07.02.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విచిత్ర రాజ్య సభ.

బాప్ దాదా పిల్లలందరి యొక్క జ్ఞానం మరియు స్వరూపం రెండింటి సమానత చూస్తున్నారు. జ్ఞానిగా అవ్వాలి మరియు స్వరూపంలో స్థితులవ్వాలి. రెండింటి సమానత ఉందా? ఎలాగైతే జ్ఞానం అనగా వాచాలోకి వచ్చే అభ్యాసం చాలా ఉందో అదేవిధంగా వాచాకి అతితంగా వెళ్ళే అభ్యాసం ఉందా? సర్వ కర్మేంద్రియాల కర్మ యొక్క స్మృతికి అతీతంగా ఒకే ఆత్మిక స్వరూపంలో స్థితులు కాగలుగుతున్నారా? కర్మ ఆకర్షిస్తుందా లేక కర్మాతీతస్థితి ఆకర్షిస్తుందా! చూడటం, వినటం, చెప్పటం.... అనే ఈ విశేష కర్మలు సహజ అభ్యాసంలోకి ఎలాగైతే వచ్చేశాయో అలాగే కర్మాతీత స్థితి అంటే కర్మను ఇముడ్చుకునే శక్తి ద్వారా ఇముడ్చుకుని అకర్మిగా అంటే కర్మాతీతంగా కాగలరా? 1. కర్మాధీన స్థితి 2. కర్మాతీత స్థితి అంటే కర్మాధికారి. ఎక్కువ సమయం ఏ స్థితి ఉంటుంది? బాప్ దాదా ప్రతి ఒక్క సంగమయుగి కర్మేంద్రియాజీత్, స్వరాజ్యాధికారి రాజ్యాధికారి రాజులను అడుగుతున్నారు - ప్రతి ఒక్కరి రాజ్య వ్యవహారం సరిగ్గా నడుస్తుందా? ప్రతి ఒక్క రాజ్యధికారి ప్రతిరోజు రాజ్యసభ పెట్టుకుంటున్నారా? ఆ రాజ్యసభలో ప్రతి ఒక్క రాజ్య వ్యవహరి తను చేసిన కార్యం యొక్క ఫలితం ఇస్తున్నాయా? రాజ్యాధికారి అయిన మీ అదుపులో ప్రతి ఒక్కరాజ్య వ్యవహారి ఉంటున్నారా ? ఏ వ్యవహారి కూడా మోసం చేయటం లేదు కదా లేదా గొడవ పడటం లేదు కదా? ఒకొక్కసారి రాజ్యాధికారిని మోసం చేయటం లేదు కదా? రాజ్యాధికారులైన మీ రాజ్యం ఉందా లేక ప్రజల రాజ్యం ఉందా? ఇలా పరిశీలించుకుంటున్నారా లేక ఎప్పుడు శత్రువు వస్తే అప్పుడు తెలివి వస్తుందా? రోజూ మీ సభ పెట్టుకుంటున్నారా లేక అప్పుడప్పుడు పెట్టుకుంటున్నారా? మీ రాజ్య వ్యవహారుల పరిస్థితి ఏమిటి? రాజ్య వ్యవహారం అంతా సరిగ్గా ఉందా? ఇంత ధ్యాస పెడుతున్నారా? ఇప్పటి రాజులే జన్మజన్మాంతరాలు రాజులు అవుతారు. మీ దాసీలు సరిగ్గా పనిచేస్తున్నాయా? అన్నింటికంటే పెద్ద దాసి - ప్రకృతి. ప్రకృతి అనే దాని సరిగ్గా పనిచేస్తుందా? ప్రకృతీజీత్ ల ఆజ్ఞానుసారం ప్రకృతి పని చేస్తుందా? మీ రాజ్యసభలోని ముఖ్య అష్ట సహాయోగి శక్తులు మీ కార్యంలో సహయోగం ఇస్తున్నాయా? రాజ్య వ్యవహారం అంతటికీ శోభ ఏమిటంటే ఈ అష్ట శక్తులే అష్ట రత్నాలు, అష్ట సహయోగులు అయితే ఆ ఎనిమిది సరిగ్గా ఉన్నాయా? మీ ఫలితాన్ని పరిశీలించుకోండి. రాజ్య వ్యవహారాన్ని నడిపించటం వస్తుందా? ఒకవేళ రాజ్యాధికారి సోమరితనం అనే నిద్రలో లేదా అల్పకాలిక ప్రాప్తుల యొక్క నషాలో లేదా వ్యర్థ సంకల్పాల నాట్యంలో మునిగిపోతే సహయోగి శక్తులు కూడా సమయానికి సహయోగం అవ్వవు. అయితే ఫలితం ఏవిధంగా ఉందని భావిస్తున్నారు? వర్తమాన సమయంలో బాబా ప్రతి బిడ్డ యొక్క రకరకాల రూపాల ఫలితాన్ని పరిశీలిస్తున్నారు. మీరు మీ ఫలితాన్ని పరిశీలించుకుంటున్నారా? మొదట సంకల్పశక్తి, నిర్ణయశక్తి మరియు సంస్కార శక్తి. ఈ మూడు శక్తులు అదుపులో ఉన్నాయా? ఆ తర్వాత అష్ట శక్తులు అదుపులో ఉన్నాయా? ఈ మూడు శక్తులు - మహామంత్రులు. అయితే మంత్రిమండలి సరిగ్గా ఉందా లేక కదులుతుందా? మీ మంత్రి కూడా దళం మారటం లేదు కదా! అప్పుడప్పుడు మాయకి శిష్యునిగా అయిపోవటం లేదు కదా!

ఒకవేళ ఇప్పటి వరకు కూడా నియంత్రణా శక్తి లేకపోతే అంతిమ ఫలితం ఎలా ఉంటుంది? ఫైన్ (అపరాధ రుసుము) కట్టడానికి ధర్మరాజు పురిలో ఆగవలసి ఉంటుంది. శిక్షలే ఫైన్, రిఫైన్ (పరిశుద్ధం)గా అయిపోతే ఫైన్ కట్టనవసరం లేదు. ఎవరి రాజ్యసభ అయితే ఇప్పటి నుండే సరిగ్గా ఉంటుందో అటువంటి వారు ధర్మరాజు సభలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ధర్మరాజు కూడా వారికి స్వాగతం పలుకుతాడు. స్వాగతించుకోవాలా లేక మాటిమాటికీ శపధాలు చేయాలా అంటే ఇప్పుడు ఇక నుండి చేయము, ఇక నుండి చేయము... ఇలా మాటిమాటికి అనవలసి ఉంటుంది? అంతిమ నిర్ణయం తీసేసుకున్నారా లేక ఫైల్స్ ఇంకా మిగిలి ఉన్నాయా? ఖాతా సమాప్తి అయిపోయిందా లేక మస్తకం అనే బల్లపై ఇది చేయలేదు, అది చేయలేదు ....ఇలా ఏ ఫైల్స్ అయినా మిగిలి ఉన్నాయా? ఇది చేయాలి, అది చేయాలి... ఇలా ఫైల్స్ నిండి లేవు కదా? పాత సంవత్సరంతో పాటు పాత ఖాతాను సమాప్తి చేసుకున్నారా? లేక కొత్త సంవత్సరంలో కూడా పాత ఖాతాను జమ చేసుకుని పెద్దది చేసుకున్నారా? ఏమి చేశారు? సంవత్సరం మారింది అంటే సంస్కారం కూడా మారింది కదా? ఒకవేళ ఇప్పటి వరకు కూడా పాతఖాతా యొక్క లెక్కలఖాతా పూర్తి చేసుకోకుండా పెంచుకుంటూ వెళ్తే ఫలితం ఏమి వస్తుంది? ఎంత పాత ఈ ఖాతాను పెంచుకుంటూ ఉంటారో అంతగా అరవవలసి వస్తుంది. అలా అరవటం చాలా బాధకరంగా ఉంటుంది. ఒకొక్క సెకండు ఒకొక్క సంవత్సరంలా అనిపిస్తుంది. అందువలన ఇప్పుడైనా కాని శివమంత్రం ద్వారా దానిని సమాప్తి చేసుకోండి. ఇప్పటికీ కొందరి ఖాతా భస్మం కాలేదు. ఇప్పటికి పాతఖాతానే ఇంకా పెంచుకుంటున్నారు. చెప్పాను కదా - కొందరి యొక్క మూడు శక్తులు ఇప్పటికి బాబా యొక్క సర్వ ఖజానాలలో మోసం చేస్తున్నాయి. బాబా ఖజానాలు ఇచ్చింది స్వకళ్యాణం మరియు విశ్వ కళ్యాణం కొరకు. కానీ వాటిని వ్యర్థంగా ఉపయోగించటం అంటే మోసం చేస్తున్నట్లే, ద్రోహం చేసినట్లే. శ్రీమతంతో పాటు పరమతం మరియు మన్మతాన్ని కలిపేస్తున్నారు. ఇలా మోసం చేయటంలో కూడా చాలా తెలివైనవారు. దాని యొక్క రూపం కూడా శ్రీమతంలాగే ఉంటుంది. మురళీలోని మాటలే తీసుకుంటారు కానీ తేడా ఎంత ఉంటుందంటే శివం మరియు శవం రెండింటికీ ఉన్నంత ఉంటుంది. శివతండ్రికి బదులు శవంతో చిక్కుకుపోతారు. వారి భాష చాలా రాయల్‌ రూపంలో ఉంటుంది. సదా తమని తాము రక్షించుకోవడానికి ఎవరు చేశారు, ఎవరు చూశారు. ఇలా నమ్మకంతో స్వయాన్ని నడిపించుకుంటారు. ఇతరులను మోసం చేస్తున్నాము అని అనుకుంటారు. కానీ స్వయానికే దు:ఖం జమ చేసుకుంటున్నారు. ఒకటికి వందరెట్లు జమ అవుతుంది. అందువలన మోసాన్ని మరియు కల్తీని సమాప్తి చేయండి. ఆత్మీయత మరియు దయాభావాన్ని ధారణ చేయండి. స్వయంపై మరియు సర్వులపై దయా హృదయులు అవ్వండి. స్వయాన్ని చూసుకోండి, బాబాని చూడండి కానీ ఇతరులను చూడకండి. ఓ అర్జునా! అవ్వండి. అంటే ఎవరు చేస్తే వారే అర్జునులు. చెప్పి నేర్పించటం కాదు, చేసి నేర్పించాలి, శ్రేష్టకర్మ చేసి నేర్పించాలి అనే సూక్తిని సదా గుర్తు ఉంచుకోండి. వ్యతిరేకమైనవి నేర్పకూడదు. నేను మారి అందరినీ మార్చి చూపిస్తాను అనుకోవాలి. వ్యర్ధ విషయాలు వింటూ, చూస్తూ పవిత్రహంసలై వ్యర్ధాన్ని వదిలి సమర్ధాన్ని ధారణ చేయండి. సదా మెరిసే దుస్తులతో అలంకరించుకుని సదా సౌభాగ్యశాలిగా ఉండండి. బాబా మరియు నేను, ఇక మూడవ వారు ఎవరూ లేరు. సదా ఊయలలో ఊగుతూ ఉండండి, బాబా ఒడి అనే ఊయలలో ఊగండి లేదా సర్వ పాప్తుల యొక్క ఊయలలో ఊగండి. సంకల్పం అనే గోరు కూడా మట్టిలోకి వెళ్ళకూడదు. ఈ సంవత్సరం ఏమి చేయాలో అర్ధమైందా? లేకపోతే మీరు మట్టిని తుడుచుకుంటూ ఉంటారు. ప్రియుడు వెళ్ళిపోతాడు. మీరు తుడుచుకుంటూ ఉంటారు ప్రియుడు గమ్యానికి చేరిపోతాడు. అప్పుడు గుంపులో అందరితోపాటు వస్తారు. సమయం గురించి వేచి చూడకూడదు. నేను తయారుగా ఉన్నాను అని స్వయాన్ని తయారుగా ఉంచుకోండి. ఇప్పుడు ఏమి చేయాలో అర్థమైందా!

గడిచిన సంవత్సరం యొక్క ఫలితం చూస్తే కొందరి యొక్క ఖాతా ఇప్పటికీ స్పష్టంగా లేదు. బాగా పాత మచ్చలు కూడా కొందరికి ఇప్పటికి ఉన్నాయి. చెరుపుకుంటున్నారు మరలా మచ్చలు అంటించుకుంటున్నారు. కొందరికి అయితే మొదట చిన్న మచ్చగా ఉంది కానీ దానిని దాచి దాచి పెద్దది చేసేసుకున్నారు. కొందరు దాచేస్తున్నారు, మరికొందరు తెలివితో తమని తాము తప్పించుకుంటున్నారు. అందువలన మచ్చ మరింత గాఢంగా అయిపోతుంది. బాగా గాఢంగా మచ్చ పడితే దేనిపై పడితే ఆ వస్త్రం లేదా కాగితం ఏదైనా కానీ అది చినిగిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా గాఢమైన మచ్చ పడినవారు నేను ఇది చేశాను, నేను ఇది చేశాను అంటూ మనస్సుని చించుకుని ఏడవవలసి ఉంటుంది. ఆ దృశ్యం ఒక్క సెకండు చూసినా కానీ వినాశనకాలం కంటే కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. అందువలన సత్యంగా అవ్వండి, స్వచ్చంగా అవ్వండి. బాప్ దాదాకి ఇప్పుడు కూడా దయ వస్తుంది. అందువలన రోజు మీ రాజ్యసభ పెట్టుకోండి, కచేరి పెట్టుకోండి. పరిశీలించుకోవటం ద్వారా పరివర్తన అయిపోతారు.

ఈవిధంగా స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే సదా రాజ్యాధికారులకి, సదా ఆత్మీయత మరియు దయాభావం యొక్క వృత్తి కలిగినవారికి, విశ్వంలో సదా సుఖమయ, శాంతిమయ వాయు మండలాన్ని తయారు చేసేవారికి, భ్రమించే ఆత్మలకు లైట్ హౌస్, మైట్ హౌస్ అయ్యేవారికి, ధృడ సంకల్పం చేసేవారికి, పాత ప్రపంచం యొక్క ఆకర్షణకి దూరంగా ఉండే వారికి, ఇటువంటి శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.