30.01.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్నేహం, సహయోగం మరియు శక్తి స్వరూపం యొక్క పేపర్స్ పరిశీలన మరియు ఫలితం.

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న శ్రేష్ఠ పిల్లలను చూస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలందరిది ఒకే స్నేహ మరియు స్మృతి సంకల్పం. మంచి మంచి సేవాధారి, సహజయోగి పిల్లలు సదా బాప్ దాదాతో పాటు ఉంటారు. దూరంగా ఉన్నా కానీ స్నేహం ఆధారంగా అతి సమీపం. ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి యొక్క స్నేహం, సహయోగం మరియు శక్తి స్వరూపం యొక్క శ్రేష్ఠ మూర్తిని చూస్తున్నారు. ఆది నుండి ఇప్పటి వరకు మూడు విశేషతలలో విశేషంగా ఎన్ని మార్కులు వచ్చాయి? స్నేహంలో విశేషంగా మూడు విషయాలు చూశారు -

1. తెగిపోని స్నేహం - పరిస్థితులు లేదా వ్యక్తులు స్నేహమనే త్రాడుని తెంచడానికి ఎంత ప్రయత్నించినా కానీ ఆ పరిస్థితులు మరియు వ్యక్తులు అనే ఎత్తైన గోడలను కూడా దాటుకుని సదా స్నేహమనే త్రాడుని తెగిపోనిదిగా ఉంచుకున్నారు. కారణం లేదా బలహీనత అనే ముడులు మాటిమాటికీ వేయలేదు. ఇటువంటి తెగిపోని స్నేహం ఉంది.

2. సదా సర్వ సంబంధాలతో ప్రీతి యొక్క రీతిని ప్రత్యక్షంలో నిలుపుకున్నారు. ఒక్క సంబంధం యొక్క ప్రీతిని నిలుపుకోవటంలో కూడా లోటు లేదు.

3. స్నేహానికి ప్రత్యక్ష రుజువుగా తమ స్నేహమూర్తి ద్వారా ఎంతోమందిని బాబాకి స్నేహిగా చేశారు. కేవలం జ్ఞానానికి స్నేహిగా కాదు లేదా పవిత్రతకు స్నేహిగా కాదు లేదా పిల్లల జీవనపరివర్తనకు స్నేహిగా కాదు లేదా శ్రేష్ఠాత్మలకు స్నేహిగా కాదు, స్వయంగా తండ్రికి స్నేహిగా చేశారు. మీరు మంచివారు, జ్ఞానం మంచిది, మీ జీవితం మంచిది - ఇలా ఇక్కడి వరకు కాదు, తండ్రి చాలా మంచివారు అనాలి దానినే బాబాకి స్నేహిగా చేయటం అంటారు. స్నేహంలో ఈ మూడు విషయాల యొక్క విశేషతను చూశారు.

సహయోగంలో ముఖ్య విషయం 1. నిష్కామ సహయోగులేనా? 2. మనసా, వాచా,కర్మణా, సంబంధ సంప్రదింపులలో అన్ని రూపాలుగా సదా సహయోగి అయ్యారా? 3. ఇటువంటి యోగ్య సత్యమైన సహయోగులుగా ఎంతమందిని తయారుచేశారు?

శక్తి స్వరూపం - 1. మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారా లేక కేవలం శక్తివంతులుగా అయ్యారా? 2. సమయానికి శక్తులనే శస్త్రాల ద్వారా లాభం పొందారా లేక శస్త్రాలు లాకరులో అన్నాయా? 3. స్వయంలోని శక్తుల యొక్క ప్రాప్తి ద్వారా ఇతరులను మాస్టర్ సర్వశక్తివంతులుగా ఎంతవరకు తయారుచేశారు?

ఇలా ఈ మూడు విషయాల యొక్క విశేషతను పరిశీలిస్తున్నారు. చెప్పాను కదా! ప్రస్తుతం పేపర్స్ యొక్క పరిశీలన జరుగుతుందని. కనుక ఈ రోజు ఈ పేపరు పరిశీలించారు, ఫలితం ఏమి వచ్చింది? మూడింటి మొత్తం మార్కులలో పూర్తిగా పాస్ అయినవారు, కేవలం పాస్ అయిన వారు, దయతో పాస్ అయినవారు ముగ్గురూ నెంబరు వారీగా ఉన్నారు. పూర్తిగా పాస్ అయినవారు సగంమంది కంటే తక్కువ, పాస్ అయినవారు 70% మరియు దయతో పాస్ చేసిన వారి యొక్క జాబితా పెద్దది. ఇప్పుడు ఇక ముందు ఏమి చేయాలి?

ఈ ఫలితం తండ్రి స్వరూపం యొక్క ఫలితం. ఇప్పుడు కూడా తండ్రి రూపంలో పరిశీలిస్తున్నారు. కానీ అంతిమ ఫలితంలో తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉంటారు. అంతిమ ఫలితానికి ఇప్పుడు కేవలం ఒక అవకాశం ఉంది, అంతిమ అవకాశం. అది ఏమిటి?
1. మనస్పూర్వక అవినాశి వైరాగ్యం ద్వారా జరిగిపోయిన మీ విషయాలను సంస్కార రూపి బీజాన్ని కాల్చేయండి. వీటిని కాల్చే యజ్ఞాన్ని రచించండి. 2. వాటిని కాల్చేయటంతో పాటు అమృతవేళ నుండి రాత్రి వరకు ఈశ్వరీయ నియమాలు మరియు మర్యాదలను సదా పాలన చేసే వ్రతాన్ని తీస్కోండి. 3. నిరంతర మహాదానియై, పుణ్యాత్మయై ప్రజలకు దానం చేయండి. బ్రాహ్మణులకు సదా సహయోగం ఇచ్చే పుణ్యం చేయండి. ఇలా అవినాశి దానపుణ్యాల కార్యం జరుగుతూ ఉండాలి. మనస్సు ద్వారానైనా, వాచా ద్వారానైనా, సంబంధ సంప్రదింపులు ద్వారానైనా దానం జరుగుతూ ఉండాలి. ఈ విధంగా హైజంప్ చేసేవారు డబుల్ లైట్ అయ్యి శ్రేష్ఠ పురుషార్థం ద్వారా ఎగిరే పక్షి అయ్యి ఫలితానికి చేరుకోగలరు. అంతిమ ఫలితం వరకు ఇటువంటి పురుషార్థం చేసే అవకాశం ఉంది. అర్థమైందా! పరిశీలన జరుగుతూ ఉంది. కనుక విని మరియు అర్థం చేసుకుని అంతిమ అవకాశం తీస్కోండి.

బ్రహ్మాబాబా అన్నారు - సాకార రూపం ద్వారా పాలన జరిగింది, అవ్యక్త రూపం ద్వారా పాలన జరుగుతూ ఉంది. సాకార పాలన లభించిన వారికి సమయానుసారం చాలా అవకాశాలు లభించాయి ఇప్పుడు అవ్యక్త పాలన పొందుతున్నవారికి ఈ అంతిమ అవకాశం యొక్క విశేష హక్కు లభించాలి. అందువలన అవ్యక్త పాలన వారికి, సాకారి పాలన ఆకారి పాలన ఇద్దరి యొక్క పరిశీలనలో మరియు మార్కులు ఇవ్వటంలో కొద్దిగా తేడా చూపాల్సి వచ్చింది. ఆదిలోని వారి యొక్క మరియు ఇప్పుడు అవ్యక్త పాలన పొందిన వారి యొక్క పేపర్లను పరిశీలించటంలో వెనుక వచ్చినవారికి 25% ఎక్కువ మార్కులు. అందువలన ఈ అంతిమ అవకాశాన్ని ఎవరు కావాలంటే వారు తీసుకోవచ్చు. ఇప్పుడు సీట్స్ తీసేసుకున్నారు అనే ఈల ఇంకా మ్రోగలేదు. అందువలన అవకాశం తీసుకోండి మరియు సీట్ పొందండి.

ఈవిధంగా సదా రాజయుక్త, యోగయుక్త, యుక్తీయుక్తంగా కర్మ చేసేవారికి, ఈ విధమైన సదా శ్రేష్ఠాత్మలకు, సదా సర్వశక్తివంతుడైన తండ్రి సాంగత్యమనే రంగులో ఉండేవారికి, ఆత్మిక ఆత్మలకు, మహాదాని, మహా పుణ్యాత్మలైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.