18.01.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్మృతి స్వరూపం యొక్క ఆధారం స్మృతి మరియు సేవ.

ఈరోజు బాప్ దాదా తన యొక్క అమూల్య మణులను చూస్తున్నారు. ప్రతి ఒక మణి తమ తమ స్థితి రూపి స్థానంలో మెరుస్తూ ఉండే మణుల స్వరూపంలో బాప్ దాదా యొక్క శృంగారంగా ఉన్నారు. ఈరోజు బాప్ దాదా అమృతవేళ నుండి తన యొక్క అలంకారస్వరూపులను (మణులను) చూస్తున్నారు. మీరందరు సాకార సృష్టిలో ప్రతి స్థానాన్ని అలంకరిస్తున్నారు. రకరకాల పుష్పాలతో అలంకరిస్తున్నారు. ఇలా పిల్లల యొక్క శ్రమను బాప్ దాదా పైనుండి చూస్తున్నారు. ఈరోజు మీరు ఎలా అయితే మధువనం యొక్క ప్రతి స్థానం తిరుగుతున్నారో అదేవిధంగా బాప్ దాదా కూడా పిల్లలతో పాటు ఈరోజు తిరుగుతున్నారు. మధువనంలో కూడా నాలుగుధామాలు విశేషంగా తయారుచేసారు. వాటి యొక్క పరిక్రమణ చేస్తున్నారు. భక్తులు కూడా నాలుగుధామాల యొక్క గొప్పతనం చెప్తారు. ఈరోజు మీరు ఎలా అయితే పరిక్రమణ చేస్తున్నారో అలాగే భక్తులు దానిని కాపీ చేసారు. మీరు కూడా క్యూలో వెళ్తున్నారు. అదేవిధంగా భక్తులు కూడా క్యూలో దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఎలా అయితే భక్తిలో సత్యవచన మహారాజు అంటారో అదేవిధంగా సంగమయుగంలో మీ సత్యవచనంతో పాటు సత్యకర్మ కూడా మహాన్ అయినది, అంటే స్మృతిచిహ్నం తయారవుతుంది. ఇదే సంగమయుగం యొక్క విశేషత. భక్తులు భగవంతుని ముందు ప్రదక్షిణ చేస్తారు, ఇప్పుడు భగవంతుడు ఏమి చేస్తున్నారు? భగవంతుడు పిల్లల వెనుక ప్రదక్షిణ చేస్తున్నారు. ముందు పిల్లలను పెడుతున్నారు, తను వెనుక ఉంటున్నారు. అన్ని కర్మలలో నడవండి పిల్లలూ ..... నడవండి పిల్లలూ ...... అంటున్నారు. ఇది విశేషతే కదా! పిల్లలను యజమానిగా చేస్తున్నారు, స్వయం పిల్లవాడిగా అవుతున్నారు. అందువలనే రోజూ యజమానులకు నమస్తే అని చెప్తున్నారు.

భగవంతుడు మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారా లేక మీరు భగవంతుడిని తనవారిగా చేసుకున్నారా? ఏమంటారు? ఎవరు ఎవరిని చేసుకున్నారు? బాప్ దాదా అయితే, పిల్లలే భగవంతుడిని తనవారిగా చేసుకున్నారు అని భావిస్తున్నారు. పిల్లలు చతురులు అయితే బాబా కూడా చతురమైనవాడే. ఆర్డర్ చేసిన వెంటనే ఆ సమయంలో హాజరు అయిపోతున్నారు. ఈరోజు కలయిక యొక్క రోజు. కనుక ఈ రోజు యొక్క వరదానం - సదా స్మృతిభవ. కనుక ఈరోజు స్మృతిభవ అనే వరదానం యొక్క అనుభవం చేసుకున్నారా?

ఈరోజు స్మృతిభవగా అయిన దానికి జవాబుగా బాబా పిల్లలని కలుసుకోవడానికి వచ్చారు. స్మృతి మరియు సేవ యొక్క సమానత స్వతహాగా స్మృతిస్వరూపంగా చేస్తుంది. బుద్ధిలో కూడా బాబా, నోటి ద్వారా కూడా బాబా అని రావాలి. ప్రతి అడుగు విశ్వకళ్యాణం యొక్క సేవ పట్ల ఉండాలి. సంకల్పంలో స్మృతి మరియు కర్మలో సేవ ఇదే బ్రాహ్మణజీవితం. స్మృతి మరియు సేవ లేకపోతే బ్రాహ్మణజీవితమే లేదు.

సర్వ అమూల్య మణులకు, స్మృతి స్వరూప వరదాని పిల్లలకు, ప్రతి కర్మ సత్యకర్మగా చేసే మహాన్ మరియు మహారాజ్ ఆత్మలకు, సదా బాబా యొక్క స్నేహంలో మరియు సహయోగంలో ఉండేవారికి ఈ విధమైన విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.