09.02.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మధువన నివాసీయుల విశేషత.

ఈరోజు విశేషంగా మధువన నివాసీ భాగ్యశాలీ ఆత్మలను కలుసుకోవటానికి వచ్చారు. మధువన నివాసీయుల మహిమ ఈరోజు వరకూ భక్తులు కూడా పాడుతున్నారు. మరియు బ్రాహ్మణులు పాడుతున్నారు. ఎందుకంటే మధువన భూమికి మహిమ ఉంది కనుక ఆ భూమిలో ఉండేవారికి కూడా స్వతహాగానే మహిమ ఉంటుంది. మధువన నివాసీయులకి డ్రామానుసారంగా అన్ని విషయాలలో విశేష అవకాశం లభించింది. బాప్ దాదా యొక్క చరిత్ర భూమి, కర్మ భూమి అయినందువలన ఈ స్థానం యొక్క ప్రభావం స్థితిపై పడుతుంది. ఈ విధంగా స్వ స్థితిలో శ్రేష్టను తీసుకువచ్చే స్థానం లేదా తీవ్ర పురుషార్ధిగా తయారుచేసే స్థానం. అందువలన మధువన నివాసీయులకి విశేష అవకాశం. మనసుని విశ్వకళ్యాణకారి వృత్తిలో, శక్తిశాలిగా తయారు చేసే కేంద్రం అంటే విశ్వ సేవకి ముఖ్య కేంద్రం మధువనం. మధువనానికి వచ్చే అతిథులకి మనసా, వాచా, కర్మణా సేవలతో పాటూ ఆత్మిక అవ్యక్త వాతావరణం తయారు చేసే సేవకి కూడా విశేష అవకాశం ఉంది. మధువనం వారిని చూసి సర్వాత్మలూ సహజంగానే అనుసరించటం నేర్చుకుంటారు. ఎలాగైతే మధువనం బేహద్ యో అలాగే మధువన నివాసీయులకి కూడా బేహద్ సేవకి అవకాశం ఉంది. మీ యొక్క కర్మ ప్రాలబ్ధం యొక్క లెక్కతో ప్రతీ ఆత్మకీ కర్మననుసరించి ఫలం లభించే తీరుతుంది. కానీ ఎంతమంది ఆత్మలు వచ్చినా కానీ వారి సేవ జరగాలి మరియు వారు తృప్తి అవ్వాలి. అప్పుడు ఆ సర్వాత్మల సంతుష్టత యొక్క వాటా ఆతిధ్యం ఇచ్చిన మధువన నివాసీయులకి లభిస్తుంది. ఇంట్లో కూర్చునే సేవ వాటాలు జమా అవుతున్నాయంంటే విశేషతయే కదా! మరియు మధువనం వారికి ప్రత్యక్ష ఫలం లభించటంలో కూడా విశేషత భవిష్య ఫలం అయితే తయరవుతూ ఉంది. మధువన నివాసీయులకి ఇంకా అదనపు విశేష సహాయం లభిస్తుంది. బాప్ దాదా పాలన యొక్క అయితే లభిస్తుంది. కానీ సాకార రూపంలో నిమిత్తమైన శ్రేష్టాత్మల యొక్క పాలన కూడా లభిస్తుంది. అంటే డబుల్ పాలన యొక్క సహాయం లభిస్తుంది. మరియు అన్ని తయారైన సాధనాలు లభిస్తాయి. ఇలా శ్రేష్ట భాగ్యశాలులు అయిన మీరు మీ యొక్క శ్రేష్ట భాగ్యాన్ని తెలుసుకుని సేవకి నిమిత్తంగా అయ్యి నడుస్తున్నారా? ఎలాగైతే కర్మణా సేవలో అలసిపోని సేవాధారులు అనే సర్టిఫికెట్ ఇచ్చి వెళ్తున్నారో అలాగే తీవ్ర పురుషార్థం నిరంతర సహయోగి స్థితి యొక్క సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారా ? రెండు సర్టీఫికెట్లూ వెనువెంట లభించాలి. అప్పుడు యజ్ఞం యొక్క సమాప్తి సమీపంగా వచ్చినట్లు. అందరూ మంచిగా శ్రమ చేసారు. రాత్రి పగలు సేవలో ఎవరైతే తమ తనువు, మనస్సు మరియు శక్తుల ఖజానామ ఉపయోగించారో అటువంటి పిల్లలకి బాప్ దాదా కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. త్యాగం చేసిన వారికి స్వతహాగానే భాగ్యం సహజ సంతోషం రూపంలో మరియు తేలికతనం యొక్క అనుభూతి రూపంలో ఆ సమయంలోనే లభిస్తూ ఉంటుంది. ఈ గుర్తు ద్వారా ప్రతీ ఒక్కరూ స్వయం యొక్క ఫలితాన్ని పరిశీలించుకోవచ్చు. ఎంత సమయం త్యాగిగా మరియు నిష్కామ భావంతో, నిమిత్త భావంతో ఉన్నారో! లేక మధ్యమధ్యలో ఏదైనా భావం కలిసిందా అనేది తెలుసుకోండి. పరిశీలించుకోండి మరియు ఇక ముందు కోసం పరివర్తన చేసుకోవాలి. ఇదే వృద్ధి కళ యొక్క విశేష పురుషార్థం. రెండవ విషయం: ఒక విశేష గుణం అందరికి సదా మరియు సహజంగా ధారణ చేయాలి. అది మన నిజ గుణంలా మారిపోవాలి. ఎప్పుడైతే అది నిజ గుణంగా అయిపోతుందో అప్పుడు ప్రయత్నం చేయవలసిన పని లేదు. స్వతహా జీవితంగా అది తయారయిపోతుంది. ఆ విశేష గుణం ఏమిటంటే ఒకరు ఇంకొకరి బలహీనతలను ధారణ చేయకండి. వర్ణన చేయకండి. వర్ణన చేస్తే అదే వాతావరణం వ్యాపిస్తుంది. ఒకవేళ ఎవరైనా వినిపిస్తున్నా కానీ ఇంకొకరు శుభ భావనతో దానిని తొలగించండి. వీరు చెప్పారు. కానీ నేను అనలేదు అనకండి, కానీ మీరు విన్నది అయితే నిజమే కదా! చెప్పిన వారికి తయారవుతుంది (పాపం), విన్నవారికి తయారవుతుంది. కానీ శాతంలో తేడా ఉంటుంది. కానీ తయారవుతుంది కదా? వ్యర్థ చింతన లేదా బలహీన విషయాలు రాకూడదు. జరిగిపోయిన విషయాలను దయా హృదయులుగా అయ్యి ఇముడ్చుకోండి. ఇముడ్చుకుని శుభ భావనతో ఆ ఆత్మకోసం మనసా సేవ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే పంచతత్వాల పట్ల కూడా మీకు శుభభావన ఉంటుంది. కానీ వారు సహయోగి బ్రాహ్మణాత్మలు. వారు సంస్కారాలకి వశమై వ్యతిరేకంగా మాట్లాడినా, చేసినా, వింటున్నా కానీ మీరు ఆ ఒక్కరిని పరివర్తన చేయండి. ఒకరి నుండి రెండవ వారికి రెండవ వారి నుండి మూడవ వారికి, ఇలా వ్యర్థ విషయాలు యొక్క మాలని దీపమాలలా తయారు చేయకూడదు. ఈ గుణం ధారణ చేయండి. ఎవరిదీ వినకూడదు. వినిపించకూడదు. కానీ ఇముడ్చుకోవాలి. సహయోగి అయ్యి మనస్సు ద్వారా లేదా వాణీ ద్వారా వారిని కూడా ముందుకి తీసుకువెళ్ళాలి. లేకపోతే ఏమి అవుతుంది. ఒకరు తమ మిత్రుడితో మరలా వారు మూడవ వారితో, మూడవ వారు నాలుగవ వారితో...ఇలా వ్యర్ధ విషయాల మాల పెరిగిపోయి నాలుగు వైపులా వ్యాపిస్తుంది. అందువలన ఈ విషయాలపై ధ్యాస పెట్టండి. మంచిది. మధువన పాండవుల యొక్క ఐక్యతకి కూడా విశేషత ఉంది. సీజన్ అంతా నిర్విఘ్నంగా నడుస్తుంది. అంటే నిర్విఘ్న భవ! అనే వరదానిగా అయిపోయారు. సేవాసఫలతలో అందరూ పాస్ అయిపోయారు. సేవ చేయటం లేదు కానీ ఫలం తింటున్నారు. సర్వ బ్రహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలకు అధికారిగా అవ్వటం అంటే ఫలం తిన్నారా లేక సేవ చేసారా?