27.03.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బాబాకి ప్రియంగా, లోకానికి ప్రియంగా, మనస్సుకి ప్రియంగా ఎలా అవ్వాలి?

ఈరోజు బాప్ దాదా విశేషంగా ఎందువలన వచ్చారు? విశేషంగా డబుల్ విదేశీ పిల్లలతో ఆత్మిక సంభాషణ చేసేటందుకు వచ్చారు. ఇచ్చి పుచ్చుకోవడానికి వచ్చారు. దూర దూరాల నుండి పిల్లలందరు వస్తే మధువనం యొక్క బాబా వచ్చిన పిల్లలకు ఎక్కువగా జ్ఞానం యొక్క ఆత్మిక సంభాషణ యొక్క మర్యాద చేయడానికి వచ్చారు. ఈరోజు బాప్ దాదా పిల్లల నుండి వినడానికి
వచ్చారు - ఎవరికి, ఏ విషయంలో ఏమి కష్టం అనుభవం అవ్వటం లేదు కదా! బాబా మరియు మీరు కలుసుకోవటం కూడా సహజం అయిపోయింది కదా! కలయిక సహజం అయిపోయింది. పరిచయం సహజంగా లభించింది. మార్గం సహజంగా లభించింది. ఇక కష్టం ఏమీ లేదు కదా? వాస్తవానికి కష్టమేమి లేదు కాని ఎవరు కష్టంగా చేసుకోలేదు కదా? బాబా ద్వారా లభించిన ఖజానా యొక్క తాళంచెవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకునే విధి వచ్చిందా? విధి ఉంటే సిద్ధి తప్పకుండా లభిస్తుంది.

అందరు ఎగరగల్గుతున్నారా? ఉన్నతమైన బాబాకి ప్రియమైన పిల్లలుగా అయ్యారు. ఇక నడవవలసిన అవసరం ఏముంది? ఎగరడమే. మార్గంలో నడిచేటప్పుడు అక్కడక్కడ మధ్య మధ్యలో విఘ్నాలు వస్తాయి కానీ ఎగరటంలో విఘ్నాలు ఉండవు. అందరు ఎగిరే పక్షులు, జ్ఞానం మరియు యోగం యొక్క రెక్కలు అందరినీ బాగా ఎగిరింప చేస్తున్నాయి. ఎగురుతూ - ఎగురుతూ అలసిపోవటం లేదు కదా! అందరికీ అథక్ భవ (అలసిపోనివారిగా అవ్వండి) అనే వరదానం లభించింది. విషయం కూడా చాలా సహజమైనదే. అనుభవం చేసుకోవటం మరియు అనుభవం వినిపించడం. అనుభవం చెప్పటం చాలా సహజంగా ఉంటుంది కదా! మీ విషయాలే చెప్తున్నారు. కనుక చాలా సహజం. సంబంధీకుల యొక్క విషయం వినిపించడంలో కష్టం ఏమి ఉంది! కేవలం రెండు విషయాలు చెప్పండి.

ఒకటి - మీ పరివారం యొక్క అంటే సంబంధం యొక్క విషయం మరియు రెండు - ప్రాప్తి యొక్క విషయం. అందువలనే బాప్ దాదా సదా పిల్లలను సంతోషంగానే చూస్తారు. రోజంతటిలో ఎప్పుడైనా ఏకరసస్థితికి బదులు ఇతర రసనలు ఆకర్షితం చేయటం లేదు కదా? ఏకరసంగా అయిపోయారా? నష్టోమోహ స్మృతి స్వరూపంగా అయిపోయారా? అంటే గీతాయుగం సమాప్తి అయిపోవాలి, అందరు జ్ఞానం యొక్క ప్రాలబ్దంలోకి వచ్చేసారు కదా! స్మృతి స్వరూపంగా అవ్వటమే - జ్ఞానం యొక్క ప్రాలబ్దం. కనుక ఇప్పుడు పురుషార్ధం సమాప్తి అయిపోయింది. ఏదైతే స్వ స్వరూపం యొక్క వర్ణన చేస్తున్నారో ఆ సర్వగుణాలు అనుభవం చేసుకుంటున్నారు కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనంద స్వరూపం అయిపోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రేమ స్వరూపం అయిపోండి. ఏ స్వరూపం కావాలంటే, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఆ స్వరూపంలో స్థితులవ్వగల్గుతున్నారా? బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అవే పిల్లల యొక్క గుణాలు. ఏదైతే బాబా యొక్క కర్తవ్యం ఉందో అదే పిల్లల కర్తవ్యం. బాబా యొక్క స్థితి ఏదైతే ఉందో అదే పిల్లల యొక్క స్థితి. దీనినే సంగమయుగీ ప్రాలబ్దం అంటారు. కనుక ప్రాలబ్ధిలా లేక పురుషార్థిలా? ప్రాప్తి స్వరూపంగా అయిపోయారా?ప్రాప్తి పొందాలి కానీ అవ్వటం లేదు, ఎలా అవుతుంది? అనే బాష మారిపోయింది కదా ? ఈరోజు భూమి పైన, రేపు ఆకాశంలో ఇలా వస్తూ, వెళ్తూ లేరు కదా ? ఈ రోజు ప్రశ్నలలో, రేపు బిందువు పెట్టటంలో ఇలా లేరు కదా? ఏకరసం అంటే ఒకే సంపన్న మూడ్ లో ఉండేవారు. మూడ్ కూడా మారకూడదు. బాప్ దాదా వతనం నుండి చూస్తున్నారు - కొంతమంది పిల్లల యొక్క మూడ్ మారిపోతుంది. అప్పుడప్పుడు ఆశ్చర్యం యొక్క మూడ్, అప్పుడప్పుడు ప్రశ్నార్థకం యొక్క మూడ్, అప్పుడప్పుడు అలజడి యొక్క మూడ్ ఉంటుంది. అప్పుడప్పుడు భయం యొక్క, అప్పుడప్పుడు ధ్యాస యొక్క ఊయలలో ఊగటం లేదు కదా? మధువనం నుండి ప్రాప్తి స్వరూపంగా అయ్యి వెళ్ళాలి. మాటిమాటికి పురుషార్థం ఎంతవరకు చేస్తూ ఉంటారు! బాబా ఎలా ఉన్నారో పిల్లలు అలా ఉండాలి. బాబాకి మూడ్ ఆఫ్ అవుతుందా ఏమిటి? ఇప్పుడు బాబా సమానంగా అవ్వాలి. మీరు మాస్టర్ కదా! మాస్టర్ అంటే ఉన్నతంగా ఉండాలి. ఫిర్యాదులు అన్నీ సమాప్తి అయిపోయాయా? వాస్తవానికి విషయం చిన్నదిగానే ఉంటుంది. కానీ ఆలోచించి - ఆలోచించి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుంటున్నారు. ఆలోచించే విధానాన్ని అనుసరించి ఆ విషయాన్ని చిన్నది నుండి పెద్దదిగా చేసుకుంటున్నారు. ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు జరిగింది అని ఆలోచించకండి. పేపర్ వచ్చింది అంటే దానిని పూర్తి చేయాలి కానీ పేపర్ ఎందుకు వచ్చింది అనే ప్రశ్న ఉంటుందా? వ్యర్థం మరియు మంచి రెండింటిని ఒక సెకనులో నిర్ణయించండి మరియు సెకనులో సమాప్తి చేయండి. వ్యర్ధం అయితే అర్ధకల్పం వరకు వ్యర్థ పేపర్ బాక్స్ లో వేసేయండి. వ్యర్థ పేపర్ బాక్స్ చాలా పెద్దది. జడ్జ్ గా అవ్వండి, వకీలుగా కాదు. లాయర్ చిన్న కేసుని పెద్దదిగా చేస్తారు. జడ్జ్ సెకనులో కేసుని అవునా, కాదా అని నిర్ణయం చేస్తారు. వకీలుగా అయితే నల్లకోటు వస్తుంది. ఒక సెకను యొక్క జడ్జ్ మెంట్ చేయాలి. ఇది బాబా యొక్క గుణమా, కాదా? కాకపోతే వ్యర్ధ పేపర్ బాక్స్ లో వేసేయండి. ఒకవేళ బాబా యొక్క గుణాలు అయితే మంచి యొక్క జమా బాక్స్ లో వేయండి. బాప్ దాదా ఉదాహరణ ఎదురుగా ఉంది కదా! కాపీ చేయటం అంటే అనుసరించడం. ఇక ఏ క్రొత్త మార్గం తయారుచేయకండి. క్రొత్త జ్ఞానాన్ని అవిష్కరించకండి. బాబా ఏదైతే వినిపిస్తున్నారో దాని స్వరూపంగా అవ్వాలి. విదేశీయులందరు 100% ప్రాప్తి పొందుతున్నారా! సంగమయుగం యొక్క ప్రాప్తి - బాబా సమానంగా అవ్వటం. భవిష్య ప్రాప్తి దేవతా పదవి. కనుక బాబా సమానంగా అయ్యి బాబా వెనువెంట ఆ స్టేజ్ పై కూర్చోవటాన్ని కొద్ది సమయం అనుభవం చేసుకుంటారు కదా! ఎవరైనా రాజా సింహాసనంపై కూర్చున్నారనుకోండి వారు కొద్ది సమయం కూర్చుంటారు కదా! ఇప్పుడిప్పుడే కూర్చుని ఇప్పుడిప్పుడే దిగిపోరు కదా! అలాగే సంగమయుగం యొక్క ప్రాప్తి - బాబా సమానమైన స్థితి అంటే సంపన్న స్థితి యొక్క సింహాసనాధికారిగా అవ్వటం. ఈ ప్రాప్తి అయితే పొందాలి కదా! చాలా సమయం యొక్క సంస్కారం ఇక్కడ నింపుకోవాలి. సంపన్న జీవితం తయారు చేసుకోవాలి. సంపన్నత కొన్ని ఘడియలు కాదు కానీ జీవితం ఉండాలి. ఫరిస్తా జీవితం, యోగీ జీవితం, సహజ జీవితం ఉండాలి. ఇప్పుడిప్పుడే పుట్టడం మరియు ఇప్పుడిప్పుడే చనిపోవటం దీనిని జీవితం అంటారా? జీవితం అనేది కొంచెం సమయమే ఉంటుందా? పొందాము అంటున్నారు ఏమి పొందారు? కేవలం ఎక్కుతూ - దిగుతూ ఉంటే శ్రమ పొందారా లేక ప్రాప్తిని పొందారా? బాబా సమానమైన జీవితాన్ని పొందారా! ఎప్పటి వరకు శ్రమ చేస్తారు! అర్దకల్పం అనేక రకాలైన శ్రమ చేసారు. గృహస్థ వ్యవహారం యొక్క, భక్తి సమస్యల యొక్క ఇలా ఎంత శ్రమ చేసారు! సంగమయుగం అయితే ప్రేమ యొక్క యుగం. శ్రమ యొక్క యుగం కాదు, కలుసుకునే యుగం. దీపం మరియు దీపపు పురుగులు కలుసుకునే యుగం. శ్రమ అంటున్నారు కానీ శ్రమ అనేది లేనే లేదు. పిల్లలుగా అవ్వటం శ్రమ అనిపిస్తుందా ఏమిటి! వారసత్వంగా లభించిందా లేక శ్రమతో లభించిందా! పిల్లలు శిరోకిరీటాలుగా ఉంటారు. పిల్లలు అంటే ఇంటికి అలంకారం. యజమాని అయిన బాబా యొక్క పిల్లలు యజమానిగా అవుతున్నారు. కనుక యజమానులైన మీరు ఎందుకు క్రిందకి వస్తున్నారు! మీ పేరు చూసుకోండి ఎంత ఉన్నతమైనదో? ఎంత శ్రేష్టమైనవారు? పేరు మరియు పని ఒకటే కదా! సదా బాబాతో పాటు శ్రేష్టస్థితిలో ఉండండి. అసలైన స్థానం అదే. మీ స్థానం ఎందుకు వదిలేస్తున్నారు? అసలైన స్థానాన్ని వదిలివేయటం అంటే భిన్న - భిన్న విషయాలలో భ్రమించడం. విశ్రాంతిగా కూర్చోండి, నషాతో కూర్చోండి, అధికారంగా కూర్చోండి. క్రిందకి వచ్చేసి మరలా ఏమి చేయము అంటున్నారు. అసలు క్రిందకి ఎందుకు వస్తున్నారు! ఏదైనా బరువు అనుభవం అయినా బరువు మీపై పెట్టుకోకండి. ఎప్పుడైతే నాది అనేది వస్తుందో అప్పుడు బరువు అనుభవం అవుతుంది. నేను ఏమి చేయను. ఎలా చేయను, చేయవలసి వస్తుంది ఇలా అనకండి. ఏమిటి మీరు చేస్తున్నారా? లేక కేవలం పేరు మీది. పని బాబాది ఉంటుందా! బాబాకి ఇచ్చిన బొమ్మ చూడండి ఆ బొమ్మ స్వయం నడుస్తుందా లేక ఎవరైనా నడిపిస్తున్నారా? విజ్ఞానశక్తి బొమ్మను నడిపించగలిగినప్పుడు బాబా నడిపించలేరా? పిల్లల యొక్క పేరుని ప్రత్యక్షం చేయడానికి బాబా పిల్లలని నిమిత్తం చేసారు. ఎందుకంటే బాబా నామ రూపాలకు అతీతుడు. బాబా ఎప్పుడైతే ఈ బరువులు అన్నీ నాకు ఇచ్చేయండి మీరు కేవలం నాట్యం చేయండి, ఎగిరిపోండి అంటే మరలా బరువు ఎందుకు ఎత్తుకుంటున్నారు? సేవ ఎలా జరుగుతుంది, ఉపన్యాసం ఎలా చెప్పాలి ఇటువంటి ప్రశ్నలే లేవు. కేవలం నిమిత్తంగా భావించి పవర్‌హౌస్ తో సంబంధం జోడించి కూర్చోండి. అప్పుడు చూడండి ఉపన్యాసం చెప్పగలరో, లేదో! వారు బొమ్మనే ఆడిస్తున్నారు, మీరు నోటిని నడిపించలేరా? మీ బుద్ధితో ప్లాన్లు ఆలోచించలేరా? ఎలా అనే మాట అన్నారు అంటే తీగకి రబ్బరు అడ్డు వచ్చినట్లే, అలసిపోతున్నారు - ఏమౌతుందో తెలియదు అని. బాబా నిమిత్తంగా చేసారు అంటే తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ ఏదైనా స్థానంలో 6-8 మందే ఉంటే, మరో స్థానం నుండి తీసుకురండి. బలహీనంగా ఎందుకు అవుతున్నారు? చక్రం తిరగండి. ఇరుగు పొరుగు స్థానాలకు వెళ్ళండి, చక్రం చాలా పెద్దది ఉంది. ఎక్కడైనా 8 మంది వచ్చినా తక్కువ కాదు. ఎందుకంటే మూలన దాగి ఉన్న పిల్లలను బయటికి తీసారు అంటే మీకు ఎంత గుణగానం జరుగుతుంది? బాబాతో పాటు నిమిత్తమైన ఆత్మకి కూడా ఆశీర్వాదాలు ఇస్తారు కదా! ఎక్కడైనా ఒక రత్నం వచ్చినా ఒకరికోసం అయినా వెళ్ళాలి కదా! లేక వదిలేస్తారా? అలా చేస్తే ఆ ఆత్మ వంచితం అయిపోతుంది. ఎంతమంది వస్తే అంత మందినే తీసుకురండి. మరలా ముందుకు వెళ్ళండి. ఇప్పుడైతే కేవలం విశ్వం యొక్క ఓ మూల వరకు చేరుకున్నారు. ఇంకా చాలామంది సింహాల్లాంటి వారు ఉన్నారు చాలా అడవి ఉంది. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికి కారణం ఏమిటి? బుద్ధిలో వ్యర్ధం నిండి ఉన్న కారణంగా ప్రేరణ రావటం లేదు. పరిశీలనా శక్తి పని చేయటం లేదు. ఎంత స్పష్టంగా ఉంటారో అంత ఏ వస్తువు ఏవిధంగా ఉందో ఆవిధంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు, ఏమిటి అనే విషయాల కారణంగా నిర్ణయ శక్తి, గ్రహించే శక్తి కార్యంలోకి రావటం లేదు. మరలా అలసిపోతున్నారు లేదా బలహీనం అయిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో అక్కడ దాగి ఉన్న రత్నం వచ్చింది అందుకే వెళ్ళారు కదా! ఒక్కరు కూడా రానటువంటి స్థానం ఎక్కడం లేదు. అక్కడక్కడ వారసులు వస్తారు, అక్కడక్కడ ప్రజలు వస్తారు, అక్కడక్కడ షాహుకారులు వస్తారు. అందరు కావాలి కదా! అందరు రాజుగా అయితే అవ్వరు. ప్రజలు కూడా కావాలి. ప్రజలను తయారు చేసే ఈ కార్యం నిమిత్తమైన వారే చేయాలి. లేక మీరు ఉన్నతకుటుంబీకులనే తయారు చేస్తారు, ప్రజలను బాబా తయారుచేస్తారా! ఇద్దరినీ తయారు చేయాలి కదా! కేవలం రెండు విషయాలు స్మృతి ఉంచుకోండి - 1. లైన్ (రేఖ) స్పష్టంగా ఉండాలి. 2. మర్యాదల యొక్క రేఖలలో ఉండాలి. ఒకవేళ రెండు విషయాలు బాగుంటే ఎప్పుడు బలహీనం అవ్వరు. ఎవరి సంబంధం అయితే బాబాతో మరియు నిమిత్త ఆత్మలతో మంచిగా ఉంటుందో వారు ఎప్పుడు అసఫలత పొందరు. కేవలం బాబాతోనే సంబంధం ఉండటం కూడా సరైనది కాదు, పరివారంతో కూడా కావాలి. ఎందుకంటే బాబా నుండి అయితే శక్తి లభిస్తుంది కానీ సంబంధం ఎవరితో ఉండాలి? కేవలం బాబాతోనేనా? రాజధాని అంటే పరివారంతో సంప్రదింపుల్లోకి రావాలి. మూడు సర్టిఫికెట్స్ తీసుకోవాలి, కేవలం ఒకటి కాదు.

1. బాబాకి ఇష్టమైనవారిగా అంటే బాబా యొక్క సర్టిఫికెట్. 2. లోకం యొక్క సర్టిఫికెట్ అనగా దైవీ పరివారం ద్వారా సంతుష్టత యొక్క సర్టిఫికెట్. 3. మనస్సుకి ఇష్టమైన వారిగా అంటే మీ మనస్సులో కూడా సంతుష్టత ఉండాలి. మీతో మీరు కూడా అయోమయం అవ్వకూడదు. చేయగలనో, నడవగలనో లేదో తెలియదు ఇలా అసంతుష్టం అవ్వకూడదు. కనుక మీ మనస్సుకి ఇష్టమైనవారిగా అంటే మనస్సు యొక్క సంతుష్టతా సర్టిఫికెట్. ఈ మూడు సర్టిఫికెట్స్ కావాలి. కనుక త్రిమూర్తి సర్టిఫికెట్స్ కావాలి. రెండింటి ద్వారా కూడా పని నడవదు. కొంతమంది మాతో మేము సంతుష్టంగా ఉన్నాము, బాబాతో కూడా సంతుష్టంగా ఉన్నాము అని భావిస్తున్నారు. ఇలా నడుస్తుంది అనుకుంటున్నారు కానీ కాదు, బాబా సంతుష్టంగా మరియు మీరు సంతుష్టంగా అయితే పరివారం సంతుష్టం అవ్వకపోవటం అనేది ఉండదు. పరివారం సంతుష్టం అవ్వడానికి చాలా చిన్న విషయం ఒకటి ఉంది - గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోండి. ఇది సదా ఉండాలి. గౌరవం యొక్క రికార్డ్ నిరంతరం ఉండాలి. ఎవరు ఏవిధంగా ఉన్నా మీరు దాత అయ్యి ఇస్తూ వెళ్ళండి. తిరిగి వారు మీకు ఇచ్చినా, ఇవ్వకపోయినా మీరు ఇస్తూ వెళ్ళండి. దీనిలో నిష్కామిగా అవ్వండి. నేను ఇంత ఇచ్చాను, వారైతే ఇవ్వలేదు, నేను 100 సార్లు ఇచ్చాను వారు ఒకసారి కూడా ఇవ్వలేదు అని అనకండి. దీనిలో నిష్కామిగా అయితే పరివారం స్వతహాగానే సంతుష్టం అవుతారు. ఈ రోజు కాకపోతే రేపు అయినా సంతుష్టం అవుతారు. మీరు ఇచ్చినది జమ అయిపోతూ ఉంటుంది, వారు జమ అయిన దాని ఫలాన్ని తప్పకుండా ఇస్తారు. మరియు బాబాకి ఇష్టమైన వారిగా అయ్యేటందుకు ఏమి చేయాలి? బాబా అయితే చాలా అమాయకుడు. బాబా ఎవరిని చూసిన అందరు చాలా, చాలా మంచివారు అంటారు. మంచివారు కాదు అనే దృష్టి అసలు రానే రాదు. ఒక్కొక్క పాండవుడు, ఒక్కొక్క శక్తి ఒకరి కంటే ఒకరు ముందు అంటారు. బాబాకి ఇష్టమైనవారిగా అయ్యేటందుకు - సత్యమైన మనస్సుకి బాబా రాజీ అవుతారు. ఈ విషయం స్మృతి ఉంచుకోవాలి. ఎవరైనా కానీ సత్యంగా ఉండాలి, సత్యత బాబాని జయిస్తుంది. మరియు మనస్సుకి ఇష్టమైనవారిగా అయ్యేటందుకు ఏమి చేయాలి? మన్మతంపై నడవకూడదు. మనస్సుకి ఇష్టమైన వారిగా అవ్వటం అది వేరే విషయం . మనస్సుకి ఇష్టమైన వారిగా అవ్వడానికి చాలా సహజ సాధనం - శ్రీమతం యొక్క రేఖలో ఉండండి. ఏ సంకల్పం చేసినా శ్రీమతం అనే రేఖలో ఉండాలి. మాట్లాడినా, కర్మ చేసినా రేఖ లోపల ఉండాలి. అప్పుడు సదా స్వయం కూడా సంతుష్టంగా ఉండగలరు, ఇతరులను కూడా సంతుష్టం చేయగలరు. సంకల్పం అనే గోరు కూడా బయటికి వెళ్ళకూడదు.

ఎంత సంలగ్నత, ఎంత ధృఢసంకల్పం ఉందో బాబాకి కూడా తెలుసు. కానీ మధ్యమధ్యలో కొద్దిగా నాజూకు అయిపోతారు. ఎప్పుడైతే నాజూకు అయిపోతారో అప్పుడు కొద్ధిగా అల్లరి చేస్తారు. ప్రేమయే వీరికి టికెట్ అందుకే వస్తారు, ప్రేమ అనే టికెట్ లేకుండా ఇక్కడి వరకు ఎందుకు వస్తారు. ఈ టికెట్‌యే మధువన నివాసీగా చేస్తుంది. ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. స్థాపన అయితే చేసారు కదా! స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి రెండింటి సమానత ఉంటే సదా వృద్ధి జరుగుతూ ఉంటుంది.

ఇది కూడా ఒక విశేషత చూసారు. చాలా సమయం వ్యక్తిగతంగా ఉన్నవారు కూడా సంఘటనలో నడుస్తున్నారు. ఇది కూడా చాలా మంచి పరివర్తన. ఒకొక్కరు వేరుగా ఉండేవారు 4-6 గురు కలిసి ఉంటూ సంస్కారాలు కలుపుకోవటం ఇది కూడా స్నేహానికి రిటర్న్. పాండవ భవనం, శక్తి భవనం సఫలంగా ఉన్నాయి. ఇది కూడా విశేషత. ఎకానమీగా (పొదుపు) ఉండటం మరియు ఏక్ నామీగా (ఒకే బాబా యొక్క పేరు) ఉండటం ఇది రిటర్న్ కదా! మీ శరీర నిర్వహణ మరియు సేవా నిర్వహణ రెండింటిలో సగం - సగం నడవటం - ఈ ఆవిష్కరణ కూడా మంచిగా చేసారు. డబుల్ కార్యం అయ్యింది కదా! సంపాదించుకున్నారు మరియు ఉపయోగించారు. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ తయారు అవ్వటంలేదు కానీ భవిష్యత్తుకి జమ అవుతుంది. బుద్ధి అయితే ఫ్రీగా ఉంది కదా? వచ్చింది మరియు ఉపయోగించారు. నిశ్చింతా చక్రవర్తులు. శక్తులు మరియు పాండవులు ఇద్దరికీ పరుగు పోటీ జరుగుతుంది. దీపం వెలిగించుకుని, వెలిగిస్తున్నారు. చాలా మంచి లక్ష్యం పెట్టుకున్నారు. భారతదేశంలో హ్యాండ్స్ తయారు చేయడానికి శ్రమ చేస్తున్నారు. విదేశంలో అయితే తయారైన హ్యాండ్స్ సహజంగా వస్తున్నారు. ఇది కూడా వరదానం. వెనుక వచ్చినవారికి ఇది లిఫ్ట్. ఇక్కడి వారికి బంధన కట్ చేసుకోవటంలో సమయం పడుతుంది మరియు వీరికి అయితే బంధనాలు కట్ అయిపోయే ఉన్నాయి. కనుక అది కూడా లిఫ్ట్ అయ్యింది కదా! ఇక కేవలం మనస్సు యొక్క బంధన ఉండకూడదు.

టీచర్స్ కూడా శ్రమ చేసారు. టీచర్‌గా అవ్వటం అంటే సేవ యొక్క బంధనలో బంధించబడటం. కానీ పేరుకి సేవ, ప్రాప్తి చాలా ఉన్నతమైనది. ఎందుకంటే పుణ్యాత్మగా అవుతున్నారు కదా! టీచర్ యొక్క అర్థమే మహాపుణ్యాత్మగా అవ్వటం. పుణ్యం యొక్క ఫలం అయితే భక్తిలో కూడా లభిస్తుంది. మరియు ఇక్కడ ప్రత్యక్షఫలం లభిస్తుంది. ఎంతగా సేవ చేస్తే అంత ఉల్లాసం, ఉత్సాహం మరియు ధైర్యం వస్తాయి మరియు జ్ఞానం యొక్క ముఖ్య రహస్యాలు లోలోపలే స్పష్టం అవుతాయి. కనుక సేవాధారిగా అవ్వటం అంటే ప్రాప్తి స్వరూపంగా అవ్వటం. అందువలనే అందరు ఫాలో చేస్తున్నారు మేము కూడా సేవాధారిగా కావాలి అని.

కేవలం టీచర్ అనుకుంటే అప్పుడప్పుడు టీచర్ కి కొద్దిగా అహంకారం వస్తుంది. కానీ మేము మాస్టర్ శిక్షకులం అని భావించండి. మాస్టర్ అనటం ద్వారా బాబా స్వతహాగానే స్మృతి వస్తారు. తయారుచేసేవారు స్మతి రావటం ద్వారా స్వతహాగానే నేను నిమిత్తం అనే స్మృతి స్వయంలో వస్తుంది. విశేషంగా మనం పుణ్యాత్మలం అనే స్మృతి ఉంచుకోండి. పుణ్యం యొక్క ఖాతా జమ చేసుకోవాలి మరియు చేయించాలి - ఇదే విశేషమైన సేవ. పాప ఖాతా రావణుడు జమ చేయించాడు మరియు పుణ్య ఖాతా బాబా నిమిత్త శిక్షకుల ద్వారా చేయిస్తున్నారు. కనుక పుణ్య కర్మ చేయాలి మరియు చేయించాలి. పుణ్మాత్మకి ఎప్పుడు పాపం యొక్క శాతం సంకల్పంలో కూడా ఉండదు. పాపం యొక్క సంకల్పం వచ్చినా పుణ్యాత్మగా కాలేరు. మాస్టర్ శిక్షకుల యొక్క అర్ధమే పుణ్య ఖాతా జమ చేసుకునేవారు మరియు చేయించేవారు. శిక్షకులను బాప్ దాదా తన సమానమైన వారు మరియు తన స్నేహితులు అనే రూపంలో చూస్తారు. స్నేహితులుగా ఎప్పుడు అవుతారు అంటే సమానంగా అవ్వాలి, సంస్కారాలు కలవాలి. ఎవరైతే నిమిత్తమైనవారిగా అవుతారో వారి సంకల్పం, మాట, కర్మలో బాబాయే కనిపిస్తారు. వారిని ఎవరు చూసినా వారి నోటి నుండి ఇదే వస్తుంది వీరు బాబా సమానం అని. పెద్దవారు పెద్దవారే, చిన్న పిల్లలు భగవంతునితో సమానం అంటారు కదా! ఈ విధంగా అనుభవం చేసుకోండి. బాబా అయితే బాబాయే కానీ పిల్లలు భగవంతునితో సమానం. ఇది ప్రత్యక్షంగా అనుభవం చేసుకుంటారు.

ప్రియస్మృతులు అయితే లభించాయి. మహిమా యోగ్యులైన పిల్లలకు బాబా ద్వారా ప్రతి సమయం ప్రియస్మృతులు లభిస్తాయి. ఇప్పుడు అయితే విధి విధానం ద్వారా ఇవ్వవలసి ఉంటుంది. ప్రియస్మృతులు ఇవ్వకుండా మీరు పెద్దవారిగా ఎలా అయ్యారు! ఈ ప్రియస్మృతులతోనే పెద్దవారిగా అయ్యారు. ప్రియస్మృతులే ముఖ్య పాలన. ఈ పాలన ఆధారంగానే మాస్టర్ గా అయ్యారు. విదేశీ పిల్లలు విశేషంగా ఏ క్రొత్త ప్లాన్ తయారు చేసారు? (ప్లాన్ వినిపించారు) అందరు నలువైపుల కాన్ఫరెన్స్ పెట్టారు. కాన్ఫరెన్స్ ద్వారా వి.ఐ.పి లను కలవటం జరుగుతుంది, జాలం వేయడానికి మంచి పద్దతి లభించింది. ప్రతి ఒక్కరి శుద్ధ సంకల్పాల ద్వారా ఆత్మల యొక్క ఆకర్షణ జరుగుతూనే ఉంటుంది, అందువలనే నలువైపుల అందరి సంకల్పం మరియు ప్లాన్ నలువైపుల పేరుని ప్రత్యక్షం చేస్తుంది. ఎంత తొందరగా విశేష ఆత్మలను సంపర్కంలోకి తీసుకువస్తారో అంత తొందరగా ధ్వని ప్రత్యక్షం అవుతుంది. ఎప్పుడైతే భారతదేశంలో ధ్వని వ్యాపిస్తుందో అప్పుడు సేవ సమాప్తి అయ్యింది అని భావించండి. ఒక వైపు ధ్వని వ్యాపిస్తుంది, రెండవ వైపు పరిస్థితులు పాడైపోతాయి.. రెండింటి కలయిక ఉంటుంది. అందువలనే సహజంగానే మేము ఏమి చేసాము అనేది మీరే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు త్వరత్వరగా తయారు చేయండి. విదేశంలో వినాశనం యొక్క సాధనాలు చాలా గొప్పగా తయారు చేస్తున్నారు కదా! అదేవిధంగా బాబా పేరుని ప్రత్యక్షం చేసేటందుకు, ధ్వని వ్యాపింపచేసేటందుకు స్థాపనకి నిమిత్తమైన మీరు కూడా మంచి ప్లాన్ తయారుచేయండి. ఇప్పుడు సందేశం లభించడం అనేది మిగిలి ఉంది. అందువలన వినాశనం యొక్క ధ్వని వ్యాపించడం లేదు. వారు కూడా ఏమౌతుంది అనే ఆలోచనలో ఉన్నారు. స్థాపన కారణంగా వినాశనం ఆగి ఉంది. వినాశనం యొక్క సాధనాలు బటన్ నొక్కగానే తయారైపోయే విధంగా ఉన్నాయి, అదేవిధంగా స్థాపన యొక్క తయారీ కూడా ఇంత శక్తిశాలిగా ఉండాలి. ఎవరు వచ్చినా సెకనులో ఏ ప్రాప్తి కావాలంటే ఆ ప్రాప్తి పొందాలి. సంకల్పం యొక్క బటన్ నొక్కాలి అంతే. కనుక దీని కోసం ప్లాన్ తయారుచేయండి. సంకల్పం ఇంత శక్తిశాలిగా ఉండాలి. కేవలం సదా ఒకే బాబా సంకల్పంలో ఉంటే సేవ స్వతహాగానే జరుగుతుంది. ఇప్పుడు ధ్యాస పెట్టవలసి వస్తుంది కానీ తర్వాత స్వతహాగా శక్తిశాలి స్థితి తయారైపోతుంది. అటువంటి బటన్ తయారైపోయిందా? టీచర్స్ ఏమని భావిస్తున్నారు? ఇప్పుడు కాన్ఫరెన్స్ చేయటం అంటే శస్త్రం ఉపయోగించటం మరియు అది బటన్ నొక్కడం. ఇప్పుడైతే మీరు ఆహ్వానం ఇవ్వవలసివస్తుంది, స్టేజ్ తయారు చేయవలసి వస్తుంది మరియు తర్వాత వారికి వారే వస్తారు. ఇప్పుడు వినడానికి వస్తున్నారు తర్వాత తీసుకోవడానికి వస్తారు. కొంచెం ఇవ్వండి, కొద్దిగా ఇవ్వండి అని అడుగుతారు. బటన్ నొక్కుతూ వెళ్ళిపోతారు మరియు స్టాంప్ పడిపోతూ ఉంటుంది - ప్రజలు, షాహుకారులు, మొదటి ప్రజలు, రెండవ నెంబర్ ప్రజలు ఇలా స్టాంప్ పడిపోతుంది, కనుక ఇప్పుడు ఇది చేయాలి.