18.01.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్మృతిదినోత్సవం సందర్భంగా పిల్లలకు బాప్ దాదా ఇచ్చిన శిక్షణలు.

ఈరోజు స్మృతిదినోత్సవం యొక్క స్మృతి స్వరూపము అంటే సమర్థ స్వరూప పిల్లలను చూసి బాప్ దాదా కూడా "సదా సమర్ధభవ" అనే వరదానాన్ని ఇస్తున్నారు. ఎలా అయితే ఈ స్మృతి దినోత్సవమున స్వతహా స్మృతి స్వరూపులుగా ఉన్నారో, ఒకే సంలగ్నతలో నిమగ్నమై ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు అనే స్మృతిలో ఉన్నారో అదేవిధంగా సహజ యోగి, నిరంతర యోగయుక్తులుగా, జీవన్ముక్తులుగా, ఫరిస్తా స్వరూపంగా సదా ఉండండి. ఈ రోజు పిల్లలందరి ఛార్టులో బాబా సమానంగా అవ్యక్త వతనవాసీగా, స్నేహంలో లవలీనస్థితి ఉందో, అదేవిధంగా బాబా సమానంగా సదా అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి. ఈ సమర్థ దినోత్సవమున నలువైపుల ఉన్న పిల్లలందరి బాబాని ప్రత్యక్షం చేయాలనే ధృడసంకల్పం బాబా దగ్గరికి చేరుకుంటుంది. పిల్లలందరు ఒకే ఉత్సాహ, ఉల్లాసం యొక్క సంకల్పంతో దేశ, విదేశాలలో కొంతమంది మనస్సుతో, కొంతమంది తనువుతో సేవా వేదికపై ఉపస్థితులై ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పటికీ బాప్ దాదా ఎదురుగా పిల్లలందరి సేవ యొక్క ఉత్సాహ,ఉల్లాసాలతో నిండిన ముఖం ఉంది. బాప్ దాదాకి విశ్వంమంతా తిరిగిరావడానికి ఎంత సమయం పడుతుంది? మీరు విజ్ఞానసాధనాలైన టి.వి లేదా రేడియో ద్వారా స్విచ్ ఆన్ చేసి ఎంత సమయంలో వింటున్నారో లేదా చూస్తున్నారో అంత సమయంలో బాప్ దాదా ఈ విశ్వం అంతా చక్రం తిరిగి వచ్చేస్తారు. బాప్ దాదా చూస్తున్నారు - ప్రతి స్థానంలోని పిల్లలు ఏమేమి చేస్తున్నారో! ఈరోజు అందరి మనస్సులో సేవ యొక్క ఒకే పట్టుదల ఉంది. ప్రతి ఒక్కరి బుద్ధిలో ప్రత్యక్షతా జెండా ఎగురుతూ ఉంది, విశ్వంలో ఈ జెండా ఎగరవేయాలని, ప్రతి ఒక్కరి హృదయంలో బాప్ దాదా నివసించి ఉన్నారు మరియు ప్రత్యక్షంలో అందరు ఇదే పురుషార్ధం చేస్తూ ఉన్నారు. మా హృదయంలో బాబా ఉన్నారు అని హృదయాన్ని చీల్చి ఎలా చూపించాలా అని. ఈ సమయం యొక్క మీ అందరి స్మృతిచిహ్న రూపంగా సేవాధారి హనుమంతుడిని ఉదాహరణ మహిమ చేయబడింది. కొంతమంది సంకల్పమనే బాణం వేస్తున్నారు, ఆ శ్రేష్టసంకల్పం యొక్క వాయుమండలం ద్వారా బాబాని ప్రత్యక్షం చేయాలని. కొంతమంది తమ నోటి యొక్క స్నేహి మరియు శక్తిశాలి మాట ద్వారా బాబాని ప్రత్యక్షం చేయటంలో నిమగ్నమై ఉన్నారు. ఇలా స్మృతి మరియు సేవ యొక్క, సమానత యొక్క దృశ్యాన్ని బాప్ దాదా చూస్తున్నారు. ఈ రోజు స్నేహం కూడా సంపూర్ణ రూపంలో ప్రత్యక్షంగా ఉంది మరియు సేవార్థం శక్తిస్వరూపం కూడా ఈరోజు ప్రత్యక్షంగా ఉంది. ఈరోజు వలె సదా స్మృతి మరియు సేవ యొక్క సమానతలో ఉండాలి.

ఈ 80వ సంవత్సరం విశేషంగా ప్రతి ఆత్మకు యోగ్యతానుసారంగా వారసత్వం ఇచ్చే సంవత్సరం. తపించే ఆత్మలందరు యోగ్యతననుసరించి తృప్త ఆత్మగా అయ్యే సంవత్సరం. విశేషంగా ఈ సంవత్సరంలో స్మృతి మరియు సేవ యొక్క సమానత ఉంచుకోవాలి మరియు సదా దయాసాగరులుగా ఉండాలి. దాంతోపాటు సర్వాత్మలకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉండాలి. ఈ సంవత్సరం సంఘటిత రూపం యొక్క సూక్తి - స్వయం పట్ల మరియు సర్వుల పట్ల సదా విఘ్నవినాశకులుగా అవ్వాలి. దీనికి సహజసాధనం - ప్రశ్నార్ధకానికి సదాకాలికంగా వీడ్కోలు ఇచ్చేయాలి మరియు బిందువు పెట్టడం ద్వారా సర్వశక్తుల పూర్తి స్టాకుని జమ చేసుకోవాలి. ఈ సంవత్సరం విశేషంగా సర్వ విఘ్నముక్తులై మెరిసే ఫరిస్తా దుస్తులు ధరించాలి. మట్టితో ఉన్న దుస్తులు వేసుకోకూడదు, సదా సర్వ గుణాలనే నగలతో అలంకరించబడి ఉండాలి. విశేషంగా అష్టశక్తులనే శస్త్రాలతో సదా అష్టశక్తి శస్త్రధారి సంపన్నమూర్తి అయ్యి ఉండాలి. సదా కమలపుష్ప ఆసనంపై మీ శ్రేష్టజీవితమనే పాదం పెట్టాలి. ఇంకేమి చేస్తారు?

సువాసన కలిగిన వారిగా అవ్వండి, సువాసనను వ్యాపింపచేయండి.

ప్రతిరోజు అమృతవేళ విశ్వ వరదాని స్వరూపంతో విశ్వకళ్యాణకారి బాబాతో కంబైండ్ రూపమై అంటే విశ్వ వరదాని శక్తి మరియు విశ్వకళ్యాణకారి శివుడు. ఇలా శివుడు మరియు శక్తి ఇద్దరి కంబైండ్ రూపంతో మనసా సంకల్పం లేదా వృత్తి ద్వారా తరంగాల యొక్క సువాసనను వ్యాపింపచేయాలి. ఎలా అయితే ఈ రోజుల్లో స్థూల సువాసనా సాధనాల ద్వారా రకరకాల సువాసనలను వ్యాపింపచేస్తారు. గులాబీ వాసన, గంధం వాసన అలాగే మీ ద్వారా సుఖం, శాంతి, శక్తి, ప్రేమ, ఆనందమనే రకరకాల సువాసనలు వ్యాపించాలి. రోజూ అమృతవేళ రకరకాల శ్రేష్ట తరంగాలు ఫౌంటేన్ వలె ఆత్మలపై పన్నీరు చల్లాలి. కేవలం సంకల్పమనే స్వతహ స్విచ్ వేయాలి అంతే. ఇదైతే వస్తుంది కదా! ఎందుకంటే ఈ రోజు విశ్వంలో అశుద్ధ వృత్తి అనే చెడువాసన చాలా ఉంది. వారిని సువాసనాభరితంగా తయారుచేయండి. ఈ సంవత్సరం ఏమి చేయాలో అర్ధమైందా?

ఈ సంవత్సరం ఈనాటి ప్రభుత్వ ఎన్నికలు జరిగాయి, మరి పాండవులు అయిన మీరు ఏమి చేస్తారు! ఈ సంవత్సరంలో పాత మరియు క్రొత్త సేవా సాధనాలు అంటే తనువు, మనస్సు, ధనం మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఉపయోగించి సర్వాత్మలలో ఏ ఆత్మలు ముక్తి యొక్క వారసత్వానికి యోగ్యులో, ఏ ఆత్మలు జీవన్ముక్తి యొక్క వారసత్వానికి యోగ్యులో ఎంపిక చేయండి. ఎవరు దేనికి యోగ్యులో వారికి ఆవిధంగానే సందేశం ఇచ్చి నిర్ణయం చేయండి. ఇప్పుడు సేవా ఫైల్ ని పూర్తి చేయండి. ఎలా అయితే ఫైల్ యొక్క ప్రతి కాగితంలో ఆఫీసర్ తన సంతకం చేసి దాన్ని పూర్తి చేసి పంపిస్తారో అదేవిధంగా సేవాధారులైన మీరందరు ప్రతి ఆత్మపై ముక్తి, జీవన్ముక్తి అనే సంతకం చేయండి. ఫైనల్ స్టాంప్ వేయండి. అప్పుడు ఫైల్ సంపూర్ణం అయిపోతుంది. ఈ సంవత్సరంలో ఏమి చేయాలో అర్థమైందా? ఎంపిక కార్యాన్ని తీవ్రం చేయండి. ఎంతమంది ఫైల్ తయారుచేస్తారో చూస్తాను. మొదట విదేశీయులు తయారుచేస్తారా లేదా దేశీయులా? ఎవరు ఏ ధర్మంలోకి వెళ్ళాలో ఆ స్టాంప్ (ముద్ర) వేయండి.

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న సర్వ స్నేహి మరియు సేవాధారి పిల్లలకు ప్రియస్మృతులు ఇస్తున్నారు. ఈరోజు తనువుతో అనేక స్థానాలలో ఉన్నారు కానీ మనస్సుతో బాబాని ప్రత్యక్షం చేయాలనే పట్టుదల ఉన్న కారణంగా మన్మనాభవగా బాబా వైపే ఉన్నారు.

ఇలా సదా స్నేహం మరియు సేవలో అవినాశిగా ఉండేవారికి, సదా బాబా యొక్క సేవలో తత్పరులై ఉండేవారికి, ప్రత్యక్షతా జెండా ఎగురవేసేవారికి, సదా విజయీ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.