15.03.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్వదర్శన చక్రధారి మరియు చక్రవర్తులే విశ్వకళ్యా ణకారులు.

ఈరోజు జ్ఞానసాగరుడైన బాప్ దాదా తన యొక్క మాస్టర్ జ్ఞానస్వరూప పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక పిల్లవాడు బాబా ద్వారా లభించిన ఙ్ఞానంలో మంచిగా రమణీయతను పొందుతున్నారు. ప్రతి ఒక్కరు నెంబరవారీగా శక్తిననుసరించి ఙ్ఞానస్వరూపం యొక్క స్థితిని అనుభవం చేసుకుంటున్నారు. జ్ఞానస్వరూప స్థితి అంటే ఙ్ఞానం యొక్క ప్రతి పాయింట్ యొక్క అనుభవీ స్వరూపంగా అవ్వాలి. బాప్ దాదా జ్ఞానస్వరూప స్థితిలో స్థితులవ్వండి అని సలహా ఇవ్వగానే ఒక సెకనులో ఆ స్థితిలో స్థితులవ్వగలుగుతున్నారా? అవుతున్నారా లేక అయిపోయారా? ఆ స్థితిలో స్థితులై అప్పుడు విశ్వాత్మలవైపు చూడండి. ఏమి అనుభవం చేసుకుంటున్నారు? సర్వాత్మలు ఎలా కనిపిస్తున్నారు, అనుభవం చేసుకుంటున్నారా? విశ్వం యొక్క దృశ్యం ఏమి కనిపిస్తుంది? ఈ రోజు బాప్ దాదాతో పాటు మీరు కూడా జ్ఞానస్వరూప స్థితిలో స్థితులవ్వండి. ఎంత శక్తిశాలి విశాల బుద్ధి యొక్క స్థితి ఉందో అనుభవం చేసుకోండి. త్రికాలదర్శి, త్రినేత్రి, దూరదేశి, సర్వశక్తివంతులు, సర్వ గుణాలు మరియు సర్వశక్తి సంపన్న ఖజానాలకు యజమానులు. ఇది ఎంత ఉన్నతమైన స్థితి? అలా ఉన్నత స్థితిలో స్థితులై క్రిందకి చూడండి. అన్ని రకాలైన ఆత్మలను చూడండి. మొట్టమొదట మీ యొక్క భక్త ఆత్మలను చూడండి - ఏమి కనిపిస్తుంది? ప్రతి ఒక్క ఇష్ట దేవతకు అనేక రకాలుగా భక్తి చేసే రకరకాల భక్తుల యొక్క వరుసలు ఉన్నాయి. లెక్కలేనంత మంది భక్తులు ఉన్నారు. కొంతమంది సతో ప్రధాన భక్తులు అంటే భావనాపూర్వకంగానే భక్తి చేసే భక్తులు. కొంతమంది రజో, తమో అంటే స్వార్థం కోసం భక్తి చేసేవారు. కానీ వారు కూడా భక్తుల యొక్క వరుసలోనే ఉన్నారు. భ్రమిస్తూ వెతుకుతున్నారు, అరుస్తున్నారు. వారి యొక్క పిలుపు వింటున్నారా? (ఒక ఈగ బాబా ముందు తిరుగుతూ ఉంది) ఎలా అయితే ఈ ఈగ భ్రమిస్తుందో అలా వీరికి గమ్యం చూపించే సంకల్పం వస్తుందా? భక్తుల కోసం ఈవిధమైన సంకల్పం వస్తుందా? మంచిది! - భక్తులను చూసారు.

ఇప్పుడు ధార్మిక ప్రజలను చూడండి - ఎన్ని రకాలైన పేర్లు, వేషాలు మరియు కార్యం యొక్క విధి, ఎన్ని రకాలైన ఆకర్షణ చేసే సాధనాలను తమవిగా చేసుకుంటున్నారు! ఇది కూడా చాలా మంచి మెరుపులతో కూడిన ధర్మం యొక్క బజారులా తయారయ్యింది. ప్రతి ఒక్కరి షోకేసులో తమ తమ విధుల యొక్క షో పీసులు కనిపిస్తున్నాయి. కొంతమంది చాలా మంచిగా తిని త్రాగుతున్నారు. కొంతమంది తినడం మానేసి తపస్సు చేస్తున్నారు. ఒకరి విధి - బాగా తినండి, త్రాగండి. రెండవ వారి విధి - అన్నింటిని త్యాగం చేయండి అని. అద్భుతమైన దృశ్యం! కొంతమంది ఎర్రగా, కొంతమంది పచ్చగా ఉన్నారు. రకరకాల రంగులు కలిగి ఉన్నారు. వారిని చూసి మాస్టర్ జ్ఞానస్వరూపులైన మీకు ఏమి సంకల్పం వస్తుంది? ధర్మాత్మలకు కూడా కళ్యాణకారి, మాస్టర్ పరమాత్మ అయిన మీకు ఏమి ఆలోచన వస్తుంది? విశ్వాత్మల ఉద్దారమూర్తి అయిన మీకు ఈ ఆత్మలను కూడా ఉద్దరణ చేయాలి అనే సంకల్పం వస్తుందా? లేక స్వయం ఉద్దరణలోనే నిమగ్నం అయిపోయారా? మీ యొక్క సేవాకేంద్రంలోనే బిజీ అయిపోయారా? సర్వాత్మలకు తండ్రి అయిన బాబా యొక్క పిల్లలు కనుక సర్వాత్మలు మీ సోదరులు. కనుక ఓ మాస్టర్ జ్ఞానస్వరూపులూ! మీ సోదరుల వైపు సంకల్పం, దృష్టి ఎప్పుడు వెళ్తాయి? విశాలబుద్ధి, దూరదేశిగా అనుభవం చేసుకుంటున్నారా? చిన్న-చిన్న విషయాలలోకి బుద్ధి వెళ్ళటం లేదు కదా! ఉన్నత స్థితిలో స్థితులవ్వండి - విశాలకార్యం కనిపిస్తుంది.

ఇప్పుడు మూడవ వైపు కూడా చూడండి - వర్తమాన సంగమ యుగంలో మరియు వెనువెంట భవిష్యత్తులో కూడా సహయోగం ఇచ్చే వైజ్ఞానిక ఆత్మలు. వారు కూడా ఎంత శ్రమ చేస్తున్నారు? ఏమేమి ఆవిష్కరిస్తున్నారు! ఇప్పుడు మీరు వేటి ఆధారంగా వింటున్నారో అవి వైజ్ఞానికుల సహయోగంతోనే వింటున్నారు. (మైక్, హెడ్ ఫోన్స్ మొదలైనవి) రిఫైన్ (పరిశుద్ధమైన) ఆవిష్కరణలు చేసి శ్రేష్టాత్మలైన మీకు బహుమతిగా ఇచ్చి వారు వెళ్ళిపోతారు. ఈ ఆత్మలు కూడా ఎంత త్యాగం చేస్తున్నారు! ఎంత శ్రమ చేస్తున్నారు! ఎంత మంచి బుద్ధి ఉంది! వారు శ్రమ చేస్తున్నారు. ప్రాప్తి మీకు ఇస్తున్నారు. ఈ ఆత్మలకు కూడా కళ్యాణం చేయాలి అనే సంకల్పం వస్తుందా? లేక వీరు అర్థం చేసుకుని వదిలేస్తారు. వీరు నాస్తికులు అని భావించి వదిలేస్తున్నారా? మీరు ఏమి తెలుసుకుంటారు అని అనుకుంటున్నారా? నాస్తికులు అయినా, ఆస్తికులు అయినా బాబాకి పిల్లలే కదా! మీ సోదరులే కదా! సోదరుల యొక్క సంబంధంతో ఈ ఆత్మలకు కూడా ధన్యవాదాలు చెప్తారు కదా! వీరికి కూడా ఏదో రకంగా వారసత్వం లభించాలి కదా! విశ్వకళ్యాణకారి రూపంలో కళ్యాణం యొక్క దృష్టి వేయలేరా? ఇది కూడా అధికారం. ప్రతి ఒక్కరికి అధికారం తీసుకునే రూపం ఎవరిది వారిది. మంచిది, ఇక ముందుకు వెళ్ళండి!

దేశ, విదేశాల యొక్క రాజ్యాధికారులను చూడండి! చూసారా? రాజ్యం కదులుతుందా లేక అచంచలంగా ఉందా? రాజ్యనీతి యొక్క దృశ్యం ఏమి కనిపిస్తుంది? కల్పపూర్వం యొక్క స్మృతిచిహ్నంలో ఒక ఆట చూపించారు, ఆ ఆట ఏమిటో తెలుసా? అది సాకార బాబా యొక్క ఆట - పాచికల ఆట. ఇప్పుడిప్పుడే చక్రవర్తిగా మరియు ఇప్పుడిప్పుడే ఓటు యొక్క బికారిగా ఉంటున్నారు. ఈ విధమైన ఆట చూస్తున్నారు. పేరు మరియు గౌరవాలకి బికారులుగా ఉన్నారు. అటువంటి ఆత్మలకు కొద్దిగా బిందువు ఇవ్వాలి కదా! దయాహృదయ ఆత్మలుగా అయ్యి వారిని కూడా దయాదృష్టితో చూడండి, దాత స్వరూపంతో కొన్ని బిందువులు దానం చేసి వారిని సంతుష్టం చేసారు కదా! ప్రతి భాగంలో ఎవరి సేవ వారిది. తర్వాత మీరు దీనిని విస్తారం చేసుకోండి. ఇక ముందుకు వెళ్ళండి. నలువైపులా బహిరంగ సభలు దీనిలో రకరకాలు ఉన్నాయి. కొంతమంది ఏమి పాట పాడుతున్నారు. మరి కొంత మంది ఏమి పాట పాడుతున్నారు! నలువైపులా కావాలి కావాలి అనే పాట వినిపిస్తుంది. ఆ పాట పాడేవారికి, మనం ఏ పాటను వినిపిస్తే వారి పాట సమాప్తి అవుతుంది? సర్వాత్మలకు మహాజ్ఞాని, మహాదాని, మహాశక్తి స్వరూపం, వరదానిమూర్తి, మాస్టర్ దాత, సెకను యొక్క దృష్టి విధాత, ఇలా కళ్యాణం చేసే మీకు శ్రేష్ఠ సంకల్పం ఉత్పన్నం అవుతుందా? నలువైపుల చూడటానికి ఖాళీ ఉందా? చర్చ్ లైటుగా అయ్యారా? లైట్‌హౌస్ గా అయ్యారా? ఈ విధమైన విశ్వకళ్యాణకారులు, త్రికాలదర్శి, త్రినేత్రి, మాస్టర్ జ్ఞానస్వరూపులు, మాస్టర్ విశ్వ రచయితలు, విశ్వం యొక్క నలువైపుల పరిక్రమణ చేయండి. దృష్టి వేయండి. విశ్వం మొత్తం తిరగండి, అప్పుడే స్వదర్శనచక్రధారులు అంటారు. వెనువెంట చక్రవర్తులు అంటారు. కేవలం స్వదర్శన చక్రధారులేనా లేక చక్రవర్తులు కూడానా! రెండూ కదా!

ఈవిధంగా మాస్టర్ జ్ఞానస్వరూపులకు, విశ్వపరిక్రమణ చేసేవారికి, చక్రవర్తి స్వరాజ్యాధికారులకు, సదా సర్వాత్మల పట్ల దయాహృదయులుగా అయ్యి కళ్యాణం యొక్క భావన ఉంచుకునే వారికి, బాబా సమానమైన శ్రేష్ఠాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.