23.03.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఫస్టులోకి లేదా ఎయిర్ కండీషన్లోకి వెళ్ళేటందుకు సహజసాధనం.

ఈరోజు బాప్ దాదా పిల్లలందరి ముఖంలో విశేషంగా ఒక విషయాన్ని చూస్తున్నారు. అది ఏమిటి? ప్రతి ఒక్కరి ముఖంలో పవిత్రత యొక్క అందం ఎంతవరకు వచ్చింది? పవిత్రత యొక్క మహానత అనే మెరుపు ఎంతవరకు కనిపిస్తుంది అని చూస్తున్నారు. శారీరక అందంలో మస్తకం, నయనాలు, ముఖం అన్నీ చూస్తారు. అదేవిధంగా పవిత్రత యొక్క అందంలో బాప్ దాదా మస్తకంలో సంకల్పం యొక్క రేఖలు అంటే స్మృతి శక్తి, నయనాలలో ఆత్మిక వృత్తి యొక్క దృష్టి, ముఖంలో మహాన్ ఆత్మగా అయ్యే సంతోషం యొక్క చిరునవ్వు, వాణీలో సదా మహానుగా అయ్యి మహానుగా చేసే మాట, తలపై పవిత్రతకు గుర్తుగా లైట్ కిరీటం - ఈ విధంగా ప్రతి ఒక్కరి మెరుస్తూ ఉండే ముఖం బాప్ దాదా చూస్తున్నారు. ఈ రోజు వతనంలో పవిత్రత యొక్క పోటీ జరుగుతుంది. ఈరోజు మీ అందరూ ఏ నెంబర్ లో ఉంటారో మీకు తెలుసా? మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి ఉంటుంది. మీ అందరికీ ఏ బహుమతి లభించింది?

ఎవరైతే ఈ 5 విషయాలలో సంపన్నంగా ఉంటారో వారే మొదటి బహుమతికి అధికారులుగా అవుతారు. మొదటిది - లైట్ యొక్క కిరీటం. దీనిలో కూడా కొంతమంది కిరీటం పూర్తి సర్కిల్ ప్రకాశంతో ఉంది. ఏవిధంగా అయితే చంద్రునికి కూడా పూర్తి సర్కిల్ ఉంటుంది కదా! అప్పుడప్పుడు సగం అయిపోతుంది. అలాగే కొంతమందికి సగం ఉంది, కొంతమందికి పూర్తిగా ఉంది మరి కొంతమందికి కేవలం గీత మాత్రంగా ఉంది అంటే నామమాత్రంగా ఉంది. మొదటి నెంబర్ అంటే ఫస్ట్ బహుమతి పొందే ఆత్మలు పూర్తి లైట్ యొక్క కిరీటధారులుగా ఉంటారు.

రెండు - మస్తకంలో తిలకం. ఏవిధంగా అయితే మస్తకంలో తిలకం మెరుస్తూ ఉంటుందో, అదేవిధంగా సోదరులు అనే స్మృతి అంటే ఆత్మిక స్మృతి ఆధారంగా మస్తకంలో బిందువు మెరుస్తూ ఉంటుంది.

మూడు - నయనాలలో ఆత్మీయత యొక్క మెరుపు అంటే ఆత్మిక దృష్టి, దేహాన్ని చూస్తూ కూడా చూడకుండా ఆత్మను చూసే అభ్యాసం ద్వారా మెరుపు కనిపిస్తుంది. ఆత్మిక ప్రేమ యొక్క మెరుపు కనిపిస్తుంది. పెదవులపై ప్రభు ప్రాప్తి, ఆత్మ మరియు పరమాత్మ యొక్క మహాన్ కలయిక యొక్క మరియు సర్వప్రాప్తుల యొక్క చిరునవ్వు ఉంటుంది. ముఖంలో తల్లి, తండ్రి మరియు శ్రేష్ఠ పరివారం నుండి విడిపోయి కల్పపూర్వం తర్వాత కలుసుకున్న సుఖం యొక్క ఎరుపు మెరుపు ఉంటుంది. బాబా కూడా ఎరుపు, ఆత్మ కూడా ఎరుపు, ఇల్లు కూడా ఎరుపు మరియు బాబా వారిగా అయ్యారు అంటే ఎరుపుగా అయిపోయినట్లే. ఈ విధంగా 5 రేఖలలో సంపూర్ణస్వరూపంగా అయిన వారికే మొదటి బహుమతి లభిస్తుంది. ఇప్పుడు దీని ఆధారంగా ఆలోచించుకోండి - మొదటి బహుమతి తీసుకునేటందుకు 5 రేఖలు 100%లో ఉన్నాయా? రెండవ బహుమతి వారికి 70%, మూడవ బహుమతి వారికి 30% ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు అని. రెండవ బహుమతి వారు దీనిలో కూడా చాలామంది నెంబర్ వారీగా ఉన్నారు. మొదటి మరియు మూడవ నెంబర్లో తక్కువగా ఉన్నారు. 30 నుండి 50లో చాలామంది ఉన్నారు. వీరిని కూడా రెండవ నెంబర్ అని అంటారు కానీ వెనుక ఉంటారు మొదటి వారిలో కూడా రెండు రకాలుగా ఉన్నారు.

1. జన్మ నుండి పవిత్రత యొక్క అందం, 5 గుర్తులు జన్మసిద్ధ అధికార రూపంలో లభించి ఉన్నాయి. పొందవలసిన అవసరం లేదు, లభించే ఉన్నాయి. వారి ముఖంలో అపవిత్రత యొక్క రేఖలు లేవు. నిజసంస్కారంగా, స్వతహాజీవితం ఉంది. సంస్కారాలను పరివర్తన చేసుకునేటందుకు శ్రమ చేయవలసిన అవసరం లేదు. స్వప్నంలో కూడా సంకల్పమాత్రంగా కూడా అపవిత్రత యొక్క యుద్ధం జరగదు అంటే పవిత్రత యొక్క అందంలో కొద్దిగా కూడా సూక్ష్మ మచ్చ ఏదీ లేదు.

2. జన్మ నుండి జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్ ఆధారంగా పవిత్రత యొక్క అందం కలిగిన వారు. తేడా ఏమిటంటే మొదటి వారి గురించి వినిపించాను కదా! వారికి చివరిజన్మ యొక్క వెనుకటి సంస్కారాల యొక్క మచ్చ కూడా ఉండదు. అందువలనే వెనుకటి సంస్కారాలు తొలగించుకునే శ్రమ యొక్క రేఖ ఉండదు. వెనుకటి జన్మల బరువు ఆత్మపై ఉంది అని జ్ఞానం ఉంది కానీ 84 జన్మల యొక్క వెనుకటి అపవిత్రత సంకల్పమాత్రంగా కూడా అనుభవం అవ్వదు. అందువలనే ఇది కూడా లిఫ్ట్ యొక్క గిఫ్ట్ లభించింది. అందువలనే నిజ సంస్కార రూపంలో సహజ మహాన్ ఆత్మగా ఉంటారు. ఏవిధంగా అయితే సహజయోగిగా ఉంటారో అదేవిధంగా సహజ పవిత్రాత్మగా ఉంటారు. పవిత్రంగా అవ్వండి అనేది వారి సూక్తి కాదు, వారు ఉండేదే పవిత్రంగా, మొదటి బహుమతిలో కూడా నెంబర్ వన్ అంటే ఎయిర్ కండీషన్ గ్రూప్ అయినట్లే. తర్వాత మొదటి తరగతి వీరిలో కొంచెం తేడా ఉంటుంది. నిజ సంస్కారంగా ఉండదు, సంస్కారంగా చేసుకోవలసి ఉంటుంది. అంటే మరజీవ జన్మ యొక్క ఆదిలో నిమిత్తమాత్రంగా, జ్ఞానం ఆధారంగా ధ్యాస పెడతారు. కొద్దిగా పురుషార్థం యొక్క రేఖలు ఆదిలో కనిపిస్తాయి. ఇప్పుడు లేవు. ఎయిర్ కండీషన్ అంటే తయారైపోయిన వారు. మొదటి తరగతి వారు ఆదిలో స్వయాన్ని తయారు చేసుకున్నారు. దానిలో కూడా పురుషార్థం సహజంగా చేసారు. సహజ పురుషార్థం, తీవ్ర పురుషార్థం, సమర్థ పురుషార్థం అయినప్పటికీ పురుషార్థం యొక్క రేఖ ఉంది. ఇది పవిత్రత యొక్క విషయం. పవిత్రత యొక్క సబ్జెక్టులో వారు తయారైపోయిన వారు మరియు వారు పురుషార్థం యొక్క రేఖ కలిగినవారు. మిగిలిన అన్ని సబ్జెక్టుల యొక్క విషయం వేరు. ఇది ఒక సబ్జెక్టు యొక్క విషయమే. వారు అష్టరత్నాల యొక్క మాలలోని వారు మరియు వీరు 100లో మొదటి నెంబర్ వారు. మూడవ తరగతి వారినైతే ఇండియా గవర్నమెంట్ వారు కూడా తయారు చేస్తున్నారు. మూడవ తరగతి వారు సత్యయుగం యొక్క మొదటి ఉన్నతమైన ప్రజలు, వీరు ఉన్నతకుటుంబం యొక్క సంబంధంలో సదా ఉంటారు. లోపల ఉండే ప్రజలుగా ఉంటారు, బయట ఉండేవారిగా కాదు. లోపల ఉండేవారు రాజకుటుంబానికి సంబంధంలో చాలా సమీపంగా ఉంటారు. కానీ కర్తవ్యంలో వెనుక ఉంటారు. లక్ష్యం ఎయిర్‌కండీషనులోకి వెళ్ళాలి అని ఉంది కదా! మొదటి తరగతి ద్వారా రెండవ తరగతి వారి గురించి అర్థం అయ్యి ఉంటుంది. రెండవ తరగతి నుండి మొదటిలోకి లేక ఎయిరకండీషనులోకి వెళ్ళడానికి చాలా సహజసాధనం ఉంది. కేవలం ఒకే సంకల్పం యొక్క సాధనం. ఆ సంకల్పం - నేను స్వతహా పవిత్ర ఆత్మను. అపవిత్రత అసలు సంస్కారం కాదు కదా! అనాది మరియు ఆది రెండు కాలాలలో పవిత్రత స్వతహా సంస్కారం, అపవిత్రత కృత్రిమమైనది. నిజ సంస్కారం కాదు. శూద్రుల సంస్కారం, శూద్ర సంస్కారాన్ని బ్రాహ్మణులు ఎలా ఉపయోగిస్తారు! కేవలం ఈ ఒక సంకల్పం స్మృతి ఉంచుకోండి - నేను అనాది, ఆది స్వరూప పవిత్ర ఆత్మను. ఎవరిని చూసినా కూడా వారి యొక్క అనాది, ఆది నిజ స్వరూపాన్ని చూడండి. స్వయం యొక్క మరియు ఇతరుల యొక్క నిజస్వరూపాన్ని చూడండి. నిజస్వరూపాన్ని అనుభవం చేసుకోండి. ఎర్ర కళ్ళజోడు పెట్టుకోండి. స్మృతి యొక్క కళ్ళజోడు పెట్టుకోండి, స్థూలమైన కళ్ళజోడు కాదు, నేను కూడా ఎరుపు, ఇతరుల కూడా ఎరుపు మరియు బాబా కూడా ఎరుపు, ఇది ఎర్ర కళ్ళజోడు అయ్యింది కదా! తర్వాత ఎర్రకోటపై జెండా ఎగురుతుంది. ఇప్పుడు మైదానం వరకు అడుగు వేసారు. గవర్నమెంట్ యొక్క దృష్టి వరకు వచ్చింది తర్వాత మనస్సులోకి వస్తుంది. అందరి మనస్సు నుండి ఇదే అనే ధ్వని వస్తుంది. ఇప్పుడు ఈ ధ్వని వ్యాపించింది - ఇది ఉన్నతమైన సంస్థ, ఇది ఉన్నతమైన కార్యం , ఇది సాధారణ సంస్థ కాదు... ఇలా ఉన్నతమైన లిస్టులో ఉంది. ఇప్పుడు మీ శ్రమను ప్రశంసిస్తున్నారు. తర్వాత పరమాత్మ ప్రేమ యొక్క మహిమ చేస్తారు. 81వ సంవత్సరంలో ఇది చేసారు, 82వ సంవత్సరంలో ఏమి చేస్తారు? ఇది కూడా మంచిగా చేసారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. సంఘటన యొక్క స్వరూపాన్ని విశ్వం ముందు ఒక చిత్రం రూపంలో పెట్టారు, మేమందరం ఒకటే అనే జెండా ఎగరవేసారు. ప్రజలు ఇక ఈ బ్రహ్మాకుమారీలు అయిపోయారు! ఎంతవరకు నడుస్తారు! అని భావించారు కానీ సంఘటన యొక్క ఉదాహరణ అనేక సాధనాల ద్వారా రేడియో, టీ.వి, పేపర్ ద్వారా, నేతల యొక్క సంప్రదింపుల ద్వారా బ్రహ్మాకుమారీలు ఎగిరేకళలో అమరంగా ఉన్నారు, వెళ్ళిపోయేవారు కాదు కానీ అందరినీ తీసుకువెళ్ళేవారు అని అర్థం చేసుకున్నారు.

ఎవరైతే తనువు, మనస్సు, ధనం ఉపయోగించారో విశ్వం యొక్క మూలమూలల్లో బ్రాహ్మణులు భావన యొక్క మట్టి వేసే ప్రోగ్రామ్ తయారయ్యింది. మీ రాజ్యం యొక్క పునాదిని గట్టిగా చేసుకున్నారు. అందువలనే కొన్ని ఫలాలు వచ్చాయి, కొన్ని వస్తాయి. నిందల నుండి రక్షించుకున్నారు. ఎర్రకోట వరకు చేరుకున్నారు కనుక నిందలు సమాప్తి అయిపోయాయి. వారికి లోపమే ఉంది మీ పై నింద లేదు. అందువలనే సఫలతా మూర్తులు మరియు సదా ఉంటారు. ఇక ముందు ఇంకా క్రొత్త ప్లాన్ తయారు అవుతుంది. ఖర్చు గురించి ఆలోచించకండి. ఖర్చు ఏమి చేసారు - 10 పైసలు ఇచ్చారు అంతే. ప్రజలు అయితే మనోరంజన సంఘటనల కోసం, సంఘటిత ప్రోగ్రామ్స్ కోసం ఎంత జమ చేసుకుంటారు, ఎంత ఖర్చు పెడతారు! మీ అందరిది అయితే 10 పైసలు లేదా 10 రూపాయలలో పని అయిపోతుంది. ఇంత పెద్ద పరివారాన్ని చూడటం మరియు కలుసుకోవటం ఇది కూడా స్నేహానికి ప్రత్యక్షత. ఐక్యత యొక్క సువాసన, ఉత్సాహ ఉల్లాసాలు మరియు ఆవిష్కరణల సువాసన నలువైపుల బాగా వ్యాపింపచేసారు. బాప్ దాదా యొక్క వతనం వరకు చేరుకున్నాయి. ఇప్పుడు కేవలం ఒక సువాసన ఉండి పోయింది. అది ఏమిటి? భగవంతుని పిల్లలు అనే సువాసన వ్యాపించాలి. మహాన్ ఆత్మలు అనే మహిమ వరకు చేరుకున్నారు. ఆత్మిక బాంబ్ వేసారు కానీ పరమాత్మ బాంబ్ వేయలేదు. బాబా వచ్చారు, వీరు బాబా యొక్క పిల్లలు లేక సహయోగులు ఇప్పుడు ఈ అంతిమ జెండా ఎగరవేయాలి. ఉపన్యాసాల ద్వారా, మైకుల ద్వారా సందేశం అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు హృదయం వరకు సందేశం అందించాలి. ఇప్పుడు ఏమి చేయాలో అర్థమైందా? ఆ రోజు కూడా వచ్చేస్తుంది. చెప్పాను కదా దేశం నుండి ఎవరో ఒక విశేష వ్యక్తి రావాలి వారి ద్వారా అలజడి (సేవ) జరగాలి. అందరు మొదటి తరగతి యొక్క పవిత్రత యొక్క అందంలోకి వచ్చి రెండవ తరగతి సమాప్తి అయిపోతే ఇక ఆ రోజు కూడా దూరంలో ఉండదు. రెండవ తరగతి వారు అందంగా తయారవ్వడానికి తమ అనే మేకప్ చేసుకోవలసి వస్తుంది ఇప్పుడు దానిని వదిలేసి స్వతహా అందంలోకి రండి. ఏవిధంగా అయితే దేవతల సంస్కారంలో అపవిత్రత అంటే ఏమిటో తెలియని విధంగా ఉంటారో అదే స్వతహా సంస్కారాన్ని తయారు చేసుకుంటే విశ్వం ముందు పవిత్రత అందంతో ఆత్మిక ఆకర్షణ స్వరూపంగా అవుతారు. ఈ రోజు ఏమి పోటీ జరిగిందో అర్థమైందా!

విదేశీ గ్రూప్ చాలామంది వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఒకరు వెళ్తున్నారు అంటే అనేక మందిని తీసుకురావాలి. ఒకొక్క నక్షత్రం తన యొక్క ప్రపంచాన్ని తయారు చేసుకుంటుంది. ఇది చైతన్య సితారల యొక్క ప్రపంచం. అందువలనే సైన్స్ వారు మీ స్మృతిచిహ్న సితారలలో (ఆకాశ సితారలు) ప్రపంచాన్ని వెతుకుతున్నారు. ఇప్పుడు వారిని కూడా మీ ప్రపంచంలోకి తీసుకురండి. శ్రమ నుండి రక్షించబడతారు. వారికి సితారల యొక్క ప్రపంచం అంటే ఏమిటి? అనేది అనుభవం చేయించండి. ఈ రోజు భారతవాసీ పిల్లలతో పాటు విదేశీయులకు కూడా విశేషంగా జ్ఞానం యొక్క పార్టీ.

ఈవిధంగా పవిత్రత యొక్క అందంలో నెంబర్ వన్ ఆత్మలకు, అపవిత్రత పై సదా విజయం పొందేవారికి, పవిత్రతని నిజ సంస్కారంగా తయారు చేసుకునేవారికి, సదా సర్వ సంబంధాల సుఖం ఒకే బాబా నుండి తీసుకునేవారికి, ఒకరిలో మొత్తం ప్రపంచం చూసే ప్రేయసీలకు ప్రియుడైన బాబా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

మురళీ యొక్క సారం:-

మొదటి బహుమతికి అధికారిగా అయ్యేవారు 5 విషయాలలో సంపన్నంగా ఉంటారు.
1. సంపూర్ణ లైట్ కిరీటధారులుగా ఉంటారు.
2. సదా సోదరుల యొక్క స్మృతి, ఆత్మిక స్మృతికి గుర్తుగా మస్తకంలో తిలకం మెరుస్తూ ఉంటుంది.
3. నయనాలలో ఆత్మీయత యొక్క మెరుపు ఉంటుంది.
4. పెదవులపై పరివారం యొక్క ప్రాప్తి, ఆత్మ మరియు పరమాత్మ యొక్క మహా కలయిక మరియు సర్వ ప్రాప్తుల యొక్క చిరునవ్వు ఉంటుంది.
5. ముఖంలో తల్లి , తండ్రి మరియు శ్రేష్ఠ పరివారాన్ని కల్పపూర్వం తర్వాత కలుసుకున్న సుఖం యొక్క లీల.
మొదటి తరగతిలోకి లేదా ఎయిర్ కండీషనులోకి రావడానికి సహజ సాధనం, కేవలం ఈ సంకల్పం ఉంచుకోండి - నేను అనాది, ఆది నిజ స్వరూప పవిత్ర ఆత్మను. ఎవరిని చూసినా వారి యొక్క ఆది, అనాది పవిత్ర రూపాన్ని చూడండి.