25.03.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మహానతకు ఆధారం - సంకల్పం, మాట మరియు కర్మ యొక్క పరిశీలన.

ఈరోజు బాప్ దాదా తన యొక్క చరిత్ర భూమి, కర్మ భూమి, వరదాని భూమి, మహా తీర్థ భూమి, మహా యజ్ఞభూమి యొక్క సర్వ సహయోగులను కలుసుకునేటందుకు వచ్చారు. మధువన నివాసీయులు అంటే మహా పావన భూమి యొక్క నివాసీయులు, ఈ భూమికి వచ్చేవారికే గొప్ప పాత్ర ఉంటుంది. అంటే ఇక ఇక్కడ ఉండేవారికి ఎంత గొప్ప పాత్ర ఉంటుంది! గొప్ప ఆత్మల యొక్క నివాస స్థానం కూడా గొప్పగా మహిమ చేయబడుతుంది. ఇక్కడికి వచ్చేవారే భాగ్యశాలిగా అనుభవం చేసుకుంటున్నారు, అనేక అనుభవాలు స్వయంలో చేసుకుంటున్నారంటే ఇక్కడ ఉండే వారికి ఎంత అనుభూతి ఉంటుంది! ఉండేదే జ్ఞానసాగరంలో అయితే ఆ ఆత్మలు ఎంత శ్రేష్టమైనవారు. ఇలా మధువన నివాసీయులందరు తమని తాము మహాన్ గా అనుభవం చేసుకుంటున్నారా? ఏవిధంగా అయితే స్థానం ఉన్నతమైనదో స్థితి కూడా ఉన్నతంగా ఉంటుంది. క్రిందకి అయితే రావటం లేదు కదా? మధువన నివాసీయులకు ఎన్ని రకాలైన సహాయాలు యొక్క బహుమతులుగా లభించాయో తెలుసా? ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా? లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి అంటున్నారా? మధువన మహిమ యొక్క పాట అందరు పాడతారు. కానీ మధువన నివాసీయులు ఆ పాట పాడుతున్నారా? మధువన నివాసీయులని ఒక శ్రేష్ట చిత్రం రూపంలో దూర దూరాల వారు తమ యొక్క మనస్సులో ఉంచుకుంటారు ఆ విధమైన చిత్రం చైతన్యంలో మీరు తయారుచేసుకున్నారా? ఎలా అయితే స్థూలంగా పర్వతంపై ఉన్నారో అదేవిధంగా సదా ఉన్నత స్థితి అనే పర్వతంపై ఉంటున్నారా? ఎంత ఉన్నత స్థితి అంటే అక్కడికి పాత ప్రపంచం యొక్క వాతావరణం యొక్క ప్రభావం ఏది రాకూడదు. అలాంటి స్థితిలో ఉంటున్నారా లేక క్రిందికి వచ్చేస్తున్నారా? క్రిందకి వచ్చే అవకాశం ఉందా? మధుననానికి డబుల్ రేఖ ఉంది.

1. మధువన నివాసీయులు మధువనం యొక్క రేఖలో ఉన్నారు మరియు 2.సదా శ్రీమతం యొక్క రేఖలో ఉండాలి. రెండు రేఖలలో ఉండేవారి స్థితి ఎంత శ్రేష్టంగా ఉంటుంది! ఈ రోజు బాప్ దాదా తన భూమి యొక్క నివాసీయులను కలుసుకునేటందుకు వచ్చారు. బాబా యొక్క చరిత్ర భూమి కదా! అటువంటి భూమి యొక్క నివాసీయులతో విశేష స్నేహం ఉంటుంది కదా! ఈ రోజుల్లో అయితే భక్తులు విశేష భూమి యొక్క మట్టిని కళ్ళకు అద్దుకోవడానికి తపిస్తున్నారు, కానీ మీరు సదా ఆ భూమిలో నివసిస్తున్నారు అంటే ఎంత భాగ్యశాలి. ఆత్మలు! అందరు హృదయ సింహాసనాధికారులే కానీ మీరు మధువన నివాసీయులు మరియు హృదయసింహాసనాధికారులు కూడా! డబుల్ అయ్యింది కదా! అందరి కంటే తాజా వస్తువులు మధువన నివాసీయులకు లభిస్తాయి. అందరి కంటే ఉన్నతమైన అనుభవాల యొక్క పిక్నిక్ మధువనం నివాసీయులే చేసుకుంటారు. అందరికంటే ఎక్కువ కలయిక మధువన నివాసీయులు చేసుకుంటారు. అందరికంటే ఎక్కువ నలువైపుల సమాచారాల యొక్క జ్ఞానసాగరులుగా కూడా మధువన నివాసీయులే ఉంటారు! మధువన నివాసియులను కలుసుకునేటందుకు అందరు వస్తారు. అంటే ఎంత శ్రేష్టభాగ్యం లభించింది మరియు ఎవరు వర్ణన చేస్తున్నారు? బాబా పిల్లల యొక్క భాగ్యాన్ని వర్ణన చేస్తున్నారు. మధువన నివాసీయులకు ఎంత శ్రేష్టభాగ్యం ఉందో! ఈ ఒక విషయం స్మృతి ఉంచుకున్నా ఎప్పుడు క్రిందికి రారు. ఇప్పుడు బాబా ఎంతగా మధువన నివాసీయుల యొక్క భాగ్యాన్ని మహిమ చేసారో అంత మహాన్ ఆత్మగా భావించి నడుస్తున్నారా? మధువన నివాసీయుల యొక్క మహిమ విని విదేశీయులు కూడా ఎంత సంతోష పడుతున్నారో చూడండి! వీరందరి మనస్సులో సంకల్పం వస్తుంది. మేము కూడా మధువననివాసీ అయిపోవాలి అని. ఈరోజు విదేశీయులు గ్యాలరీలో కూర్చున్నారు. గ్యాలరీలో కూర్చుని చూడటంలో మజా వస్తుంది. అప్పుడప్పుడు మధువన నివాసీయులు చూస్తారు, అప్పుడప్పుడు విదేశీయులు చూస్తారు. మధువన నివాసీయులు సమర్థంగా అవ్వడానికి ఒక విషయం స్మృతి ఉంచుకోండి. అది ఏమిటి? ఆ ఒక విషయంలో అంతా ఇమిడి ఉంది. ఏ సంకల్పం చేసినా, మాట మాట్లాడినా, కర్మ చేసినా, సంబంధ, సంప్రదింపుల్లో వచ్చినా కేవలం ఒక విషయం పరిశీలన చేసుకోండి - ఇది బాబా సమానంగా ఉందా? నా సంకల్పం బాబా సంకల్పంగా ఉండాలి. నా మాట బాబా మాటగా ఉండాలి. ఎందుకంటే ఇది బాబాతో అందరి యొక్క ప్రతిజ్ఞ - బాబా ద్వారా ఏదైతే విన్నానో అదే వినిపిస్తాను, బాబా ఏదైతే వినిపిస్తారో అదే వినిపిస్తాను, బాబా ఏదైతే ఆలోచించమని చెప్పారో అదే ఆలోచిస్తాను. ఇది అందరి ప్రతిజ్ఞ కదా! ఇది అందరి ప్రతిజ్ఞ కనుక కేవలం పరిశీలన చేసుకోండి. పరిశీలన చేసుకోవటం కష్టం కాదు కదా! మొదట కలుపుకోండి తర్వాత ప్రత్యక్షంలోకి తీసుకురండి. మొదట ప్రతి సంకల్పం బాబా సమానంగా ఉందా, అని పరిశీలన చేసుకోండి. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా! ద్వాపరయుగీ రాజులు ఎవరైతే ఉండేవారో వారు ఏదైనా పదార్థం స్వీకరించేముందు పరిశీలన చేసుకుని తర్వాత స్వీకరిస్తారు. ద్వాపరయుగీ రాజులు మీ ముందు ఎవరు? మీరయితే ఇంకా మంచి రాజులుగా ఉండేవారు. పడిపోయిన రాజులకే అంత జాగ్రత్త ఉంటుంది అంటే మీ బుద్ధికి సంకల్పాలే భోజనం కదా! మాట - నోటి యొక్క భోజనం, కర్మ - చేతులకు, పాదాలకు భోజనం. కనుక అన్నీ పరిశీలన చేసుకోవాలి కదా! మొదట చేసి తర్వాత ఆలోచిస్తే ఏమంటారు? రెండు రకాలుగా తెలివైనవారిగా ఉండాలి. కేవలం ఈ ఒక విషయాన్ని మీ యొక్క నిజ సంస్కారంగా చేసుకోండి. ఏవిధంగా అయితే స్థూలంగా కూడా కొద్దిమంది ఆత్మలకు అలా, ఇలా ఉండే పదార్థాలు తినే అలవాటు ఉండదు. మొదట పరిశీలన చేసుకుని తర్వాత స్వీకరిస్తారు. మీరందరు మహాన్ పవిత్ర ఆత్మలు, సర్వశ్రేష్ట ఆత్మలు. మరి మీరు పరిశీలన లేకుండా సంకల్పాన్ని కూడా స్వీకరించకూడదు, మాట మాట్లాడకూడదు, కర్మ చేయకూడదు. ఇది మహానత అనిపించుకోదు. కనుక మధువన నివాసీయులకు కేవలం ఒక విషయం ఉండాలి. పరిశీలనా యంత్రాంగం ఉంది కదా! అభ్యాసమే యంత్రాంగం. మధువన నివాసీయుల యొక్క మహిమ కూడా చాలామంది చేస్తారు. అలసిపోని స్థితి యొక్క సువాసన చాలా సమయం నుండి వస్తుంది. అలసిపోని స్థితి యొక్క సువాసనా సర్టిఫికెట్ అయితే లభించింది. దీనితో పాటు ఇంకేమి కలుపుతారు? ఏవిధంగా అయితే అలసిపోనివారో అదేవిధంగా సదా ఏకరసంగా ఉండాలి. ఎప్పుడు ఫలితం చూసినా ఫలితంలో ఏకరసస్థితి అందరిదీ నెంబర్ వన్ గా ఉండాలి. రెండు, మూడు నెంబర్‌గా కాదు. ఎందుకంటే మధువనంలోని వారు అందరికీ లైట్ మరియు మైట్ ఇచ్చేవారు. ఒకవేళ లైట్ హౌస్, మైట్ హౌస్ యే కదులుతూ ఉంటే ఇతరుల పరిస్థితి ఏవిధంగా ఉంటుంది? మధువన నివాసీయుల యొక్క వాయుమండలం చాలా త్వరగా నలువైపుల వ్యాపిస్తుంది. ఇక్కడ చిన్న విషయం కూడా బయట పెద్దరూపంలో చేరుతుంది. ఎందుకంటే ఉన్నతమైన వ్యక్తులు కదా! సదా చత్రఛాయలో ఉండేవారు. స్వర్గంలో ప్రాప్తి లభిస్తుంది. కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ ప్రాప్తి కదా! మధువన నివాసీయులకు అన్నీ తయారైనవి లభిస్తాయి. ఒక భాధ్యత సంభాళిస్తారు. ఇక మిగిలినవన్నీ తయారైనవి లభిస్తాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎంత వస్తుంది అని సంకల్పం చేయవలసిన అవసరం లేదు. కేవలం సేవ చేయండి, ఫలం తినండి. 36 రకాల భోజనం కూడా మధువనం వారికి చాలాసార్లు లభిస్తుంది. కనుక 36 గుణాలు కూడా ధారణ చేయాలి. ప్రతి ఒక మధువన నివాసీ లైట్ కిరీటధారిగా అవ్వవలసిందే. కానీ డబల్ కిరీటధారులుగా అవ్వాలి. 1. గుణాల యొక్క కిరీటం 2. పవిత్రత యొక్క కిరీటం. ఈ కిరీటంలో తక్కువలో తక్కువ 36 వజ్రాలు అయినా ఉండాలి కదా!

ఈరోజు బాప్ దాదా మధువన నివాసీయులకు ఎక్కువగా గుణాల కిరీటం యొక్క ప్రోగామ్ చేస్తున్నారు. ఎవరిని చూసినా ప్రతి ఒక్కరినీ కిరీటధారిగా చూడాలి. ప్రతి ఒక్కరి గుణాల రూపీ రత్నాలు మెరుస్తూ ఇతరులను కూడా మెరిపింపచేయాలి. (బాప్ దాదా డ్రిల్ చేయించారు) అందరు లవలీన స్థితిలో స్థితులై ఉన్నారు కదా! ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు ఈ అనుభూతిలో ఎంత అతీంద్రియసుఖం ఉంటుంది! సర్వగుణాలలో సంపన్న శ్రేష్టస్థితి మంచిగా అనిపిస్తుంది కదా! ఈ స్థితిలో రాత్రి, పగలు గడిచిపోయినా కానీ ఈ స్థితిలోనే ఉండాలి అనే సంకల్పం ఉంటుంది. సదా ఈ స్మృతిలో సమర్ధ ఆత్మగా ఉండండి.

బాప్ దాదా నిరంతరం పిల్లలతో కలయిక జరుపుతూ ఉంటారు. అనేక మంది పిల్లలు ఉన్నా కానీ ప్రతి ఒక పిల్లవాడితో బాబా కలయిక జరుపుతూనే ఉంటారు. ఎందుకంటే శరీరం యొక్క బంధన నుండి ముక్తి అయిన బాబా మరియు దాదా ఇద్దరు ఒక సెకనులో అనేకులకు అనుభూతి ఇస్తారు.

1. ఏ సంకల్పం చేసినా, ఏ మాట మాట్లాడినా, కర్మ చేసినా, సంబంధ, సంప్రదింపుల్లోకి వచ్చినా ఇది బాబా సమానంగా ఉందా అని పరిశీలన చేసుకోండి.

2. డబుల్ కిరీటధారులుగా అవ్వండి - 1. గుణాల యొక్క కిరీటం 2. పవిత్రత యొక్క కిరీటాన్ని ధారణ చేయండి.

3. విశ్వమహారాజు యొక్క సింహాసనానికి విశేష ఆధారం - ప్రతి విషయంలో, ప్రతి సబ్జక్టులో బాబాని పూర్తిగా అనుసరించాలి.

దాదీజీతో:-ఉన్నతకుటుంబం తయారైపోయిందా? లేక ఇప్పుడు తయారు చేసుకుంటున్నారా? రాజు కార్యాలు చేసేవారు వచ్చేస్తారా? లేక ఇప్పుడు రావాలా? ఒకరు నడిపించేవారు, మరొకరు వచ్చేవారు. ఎవరైతే సింహాసనాధికారులుగా ఉంటారో వారు రాజ్యం నడిపించేవారు మరియు ఎవరైతే సంబంధంలో ఉంటారో వారు రాజ్య పరివారంలోకి వచ్చేవారు. కనుక రాజ్య పరివారం నడిపించేవారు కూడా ఇప్పుడు తయారవుతున్నారు కదా! రాజ్య పరివారం నడిపించేవారి విశేషత ఏమి ఉంటుంది? సింహాసనంపై అయితే అందరు కూర్చోరు, సింహాసనంపై కూర్చునే వారి సంబంధీకులు అయితే అవుతారు కానీ సింహాసనంపై కూర్చునే వారు అయితే తక్కువ కదా! ఉన్నత కుటుంబంలోకి వచ్చేవారికి మరియు రాజ్య సింహాసనంపై కూర్చునే వారికి కూడా తేడా ఉంటుంది. వారిని కూడా అనటం అయితే మొదటినెంబర్ అంటారు, రెండవ నెంబర్ అంటే విశ్వమహారాజు యొక్క ఉన్నత కుటుంబీకులు. కానీ తేడా ఏమి ఉంటుంది? సింహాసనాధికారిగా ఎవరు అవుతారు. దానికి కూడా నియమం ఉంటుంది కదా! దీని ఆధారంగా ఆలోచించాలి. సంగమయుగంలో హృదయసింహాసనాధికారిగా బాబా అందరినీ తయారు చేస్తారు. భవిష్యత్తులో రాజులుగా - మహారాజుగా అయితే అవుతారు కానీ మొదటి నెంబర్ యొక్క సింహాసనాధికారిగా, లక్ష్మీనారాయణుల యొక్క సింహాసనాధికారిగా ఎవరు అవుతారు? చిన్న చిన్న సింహాసనాధికారులుగా మరియు రాజ్యసభలు ఉంటాయి కానీ విశ్వ మహారాజు యొక్క సింహాసనానికి విశేష ఆధారం - ప్రతి విషయంలో, ప్రతి సబ్జక్టులో బాబాని పూర్తిగా అనుసరించాలి. ఒకవేళ ఒక సబ్జక్టులో అయినా అనుసరించడంలో లోపం వస్తే మొదటి నెంబర్ సింహాసనాధికారిగా కాలేరు. నరుని నుండి నారాయణుని పదవి, నారి నుండి లక్ష్మీగా అయ్యే పదవి అయితే పొందుతారు కానీ మొదటి నెంబర్ యొక్క సింహాసనం మరియు కిరీటం పొందడానికి బాప్ దాదా ఇద్దరినీ ప్రతి విషయంలో అనుసరించాలి. అప్పుడు సింహాసనం కూడా వరసగా లభిస్తుంది. ప్రతి విషయంలో, ప్రతి సంస్కారంలో, ప్రతి సంకల్పంలో బాబాని అనుసరించాలి. దీని ఆధారంగా నెంబర్ కూడా లభిస్తుంది. సింహాసనం కూడా అదే లభిస్తుంది, కానీ దానిలో కూడా నెంబర్ ఉంటుంది. రెండవ లక్ష్మీనారాయణులలో మరియు ఎనిమిదవ లక్ష్మీనారాయణులో తేడా ఉంటుంది కదా! ఇక్కడ అనుసరించడంలో తేడా వస్తుంది. దీనిలో కూడా గుహ్యరహస్యం ఉంది. మహారాజుగా మరియు మహారాణిగా అవ్వటంలో కూడా రహస్యం ఉంది. బాప్ దాదా కూడా రాజధానిని చూస్తూ ఉంటారు. ఎవరెవరు రాజ్యాధికారిగా అవుతారు అని. ఏ రేఖల యొక్క లెక్కతో తయారవుతారు. ఇది కూడా రహస్యం కదా!

బాబాని అనుసరించడంలో కూడా చాలా గుహ్యగతి ఉంది. జన్మ నుండి బాబాని అనుసరించాలి. యువ జీవితంలో కూడా బాబాని అనుసరించాలి. సేవా జీవితంలో కూడా బాబాని అనుసరించాలి. మరలా అంతిమ జీవితంలో కూడా బాబాని అనుసరించాలి. స్థాపనా కార్యంలో వెనువెంట సహయోగంలో ఎంత సమయం మరియు ఎంత శాతంలో బాబాని అనుసరించారు! పాలనా కార్యంలో ఎంత వరకు అనుసరించారు! మీ యొక్క మరియు ఇతరుల యొక్క విఘ్నవినాశక కార్యంలో ఎంత వరకు బాబాని అనుసరించారు! వీటన్నింటి మార్కులు కలిసి మొత్తం తయారవుతుంది. మొత్తం లెక్కతో నెంబర్ తయారవుతుంది.

మీరందరు జంప్ చేయగలుగుతున్నారా! కోట్లలో కొద్దిమంది ఈవిధమైన అద్భుతం చూపించగలరు. కోట్లలో కొద్దిమంది ఎవరు? ఇది మిమ్మల్ని మీరు అడగండి. ఆలస్యంగా వస్తే చేయలేము అని అనుకోకండి. ఇంత పెద్ద జంప్ చేయాలి, జంప్ చేయండి బాప్ దాదా ఎగస్ట్రా సహాయం కూడా ఇస్తారు.

పార్టీలతో - ఏవిధంగా అయితే బాబా పిల్లల యొక్క శ్రేష్టత తెలుసుకుంటున్నారో అదేవిధంగా మీరందరు తెలుసుకుంటున్నారా? ఇంత నషా ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉండటం లేదా? విషయాలను చూస్తున్నారా లేక బాబాని చూస్తున్నారా? ఎవరిని చూస్తున్నారు? ఎందుకంటే ఎంత పెద్ద సంఘటన ఉంటే అంత అన్ని విషయాలు వస్తూ ఉంటాయి కదా! సంఘటనలో విషయాలు ఉండటం అనేది ఉంటుంది. విషయాల యొక్క సమయంలో బాబా స్మృతిలో ఉంటున్నారా? విషయాలు సమాప్తి అయిపోతే బాబా స్మృతి వస్తారు అని ఆలోచించకండి. కానీ విషయాలను సమాప్తి చేసేటందుకే బాబా యొక్క స్మృతి ఉండాలి. ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు విషయాలు సమాప్తి అవుతాయి. విషయాలు సమాప్తి అయితే మేము ముందుకు వెళ్తాము అని భావించకండి. మనం ముందుకు వెళ్తూ ఉంటే విషయాలు వెనుక ఉండిపోతాయి. మార్గం ముందుకు వెళ్ళదు, వెళ్ళేవారు ముందుకు వెళ్తారు. ఎప్పుడైనా మార్గం ముందుకు వెళ్తుందా? ఎవరైనా మార్గం దాటేవారు మార్గం ముందుకు వెళ్తే నేను ముందుకు వెళ్తాను అని ఆలోచిస్తారా! మార్గం అయితే అక్కడే ఉండిపోతుంది, దానిని దాటేవారు ముందుకు వెళ్తారు. మార్గమధ్య దృశ్యాలు ముందుకు వెళ్ళవు, కానీ వాటిని దాటేవారు ముందుకు వెళ్తారు. కనుక ఈ శక్తి ఉందా?

ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు ఈ పాఠం మనసా, వాచా, కర్మణా నిరంతరం స్మృతి ఉంటుందా? ఇది ఒక సబ్జెక్టు రెండవ వ్యక్తి ఎవరు లేరు కానీ ఏదైనా వైభవం ఉందా? ఏదైనా విఘ్నం ఉందా? ఏదైనా వ్యర్ధ సంకల్పం ఉంటే ఒక బాబా మరియు రెండవది వ్యర్దసంకల్పం అప్పుడు రెండు అయిపోయాయి కదా! సంకల్పంలో కూడా వ్యర్ధం ఉండకూడదు, మాటలో కూడా ఉండకూడదు. ఆత్మలతో సంప్రదింపులను నిలుపుకుంటూ స్మృతిలో బాబా ఉండాలి. వ్యక్తి మరియు సంప్రదింపు యొక్క విస్తారం ఉండకూడదు. ఈ విధంగా ఉన్నానా? ఈరోజు తనువుపై, రేపు మనస్సుపై, ఎల్లుండి వస్తువులపై, అప్పుడప్పుడు వ్యక్తులపై దీనిలో సమయం వెళ్ళిపోవటం లేదు కదా? వ్యక్తులు వెళ్ళిపోతే వైభవాలు వస్తాయి. వైభవాలు వెళ్ళిపోతే వ్యక్తులు వస్తారు, ఇలా వరస ఉంటుంది. ఎందుకంటే మాయకి తెలుసు కొద్దిగా అవకాశం లభించినా బహురూపాలలో వస్తుంది.

ఒక రూపంతో కాదు. అక్కడి నుండి, ఇక్కడి నుండి, మూలల నుండి బహురూపాలతో చాలా వైపుల నుండి వస్తుంది. కానీ పరిశీలించుకునే వారు ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు ఈ పాఠం ఆధారంగా అవి దూరం నుండి నమస్కారం చేసేవిధంగా చేస్తారు. చేయటం కాదు, చేయిస్తారు. ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు అనే ఈ పాఠం యొక్క వాతావరణం నలువైపుల ఉండాలి. ఎందుకంటే జ్ఞానం అంతా లభించింది. ఎన్ని పాయింట్స్ లభించాయి, పాయింట్స్ ఉంటూ కూడా పాయింట్ రూపంలో ఉండాలి. క్రిందకి తీసుకువచ్చే సమయంలో ఇదే అద్భుతం చేయాలి. అప్పుడప్పుడు విషయాలు క్రిందకి తీసుకు వచ్చేస్తాయి, అప్పుడప్పుడు ఎవరో ఒక వ్యక్తి నిమిత్తం అవుతారు, అప్పుడప్పుడు వాయుమండలం, అప్పుడప్పుడు ఏదోక వస్తువు నిమిత్తం అవుతుంది. ఇది ఉండకూడదు అనుకోకూడదు. కానీ మీరు వాటిలో ఉంటూ ఏకరసంగా ఉండండి, దానికి యుక్తి ఆలోచించండి, ఏదోక క్రొత్త ఆవిష్కరణ చేయండి, అందరు ఓహో, ఓహో అనే విధంగా ఆవిష్కరణ ఉండాలి. వీరు మంచి యుక్తి వినిపించారు అని అనాలి.