28.01.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంపూర్ణ బ్రహ్మ మరియు బ్రాహ్మణుల యొక్క సంపూర్ణ స్వరూపంలో తేడాకు కారణం మరియు నివారణ.

ఈరోజు ప్రతి బిడ్డ యొక్క రెండు స్వరూపాలను చూస్తున్నారు. రెండు స్వరూపాలు? 1. వర్తమాన సమయం యొక్క పురుషార్థ స్వరూపం 2. వర్తమాన జన్మ యొక్క అంతిమ సంపూర్ణ ఫరిస్తా స్వరూపం. నువ్వే నేను - నేనే నువ్వు అనే మంత్రంలో మొదట నేనే ఫరిస్తా స్వరూపాన్ని ఆ తర్వాత భవిష్యత్తులో నేనే దేవతను. ఈరోజు వతనంలో పిల్లలందరి యొక్క నెంబరువారీ పురుషార్థాన్ని అనుసరించి అంతిమ ఫరిస్తా స్వరూపం ఏదైతే తయారవ్వాలో ఆ రూపాన్ని ప్రత్యక్షం చేశారు. సాకార బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ ఇద్దరిలో పురుషార్థి మరియు సంపూర్ణం రెండింటిలో గల తేడా ఏమిటో చూసేవారు మరియు అనుభవం చేసుకునేవారు. అదేవిధంగా ఈరోజు పిల్లల యొక్క తేడాను చూస్తున్నారు. దృశ్యం చాలా బావుంది. క్రింద పురుషార్థీ తపస్వి స్వరూపం మరియు పైన ఫరిస్తా రూపం నిలబడి ఉంది. ఇలా మీ మీ రూపాలు ఎదురుగా తెచ్చుకోగలరా? మీ సంపూర్ణ రూపం కనిపిస్తుందా? సంపూర్ణ బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రాహ్మణులు. బ్రహ్మ మరియు మా యొక్క సంపూర్ణ స్వరూపంలో ఎంత తేడా ఉంటుందో అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నెంబరువారీగా అయితే ఉంటారు కదా! అక్కడ ఏమి జరిగింది! వారి ఫరిస్తా స్వరూపాలు చాలా పెద్ద వలయాకారంగా రాజ్య సభ వలె కొలువు దీరి ఉన్నాయి. ప్రకాశంలో తేడా ఉంది. కొందరికి విశేషంగా మెరిసే రూపం ఉంది, కొందరి ప్రకాశం మాధ్యమంగా ఉంది, కానీ విశేషముగా మస్తకములో మెరిసే మణి రూపంలో ఉన్న ఆత్మలలో తేడా ఉంది. కొందరి మెరుపు అంటే ప్రకాశం చాలా దూరం వ్యాపించి ఉంది. కొందరి ప్రకాశం మెరుస్తూ ఉంది కానీ వ్యాపిస్తూ లేదు. కొందరిది అయితే ప్రకాశమే తక్కువగా ఉంది. బాప్ దాదా పిల్లలందరి యొక్క తేడాను పరిశీలించారు. యంత్రం యొక్క వేగం ఎక్కువ. పురుషార్థం మరియు సంపూర్ణత రెండింటి సమానతలో తేడా ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. విజ్ఞాన యంత్రాల యొక్క వేగం ఎంత ఎక్కువో దాని కంటే సమానత యొక్క పురుషార్థ వేగం తక్కువగా ఉంది.

కేవలం గ్రహించటం కాదు, గుణగ్రాహకులు అవ్వండి - ఫలితం గురించి బాప్ దాదాలు ఇద్దరికీ ఆత్మిక సంభాషణ జరిగింది. ఇంత తేడా ఎందుకు? అనే విషయం గురించి, బ్రహ్మాబాబా అన్నారు - నా పిల్లలందరు జ్ఞాన సాగరులు. శివబాబా అన్నారు - జ్ఞానసాగరులతో పాటు త్రికాలదర్శులు కూడా, అర్థం చేసుకోవటంలో మరియు చేయించటంలో చాలా తెలివైనవారు. తండ్రిని అనుసరించటంలో కూడా తెలివైనవారే. ఆవిష్కరణకర్తలు అయిపోయారు, రచయితలు అయిపోయారు, అయినా తేడా ఉందంటే ఏమి మిగిలింది? దీనికి గల కారణం ఏమిటి? కారణం అయితే చిన్నదే. బ్రహ్మాబాబా అన్నారు - పిల్లలకు గ్రహించే శక్తి చాలా ఎక్కువ ఉంది. అందువలనే జ్ఞానం, గుణాలు మరియు శక్తులను గ్రహించటంతో పాటు ఇతరుల యొక్క బలహీనతలను కూడా గ్రహించే శక్తి చాలా ఎక్కువగా ఉంది. గ్రాహకశక్తి అనే పదం ముందు గుణ గ్రాహకశక్తి అనే పదాన్ని మర్చిపోతున్నారు. అందువలన మంచితో పాటు బలహీనతలను కూడా గ్రహించేస్తున్నారు. ఆ తర్వాత ఏమి చేస్తున్నారంటే - ఈలోపుగా అక్కడ ఒక దృశ్యం ప్రత్యక్షమైంది. ఇక్కడి మీ చిత్ర ప్రదర్శినిలో ఒక చిత్రం ఉంటుంది కదా! మీ ఆ చిత్రం యొక్క లక్ష్యం వేరు కానీ రూపురేఖ అదే, ఆ చిత్రం ఏమిటంటే శాంతిదాత ఎవరు? ఇటువంటి రూపురేఖలతో కొంతమంది పిల్లలు ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత ఏమైంది? మొదటి నెంబరులో నిల్చున్న ఆత్మ యొక్క ఏదో బలహీనత గురించి చెప్పారు, తీవ్రపురుషార్థం యొక్క లెక్కతో చూస్తే ఇది సరైన విషయం కాదు అన్నారు. అప్పుడు ఆ ఆత్మ రెండవవారి వైపు సైగ చేసి చూపిస్తూ ఇది నా విషయం కాదు, వీరిది అన్నారు. అప్పుడు ఆ రెండవ ఆత్మ మూడవవారిని చూపి వీరు కూడా ఇలాగే చేస్తున్నారు. అందుకే నేను చేశాను అన్నారు. అప్పుడు నాల్గవ ఆత్మ అంటుంది - మహారథీలు కూడా చేస్తున్నారని. ఈ విధంగా సంపూర్ణంగా ఎవరయ్యారు? అని అయిదవవారు అనగా ఆరవవారు ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది అన్నారు. ఏడవ ఆత్మ సంపూర్ణం అయిపోతే సూక్ష్మ వతనానికి వెళ్ళిపోతాం అని అనగా, ఎనిమిదవ ఆత్మ అంటుంది - బాప్ దాదా అయితే సైగ చేస్తున్నారు కనుక చేయాలి కానీ సంఘటన ఉంది కదా! వద్దనుకున్నా కానీ చేసేస్తున్నాం. ఇలా ఒక విషయాన్ని ఒకరిపై ఒకరు పెట్టుకుంటూ, ఒకరినొకరు చూపిస్తూ ఉండేసరికి మొత్తం విషయమే మారిపోయింది. ప్రస్తుతం ఇటువంటి ప్రత్యక్ష ఆటలు చాలా జరుగుతున్నాయి. ఈ ఆటలో ఉండటం వలనే లక్ష్యం మరియు లక్షణాలలో చాలా తేడా కనిపిస్తుంది. అయితే కారణం ఏమిటి? ఈ సంస్కారం కారణంగానే సంపూర్ణ సంస్కారం ఇప్పటి వరకు ప్రత్యక్షం కాలేదు.

అప్పుడు బాప్ దాదా అన్నారు - ఈ ఆట కారణంగానే పురుషార్థం మరియు సంపూర్ణం రెండూ సమానంగా కలవటం లేదు. ముఖ్య కారణం ఏమిటంటే - గ్రహించే శక్తి ఉంది. గుణగ్రాహకులుగా అయ్యే శక్తి తక్కువగా ఉంది. ఈ ఆట వలన అర్థమైన రెండవ విషయం ఏమిటంటే తమ పొరపాటు ఇతరులపై నెట్టేయటం వస్తుంది. కానీ తమ పొరపాటుని అనుభూతిని చెంది స్వయంపై పెట్టుకోవటం రావటం లేదు. అందువలనే పిల్లలు జ్ఞానసాగరులు అని బాప్ దాదా అన్నారు. తప్పించుకోవటంలో కూడా తెలివైనవారు కానీ స్వయాన్ని మార్చుకోవటం తక్కువ. మరో కారణం కూడా ఉంది. అది ఏమై ఉంటుంది? దాని కారణంగా ప్రత్యక్షత జరగటం ఆలస్యమవుతుంది.

ఆ కారణం ఏమిటంటే స్వచింతన. స్వయం గురించి స్వచింతన, ఇతరుల గురించి శుభ చింతకులు. స్వ చింతన అంటే మననశక్తి మరియు శుభ చింతకులు అంటే సేవాశక్తి. వాచా సేవకి ముందు శుభ చింతక భావనతో ఎప్పటి వరకు భూమిని తయారుచేయరో అప్పటి వరకు వాచా సేవకి కూడా ఫలం లభించదు. అందువలన సేవకి మొదట ఆధారం - శుభ చింతకులు అవ్వటం. ఈ భావన ఆత్మలలో గ్రహణశక్తిని పెంచుతుంది, వినాలనే ఆసక్తిని పెంచుతుంది. దీని కారణంగా వాచా సేవ సహజం మరియు సఫలం అవుతుంది. స్వయం గురించి స్వచింతన చేసేవారు సదా మాయాప్రూఫ్ గా, బలహీనతలను గ్రహించటం నుండి రక్షణగా ఉంటారు. వ్యక్తి, వైభవాల ఆకర్షణ నుండి కూడా రక్షణగా ఉంటారు. అందువలన రెండవ కారణాన్ని నివారణరూపంలో చెప్పాను. కనుక శుభ చింతకులు మరియు స్వ చింతకులు అవ్వండి. ఇతరులను చూడకండి, స్వయం చేయండి. ఇప్పుడు పురుషార్థీల అందరి యొక్క సూక్తి - నన్ను చూసి ఇతరులు చేస్తారు. ఇతరులను చూసి నేను చేస్తాను అని కాదు. మరి విన్నారా, ఏమి ఆత్మిక సంభాషణ జరిగిందో!

ఈరోజుల్లో బాప్ దాదా ఏ పని చేస్తున్నారు? అంతిమ మాలను తయారుచేసేటందుకు మొదటి మణుల యొక్క ఎంపిక యొక్క విభాగాన్ని తయారుచేస్తున్నారు. అప్పుడు త్వరత్వరగా గ్రుచ్చవచ్చు. అయితే నేను ఏ విభాగంలో ఉన్నాను? అని ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు చూస్కోండి. మొదటి విభాగం - అష్ట రత్నాలు, రెండవ విభాగం - 100, మూడవ విభాగం - 16,000. మొదటి విభాగం వారి గుర్తులు ఏమిటి? మొదటి నెంబరులోకి రావడానికి సహజ సాధనం - మొదటి నెంబర్ బ్రహ్మాబాబా కదా! కనుక ఆయననే చూడండి. చూడడంలో తెలివైనవారు కదా! అనేకులను చూడడానికి బదులు ఒక్కరినే చూడండి. మరయితే సహజమా లేక కష్టమా? సహజం కదా! అయితే అష్టరత్నాలలోకి వచ్చేస్తారా రెండవ మరియు మూడవ విభాగాల గురించి మీకే తెలుసు.

భాగ్యంలో ఎలాగైతే మొదట మిమ్మల్ని పెట్టుకుంటున్నారో అలాగే త్యాగంలో కూడా మొదట నేను అనుకోవాలి. ప్రతి బ్రాహ్మణాత్మ త్యాగంలో మొదట నేను అని అంటే బాగ్యమాల అందరి మెడలో పడుతుంది. మీ సంపూర్ణ స్వరూపం సఫలతా మాలను చేతిలోకి తీసుకుని పురుషార్థీలు అయిన మీ మెడలో వేసేందుకు సమీపంగా వస్తూ ఉంది. కనుక తేడాను తొలగించండి. మేమే ఫరిస్తాలం అనే మంత్రాన్ని పక్కా చేస్కోండి. అప్పుడు విజ్ఞాన సాధనాలు తమ పనిని ప్రారంభిస్తాయి. మీరే ఫరిస్తాలై ఫరిస్తాల నుండి దేవతలై కొత్త ప్రపంచంలో అవతరిస్తారు. ఈ విధంగా సాకార తండ్రిని అనుసరించండి. సాకారాన్ని అనుసరించటం సహజం కదా! సంపూర్ణ ఫరిస్తా అంటే సాకార తండ్రిని అనుసరించటం.

ఈవిధంగా సదా స్వచింతకులు మరియు శుభచింతకులకు, సదా తండ్రిని అనుసరించేవారికి, స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసేవారికి, ఇటువంటి విశ్వ కళ్యాణకారి, సర్వాత్మల ద్వారా సత్కారి, త్యాగంలో సదా ముందు నేను అని చేసేవారికి, ఇటువంటి శ్రేష్ఠ భాగ్యశాలి, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.