16.01.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వశక్తివంతుని రాజయోగ సభ మరియు లోక(ప్రియ)సభ.

ఈరోజు కల్పమంతటిలో సర్వశ్రేష్ట బ్రాహ్మణుల యొక్క సభ లేదా రాజయోగిసభను చూస్తున్నారు. ఒకవైపు ఈనాటి అల్పకాలిక రాజ్యం యొక్క రాజ్యసభ మరియు లోక్ సభ. రెండవవైపు సర్వశక్తివంతుని ద్వారా తయారైన రాజయోగి సభ, లోకప్రియ (లోకానికి ఇష్టమైన) సభ. రెండు సభలు తమతమ కార్యం చేస్తున్నాయి. హద్దు యొక్క లోక్ సభ హద్దులోని లా అండ్ ఆర్డర్ తయారుచేస్తుంది మరియు లోకప్రియ బ్రాహ్మణసభ అవినాశి లా అండ్ ఆర్డర్ తయారుచేస్తుంది. ఎలా అయితే ఆ లోక్ సభ మరియు రాజ్యసభలో అధికారులు తమతమ అల్పబుద్ధి ద్వారా అల్పకాలికమైన రకరకాల ఆలోచనలను తెలియచేస్తారో అదేవిధంగా బ్రాహ్మణుల రాజ్యసభ లేదా రాజయోగి సభ విశ్వకళ్యాణానికి రకరకాల ఆలోచనలను తెలియచేస్తుంది. అది స్వార్థం కోసం మరియు ఇది విశ్వకళ్యాణం కోసం. అందువలనే లోకానికి ఇష్టమైన వారిగా అవుతారు. స్వార్ధం ఉంటే మనస్సుకి ఇష్టమైన వారిగా అవుతారు మరియు విశ్వకళ్యాణం యొక్క ఆలోచన ఉంటే లోకానికి ఇష్టమైనవారిగా, ప్రభువుకి ఇష్టమైనవారిగా అవుతారు. ఏ సంకల్పం లేదా ఆలోచన చేస్తున్నా మొదట ఇది పరిశీలన చేసుకోండి - ఈ సంకల్పం లేదా ఆలోచన బాబాకి అంటే ప్రభువుకి ఇష్టమైనదేనా? అని. ఎవరితో చాలా స్నేహం ఉంటుందో వారికి ఇష్టమైనదే మనకి ఇష్టం అవుతుంది. అలాగే బాబాకి ఇష్టమైనదే మీకు ఇష్టం మరియు బాబాకి ఇష్టమైనది లోకానికి స్వతహాగానే ఇష్టం అవుతుంది. ఎందుకంటే మొత్తం విశ్వానికి లేదా లోకానికి తెలిసినా, తెలియకపోయినా, చూసినా, చూడకపోయినా అందరికీ ఇష్టమైనవారు ఎవరు? ధర్మపితలకు తమ ధర్మాత్మలు ఇష్టం కానీ ధర్మాత్మలకు కూడా ప్రియమైవారు పరమపిత ఒక్కరే. అందువలనే అందరి నోటి నుండి సమయానుసారం రకరకాల భాషలలో ఒకే బాబా యొక్క పిలుపు వినిపిస్తుంది. బాబా లోకానికి ఇష్టమైనవారు కనుక బాబాకి ఎవరైతే ఇష్టం అవుతారో వారు స్వతహాగానే లొకానికి ఇష్టంగా అవుతారు. బాబాకి ఇష్టమైనవారు స్వతహాగానే లోకానికి ఇష్టమైనవారిగా అవుతారు. మిమ్మల్ని మీరు అడగండి - నాకు లోకప్రియ సభ యొక్క టికెట్ లభించిందా? అని. బాబా ఎన్నుకున్నారు, బాబా వారిగా అయ్యారు. బాబా అయితే స్వీకరించారు. అయినప్పటికీ బాబా ప్రతి రోజు నెంబర్ వారీ అని అంటారు. ఎక్కడ అష్టరత్నాల మాల యొక్క మొదటి నెంబర్ మరియు ఎక్కడ 16 వేల మాల యొక్క చివరి నెంబర్. పిల్లలుగా అయితే ఇద్దరు అయ్యారు కాని ఎంత తేడా వచ్చింది! ఇంత తేడా ఎందుకు వచ్చింది? దానికి ముఖ్య కారణం ఏమిటి?

ఒకే తండ్రి యొక్క పిల్లల అయినప్పటికీ ఇంత తేడా ఎందుకు? ఒకరు - విశ్వకళ్యాణ కార్యం చేసేవారు మరియు రెండవారు - కార్యం చేసేవారి మహిమ మరియు కార్యం యొక్క మహిమ చేసేవారు. మొదటి వారు మహిమాయోగ్యంగా అయ్యేవారు. 1. చేయటం మరియు 2. చేయాలి, అవ్వాలి, తయారవ్వాలి అంటారు. అందువలనే ఒకే తండ్రికి పిల్లల అయినప్పటికీ ఎంత తేడా ఉంటుంది. కావాలి అనే దానిని, ఉంది అనే దానిలోకి మార్చుకోండి. ఎవరైతే సదా ఉంది ఉంది అని అంటారో వారు హాహా కారాల నుండి విముక్తులవుతారు. కావాలి కావాలి అనేవారు ఒకొక్కసారి ఉల్లాసంలో నాట్యం చేస్తారు. అప్పుడప్పుడు విఘ్నాలలో హా హా అని అంటూ ఉంటారు. వారు లోకప్రియ సభలో సభ్యులు కాదు. ఎలా అయితే అక్కడ కూడా పార్టీలో సభ్యులు చాలామంది ఉంటారు కానీ సభలో సభ్యులు కొద్దిమందే ఉంటారు. అలాగే ఇక్కడ కూడా వీరు బ్రాహ్మణపరివారం యొక్క సభ్యునిగా తప్పకుండా ఉంటారు కానీ లోకప్రియ సభ యొక్క సభ్యునిగా అంటే లా అండ్ ఆర్డర్ యొక్క రాజ్యాధికారం తీసుకునే అధికారి ఆత్మల జాబితాలోకి రారు. వారు రాజ్యసింహాసనానికి అధికారులు మరియు వీరు రాజ్యంలోకి వచ్చే అధికారులు. 16 వేల మాలలో రావడానికి, రాజ్యంలోకి రావడానికి అధికారులు కానీ రాజ్యసింహాసనాధికారులు కాదు. కనుక లోకప్రియ సభ యొక్క టికెట్ బుక్ చేసుకుంటే రాజ్యసింహాసనం స్వతహాగానే లభిస్తుంది.

ఈరోజు బాప్ దాదా తన మహాన్ తీరస్థానాలన్నీ తిరిగారు. ఇప్పటి సేవాకేంద్రాలే భక్తిమార్గంలో తీర్థస్థానాల రూపంలో పూజింపబడుతున్నాయి. అన్ని తీర్థస్థానాలకు విహారిస్తూ గంగ, యమున, సరస్వతి, గోదావరి అందరినీ చూసారు. జ్ఞాననదులన్నీ తమతమ సేవలలో నిమగ్నమై ఉన్నారు. అక్కడక్కడ చాలా కొద్దిమంది వారసులను చూసారు మరియు అక్కడక్కడ కొద్ధిమంది కాబోయే వారసులను కూడా చూశారు. అక్కడక్కడ ఉన్నత కుటుంబానికి అతి సమీపంగా ఉండి రాజ్యవ్యవహారాలను నడిపించేవారిని చూసారు. వారు రాజ ఆజ్ఞలు ఇచ్చేవారు. వీరు రాజ్య వ్యవహారాలను నడిపించేవారు. ఇలాంటి వారు ఎక్కువ మందిని చూశారు. ఈరోజు బాప్ దాదా నలువైపుల పిల్లలను వేరువేరుగా పరిశీలిస్తున్నారు మరియు ఫలితం చూస్తున్నారు. చివరికి ఫలితం అయితే ప్రకటించబడుతుంది. కనుక ఈరోజు అందరి పేపర్స్ పరిశీలిస్తున్నారు. ఈరోజు బాప్ దాదా విశేషంగా ప్రతి బిడ్డ యొక్క పవిత్రతా సబ్జెక్టు యొక్క పేపర్ పరిశీలిస్తున్నారు. అందువలనే విశేషంగా చక్రం తిరగడానికి వెళ్ళారు ప్రతి బ్రాహ్మణ బిడ్డ యొక్క పవిత్రతా ప్రకాశం ఎంత వరకు విస్తరించబడుతుందని, అంటే సేవాస్థానంలో ప్రతి ఆత్మ యొక్క పవిత్రతా తరంగాలు ఎంత వరకు వ్యాపిస్తున్నాయని, పవిత్రతా శాతం చిన్న బల్బ్ వలె ఉందా లేదా పెద్ద బల్బ్ వలె ఉందా లేదా సర్చ్ లైట్ వలె ఉందా లేదా లైట్‌హౌస్ వలె ఉందా? పవిత్రతా శక్తి ఎంత వరకు వాయుమండలాన్ని పరివర్తన చేస్తుందని, ఈ ఫలితం చూడడానికి బాబా తీర్థస్థానాలన్నీ విహరించారు. తీర్థస్థానం యొక్క గొప్పతనం నిమిత్తంగా సేవాధారి అయిన సత్యతీర్ధంపై ఆధారపడి ఉంటుంది. నిమిత్త సేవాధారికి ఎంత ప్రభావం ఉంటుందో అంత నలువైపుల తరంగాలు మరియు వాయుమండలం ఉంటాయి. ఈ రోజు బాప్ దాదా యొక్క దినచర్య ఏమిటంటే పవిత్రత యొక్క పేపర్ ని పరిశీలించడం. ప్రతి స్థానం యొక్క ఫలితం చూసారు. ఆది నుండి అంతిమం వరకు పవిత్రత ఎంత ఉంది; సంకల్పం నుండి స్వప్నం వరకు అంతా పరిశీలించారు. బాప్ దాదా తన సహయోగులను ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్షం చేస్తారు. న్యాయసభ అనే మహిమ కూడా ఉంది. అంతిమంలో సహయోగుల న్యాయసభ ఉంటుంది. ఇప్పుడైతే గారాబమైన మరియు సహయోగి పిల్లల రూపంలో ప్రత్యక్షం చేస్తున్నారు. ఎందుకు ప్రత్యక్షం చేస్తున్నారు? బాప్ దాదా కూడా చిన్న చిన్న సభలు పెడతారు కదా! ఎలా అయితే మీరు అప్పుడప్పుడు జోన్ హెడ్స్ యొక్క మీటింగ్ పెడతారు, అప్పుడప్పుడు సేవాధారుల మీటింగ్ పెడతారు, అప్పుడప్పుడు సేవాధారి ఆత్మల మీటింగ్ పెడతారు కదా! అలాగే బాప్ దాదా కూడా అక్కడికి గ్రూపులను పిలుస్తారు.

ప్రతీ గ్రూపు వారికి వేర్వేరుగా భోజనాలు పెట్టేవారు. ఇప్పుడు భాగవతానికి వచ్చేశారు. భాగవతం చాలా పెద్దది. భక్తిలో కూడా గీత కంటే భాగవతాన్ని పెద్దదిగా తయారుచేసారు. జ్ఞానం వినడానికి అందరు ఆసక్తి చూపించకపోవచ్చు కాని భాగవతం అందరు వింటారు.ఎలా అయితే సాకారంలో పిల్లలతో అలాగే ఇప్పుడు కూడా వతనంలో పిల్లలను ప్రత్యకం చేస్తూ ఉంటారు. పేపర్లను కూడా పిల్లల చేతనే పరిశీలన చేయిస్తారు ఎందుకంటే బాబా సదా పిల్లలను పిల్లలు మరియు యజమానులు అనే రూపంలో చూస్తారు. అందువలనే నిమిత్తంగా అయిన పిల్లలను ప్రతి కార్యంలో పెద్ద అన్నయ్య సంబంధంతో చూస్తారు. సోదరుల కలయిక ఎలా ఉంటుంది? సోదరుడు సోదరుని చేత పరిశీలన చేయించుకుంటారు కదా! అందువలన బాప్ దాదా ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండరు. సదా పిల్లల వెంటే ఉంటారు. ఒంటరిగా ఎక్కడా కూడా ఉండలేరు. అందువలనే స్మృతిచిహ్నంలో కూడా అర్ధనారీశ్వరునిగా చూపిస్తారు. దిల్వాడా మందిరంలో ఒంటరిగా ఉన్నారా? పిల్లల వెంటే ఉన్నారు కదా! మరియు అంతిమ ఫలితం - విజయీమాల; దీనిలో కూడా ఒంటరిగా లేరు. అప్పుడప్పుడు ఒకరిని, అప్పుడప్పుడు మరొకరిని సదా వెంట పెట్టుకుంటారు. బాబా మీ సంపూర్ణ ఫరిస్తా రూపాన్ని ప్రత్యక్షం చేస్తుంటారు. ఆ ప్రేరణ మీకు కూడా వస్తుంది. రోజూ వస్తుందా లేదా అప్పుడప్పుడు వస్తుందా? మీరు సూక్ష్మవతనాన్ని ఇక్కడికి తీసుకువస్తారు కానీ బాబా మిమ్మల్ని సూక్ష్మవతనానికి తీసుకువస్తున్నారు. ఒకసారి బాబా మీ దగ్గరికి వచ్చేస్తారు. మరోసారి మిమ్మల్ని తన దగ్గరికి పిలుస్తారు. రోజంతా ఇదే వ్యాపారం చేస్తారు. ఒక్కోసారి ఆట ఆడుతారు మరియు ఆడిస్తారు. అప్పుడప్పుడు తన వెంట సేవకి తీసుకువెళ్తారు. ఒకొక్కసారి సాక్షాత్కారం చేయించడానికి తన వెంట తీసుకువెళ్తారు మరియు అప్పుడప్పుడు సాక్షాత్కారం చేయించడానికి పంపిస్తారు. ఎందుకంటే కొంతమంది భక్తులు ఎంత మొండిగా ఉంటారంటే తమ ఇష్టదేవత సాక్షాత్కారం అయితేనే కానీ సంతుష్టమవ్వరు. స్వయంగా బాబాయే వారి ముందు ప్రత్యక్షమైనా కానీ వారు తమ ఇష్టదేవతనే ఇష్టపడతారు. అందువలన రకరకాల ఇష్ట దేవీదేవతలను భక్తుల వద్దకు పంపాల్సి ఉంటుంది. మరి ఇంకా ఏమి చేస్తారు? అప్పుడప్పుడు విశేష స్నేహి మరియు సహయోగి పిల్లలకు విశేషంగా చెవిలో శక్తి యొక్క మంత్రం కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఎందుకంటే కొన్ని కొన్ని కార్యాలు ఎలా వస్తాయంటే వాటిలో విశేషాత్మలు, సహయోగి పిల్లలు నిమిత్తంగా అయిన కారణంగా ధైర్యం, ఉల్లాసం మరియు తమకు లభించిన శక్తులతో కార్యం చేయడానికి వస్తారు. అయినప్పటికీ అక్కడక్కడ ఎలా అయితే రాకెట్ చాలా పైకి వెళ్ళాలంటే ఎగస్ట్రా ఫోర్స్ ఇవ్వటం ద్వారా పైకి వెళ్ళిపోతుంది. మరలా నిరాధారం అయిపోతుంది. అలాగే అక్కడక్కడ కొన్ని కార్యాలు ఎలా వస్తాయంటే అక్కడ కేవలం ఒక సెకను యొక్క సైగ అవసరం అవుతుంది. అదే ప్రేరణ ఇవ్వటం అంటే చెవిలో శక్తి యొక్క మంత్రం ఇవ్వటం. వర్గీకరణ చేశారు కనుక బాబా కూడా వతనంలో ఏమేమి జరుగుతాయో వతనం యొక్క వర్గీకరణ కార్యం గురించి చెప్పారు. ఇది ఎందువలన చెప్పానంటే ఇప్పుడు కూడా అంటే 18వరకు (జనవరి 18 మిలనం) మీ యొక్క అదనపు పేపర్ కోసం తయారవ్వవచ్చు. అప్పుడప్పుడు రెండవసారి కూడా పరీక్ష పెడతారు కదా! పవిత్రత యొక్క పేపర్లో ఇప్పుడు కూడా అదనపు మార్కులు జమ చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్య ఆధారం లేదా సత్యజ్ఞానం యొక్క పరిశీలన పవిత్రతయే. పవిత్రత ఆధారంగానే సహజ జ్ఞానం, సహజయోగం, మరియు సహజ ధారణ లేదా సేవ చేయగలరు. నాలుగు సబ్జక్టులకు పునాది - పవిత్రత. అందువలనే మొదట ఈ పేపర్ పరిశీలిస్తున్నారు.

ఇలా ప్రతి సంకల్పంలో ప్రభువుకి ఇష్టమైనవారిగా మరియు లోకానికి ఇష్టమైనవారిగా, ప్రతి కార్యంలో అధికారి అయ్యి కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించేవారికి అంటే రాజ్యసభ యొక్క అధికారులకు, సదా బాబాతో పాటు మనస్సు మరియు కర్మలో విశ్వ సేవ యొక్క సహయోగులకు, సదా సంకల్పం ద్వారా వాయుమండలాన్ని శ్రేష్టంగా తయారుచేసుకునేవారికి, మీ యొక్క మహా వరదానివృత్తి ద్వారా తరంగాలను వ్యాపింపచేసేవారికి, ఇలా సమీప మరియు సహయోగి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.