11.03.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సఫలతకు రెండు ముఖ్య ఆధారాలు.

ఈరోజు భగవంతుడు. స్నేహితుడు తన యొక్క పిల్లలను స్నేహితుల రూపంలోనే కలుసుకుంటున్నారు. ఒకే ఈశ్వరీయ స్నేహితునికి ఎంతమంది స్నేహితులు ఉన్నారో! అలాగే విదేశీయులు స్నేహాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కనుక బాప్ దాదా - తండ్రి కూడా, సద్గురువు కూడా శిక్షకుడు కూడా, సర్వసంబంధాలను నిలుపుతారు. మీ అందరికీ అన్నింటికంటే ఎక్కువ ప్రియమైన సంబంధం ఏమిటి? కొందరికి టీచర్ ఇష్టమనిపిస్తారు, కొందరికి ప్రియుడు ఇష్టమనిపిస్తారు, కొందరికి స్నేహితుడు ఇష్టమనిపిస్తారు. కానీ ఉన్నది ఒకరే కదా! అందువలన ఒకనితోనే ఏ సంబంధం జోడించినా సర్వప్రాప్తి స్వరూపంగా అయిపోతారు- ఇదే గారడీ. ఒకనితోనే ఏ సంబంధం కావాలంటే ఆ సంబంధం జోడించవచ్చు, ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. దీని ద్వారా ఇంకొకరు కావాలి అనే కోరిక సమాప్తి అయిపోతుంది. సర్వసంబంధాల యొక్క ప్రేమను నిలుపుకునే అనుభవీగా అయిపోయారా? అయిపోయారా లేక ఇప్పుడు అవ్వాలా? ఏమని భావిస్తున్నారు? పూర్తిగా అనుభవీగా అయిపోయారా? ఈరోజు మురళి నడిపించడానికి రాలేదు. బాప్ దాదా కూడా తన యొక్క సంబంధాలతో దూర దూరాల నుండి వచ్చిన ఆత్మలను చూసి సంతోషిస్తున్నారు. అందరికంటే దూరదేశి ఎవరు? మీరయితే సాకారలోకం నుండి వచ్చారు. కానీ బాప్ దాదా నిరాకారి వతనం నుండి ఆకారిలోకంలోకి వచ్చారు. తర్వాత సాకారలోకంలోకి వచ్చారు. కనుక అందరి కంటే దూరదేశం బాబాది అయ్యిందా లేక మీదా? ఈ లోకం యొక్క లెక్కతో ఎవరైతే బాగా దూరదేశం నుండి వచ్చారో వారికి బాప్ దాదా స్నేహంతో శుభాకాంక్షలు ఇస్తున్నారు. అందరికంటే దూరదేశం నుండి వచ్చినవారు చేతులు ఎత్తండి! ఎంత దూరం నుండి వచ్చారో, ఎన్ని మైళ్ళ నుండి వచ్చారో అన్ని కోట్లరెట్లు శుభాకాంక్షలు స్వీకరించండి.

ఫారెనర్స్ (విదేశీయులు) అంటే ఫర్-ఎవర్ (సదా ఎవరెడీ). అటువంటి వరదానీలు కదా? ఫారెనర్స్ కాదు కానీ ఫర్ ఎవర్. సదా సేవ కోసం ఎవరెడీగా ఉండేవారు. ఆజ్ఞ లభించగానే వెళ్ళిపోవాలి, ఇది ఫర్ఎవర్ గ్రూప్ యొక్క విశేషత. ఇప్పుడిప్పుడే అనుభవం చేసుకుంటున్నారు మరియు ఇప్పుడిప్పుడే అనుభవం చేయించడానికి ధైర్యం పెట్టుకుని సేవలో స్థితులైపోతున్నారు. ఇది చూసి బాప్ దాదా కూడా చాలా సంతోషిస్తున్నారు. ఒకరి ద్వారా అనేక సేవాధారులు నిమిత్తం అయ్యారు. సేవ యొక్క సఫలతకు విశేషంగా రెండు ఆధారాలు ఉన్నాయి అవి తెలుసా? (కొంతమంది సమాధానం చెప్పారు) మీ యొక్క అనుభవంతో చెప్పిన సమాధానాలన్ని నిజమే. సేవలో లేక స్వయం యొక్క ఎగిరేకళలో సఫలతకు ముఖ్య ఆధారం - ఒకే బాబాతో తెగిపోని ప్రేమ. బాబా తప్ప ఇంకెవ్వరు కనిపించకూడదు. సంకల్పంలో కూడా బాబా, మాటలో కూడా బాబా, కర్మలో కూడా బాబా వెంట కర్మ చేయాలి. ఈ విధమైన లవలీన ఆత్మ ఒక మాట మాట్లాడినా వారి స్నేహం యొక్క మాట ఇతర ఆత్మను కూడా స్నేహంలో బంధిస్తుంది. ఈ విధమైన లవలీన ఆత్మకు బాబా అనే మాటయే గారడీ పని చేస్తుంది. లవలీన ఆత్మ ఆత్మిక గారడీ చేసేవిధంగా ఉంటుంది. లవలీన ఆత్మ అంటే ఒకే బాబా యొక్క ప్రేమ.

సఫలతకు రెండవ ఆధారం - జ్ఞానం యొక్క ప్రతి పాయింట్ యొక్క అనుభవీమూర్తిగా అవ్వాలి. డ్రామా యొక్క పాయింట్ ఉంది అనుకోండి - 1. జ్ఞానం ఆధారంగా ఆ పాయింట్ చెప్పటం. 2 అనుభవీమూర్తి అయ్యి చెప్పటం. డ్రామా పాయింట్ యొక్క అనుభవీగా ఎవరైతే అవుతారో వారు సదా సాక్షిస్థితి యొక్క సీట్ పై కూర్చుంటారు. ఏకరసంగా, అచంచలంగా, స్థిరంగా ఉంటారు. ఇటువంటి స్థితి కలిగిన వారినే అనుభవీమూర్తి అంటారు. విషయం యొక్క బాహ్య రూపం మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా కానీ డ్రామా అనే పాయింట్ ని అనుభవం చేసుకున్న ఆత్మ చెడులో కూడా చెడుని చూడకుండా సదా మంచినే చూస్తుంది, అంటే స్వ కళ్యాణం యొక్క మార్గం కనిపిస్తుంది. అకళ్యాణం యొక్క ఖాతా సమాప్తి అయిపోతుంది. కళ్యాణకారి బాబా యొక్క పిల్లలుగా అయిన కారణంగా, కళ్యాణకారి యుగం అయిన కారణంగా, ఇప్పుడు కళ్యాణం యొక్క ఖాతా ప్రారంభం అయ్యింది. ఈ జ్ఞానం మరియు అనుభవం యొక్క అథార్టీతో అచంచలంగా ఉంటారు. ఒకవేళ లెక్కిస్తే మీ ఒక్కొకరి దగ్గర ఎన్ని రకాలైన అధికారాలు ఉన్నాయి! ఇతరాత్మల దగ్గర అయితే ఒకటి, రెండు అధికారాలు ఉంటాయి. కొందరికి విజ్ఞానం యొక్క అధికారం, కొందరికి శాస్త్రాల యొక్క అధికారం, కొందరికి డాక్టర్ యొక్క తెలివి, కొందరికి ఇంజనీర్ యొక్క తెలివి ఇలా అధికారాలు ఉంటాయి. కానీ మీకు ఏ అధికారం ఉంది? జాబితా తీస్తే చాలా పెద్ద జాబితా అవుతుంది. అన్నింటికంటే ఉన్నతమైన అధికారం - సర్వశక్తివంతుడు మీ వారిగా అయిపోయారు. మీ దగ్గర సర్వశక్తివంతుని యొక్క అధికారం ఉంది. ఎప్పుడైతే సర్వశక్తివంతుడు మీవారిగా అయిపోయారో ఇక విశ్వంలో అధికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీవిగా అయిపోయాయి. ఇలా జాబితా తీయండి. సృష్టి యొక్క ఆది, మధ్య, అంత్యం యొక్క జ్ఞానం యొక్క అధికారం లభించింది. ఈ జ్ఞానానికి స్మృతిచిహ్నంగానే శాస్త్రాలు, బైబిల్ లేదా ఖురాన్ ఇవన్నీ వచ్చాయి. అందువలనే గీతను సర్వశాస్త్రాలకు, సర్వ పుస్తకాలకు శిరోమణి అంటారు. డైరెక్ట్ గీత ఎవరు వినిపిస్తున్నారు? కనుక అధికారం అయ్యింది కదా! అదేవిధంగా సర్వధర్మాలలో నెంబర్ వన్ ధర్మం ఎవరిది? (బ్రాహ్మణులది) మీ యొక్క బ్రాహ్మణధర్మం ద్వారానే అన్ని ధర్మాలు ఉద్భవిస్తాయి. బ్రాహ్మణధర్మం వేరు వంటిది. ఈ ధర్మానికి విశేషత కూడా ఉంది. బ్రాహ్మణధర్మం డైరెక్ట్ పరమపిత స్థాపన చేసారు. ఇతర ధర్మాలు ధర్మపితలకు సంబంధించినవి, ఈ ధర్మం పరమపిత స్థాపించినది. ఆ ధర్మాలు పిల్లల ద్వారా స్థాపన అవుతాయి, అందువలనే వారిని సన్ ఆఫ్ గాడ్ (భగవంతుని పిల్లలు) అంటారు కానీ గాడ్ (భగవంతుడు) అవ్వరు. డైరెక్ట్ పరమపిత ద్వారా శ్రేష్టధర్మం స్థాపన అయ్యింది. మీరు ఆ ధర్మం యొక్క అధికారులు. ఆదిపిత డైరెక్ట్ బ్రహ్మ యొక్క ముఖవంశావళి యొక్క అధికారం కలిగినవారు. సర్వశ్రేష్ట కర్మ చేసే ప్రత్యక్ష జీవితం యొక్క అధికారం కలిగినవారు. శ్రేష్ట కర్మకి ప్రాలబ్ధంగా విశ్వం యొక్క అఖండ రాజ్యానికి అధికారులు. భక్తుల యొక్క పూజకి అధికారులు. ఇలా ఇంకా జాబితా తీస్తే చాలా వస్తుంది. మీకు ఎంత ఉన్నతమైన అధికారం ఉందో అర్థమైందా! ఇలా అధికారం కలిగిన వారికి బాబా కూడా నమస్తే చెప్తున్నారు. ఇది చాలా ఉన్నతమైన అధికారం. ఈ విధమైన అధికారం కలిగిన వారిని చూసి బాబా కూడా సంతోషిస్తున్నారు.

అందరు చాలా బాగా శ్రమ చేసి సేవ యొక్క కార్యాన్ని విస్తారంలోకి తీసుకువచ్చారు. మీ యొక్క భ్రమించే సోదరి, సోదరులకు మార్గం చెప్పారు. దాహంతో ఉన్న ఆత్మలకు శాంతి, సుఖం యొక్క బిందువు ఇచ్చి తృప్త ఆత్మగా చేయడానికి మంచి పురుషార్ధం చేస్తున్నారు. బాబాతో చేసిన ప్రతిజ్ఞను నిలిపి చిన్నదైనా, పెద్దదైనా బాబా ముందుకు పుష్పగుచ్చాన్ని తీసుకువచ్చారు. కానీ చిన్నదైనా బాబాకి ఇష్టమే. ఇప్పుడైతే ఈ ప్రతిజ్ఞను నిలుపుకున్నారు ఇంకా విస్తారాన్ని పొందుతారు. కొంతమంది నెక్లస్ ‌గా తయారుచేసి తీసుకువచ్చారు. కొంతమంది హారంగా తయారుచేసి తీసుకువచ్చారు. కొంతమంది కంకణంగా, కొంతమంది ఉంగరంగా చేసి తీసుకువచ్చారు. కనుక ఇదంతా మొత్తం బాప్ దాదా యొక్క జ్యూయలరీ. ఒక్కొక్క రత్నం విలువైనది. బాబా ఎదురుగా చాలా పెద్ద జ్యూయలరీని తీసుకువచ్చారు. ఇప్పుడు దీనిని ఏమి చేయాలి? (పాలిష్) మధువనానికి వస్తే పాలిష్ అయిపోతుంది. ఇప్పుడు షోకేస్లో పెట్టండి. విశ్వం యొక్క షోకేస్లో ఈ జ్యూయలరీ మెరుస్తూ అందరికీ కనిపించాలి. షోకేస్లోకి ఎలా వస్తారు? బాబా ఎదురుగా వచ్చారు, బ్రాహ్మణుల ఎదురుగా వచ్చారు. ఇది చాలా బావుంది. ఇప్పుడు విశ్వం ముందుకు రావాలి. ఇప్పుడు ఈ విధమైన ప్లాన్ తయారు చేయండి, కోన-కోనల నుండి ఇదే ధ్వని రావాలి - భగవంతుని పిల్లలు కోన-కోనలో ప్రత్యక్షం అయ్యారు అని. భారతదేశంలో అయినా, విదేశంలో అయినా ఒకటే ధ్వని వ్యాపించాలి. ఎలా అయితే సూర్యుడు, చంద్రుడు సమయం యొక్క తేడాతో ఒకే విధంగా కనిపిస్తారు. అదేవిధంగా జ్ఞానసూర్యుని యొక్క పిల్లలు కోన-కోనలో ప్రత్యక్షం అవ్వాలి. జ్ఞానసూర్యుని యొక్క వెలుగు నలువైపుల కనిపించాలి. అందరి సంకల్పంలో, నోటితో ఇదే మాట రావాలి జ్ఞానసూర్యునితో పాటు జ్ఞాన సితారలు కూడా ప్రత్యక్షం అయ్యారు అని. అప్పుడు అన్నివైపుల నుండి వచ్చిన ధ్వని నలువైపుల వ్యాపిస్తుంది. మరియు ప్రత్యక్షత యొక్క సమయం వస్తుంది. ఇప్పుడైతే గుప్త పాత్ర నడుస్తుంది. ఇప్పుడు ప్రత్యక్షంలోకి తీసుకురండి. దీని ప్లాన్ తయారుచేయండి తర్వాత బాప్ దాదా కూడా చెప్తారు. ఒక్కొక్క రత్నం యొక్క విశేషతలు వర్ణన చేస్తే అనేక రాత్రులు, పగలు గడిచిపోతాయి. ప్రతి పిల్లవాని యొక్క విశేషత ప్రతి ఒక్కరి మస్తకంలో మణి సమానంగా మెరుస్తూ కనిపిస్తుంది.

ఈవిధంగా సర్వ విశేషాత్మలకు, సుపుత్రులుగా అయ్యి సేవ యొక్క ప్రత్యక్షత ఇచ్చేవారికి, సదా సేవ మరియు స్మృతిలో ఉండే సేవాధారులకు, మాస్టర్ సర్వశక్తివంతులకు, సర్వుల యొక్క మనోకామనలను పూర్తి చేసే అతి ప్రియమైన, లవలీన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

ప్రశ్న- బాబా సదా పిల్లలను ఆహ్వానం చేస్తూ ఉంటారు, బాబాకి కూడా పిల్లలందరు చాలా ప్రియమైన వారు ఎందుకు?

సమా-పిల్లలు లేకపోతే బాబా యొక్క పేరు కూడా ప్రసిద్ధం అవ్వదు. బాబాకి పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి పిల్లవాని యొక్క విశేషతను చూస్తున్నారు. బాబాకి పిల్లల యొక్క మూడు కాలాల గురించి తెలుసు. భక్తిలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు అవి కూడా తెలుసు మరియు ఇప్పుడు కూడా తమ, తమ శక్తిననుసరించి ఎంత పురుషార్ధంలో ముందుకు వెళ్తున్నారు. ఇది కూడా తెలుసు మరియు భవిష్యత్తులో ఏవిధంగా అవుతారు ఇది కూడా బాబా ముందు స్పష్టంగా ఉంటుంది. కనుక మూడు కాలాలు చూసి బాబాకి ప్రతి పిల్లవాడు చాలా ప్రియంగా అనిపిస్తారు.