కష్టాన్ని సహజంగా చేసుకునే యుక్తి - సదా బాబాని
చూడండి.
ఈ రోజు విశేషంగా లండన్ నివాసీయులను కలుసుకునేటందుకు
బాప్ దాదా వచ్చారు. కలయిక యొక్క అర్థం - బాబా సమానంగా అవ్వటం. ఎప్పుడైతే బాబాని
కలుసుకున్నారో బాప్ దాదా ఏమి సైగ చేసారు? పిల్లలూ మీరందరు శ్రేష్టాత్మలు, బాబా
సమానంగా సర్వగుణాలలో, సర్వప్రాప్తులలో మాస్టర్ అని. బాబా కంటే ఉన్నతమైన, బాబా
యొక్క శిరోకిరీటాలు. ఇలా బాబా ద్వారా ఏదైతే మొట్టమొదటి సైగ లభించిందో
దానిననుసరించి మాస్టర్ సర్వశక్తివంతులుగా, సర్వగుణ సంపన్నంగా అయ్యారా? ఎప్పుడైతే
మీరు బాబా సమానంగా అవుతారో అప్పుడే భవిష్యత్తులో విశ్వరాజ్యా ధికారి దేవత
అవుతారు. బాబా సమానంగా ఎంతవరకు అయ్యాను అని పరిశీలన చేసుకుంటూ ఉంటున్నారా!
ఒకొక్క గుణం మరియు ఒకొక్క శక్తిని ఎదురుగా ఉంచుకుని ఎంత శాతం గుణస్వరూపంగా మరియు
శక్తి స్వరూపంగా అయ్యాను అని పరిశీలించుకోండి. ఇలా అనుసరించటం అయితే సహజమే కదా!
బాప్ దాదా మీ ఎదురుగా ఉదాహరణగా ఉన్నారు. నిరాకారి రూపంలో మరియు సాకారి రూపంలో
రెండు రూపాలలో బాబాని చూస్తూ అనుసరిస్తూ వెళ్ళండి. ఎలాంటి తండ్రియో ఆవిధమైన
పిల్లలు అంటే తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అని మహిమ ఉంది కదా! పిల్లలు అనే
సంబంధం అంటేనే తండ్రిని అనుసరించటం. కష్టమేమి లేదు కాని కష్టంగా చేసుకుంటున్నారు.
ఎందుకంటే కష్టం అయితే సదా కష్టం అనిపించాలి. కొంతమందికి సహజం అనిపిస్తుంది,
కొంతమందికి కష్టం అనిపిస్తుంది. ఎందుకు? ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుంది,
మరోసారి వారికే సహజం అనిపిస్తుంది. ఎందుకు? దీని ద్వారా ఏమి రుజువు అవుతుంది?
నడిచేవారికి ఏదైనా బలహీనత ఉంటే కష్టం అనిపిస్తుంది.
ఇప్పటి వరకు భక్తులు బాబా యొక్క మహిమ అయితే
చేస్తున్నారు, వెనువెంట మహానాత్మలకు, పూజ్యాత్మలకు కూడా అదే మహిమ ఉంది. అది ఏమి
మహిమ అనేది జ్ఞాపకం ఉందా? ఏదైనా కష్టమైన పని ఆత్మలకి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి
వెళ్తారు? బాబా దగ్గరకా లేక దేవాత్మల దగ్గరకా? ఎవరైతే ఇతరుల యొక్క కష్టం
తొలగించేవారిగా ఉంటారో వారు స్వయం కష్టాన్ని ఎలా అనుభవం చేసుకుంటారు? కష్టం
అనుభవం అయ్యే సమయంలో ఏ విషయం బుద్ధిలోకి వస్తున్న కారణంగా కష్టం అనిపిస్తుంది?
దీనిలో చాలా అనుభవీలు కదా! బాబాని చూడడానికి బదులు విషయాలు చూడటంలో నిమగ్నం
అయిపోతున్నారు. విషయాలలోకి వెళ్ళటం ద్వారా ప్రశ్నలు ప్రారంభం అవుతున్నాయి.
బాబాని చూస్తే బాబా బిందువు, కనుక ప్రతి విషయంలో బిందువు పెట్టగలరు. విషయాలు
వృక్షం వంటివి మరియు బాబా బీజం, మీరు విస్తారం కలిగిన వృక్షాన్ని చేతితో ఎత్తాలి
అనుకుంటున్నారు. కనుక బాబా చేతిలోకి రావటం లేదు మరియు వృక్షం కూడా చేతిలోకి
రావటం లేదు. బాబాని కూడా ప్రక్కకి తొలగించేస్తున్నారు మరియు వృక్షం యొక్క
విస్తారాన్ని కూడా మీ యొక్క బుద్ధిలో ఇముడ్చుకోలేకపోతున్నారు. ఏది
కోరుకుంటున్నారో అది జరగని కారణంగా బలహీనం అయిపోతున్నారు. బలహీనంగా అయిపోయిన
దానికి ముఖ్య గుర్తు - వారు మాటిమాటికి ఏదోక పరిస్థితి యొక్క లేదా వ్యక్తి
యొక్క ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ఎంత ఫిర్యాదులు చేస్తూ ఉంటారో అంత స్వయం
చిక్కుకుపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ విస్తారం ఒక జాలంగా అవుతుంది. ఎంతగా దాని నుండి
తొలగించుకోవాలి అని ప్రయత్నించినా అంతగా చిక్కుకుపోతూ ఉంటారు. ఉంటే విషయాలు
ఉంటాయి. లేకపోతే బాబా ఉంటారు. విషయాలు వినటం మరియు వినిపించటం ఇదైతే అర్ధకల్పం
నుండి చేస్తూ వచ్చారు. భక్తిమార్గం యొక్క భాగవతం లేక రామాయణం ఏమిటి? ఎంత పెద్ద
విషయాలు! విషయాలు ఉంటే బాబా ఉండరు. ఇప్పుడు కూడా ఎప్పుడైతే విషయాలలోకి
వెళ్ళిపోతున్నారో అప్పుడు బాబాని పోగొట్టుకుంటున్నారు. మరలా ఏమి ఆట ఆడుతున్నారు?
(కళ్ళగంతల ఆట) మూడవ నేత్రానికి పట్టీలు కట్టుకుని వెతుకుతున్నారు. బాబా
మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. మీరు వెతుకుతూ ఉన్నారు. చివరకు ఏమౌతుంది? బాబాయే
స్వయంగా వచ్చి తోడు ఇస్తున్నారు. ఇలాంటి ఆట ఎందుకు ఆడుతున్నారు? ఎందుకంటే
విషయాల యొక్క విస్తారంలో రంగురంగుల విషయాలు ఉంటాయి, అవి మిమ్మల్ని తమవైపు
ఆకర్షితం చేస్తున్నాయి. వాటి నుండి తొలగిపోతే కనుక సహజయోగిగా అయిపోతారు.
లండన్ నివాసీయులు కష్టంగా అనుభవం చేసుకోవటం లేదు కదా?
మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకునే పద్ధతి నేర్చుకోండి.
అప్పుడు విస్తారంలోకి వెళ్ళే సమయమే ఉండదు. ఏవిధంగా అయితే ఏదైనా విశాలకార్యం
చేస్తున్నప్పుడు ఆ సమయంలో చాలా బిజీగా ఉంటాం అప్పుడు ఏమి జరిగినా వాటినుండి
అతీతంగా ఉంటారు. సేవ యొక్క సంలగ్నతలో నిమగ్నం అయ్యి ఉంటారు. తినాలి లేదా
నిద్రపోవాలి అనే ఆలోచన కూడా రాదు. అదేవిధంగా విశ్వకళ్యాణకారి ఆత్మలైన మీరు ఇంత
విశాలకార్యం యొక్క ప్లానుని ప్రత్యక్షంలో తీసుకురండి. మీ బుద్ధిని ఇంత
విశాలకార్యంలో బిజీ చేస్తే ఇక ఖాళీయే ఉండదు. మీ బుద్ధిని బిజీగా ఉంచుకునే డైలీ
డైరీ (దినచర్య) తయారుచేసుకోండి. దీని ద్వారా స్వతహాగా సహజయోగిగా అనుభవం
చేసుకుంటారు.
సహజ రాజయోగం అని వర్ణన చేస్తున్నారు. కానీ
అప్పుడప్పుడు సహజ యోగం, అప్పుడప్పుడు కష్టమైన యోగం అనటంలేదు. కనుక ఏవిధమైన పేరో
ఆవిధమైన స్వరూపాన్ని బాప్ దాదా పిల్లలలో చూడాలనుకుంటున్నారు. మాస్టర్
సర్వశక్తివంతులు అయిన తర్వాత కూడా కష్టంగా అనుభవం చేసుకుంటే సహజం ఎప్పుడు
అవుతుంది? ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. దీని కొరకు పరస్పరం ప్రోగ్రామ్
తయారుచేసుకోండి.
లండన్ పార్టీతో - ఒకొక్క రత్నం చాలా ప్రియమైన వారు
మరియు అమూల్యమైనవారు. ఎందుకంటే ప్రతి ఒక రత్నానికి ఎవరి విశేషత వారికి ఉంది.
సర్వుల యొక్క విశేషతల ద్వారానే విశ్వం యొక్క కార్యం సంపన్నం అవ్వాలి. ఏవిధంగా
అయితే స్థూలమైన పదార్థం తయారుచేసేటప్పుడు కూడా దానిలో అన్ని వస్తువులు వేయకపోతే
అంటే పంచదార లేక ఉప్పు వేయకపోతే అది ఎంత గొప్ప పదార్థం అయినా తినడానికి యోగ్యంగా
ఉండదు. అదేవిధంగా విశ్వం యొక్క ఇంత విశాల శ్రేష్ఠ కార్యం కొరకు ప్రతి ఒక రత్నం
యొక్క అవసరం ఉంది. అందరి వ్రేలు కావాలి. చిత్రంలో కూడా అందరి వ్రేలు చూపిస్తారు
కదా! కేవలం మహారథిలే కాదు, అందరి యొక్క వ్రేలు ద్వారానే విశ్వం యొక్క కార్యం
సంపన్నం అవుతుంది. అందరు ఎవరి రీతిలో వారు మహారథులే. బాప్ దాదా కూడా ఒంటరిగా ఏమి
చేయలేరు. బాప్ దాదా పిల్లలను ముందు పెడతారు, నిమిత్త ఆత్మలు కూడా మిమ్మల్ని
అందరినీ ముందు పెడతారు. కనుక అందరు చాలా చాలా అవసరమైన మరియు శ్రేష్ఠ రత్నాలు.
బాప్ దాదా స్వీకరించినటువంటి రత్నాలు. స్మృతిచిహ్నంలో కూడా చూపించారు - భగవంతుని
యొక్క దృష్టి రాడుపై పడినా కానీ రాడు కూడా బంగారంగా అయిపోయింది అని. భగవంతుడు
స్వీకరించిన శ్రేష్ఠరత్నాలు మీరు. మీ కార్యం యొక్క శ్రేష్ఠతను తెలుసుకోండి.
శక్తులకు మరియు పాండవులకు ఎవరి మహిమ వారికి ఉంది. కనుక మీరందరు మహానాత్మలు.
మహాన్ ఆత్మల యొక్క గుర్తులు ఏమిటి? ఎవరు ఎంత మహాన్ గా ఉంటారో అంతగా నిర్మాణంగా
ఉంటారు. మహాన్ ఆత్మలు సదా తమని తాము నిస్వార్థ సేవాధారిగా అనుభవం చేసుకుంటారు.
ఈ విధమైన గ్రూప్ కదా! శక్తిభవనం యొక్క శక్తులకు తమ యొక్క శక్తి స్వరూపం స్వతహాగా
స్మృతి ఉంటుందా? స్థానం ద్వారా స్థితి కూడా స్మృతి వస్తుంది. శక్తి యొక్క
విశేషత - మాయజీత్ గా ఉండాలి. శక్తుల ముందు ఏవిధమైన మాయ రాదు. ఎందుకంటే శక్తి
మాయపై సవారీ చేస్తుంది. శక్తుల యొక్క చేతిలో సదా త్రిశూలం చూపిస్తారు. ఇది
దేనికి గుర్తు? త్రిశూలం స్థితికి గుర్తు. సంగమయుగం యొక్క బిరుదు - మాస్టర్
త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథులు. ఈ అన్ని స్థితులకు గుర్తుగా త్రిశూలం
చూపిస్తారు. కనుక ఈ స్థితి ఉంటుందా? నిరంతరం ఉండాలి, ఇది అండర్‌లైన్ చేసుకోండి.
చాలా మంచి భాగ్యం తయారుచేసుకున్నారు. విశ్వం యొక్క వాయుమండలం నుండి
తొలగించుకున్నారు. బాప్ దాదా కూడా పిల్లల యొక్క భాగ్యం చూసి సంతోషిస్తున్నారు.
సదా మిమ్మల్ని మీరు పూజ్యాత్మలుగా భావించి
నడుస్తున్నారా? పూజ్య ఆత్మలు అంటే మహన్ ఆత్మలు. మహానుగా అయ్యేటందుకు విశేషంగా
సదా మిమ్మల్ని మీరు అతిథిగా భావించి నడవాలి. ఎవరైతే అతిథిగా భావించి నడుస్తారో
వారే మహాన్ పూజ్యులుగా అవుతారు. ఎందుకు? ఎందుకంటే త్యాగానికి భాగ్యం తయారవుతుంది.
అతిథిగా భావించడం ద్వారా మీ దేహరూపి ఇంటితో కూడా నిర్మోహిగా అయిపోతారు. అతిథికి
తమది అంటూ ఏమి ఉండదు. అన్నీ ఉంటూ కూడా నాది అనేది ఉండదు. అన్ని వస్తువులు
కార్యంలో ఉపయోగిస్తారు. కానీ నాది అనే భావన ఉండదు. అందువలన అతీతంగా కూడా ఉంటారు
మరియు అన్ని వస్తువులను కార్యంలో ఉపయోగిస్తూ కూడా ప్రియంగా ఉంటారు. ఈ విధముగా
అతిథిగా ఉండేవారు కుటుంబంలో ఉంటూ, సేవాసాధనాలను ఉపయోగిస్తూ, సదా అతీతంగా బాబాకి
ప్రియంగా ఉంటారు. ఇలా మహానుగా ఉండేవారే కదా? అతిథిగా భావిస్తున్నారు కదా? ఈ రోజు
ఇక్కడ ఉన్నారు రేపు మీ ఇంటికి వెళ్ళిపోతారు, తిరిగి మీ రాజ్యంలోకి వెళ్తారు. ఇదే
ధ్యాస ఉంటుంది కదా! అందువలన సదా దేహంతో అతీతంగా ఉండాలి. ఎప్పుడైతే దేహంతో
అతీతంగా అవుతారో దేహ సంబంధాలు మరియు వైభవాలతో అతీతం అయినట్లే. ఈ అతీత స్థితి
ఎంత ప్రియమైనది! ఇప్పుడిప్పుడే కార్యంలో రావాలి, ఇప్పుడిప్పుడే అతీతం అవ్వాలి.
ఈ విధమైన అనుభవం అవుతుంది కదా! మీ యొక్క జడచిత్రాలను పూజ్య రూపంలో మందిరంలో
పెడుతున్నారు. కానీ భక్తిలో కూడా సంగమయుగం యొక్క అతీత స్థితి పరంపరగా నడుస్తూ
వస్తుంది. మందిరం లక్ష్మీనారాయణులదే కానీ వారు తమదిగా భావిస్తారా? అతీతంగా
ఉంటారు కదా! జడచిత్రాలలో పూజ్యులుగా అయిన వారిలో కూడా నాది అనే భావన లేదు. కనుక
చైతన్య పూజ్యాత్మలైన మీలో కూడా సదా అతిథిని అనే వృత్తి ఉండాలి. ఎంత అతిథిని అనే
వృత్తి ఉంటుందో అంతగా ప్రవృత్తి శ్రేష్ఠముగా మరియు స్థితి ఉన్నతంగా ఉంటుంది.
లండన్ నివాసీయులు అని నామమాత్రంగా అంటారు కానీ అందరు అతిథులు. ఈరోజు ఇక్కడ
ఉన్నారు, రేపు అక్కడ ఉంటారు. ఈ రోజు మరియు రేపు ఈ రెండు మాటలలో మొత్తం చక్రం
స్మృతిలోకి వస్తుంది. ఈ విధమైన మహాన్ పూజ్య ఆత్మలే కదా! లండన్ నివాసీయులకు
నిశ్చయం మరియు ఉల్లాసం చాలా మంచిగా ఉన్నాయి. బలహీన ఆత్మలు కాదు. విఘ్నం వచ్చింది
అంటే దానిని దాటేస్తున్నారు. మేకలుగా కాదు అందరు సింహాలుగా ఉన్నారు. శక్తి సేన
యొక్క జెండా మంచిగా ఎగరవేస్తారు. ఒక్కొక్క శక్తి - సర్వశక్తివాన్ బాబాని
ప్రత్యక్షం చేసేవారు. ఎప్పుడైతే శక్తి సేన మైదానంలోకి వస్తారో అప్పుడే జయ - జయ
కారాలు వస్తాయి. మొదట జయ - జయ కారాల యొక్క ధ్వని ఎక్కడ మ్రోగుతుంది? లండన్లోనా
లేక అమెరికాలోనా? బాప్ దాదా సదా స్నేహి పిల్లలకు అమృతవేళ శుభాకాంక్షలు
ఇస్తున్నారు - ఓహో నా పిల్లలు ఓహో! అనే పాట పాడుతున్నారు. పాట వినడం వస్తుందా?
ప్రశ్న : ఏ బరువు తగ్గించుకోవటం ద్వారా ఆత్మ
శక్తిశాలిగా తయారవుతుంది?
జవాబు : ఆత్మపై వ్యర్థం యొక్క బరువు ఉంది. వ్యర్థ
సంకల్పాలు, వ్యర్థ మాట, వ్యర్థ కర్మ వీటి ద్వారానే ఆత్మ బరువు అయిపోతుంది.
ఇప్పుడు ఈ బరువును తగ్గించుకోండి. ఈ బరువును తగ్గించుకోవడానికి సదా సేవలో బిజీగా
ఉండండి. మననశక్తిని పెంచుకోండి. మననశక్తి ద్వారా ఆత్మ శక్తిశాలిగా అవుతుంది. ఎలా
అయితే భోజనాన్ని అరిగించుకోవటం ద్వారా రక్తంగా తయారవుతుంది. ఆ శక్తే మనకి పని
చేస్తుంది అదేవిధంగా మననం చేయటం ద్వారా ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది.
ప్రశ్న : ఏ మంత్రం భక్తిలో చాలా ప్రసిద్ధమైనది, దానిని
స్మృతిలో ఉంచుకోవటం ద్వారా సంతోషం యొక్క ఊయలలో ఊగగలరు. ఆ మంత్రం ఏమిటి?
జవాబు : భక్తిలో హంసో సో హం (నువ్వే నేను, నేనే నువ్వు)
యొక్క మంత్రం చాలా ప్రసిద్ధమైనది. ఇప్పుడు పిల్లలు ఈ మంత్రం యొక్క అర్థాన్ని
ప్రత్యక్షంగా అనుభవం చేసుకుంటున్నారు. ఈ మంత్రం మన కోసమే, మనం బ్రాహ్మణులుగా
అయ్యాము - ఇది ఇప్పుడు మనకి తెలిసింది. దేవతల యొక్క చిత్రాలను చూసి ఇవి మా
యొక్క చిత్రాలే అని బుద్ధిలోకి వస్తుంది. ఇదే అద్భుతం. ఈ స్మృతిలో ఉంటే సదా
సంతోషం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు.