01.02.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సూక్ష్మవతనం యొక్క కార్యవ్యవహారం.

ఈరోజు విశేషంగా భావం గల పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. ఎంత భావం గలవారో అంత భాగ్యం గలవారు కూడా. అటువంటి భాగ్యవంతులైన పిల్లలను కలుసుకునేటందుకు భాగ్యవిధాత తండ్రి వచ్చారు. బాప్ దాదా దగ్గర పిల్లలందరి యొక్క భావన, స్నేహం మరియు సేవాచార్ట్ ఉంటుంది. ఈ పాత ప్రపంచంలో సైన్యాధికారి దగ్గర తన స్థానం మరియు సైన్యం యొక్క చార్ట్ లేదా పటం ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా బాబా దగ్గర కూడా సేవాస్థానాలు మరియు సేవాధారుల యొక్క చార్ట్ లేదా పటం ఉంటుంది. ఆ చార్ట్ ద్వారా ప్రతి సేవాస్థానం మరియు సేవాధారుల యొక్క సేవావిధి మరియు పురుషార్థం యొక్క వేగం రెండింటినీ ఒకే చోట ఉంటూ చూస్తుంటారు. రోజంతటిలో ప్రతి ఒక్కరి యొక్క స్థితులు ఏయే విధంగా మారుతున్నాయో లేదా ఏకరస స్థితి ఉంటుందో ఆ రకరకాల స్థితుల యొక్క సాక్షాత్కారం స్పష్టంగా అవుతూ ఉంటుంది. సూక్ష్మవతనం యొక్క కార్యవ్యవహారం అంతా ఏ శక్తి ఆధారంగా జరుగుతుంది? ఇక్కడైతే రకరకాల సాధనాల ద్వారా పనులు జరుగుతాయి; సత్యయుగంలో అయితే విశేషంగా అణుశక్తి ద్వారా జరుగుతాయి. అదేవిధంగా సూక్ష్మవతనం యొక్క కార్యవ్యవహారం ఏవిధంగా జరుగుతుంది? ఏ శక్తి ఆధారంగా జరుగుతుంది మరియు ఏవిధంగా జరుగుతుందో తెలుసా? ప్రకాశలోకం అది, ఆ ప్రకాశలోకంలో పనులు దేని ఆధారంగా జరుగుతాయి? ప్రకాశం ఆధారంగానే లేక వేరే ఆధారంగానా? ఈరోజు పేపర్స్ పరిశీలించారు లేదా ఈరోజు పిల్లలు ప్రత్యక్షమయ్యారు, ఇలా రకరకాల కార్యవ్యవహారాలన్నీ ఎలా జరుగుతాయి?

సూక్ష్మవతనం యొక్క కార్యవ్యవహారాలు ఏవిధంగా జరుగుతాయి మీరు చెప్పండి (కర్ణాటక వారిని ఉద్దేశించి) దేని ఆధారంగా జరుగుతాయి? ఇక్కడ కరెంట్ పోతే ఇతర సాధనాల ద్వారా కార్యవ్యవహారాన్ని నడిపిస్తారు కదా, ఇక్కడైతే జనరేటర్ ఉంటుంది, జనరేటర్ ద్వారా కరెంట్ వస్తుంది, అక్కడ ఏముంటుంది? ఏ శక్తి ద్వారా కార్యవ్యవహారం జరుగుతుంది? ఆకారం సాకారాన్ని ప్రేరేపిస్తుందా లేక సాకారం ఆకారాన్ని ప్రేరేపిస్తుందా? చెప్పండి ఎలా జరుగుతుందో! సూక్ష్మవతనం యొక్క కార్యవ్యవహారాలన్నీ విశేషంగా శుద్ధ సంకల్పాల ఆధారంగా జరుగుతాయి. బ్రహ్మ సంకల్పం ద్వారా సృష్టిని రచించాడు అనే మహిమ ఉంది కదా! అలాగే సంకల్పం చేశారు మీరు ప్రత్యక్షం అయ్యారు. ప్రత్యక్షం మరియు గుప్తం యొక్క ఆట. రూపురేఖ - సైగలు కానీ విశేషంగా ఆకారి రూపం యొక్క కార్యవ్యవహారం అంతా మనోబలం అనండి లేదా సంకల్పం అనండి వీటి ఆధారంగానే జరుగుతాయి. బాప్ దాదా సంకల్పం అనే స్విచ్ వేస్తే అంతా ప్రత్యక్షమవుతుంది. సైనికులు వైర్లెస్ ద్వారా దూరదూరాల వరకు కార్యవ్యవహారాలను నడిపిస్తారు. కానీ ఇక్కడైతే వైర్ లెస్ అంటే నిర్వికారి స్థితి యొక్క శక్తి ద్వారా కనెక్షన్ జోడించగలరు. బుద్ధియోగం పూర్తి పరిశుద్ధంగా ఉండాలి. సూక్ష్మవతనం వరకు సంకల్పం చేరాలంటే లోతైన మరియు సర్వ సంబంధాల యొక్క సారవంతమైన స్మృతి అవసరం. ఇది అన్నింటికంటే శక్తివంతమైన తీగ. దీని మధ్యలో మాయ ప్రవేశించలేదు. అక్కడ బాప్ దాదాలకు చాలా వెలుగు ఉంటుంది. ఇక్కడి ప్రపంచంలా కాదు (ఆ సమయంలో మాటిమాటికి కరెంట్ వస్తూ పోతూ ఉంది) కల్పమంతటిలో ఈ సమయంలోనే సూక్ష్మవనతనం ఉంటుంది. కనుక సూక్ష్మవతనం యొక్క వెలుగు కూడా ఈ సమయంలోనే ఉంటుంది. ఆ తర్వాత స్వర్గం యొక్క వెలుగు మీ కోసం.

(ఇక్కడ కూర్చుని ఉండగానే సూక్ష్మవతనాన్ని అనుభవం చేసుకోగలమా? అని అడిగారు) అనుభవం అయితే పిల్లలే చేసుకోగలరు. వతనం ఉన్నదే పిల్లల కొరకు, మరే ఇతరాత్మలు సూక్ష్మవతనాన్ని అనుభవం చేసుకోలేరు. ఎందుకంటే దీనితో బ్రహ్మ మరియు బ్రాహ్మణులకే సంబంధం ఉంది. భక్తులు విశేషంగా ఏదో విశేష దృశ్యాన్ని సాక్షాత్కారం చేసుకోగలరు కానీ సూక్ష్మవతనం మన ఇల్లు, బ్రహ్మాబాబా యొక్క స్థానం అంటే మన స్థానం కూడా. సూక్ష్మవతనపు పద్ధతుల యొక్క అనుభవం, కలుసుకునే అనుభవం, సంతోషకర అనుభవం బ్రాహ్మణులే చేసుకోగలరు.