ధ్యాస పెడుతున్నారా? త్రాసును రెండు వైపుల సమానంగా పెడుతున్నారా? ముల్లు సరిగ్గా ఉంచుతున్నారా లేక ముల్లు లేకుండానే త్రాసు పెడుతున్నారా? ముల్లు అంటే శ్రీమతం. ఒకవేళ శ్రీమతం అనే ముల్లు సరిగ్గా ఉంటే రెండు వైపుల సమానంగా ఉంటుంది. అంటే త్రాసు యొక్క సమానత బావుంటుంది. ముల్లే సరిగా లేకపోతే సమానత ఉండదు. కొంతమంది పిల్లలు ఒకవైపు బరువు ఎక్కువ పెడుతున్నారు. ఎలా? లౌకిక బాధ్యతలను అయితే నిలుపుకోవలసిందే అంటున్నారు మరియు ఈశ్వరీయ బాధ్యతలను అయితే నిలుపుకోవాలి కానీ అంటున్నారు. అవి అయితే నిలుపుకోవల్సిందే మరియు ఇవి అయితే నిలుపుకోవాలి కానీ అంటున్నారు. అందువలన ఒకవైపు బరువు ఎక్కువ అయిపోతుంది. ఫలితం ఏమి వస్తుంది? ఆ బరువు వారినే క్రిందికి తీసుకువచ్చేస్తుంది. పైకి లేవలేకపోతున్నారు. బరువు ఉన్నవైపు సదా భూమిమీదకు క్రిందికి వచ్చేస్తుంది మరియు తేలికైన వైపు పైకి లేస్తుంది. మరియు సమానంగా ఉన్నా కానీ పైకే ఉంటాయి కానీ క్రిందకి రావు, క్రిందకు వచ్చేస్తున్న కారణంగా భూమి యొక్క అకర్షణకు వశం అయిపోతున్నారు. బరువు కారణంగా ఈశ్వరీయ సేవామైదానంలో తేలికగా సదా సఫలతామూర్తిగా కాలేకపోతున్నారు. కర్మబంధన మరియు లోక మర్యాద యొక్క బరువు క్రిందికి తీసుకువచ్చేస్తుంది. ఏ లోకాన్ని అయితే వదిలేసారో ఆ లోకం యొక్క మర్యాదలను ఉంచుకుంటున్నారు మరియు సంగమయుగం లేదా సంగమయుగీలోకం వారిగా అయ్యారు. మరి ఈ లోకం యొక్క మర్యాదను మర్చిపోతున్నారు. ఏ లోకం అయితే భస్మం కానున్నదో ఆ లోకం యొక్క మర్యాదలను సంస్కృతిలో ఉంచుకుంటున్నారు మరియు అవినాశి లోకం యొక్క మరియు ఏ లోకం ద్వారా భవిష్యలోకం తయారవుతుందో ఆ లోకం యొక్క స్మృతి ఇప్పిస్తున్నా కూడా అప్పుడప్పుడు స్మృతి స్వరూపంగా అవుతున్నారు. గృహస్థ వ్యవహారం మరియు ఈశ్వరీయ వ్యవహారం రెండింటిలో సమానత ఉంచుకోవాలి అంటే సదా రెండింటిలో తేలికగా మరియు సఫలులు అవ్వటం.

గృహస్థ వ్యవహారం కాదు, నిమిత్త వ్యవహారం వాస్తవానికి గృహస్థ వ్యవహారం అనే మాటను మార్చేయండి. గృహస్థం అని అంటూ గృహస్థీగా అయిపోతున్నారు. అందువలనే గృహస్థీలు కాదు, నిమిత్తులు. గృహస్థ వ్యవహారం కాదు, నిమిత్త వ్యవహారం. గృహస్థీగా అయ్యి ఏమి చేస్తున్నారు? గృహస్థీల ఆట ఏది? గృహస్థీగా అవ్వటం ద్వారా సాకులు చెప్పే ఆట ఆడుతున్నారు. ఇలా మరియు అలా అనే భాష చాలా మాట్లాడుతున్నారు. ఇలా కదా, అలా కదా అంటూ విషయాన్ని పెంచుతున్నారు. ఇది అయితే మీకు తెలుసు కదా, చేయాల్సే ఉంటుంది కదా, ఇది అంతే, అలానే ఉంటుంది..... ఇలా ఈ పాఠాన్ని బాబాకి కూడా చదివిస్తున్నారు. నిమిత్తంగా అయిపోతే సాకులు చెప్పే ఆట సమాప్తి అయ్యి ఎగిరేకళ యొక్క ఆట ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి మిమ్మల్ని మీరు గృహస్థ వ్యవహారులుగా భావించకూడదు. నిమిత్త వ్యవహారం. బాధ్యులు వేరేవారు, మీరు నిమిత్తులు. ఇలా సంకల్పంలో పరివర్తన తీసుకువస్తే మాట మరియు కర్మలో పరివర్తన అయిపోతారు. ఈ గ్రూప్ ఒకొక్కరు చాలా అద్భుతం చేస్తారు. కర్మయోగులు, సహజయోగులు ప్రతీ ఒక్కరు ఉదాహరణగా అయ్యి అనేకాత్మలు శ్రేష్ట వ్యాపారం చేసేటందుకు నిమిత్తం అవుతారు. హద్దులోని గురువు యొక్క పీఠాధిపతి శిష్యుడు తన గురువు యొక్క పేరుని ప్రసిద్ధం చేస్తాడు మరియు ఇక్కడ సద్గురువు యొక్క ఇంతమంది సింహాసనాధికారి పిల్లలు ఒక్కొక్కరు ఎంత శ్రేష్టకార్యం చేస్తారు?

బాప్ దాదా పిల్లలందరినీ ఇలా సేవాధారులుగా మరియు విశ్వంలో పేరుని ప్రసిద్ధం చేసే విశ్వకళ్యాణకారి పిల్లలుగా భావిస్తున్నారు. ఎప్పుడైతే ఇలా ఒక్కొక్క దీపం దీపమాలను తయారుచేస్తే ఒక్కొక్క దీపం విశ్వంలో దీపావళి చేస్తారు. అర్ధమైందా!

ఈ గ్రూప్ ఏమి చేయాలి! వెరైటీ గ్రూప్ కనుక వెరైటీ వర్గాల ఆత్మలకు సేవాధారి అయ్యి సర్వులకు సద్గతి లేదా శ్రేష్టజీవితాన్ని తయారుచేసే ఆధారమూర్తులు అవ్వాలి. ఎలా అయితే మీరు డబుల్ విదేశీయులో అలాగే డబుల్ నాలెడ్జ్ ఫుల్, డబుల్ సర్వీసబుల్. ఇలా ఫలితం కూడా డబుల్ గా రావాలి.

ఇలా సదా సర్వ బంధనముక్తులకు, సదా జీవన్ముక్తులకు, విశ్వం యొక్క షోకేస్ లో విశేషమైన షో పీస్ లకు, విశ్వపరివర్తన చేసే ఆధారమూర్తులకు, సదా శ్రీమతం ఆధారంగా స్వ ఉద్దరణ మరియు విశ్వ ఉద్దరణ చేసేవారికి, సదా విశ్వ సేవాధారులకు, బేహద్ సేవాధారులకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.