23.01.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పవిత్రత యొక్క గొప్పతనం.

బాప్ దాదా తన యొక్క సర్వ మహానాత్మలను, ధర్మాత్మలను,పుణ్యాత్మలను, మహాన్ పవిత్రాత్మలను చూసి సంతోషిస్తున్నారు. పరమాత్మ పిల్లలు పరమ పవిత్ర పిల్లలు. పవిత్రతకే గొప్పతనం ఉంది. పవిత్రతకే గౌరవం ఉంది. పవిత్రత కారణంగానే పరమపూజ్యులుగా, మహిమాయోగ్యంగా అవుతారు. పవిత్రతయే శ్రేష్టధర్మం అంటే ధారణ. ఈ ఈశ్వరీయ సేవ యొక్క ఉన్నతోన్నతమైన పుణ్యం - పవిత్రత యొక్క దానం ఇవ్వటం. పవిత్రంగా చేయటమే పుణ్యాత్మగా అవ్వటం. ఎందుకంటే ఎవరో ఒక ఆత్మనైనా ఆత్మహత్యా మహాపాపం నుండి విడిపిస్తున్నారు. అపవిత్రతయే ఆత్మహత్య, పవిత్రతయే జీవదానం. పవిత్రంగా చేయటం అంటే పుణ్యాత్మగా చేయటం. గీతాజ్ఞానం యొక్క పరమాత్మ జ్ఞానం యొక్క సారం ఒక సూక్తిలో చెప్తారు. దానిలో కూడా పవిత్రత యొక్క గొప్పతనాన్ని చెప్తారు. పవిత్రంగా భవ! యోగి భవ!! ఈ సూక్తియే మహానాత్మగా అయ్యేటందుకు ఆధారం. బ్రాహ్మణజీవితం యొక్క పురుషార్ధం యొక్క నెంబర్ కూడా పవిత్రతపై ఆధారపడి ఉంటుంది. భక్తిమార్గంలో స్మృతిచిహ్నం కూడా పవిత్రత ఆధారంగానే ఉంటుంది. ఏ భక్తుడు మీ యొక్క స్మృతిచిహాన్ని పవిత్రత లేకుండా తాకలేరు. విశేషంగా దేవీ దేవతల దినోత్సవాలు జరిపేటప్పుడు కూడా ఆరోజు విశేషంగా పవిత్రతకే విలువ ఇస్తారు. భక్తి అంటేనే అల్పకాలికం అని అర్థం. జ్ఞానం అంటే సదాకాలికం అని అర్థం. భక్తులు అల్పకాలిక నియమాలను పాలన చేస్తారు. నవరాత్రి, జన్మాష్టమి లేదా దీపావళి ఇలా ఏవైనా ఉత్సవాలు జరుపుకునేటప్పుడు పవిత్రతా నియమాన్ని అల్పకాలికంగా తప్పకుండా పాటిస్తారు. శరీరం యొక్క పవిత్రత మరియు ఆత్మ యొక్క నియమం రెండు రకాలైన శుద్ధత తప్పకుండా పెట్టుకుంటారు.

మీ స్మృతిచిహ్నం అయిన విజయీమాలను స్మరణ చేసేటప్పుడు కూడా విధిపూర్వకమైన పవిత్రతను పాటిస్తారు. మీరు సిద్ధి స్వరూపంగా అవుతున్నారు. కనుక సిద్ధి స్వరూప ఆత్మల పూజ కూడా విధిపూర్వకంగా జరుగుతుంది. పవిత్రత యొక్క గొప్పతనం తెలుసు. కదా? అందువలనే మొదట ముఖ్యమైన పవిత్రతా పేపర్ ని పరిశీలించారు. ప్రతి ఒక్కరు మీ పవిత్రతా పేపర్ ని పరిశీలించుకున్నారా? కార్యక్రమం అనుసారంగా ఉన్నతి అయితే చేసుకున్నారు.

మొత్తం ఫలితంలో అన్నింటికంటే ఎక్కువగా చాలా మంది కర్మణాలో శాతం బావుంది. వాచాలో కర్మణా ఫలితం కంటే 25 శాతం తక్కువగా ఉంది. మనస్సులో కర్మణా ఫలితం కంటే 50 శాతం తక్కువగా ఉంది. మనసా సంకల్పం మరియు స్వప్నంలో కొద్దిగా తేదా ఉంది. దానిలో కూడా జన్న తీసుకున్న తేది నుండి ఇప్పటివరకు ఫలితంలో కొంతమంది పురుషార్థం చేయటంలో దిగటం - ఎక్కడం, మచ్చ పడటం - దానిని తొలగించుకోవటం అప్పుడప్పుడు సంకల్పం రావటం మరియు దానిని తొలగించుకోవటం. అప్పుడప్పుడు వాచా, కర్మణాలో మచ్చ పడటం మరలా దానిని తొలగించుకోవటం మరియు సమాప్తి చేసుకోవటంలో చాలామంది ఉన్నారు. కొంతమంది తీవ్రపురుషార్థులను కూడా చూసారు. వారు సంస్కారాల మచ్చను తొలగించుకుని ఇప్పటి వరకు కూడా పూర్తి స్వచ్ఛమైన శుద్ద పేపర్ ని చూపించారు. ఇలా స్వప్పం వరకు కూడా తొలగించుకున్నారు. పాస్ విత్ ఆనర్ అయ్యే మహాన్ పవిత్రాత్మలను కూడా చూసారు. వారి విశేషత ఏమి చూసారు?

ఎప్పటి నుండి బ్రాహ్మణజన్మ తీసుకున్నారో అప్పటినుండి ఇప్పటి వరకు వారికి పురుషార్ధం చేయాల్సిన అవసరం లేదు. కాని పవిత్రత అనేది బ్రాహ్మణజీవితం యొక్క విశేష లక్షణం, బ్రాహ్మణాత్మ యొక్క అనాది, ఆదిసంస్కారం. ఇలా స్వతహా సంస్కారంగా పవిత్రత ఉంది, స్వప్నంలో లేదా సంకల్పంలో కూడా అపవిత్రత అనేది రాలేదు. సంకల్పం వచ్చింది మరియు విజయీ అయ్యారు. ఈ నీతి కంటే ఉన్నతంగా వారికి స్వతహా సంస్కార రూపంలో నడుస్తుంది. ఈ సబ్జక్టులో పురుషార్ధం చేయాల్సిన అవసరం వారికి ఉండదు. ఇలా పరమపూజ్య సంస్కారం కలిగినవారిని కూడా చూసారు. కానీ తక్కువమంది ఉన్నారు. జ్ఞానసాగరులుగా ఉంటూ, ఇతరులకు పవిత్రంగా అయ్యే విధి చెప్తూ, ఇతరులు తమ బలహీనతలు వినిపిస్తున్నప్పుడు వింటూ, తెలుసుకుంటూ వారికి బాబా యొక్క శ్రీమతం ఇస్తూ స్వయం సదా స్వచ్ఛంగా ఉంటారు అంటే పవిత్రతా సబ్జక్టులో సిద్ది స్వరూపంగా ఉంటారు. అందువలనే అటువంటి పరమ పవిత్ర ఆత్మల పూజ కూడా సదా విధిపూర్వకంగా జరుగుతుంది. అష్టదేవతల రూపంలో కూడా పూజ జరుగుతుంది మరియు భక్తుల ఇష్టదేవతల రూపంలో కూడా పూజ జరుగుతుంది. అష్టశక్తుల ప్రత్యక్ష స్వరూపంగా అష్టదేవీలుగా ప్రత్యక్షమవుతారు. కనుక పేపర్ యొక్క ఫలితం విన్నారు కదా! కనుక మనసా పరివర్తనలో డబుల్ ధ్యాస పెట్టుకోండి. సంపన్నంగా అయ్యేంతవరకు సంకల్పాలు వస్తాయి అని ఆలోచించకండి. అలా ఉండకూడదు. సంకల్పం అంటే బీజాన్నే యోగాగ్నిలో కాల్చేయండి. ఆ బీజం మరలా అర్థకల్పం వరకు ఫలం ఇవ్వకూడదు. వాచా అనే రెండు ఆకులు కూడా రాకూడదు. కర్మణా అనే కాండము మరియు కొమ్మలురెమ్మలు కూడా రాకూడదు. చాలాకాలం భస్మీభూతం అయిపోయిన బీజం జన్మజన్మాంతరాల వరకు ఫలం ఇవ్వదు. ఈ సబ్జక్టులో అంతిమంలో సంపూర్ణం అవ్వటం కాదు కానీ చాలా సమయం యొక్క అభ్యాసమే అంతిమంలో పాస్ చేయిస్తుంది. అంతిమంలో సంపూర్ణం అవుతాము అనే ఈ సంకల్పాన్ని మొదట సమాప్తి చేయండి. ఇప్పుడు తయారయితేనే అంతిమంలో కూడా తయారవుతారు. ఇప్పుడు కాకపోతే అంతిమంలో కూడా అవ్వరు. అందువలనే ఈ సోమరితనం యొక్క నిద్ర నుండి కూడా మేల్కోండి. దీనిలో నిద్రపోతే పోగొట్టుకుంటారు. అంతిమంలో సంపూర్ణం అవుతాం అనుకున్నాము అని మరలా నిందించకండి. అంతిమంలో సంపూర్ణమయ్యే అర్థాన్ని అర్థం చేసుకోండి. ఏదైనా విశేష బలహీనతను అంతిమంలో సంపూర్ణం చేస్తాము అని సంకల్పంలో కూడా రానివ్వకండి. పురుషార్ధం చేసి బ్రాహ్మణజీవితం యొక్క నగను కూడా ఇప్పుడే తయారుచేయాలి. మర్యాదలు మరియు నియమాల పాలన అనే నగను కూడా ఇప్పటి నుండే పెటుకోవాలి. మెరుగు కూడా ఇప్పుడే పెట్టుకోవాలి. అంతిమంలో కేవలం మెరుగు పెట్టిన దానిని చేతిలోకి తీసుకోవలసి ఉంటుందంతే; ఆ సమయంలో మెరుగు పెట్టుకోలేరు. అప్పుడు కేవలం ఇతరాత్మల శ్రేష్ట సేవార్ధం సమయం లభిస్తుంది. ఆ సమయంలో పురుషార్థ స్వరూపం ఉండదు. మాస్టర్ దాత స్వరూపం ఉంటుంది. ఇవ్వటమే తీసుకోవటం అవుతుంది. తీసుకోవటం సమాప్తి అయితే మెరుగు ఎలా పెట్టుకోగలరు? ఒకవేళ స్వయం నగ పెట్టుకోవడంలోనే ఉంటే విశ్వకళ్యాణకారి పాత్రను అభినయించలేరు. అందువలన ఇప్పుడు మాస్టర్ రచయితగా అయ్యే సంస్కారాన్ని ధారణ చేయండి. చిన్ననాటి సంస్కారాన్ని సమాప్తి చేయండి. మాస్టర్ రచయితయై లభించిన శక్తులను లేదా లభించిన జ్ఞానాన్ని, గుణాలను మరియు సర్వ ఖజానాలను ఇతరాత్మల పట్ల వరదానియై, మహాజ్ఞానియై మరియు మహాదానియై ఇస్తూ వెళ్ళండి. వరదాని అంటే మీ శక్తుల ద్వారా వాయుమండలం లేదా తరంగాల ప్రభావం ద్వారా ఆత్మలను పరివర్తన చేయాలి. మహాజ్ఞాని అంటే వాణీ ద్వారా లేదా సేవా సాధనాల ద్వారా ఆత్మలను పరివర్తన చేయాలి. మహాదాని అంటే పూర్తిగా నిర్మలంగా, బలహీన అసమర్ధ ఆత్మకు అదనపు శక్తినిచ్చి ఆత్మిక దయాహృదయులుగా అవ్వాలి. మాయపై కూడా దయాహృదయులు అవ్వటం అనేది ఉంటుంది. అది ఎలాగంటే ఎవరైనా తప్పు పని చేస్తుంటే మీరు జాలి పడుతున్నారంటే అదే మాయపై దయాహృదయులుగా అవ్వటం. అటువంటి సమయంలో నియమపూర్వకంగా కూడా అవ్వాల్సి ఉంటుంది. కానీ అక్కడ తగుల్పాటు ఉంటుంది కానీ దానిని దయ అని అనుకుంటారు. దీనినే మాయపై దయ చూపించడం అంటారు. ఇటువంటి దయాహృదయులుగా అవ్వకూడదు. అందువలనే ఆత్మిక దయ ఉండాలి అని చెప్పాను; లేకపోతే కనుక దయ అనే మాటను కూడా అపార్థం చేసుకుంటారు. మహాదాని అంటే పూర్తిగా నిరాశ కేసులలో కూడా ఆశను పుట్టించాలి. మీ శక్తుల ఆధారంగా వారికి సహయోగం ఇవ్వాలి. అంటే మహాదానం అనేది ప్రజలకు ఇవ్వాలి. వారసుల లక్షణాలు కలిగినవారికి మహాదాని అవ్వాల్సిన అవసరం లేదు. దానం అనేది పూర్తిగా బీదవారికే ఇస్తారు. నిస్సహాయులకే సహాయం ఇస్తారు. కనుక ప్రజల కొరకు మహాదాని మరియు అంతిమంలో భక్తులకు మహాదాని అవ్వాలి. బ్రాహ్మణాత్మలు పరస్పరం ఒకరికొకరు మహాదాని కాకూడదు. పరస్పరం సహయోగులుగా, సాథీలుగా ఉండాలి. సోదరులు మరియు సమాన పురుషార్థులు కనుక సహయోగం ఇస్తారు కానీ దానం ఇవ్వరు. అర్థమైందా! ఇప్పుడు ఈ సంకల్పాన్ని కూడా సమాప్తి చేయండి. ఎప్పుడో అవుతుంది అనే ఎప్పుడో అనే ఈ మాటను కూడా సమాప్తి చేయండి. తీవ్రపురుషార్థులు అంటే ఎప్పుడో అనరు, ఇప్పుడే అని అంటారు. కనుక సదా తీవ్రపురుషార్ధిగా అవ్వండి.

ఇలా సదా విశ్వకళ్యాణకారి, మహాన్ పవిత్రాత్మలకు, సంకల్పం మరియు స్వప్నంలో, కూడా అతీతంగా ఉండే పరమపూజ్యులకు, ఇప్పుడు కూడా గౌరవనీయ, మహిమా యోగ్యులకు, కర్మయోగులకు, సదా స్వ సంకల్పం మరియు స్వరూపం ద్వారా సేవ చేసే సేవాధారులకు, ఇలా పుణ్యాత్మలకు వరదాని, మహాదాని పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.