13.03.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


రెండు రూపాల యొక్క సేవ ద్వారానే ఆధ్యాత్మిక జాగృతి వస్తుంది.

ఈరోజు బాప్ దాదా శుభచింతకుల సంఘటనను చూస్తున్నారు. శుభచింతకులు అంటే సదా శుభచింతనలో ఉండేవారు, స్వచింతనలో ఉండే వారు. ఈ విధంగా స్వచింతకులుగా, శుభచింతకులుగా, సదా బాబా ద్వారా లభించిన సర్వ ప్రాప్తులు, సర్వ ఖజానాలు మరియు శక్తుల యొక్క నషాలో మరియు వెనువెంట సంపూర్ణ ఫరిస్తా లేదా సంపూర్ణ దేవతగా అయ్యే గమ్యం యొక్క స్మృతిస్వరూపంగా ఉంటున్నారా? ఎంత నషా ఉంటుందో అంత గమ్యం స్పష్టంగా కనిపిస్తుంది. సమీపంగా ఉంటేనే స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా అయితే మీ పురుషార్థం యొక్క రూపం స్పష్టంగా ఉందో అదేవిధంగా సంపూర్ణ ఫరిస్తా రూపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అవుతామా? అవ్వమా? అనే సంకల్పం కూడా రాదు. తయారవ్వాలి ...... తప్పక తయారవుతాం కూడా .... ఇలాంటి సంకల్పాలు వస్తున్నాయి అంటే దీని ద్వారా మీ యొక్క ఫరిస్తా రూపం సమీపంగా మరియు స్పష్టంగా లేనట్లు ఋజువు అవుతుంది. ఎలా అయితే మీ యొక్క బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారుల యొక్క స్వరూపం స్పష్టంగా ఉంటుంది మరియు నిశ్చయబుద్ధి అయ్యి చెప్తున్నారు అవును మేము బ్రహ్మాకుమారీ, కుమారులమే. మేము బ్రహ్మాకుమారీ, కుమారులు అవ్వాలి అని చెప్పటం లేదు. నేనే బ్రహ్మాకుమారీని అంటున్నారు. అవుతాము అనే మాట రావటం లేదు. అవును మేమే అంటారు. అవునా? కాదా? అనే ప్రశ్న రాదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పరిశీలన చేయడానికి - మీరు బ్రహ్మాకుమారీ, కుమారులు కాదు, బ్రహ్మాకుమారీ - కుమారులు భారతవాసీయులు, పెద్ద పెద్ద మహారథులు బ్రహ్మాకుమారీలు. మీరు విదేశీయులు, క్రైస్తవులు, బ్రహ్మ భారతవాసీ అయితే మీరు బ్రహ్మాకుమారీ కుమారులు ఎలా అవుతారు? క్రైస్తవకుమారీ అనడానికి బదులు పొరపాటుగా బ్రహ్మాకుమారీ అంటున్నారు అని అంటే మీరు అంగీకరిస్తారా? అంగీకరించరు కదా! నిశ్చయబుద్ధితో చెప్తారు మేము ఇప్పుడే బ్రహ్మాకుమారీలం కాదు అనేక కల్పాల నుండి బ్రహ్మాకుమారీలము అని. ఇలా నిశ్చయంతో చెప్తారు కదా! లేదా ఎవరైనా అడిగితే ఆలోచనలో పడిపోతారా? ఏమి చేస్తారు? ఆలోచిస్తారా లేక నిశ్చయంతో మేమే బ్రహ్మాకుమారీలము అని చెప్తారా! ఎలా అయితే బ్రహ్మాకుమారీ అనే నిశ్చయం పక్కాగా మరియు స్పష్టంగా ఉంది, అనుభవం కూడా ఉంది అలాగే సంపూర్ణ ఫరిస్తాస్థితి కూడా ఇంతగా అనుభవంలోకి వస్తుందా? ఈరోజు పురుషార్థులు, రేపు ఫరిస్తాలు. ఇంత పక్కా నిశ్చయబుద్ధిగా ఉన్నారా? ఈ నిశ్చయం నుండి ఎవరు కదపలేరు కదా! అంత నిశ్చయబుద్ధిగా అయ్యారా? ఫరిస్తా స్వరూపం యొక్క రేఖ స్పష్టంగా, ఎదురుగా ఉందా? ఫరిస్తా స్వరూపం యొక్క వృత్తి, దృష్టి, కృతి లేదా ఫరిస్తా స్వరూపం యొక్క సేవ ఏమిటో అనుభవం ఉందా? ఎందుకంటే బ్రహ్మాకుమారీ స్వరూపం యొక్క, సేవ యొక్క రూపు రేఖ అయితే అందరు శక్తిననుసరించి అనుభవం చేసుకుంటున్నారు. ఈ సేవ యొక్క పరిణామం ఆది నుండి ఇప్పటివరకు చూసారు. ఈ రూపం యొక్క సేవ కూడా అవసరం, ఆ సేవ జరిగింది, జరుగుతుంది మరియు ఇంకా జరుగుతూ ఉంటుంది కూడా!

ఇక మున్ముందు సమయం మరియు ఆత్మల యొక్క కోరికను అనుసరించి రెండు రూపాల యొక్క సేవ అవసరం 1. బ్రహ్మాకుమారి స్వరూపం అంటే సాకారీ స్వరూపం యొక్క సేవ మరియు 2. సూక్ష్మ ఆకారి ఫరిస్తా స్వరూపం యొక్క సేవ. బ్రహ్మాబాబాలో రెండు సేవలు చూసారు. సాకారి రూపం యొక్క సేవ మరియు ఆకారి రూపం యొక్క సేవ. సాకార రూపం యొక్క సేవ కంటే అవ్యక్తరూపం యొక్క సేవ వేగంగా జరుగుతుంది. అది మీకు తెలుసు మరియు అనుభవీలే కదా! ఇప్పుడు అవ్యక్త బ్రహ్మాబాబా అవ్యక్తరూపధారిగా అయ్యి అంటే, ఫరిస్తా రూపంగా అయ్యి పిల్లలను అవ్యక్త ఫరిస్తా రూపం యొక్క స్థితి వైపుకి ఆకర్షిస్తున్నారు. బాబాని అనుసరించడం వస్తుంది కదా! మేము కూడా శరీరం వదలి అవ్యక్తంగా అవ్వాలి అని ఆలోచించకండి, దీనిలో అనుసరించడం కాదు. బ్రహ్మాబాబా అవ్యక్తంగా అయిపోయారు, అందువలన అవ్యక్త రూపం యొక్క ఉదాహరణ చూసి సహజంగా అనుసరించండి. సాకార రూపంలో లేనప్పటికీ ఫరిస్తా రూపం ద్వారా సాకార రూపం సమానంగానే సాక్షాత్కారం చేయిస్తున్నారు కదా! విశేషంగా విదేశీయులకు ఎక్కువ అనుభవం ఉంది. మధువనంలో సాకార బ్రహ్మ యొక్క అనుభవం చేసుకుంటారు కదా! బాబా గదిలోకి వెళ్ళి ఆత్మిక సంభాషణ చేస్తారు కదా! చిత్రం కనిపిస్తుందా లేక చైతన్యం కనిపిస్తుందా! అనుభవం అవుతుంది కనుకనే ప్రాణప్రదంగా బ్రహ్మాబాబా ... అని అంటున్నారు. మీ అందరి బ్రహ్మాబాబాయా లేక ఆదిలోని వారికే బ్రహ్మాబాబాయా? అనుభవంతో చెప్తున్నారా లేక జ్ఞానం ఆధారంగా చెప్తున్నారా? అనుభవం ఉందా? ఎలా అయితే అవ్యక్త బ్రహ్మాబాబా సాకార రూపం యొక్క పాలన ఇస్తున్నారో అదేవిధంగా వ్యక్తంలో ఉంటూ సాకార రూపం యొక్క అనుభవం చేసుకోండి. అందరికీ ఈ అనుభవం అయ్యింది కదా! ఈ ఫరిస్తా ఎవరు మరియు ఎక్కడి నుండి వచ్చారు అని. ఇప్పుడు నలువైపుల ఈ తెల్లబట్టలు వేసుకున్నవారు ఎవరు? ఎక్కడినుండి వచ్చారు? అనే ధ్వని వస్తుంది కదా! అదేవిధంగా ఇప్పుడు నలువైపుల ఫరిస్తా రూపం యొక్క సాక్షాత్కారం అవ్వాలి. దీనినే రెండు రూపాల ద్వారా చేసే సేవ అంటారు. శ్వేతవస్త్రధారులుగా మరియు శ్వేతప్రకాశధారిగా కనిపించాలి. వారిని చూసి స్వతహాగానే కళ్ళు తెరుచుకుంటాయి. అంధకారంలో ఏదైనా పెద్ద లైట్ ఎదురుగా వస్తే ఆకస్మాత్తుగా కళ్ళు తెరుచుకుంటాయి కదా! ఇది ఏమిటి, వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు ..... ఇలా సాటిలేని అలజడి తీసుకురండి. ఎలా అయితే మేఘాలు నలువైపులా కమ్ముకుంటాయో అదేవిధంగా నలువైపులా ఫరిస్తా రూపం ప్రత్యక్షం అవ్వాలి. దీనినే ఆధ్యాత్మిక జాగృతి, ఆత్మిక జాగృతి అంటారు. దేశ - విదేశాల నుండి ఇక్కడికి వచ్చినవారందరూ బ్రహ్మాకుమారి స్వరూపం యొక్క సేవ అయితే చేసారు, ధ్వని వ్యాపించే జాగృతి చేసే కార్యం చేసారు. సంఘటన యొక్క జెండా ఎగరవేసారు. ఇప్పుడు ఇంకా క్రొత్త పద్దతి తయారు చేస్తారు కదా! ఎక్కడ చూసినా ఫరిస్తాలే (దేవదూతలు) కనిపించాలి. లండనులో చూసినా, ఇండియాలో చూసినా ఫరిస్తాలే కనిపించాలి. అమెరికా - ఆస్ట్రేలియాలో చూసినా ఫరిస్తాలే ఫరిస్తాలు కనిపించాలి. దీని కొరకు తయారీలు ఏమిటి? వారు అయితే 10 సూత్రాల యొక్క ప్రోగ్రామ్ తయారుచేసారు, దీనికి ఎన్ని సూత్రాలు కావాలి? అది 10 సూత్రాల యొక్క కార్యక్రమం, ఇది 16 కళల సూత్రాల యొక్క కార్యక్రమం. దీనికోసం పరస్పరం ఆత్మికసంభాషణ చేయాలి. పద్ధతి చెప్పాను ఇప్పుడు ప్రోగ్రామ్ తయారుచేయాలి. ముఖ్య లక్ష్యం చెప్పాను ఇప్పుడు పూర్తి ప్రోగ్రామ్ తయారుచేయాలి.

ఈవిధంగా శుభచింతనలో ఉండే వారికి, శుభచింతకులకు, డబుల్ రూపం ద్వారా సేవ చేసేవారికి, డబుల్ సేవాధారులకు, బ్రహ్మాబాబాను అనుసరించే వారికి, నిరాకార బాబాని ప్రత్యక్షం చేసేవారికి, సదా బాబా సమానంగా సర్వప్రాప్తి సంపన్న ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

ప్రశ్న - ఆత్మిక సేవాధారులైన మీరు చేయవలసిన అన్నింటికంటే ఉన్నతోన్నతమైన సేవ ఏమిటి?

జవాబు - ఇతరుల దు:ఖం తీసుకుని (హరింపచేయటం) సుఖం ఇవ్వటం ఇదే ఉన్నతోన్నతమైన సేవ. మీరు సుఖసాగరుని బాబా యొక్క పిల్లలు. కనుక మిమ్మల్ని ఎవరు కలిసినా వారి దు:ఖం తీసుకుంటూ ఉండాలి మరియు సుఖం ఇస్తూ వెళ్ళాలి. ఎవరి యొక్క దు:ఖాన్ని అయినా తీసుకుని సుఖం ఇవ్వటం అనేది ఉన్నతోన్నతమైన సేవ. ఇలా పుణ్యం చేస్తూ, చేస్తూ పుణ్యాత్మగా అవుతారు.