జ్ఞానం యొక్క సారం - నేను మరియు నా బాబా.
బాప్ దాదా పిల్లలందరినీ సంపన్న స్వరూపంగా
తయారుచేసేటందుకు ప్రతీరోజు రకారకాలైన పాయింట్స్ చెప్తూ ఉంటారు. అన్ని పాయింట్స్
యొక్క సారం - అన్నింటినీ సారంలో ఇముడ్చుకుని బిందువు అవ్వండి. ఈ అభ్యాసం నిరంతరం
ఉంటుందా? ఏ కర్మ చేస్తున్నా నేను జ్యోతిర్బిందువును, ఈ కర్మేంద్రియాల ద్వారా
కర్మ చేయించేవాడిని అనే స్మృతి ఉంటుందా? ఈ మొదటి పాఠాన్ని స్వరూపంలోకి
తీసుకువచ్చారా? ఆదిలో కూడా ఇదే మరియు అంతిమంలో కూడా ఇదే స్వరూపంలో స్థితులవ్వాలి.
ఒక సెకను యొక్క జ్ఞానం, ఈ ఒక సెకను జ్ఞానం యొక్క స్వరూపంగా అయ్యారా?
విస్తారాన్ని ఇముడ్చుకోవడానికి ఒక సెకను యొక్క అభ్యాసం కావాలి. విస్తారంలోకి
రావటం ఎంత సహజమో అంతగానే సార రూపంలోకి రావటం సహజం అనిపిస్తుందా? సార స్వరూపంలో
స్థితులై విస్తారంలోకి రావాలి. ఈ విషయం మర్చిపోవటం లేదు కదా? సార స్వరూపంలో
స్థితులై విస్తారంలోకి రావటం ద్వారా విస్తారం యొక్క ఆకర్షణ ఉండదు. విస్తారాన్ని
చూస్తూ, వింటూ, వర్ణన చేస్తూ ఒక ఆటలా అనుభవం చేసుకుంటారు. ఈ విధమైన అభ్యాసం సదా
స్థిరంగా ఉండాలి. దీనినే సహజస్థితి అంటారు.
జ్ఞానంలోనైనా, అజ్ఞానంలోనైనా జీవితంలో ప్రతి కర్మలో
రెండు మాటలను ఉపయోగిస్తారు. అవి ఏమిటి? నేను మరియు నాది. ఈ రెండు మాటలలో జ్ఞానం
యొక్క సారం కూడా ఉంది. నేను జ్యోతిబిందు లేక శ్రేష్టాత్మను, బ్రహ్మాకుమారీ లేక
కుమారుడను మరియు నాకు ఒక శివబాబా తప్ప మరెవ్వరు లేరు, నా బాబా అనే దానిలో అన్నీ
వచ్చేస్తాయి. నా బాబా అంటే నా వారసత్వం అయిపోయినట్లే. కనుక ఈ నేను మరియు నాది ఈ
రెండు మాటలు పక్కా కదా! నా బాబా అనటం ద్వారా అనేక రకాల నాది అనేది దానిలో
ఇమిడిపోతాయి. కనుక రెండు మాటలు స్మృతిలోకి తీసుకురావటం కష్టమా లేదా సహజమా? ఇంతకు
ముందు కూడా ఈ రెండు మాటలు మాట్లాడేవారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కానీ
ఎంత తేడా ఉంది? నేను మరియు నాది ఈ మొదటి పాఠం మర్చిపోతున్నారా? చిన్న పిల్లవాడు
కూడా గుర్తు పెట్టుకోగలడు. మీరు జ్ఞానసాగరులు కదా! జ్ఞానసాగరులు అయిన మీరు రెండు
మాటలు జ్ఞాపకం ఉంచుకోలేరా ఏమిటి? ఈ రెండు మాటల ద్వారా మాయాజీత్ గా, నిర్విఘ్నంగా,
మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు. రెండు మాటలను మర్చిపోతే మాయ వేల రూపాలలో
వస్తుంది. ఈరోజు ఒక రూపంలో వస్తుంది, రేపు వేరే రూపంలో వస్తుంది. ఎందుకంటే మాయ
యొక్క నాది, నాది అనేది చాలా పెద్దది. కానీ నా బాబా అనుకుంటే ఒక్కరే. ఒకని ముందు
మాయ యొక్క వేల రూపాలు కూడా సమాప్తి అయిపోతాయి. ఈ విధంగా మాయాజీత్ గా అయిపోయారా?
మాయకి వీడ్కోలు ఇవ్వటంలో సమయం ఎందుకు పడుతుంది? సెకను యొక్క వ్యాపారం. దీనిలో
సంవత్సరాలు ఎందుకు పడుతుంది? వదిలేస్తే వదిలిపోతాయి. కేవలం నా బాబా దీనిలోనే
నిమగ్నం అయి ఉంటారు. మాటిమాటికి బాబా ఇదే పాఠం చదివించవలసి వస్తుంది. మీరు
ఇతరులకు చదివిస్తున్నారు అయినా కానీ మర్చిపోతున్నారా? ఇతరులకు చెప్తున్నారు -
స్మృతి చేయండి, స్మృతి చేయండి. మరి స్వయం ఎందుకు మర్చిపోతున్నారు? ఏ తారీఖుకి
అసలు మర్చిపోనివారిగా అవుతారు? అందరి తారీఖు ఒకటేనా లేక వేర్వేరా? ఇక్కడ
కూర్చున్న వారందరి తారీఖు ఒకటేనా? ఇతర విషయాలు సమాప్తి అయిపోయినట్లేనా! భలే
శుభవార్తలు వినిపించండి, సమస్యలు వినిపించకండి. మేళా లేదా ప్రదర్శిని యొక్క
ప్రారంభోత్సవ సమయంలో కత్తెరతో పూల మాల కట్ చేయిస్తారు కదా! అలాగే ఈ రోజు ఏమి
చేస్తారు? స్వయమే కత్తెర చేతిలోకి తీసుకోండి. కత్తెర యొక్క రెండు భాగాలు
కలిసినప్పుడే కట్ అవుతుంది కదా! అదేవిధంగా జ్ఞానం మరియు యోగం రెండింటి కలయిక
ద్వారా మాయా సమస్య యొక్క బంధనాలు సమాప్తి అవుతాయి, ఇప్పుడు ఈ శుభవార్త
వినిపించండి. ఈరోజు ఈ సమస్యల యొక్క బంధనాలను కట్ చేసే రోజు. ఒక సెకను యొక్క
విషయం కదా? తయారై ఉన్నారు కదా? ఎవరైతే ఆలోచించి ఈ బంధనాలను కట్ చేస్తాము అంటారో
వారు చేతులు ఎత్తండి? అంటే డబల్ విదేశీయులు అందరు తీవ్రపురుషార్థుల జాబితాలోకి
వచ్చేస్తారా! ఈ విషయం వినగానే అందరి ముఖం మారిపోయింది. అంటే సదాకాలికంగా
తయారైపోతే ఇంక ఎలా ఉంటుంది? అందరు నడుస్తూ తిరుగుతూ అవ్యక్తవతనం యొక్క ఫరిస్తాల
వలె కనిపిస్తారు. అప్పుడు సంగమయుగం ఫరిస్తాల యుగం అయిపోతుంది. ఈ ఫరిస్తాల ద్వారా
దేవతలు ప్రత్యక్షం అవుతారు. ఫరిస్తాల గురించి దేవతలు కూడా ఎదురుచూస్తున్నారు.
వారు కూడా మేము రావడానికి యోగ్యస్థితి తయారయ్యిందా అని చూస్తున్నారు. ఫరిస్తా
మరియు దేవతల యొక్క మేళా అంతిమ సమయంలో ఉంటుంది. ఫరిస్తాలైన మీకోసం దేవతలు వరమాల
పట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఫరిస్తాలను వరించేటందుకు. మీ కోసమే పదవి
ఎదురుచూస్తుంది. దేవతల యొక్క ప్రవేశం సంపన్న శరీరంలోనే ఉంటుంది కదా! కనుక మీరు
16 కళాసంపన్నంగా అయితే వారు వరమాల వేయాలి అని ఎదురు చూస్తున్నారు. ఎన్ని కళలు
తయారయ్యాయి. సూక్ష్మవతనంలో సంపన్న ఫరిస్తా స్వరూపం మరియు దేవతల కలయిక యొక్క
దృశ్యం చాలా బావుంటుంది, ఫరిస్తాలకు బదులు పురుషార్థీ స్వరూపంగా ఉంటే దేవతలు
కూడా దూరం నుండే చూస్తూ ఉంటారు. సమయ ప్రమాణంగా సమీపంగా వస్తూ వస్తూ కూడా
సంపన్నంగా అవ్వని కారణంగా ఉండిపోతారు. ఈ వరమాల ధరించే తేదీ కూడా నిర్ణయించాలి.
తర్వాత ఏ తేదీ ఉంటుంది? తేదీ నిర్ణయం అవ్వటం ద్వారా ఎటువంటి లక్ష్యమో అటువంటి
లక్షణాలు వచ్చేస్తాయి. ఆ తేదీ అయితే ఈరోజు అయిపోయింది. కనుక ఇది కూడా సమీపంగా
వచ్చేస్తుంది కదా! ఎందుకంటే నిర్విఘ్నభవ యొక్క స్థితి చాలా సమయం నుండి కావాలి.
అప్పుడే చాలా సమయం నిర్విఘ్నరాజ్యం చేస్తారు. ఇప్పుడు సమస్యలు మరియు సమాధానాల
జ్ఞానస్వరూపంగా అయిపోయారు. ఏదైనా విషయం ఇతరులను అడుగుతున్నారు, దానికంటే ముందే
ఙ్ఞానం ఆధారంగా ఇది ఇలా జరగాలి అని అర్థం చేసుకుంటున్నారు. మరలా ఇతరులను అడిగి
వారికి శ్రమని ఇవ్వడానికి బదులు, సమయం పోగొట్టుకోవడానికి బదులు, మీ యొక్క జ్ఞానం
యొక్క లైట్ మరియు మైట్ ఆధారంగా ఒక సెకనులో సమాప్తి చేసి ఎందుకు ముందుకు వెళ్ళటం
లేదు? కానీ జరిగేది ఏమిటంటే ఆ సమయంలో మాయ దూరం నుండే తన రాయిని వేసి నిర్బలంగా
చేసేస్తుంది. కానీ మీరు ఆ ఘడియలో సంబంధాన్ని మంచిగా చేసుకోండి. సంబంధాన్ని
మంచిగా చేసుకోవటం ద్వారా స్వతహాగా మాస్టర్ సర్వశక్తివాన్ గా అవుతారు.
మాయ బాబా సంబంధాన్నే బలహీనంగా చేసేస్తుంది, దానిని
సంభాళించుకోండి. ఎక్కడో ఒక చోట కనెక్షన్ (సంబంధం) లూజ్ అయ్యింది అంటే నిర్భలత
వచ్చింది అని అర్థం చేసుకోండి. ఎందుకు జరిగింది? ఏమి జరిగింది? అని ఆలోచించకండి.
ఎందుకు, ఏమిటి అదే దానికి బదులు సంబంధాన్ని మంచిగా చేసుకుంటే సమాప్తి అయిపోతుంది.
సహయోగం కోసం సమయం తీసుకోండి. యోగం యొక్క తరంగాలు, వాయుమండలం తయారు చేయడానికి
సహయోగం తీసుకోండి. పనికిరాని మరియు వ్యర్ధ విషయాల మరియు విస్తారంలోకి వెళ్ళే
విషయాలలో ఎవరినీ తోడు తీసుకోకండి. ఆది శుభచింతన అయితే ఇది వ్యర్ధచింతన అవుతుంది.
అన్ని సమస్యలకు మూల కారణం - సంబంధం లూజ్ అవ్వడమే. ఇది ఒకే విషయం. డ్రామాలో నాకు
పాత్ర లేదు, నాకు సహయోగం లభించలేదు, నాకు స్థానం లభించలేదు ఇవన్నీ వ్యర్ధ
విషయాలు. కేవలం సంబంధాన్ని మంచిగా చేసుకోండి. సర్వశక్తులు మీ ముందు తిరుగుతూ
ఉంటాయి. వాటికి ఎక్కడికి వెళ్ళడానికి ఖాళీయే ఉండదు. బాప్ దాదా ఎదురుగా వెళ్ళి
కూర్చోండి అప్పుడు సంబంధం జోడించేటందుకు బాప్ దాదాయే మీకు సహయోగి అవుతారు.
ఒకవేళ, ఒకటి, రెండు సెకనులు అనుభవం కాకపోయినా అలజడి అవ్వకండి. తెగిపోయిన
సంబంధాన్ని జోడించడానికి ఒకటి లేక రెండు సెకనులు పట్టినా ధైర్యాన్ని వదలకండి.
నిశ్చయం యొక్క పునాదిని కదుపుకోకండి, నిశ్చయాన్ని ఇంకా పక్కాగా చేసుకోండి. బాబా
నా వాడు మరియు నేను బాబా వాడిని ఈ ఆధారంగా నిశ్చయం యొక్క పునాదిని పక్కాగా
చేసుకోండి. బాబాని కూడా మీ నిశ్చయం యొక్క బంధనలో బంధించగలుగుతున్నారా! బాబా కూడా
వెళ్ళలేరు. అంత అధికారం ఈ సమయంలో పిల్లలకు లభించింది. మీ అధికారాన్ని,
జ్ఞానాన్ని ఉపయోగించండి. పరివారం యొక్క సహయోగాన్ని ఉపయోగించండి, ఫిర్యాదులు
తీసుకునిరాకండి, సహయోగం కూడా అడగకండి. ప్రోగ్రామ్ సెట్ చేసుకోండి, బలహీనంగా
అయ్యి వెళ్ళకండి, ఏమి చేయము? ఎలా చేయము? అని భయపడకండి. కానీ సంబంధం ఆధారంగా,
సహయోగం ఆధారంగా వెళ్ళిపోండి. సెకనులో మెట్లు ఎక్కడం, సెకనులో మెట్లు దిగటం ఈ
సంస్కారాన్ని పరివర్తన చేసుకోండి. బాదా చూసారు డబల్ విదేశీయులు చాలా తొందరగా
క్రిందకి వస్తున్నారు, చాలా తొందరగా పైకి వెళ్తున్నారు. నాట్యం కూడా బాగా
చేస్తారు. కానీ భయపడే నృత్యం కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా
పరివర్తన చేయండి. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా ఉండి కూడా మరలా ఎందుకు ఈ నాట్యం
చేస్తున్నారు?
సత్యత మరియు స్వచ్ఛత యొక్క లిఫ్ట్ కారణంగా చాలా
ముందుకు వెళ్తున్నారు. ఈ విశేషత నెంబర్ వన్ విశేషత. ఈ విశేషత చూసి బాప్ దాదా
సంతోషిస్తున్నారు. ఇప్పుడు కేవలం భయపడే నాట్యం సమాప్తి చేయండి, చాలా ముందుకు
వెళ్ళిపోతారు. చాలా ముందు నెంబర్ తీసుకుంటారు. ఈ విషయం అందరికీ పక్కాగా ఉంది -
లాస్ట్ సో పాస్ట్, పాస్ట్ సో ఫస్ట్. (చివర వచ్చినా ముందుకు వెళ్ళిపోవచ్చు మరియు
వేగంగా వెళ్ళి మొదటి నెంబర్ తీసుకోవచ్చు) సంతోషం యొక్క నాట్యం చేయండి. బాబా
యొక్క చేతిని వదిలేస్తే వీరు ఎక్కడికి వెళ్తున్నారో అని బాబా అనుకుంటారు, ఇది
బాబాకి ఇష్టం అనిపించటం లేదు. బాబా చేతిలో చేయి ఉంటే భయపడే నాట్యం ఉండదు. మాయ
యొక్క చేయి పట్టుకుంటే ఈ నాట్యం చేస్తారు. బాబాకి మనతో ఎంత ప్రేమ ఉంది. అంటే
ఇతరులతో వెళ్ళటం బాబాకి చూడాలనిపించటం లేదు. బాబాకి తెలుసు ఎంతో భ్రమించి, అలజడి
అయ్యి బాబా దగ్గరికి చేరుకున్నారు. ఇక మిమ్మల్ని అయోమయం ఎలా అవ్వనిస్తారు?
సాకారంలో కూడా చూసారు కదా పిల్లలు స్థూలంగా ఎక్కడికైనా వెళ్తుంటే కూడా రండి
పిల్లలు, రండి పిల్లలు అనేవారు. ఎప్పుడైనా మాయ తన రూపం చూపిస్తుంటే ఈ మాట స్మృతి
ఉంచుకోండి. అమృతవేళ స్మృతిని శక్తిశాలిగా చేసుకునేటందుకు మొదట మీ యొక్క
స్వరూపాన్ని శక్తిశాలిగా చేసుకోండి. బిందురూపంలో కూర్చోండి లేదా ఫరిస్తా
స్వరూపంలో కూర్చోండి. మీరు స్వరూపాన్ని పరివర్తన చేయటం లేదు. కేవలం బాబాని ఆ
స్వరూపంలో చూస్తున్నారు. బాబాని బిందురూపంలో లేదా ఫరిస్తా రూపంలో చూడడానికి
ప్రయత్నం చేస్తున్నారు, కాని ఎప్పటి వరకు స్వయం ఆ స్వరూపాన్ని తయారు చేసుకోరో
అప్పటి వరకు కలయిక జరుపుకోలేరు. కేవలం బాబాని ఆ స్వరూపంలో చూడడానికి ప్రయత్నం
చేస్తున్నారు. ఇది భక్తిమార్గంతో సమానం. వారు దేవతలను శ్రేష్ట రూపంలో చూస్తారు,
స్వయం ఎలాంటివారో అలాగే ఉండిపోతారు. ఆ సమయంలో సంతోషంగా ఉంటారు లేదా కొద్ది సమయం
ఆ ప్రభావం పడుతుంది, కానీ అనుభూతి ఉండదు. అందువలన మొదట స్వ స్వరూపాన్ని
పరివర్తన చేసుకునే అభ్యాసం చేయండి. అప్పుడు చాలా శక్తిశాలి స్థితి అనుభవం
అవుతుంది.
మురళీ యొక్క సారం -
1. సార స్వరూపంలో స్థితులై విస్తారంలోకి రావటం ద్వారా విస్తారం ఆకర్షితం చేయదు.
2. నేను మరియు నాది ఈ రెండు మాటల యొక్క స్మృతి ద్వారా మాయాజీత్ గా, నిర్విఘ్నంగా,
మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు. 3. మాయ సంబంధాన్ని లూజ్ చేస్తుంది, అలజడి
చేస్తుంది - ఎందుకు, ఏమిటి అనే దానిని సమాప్తి చేసి సంబంధాన్ని మంచిగా చేసుకుంటే
అన్నీ మంచిగా అయిపోతాయి.
పాండవులతో - అందరూ మహాదాని కదా! ఎవరికైనా సంతోషం ఇవ్వటం ఇది ఉన్నతమైన కార్యం,
సేవ. పాండవులు సదా ఏకరసంగా, ఏకతలో ఉంటూ పొదుపు చేసేవారు కదా! పాండవులు అందరు
మహిమాయోగ్యులు మరియు పూజ్యనీయులు కూడా. భక్తులకు ఇప్పుడు కూడా పూజ్యనీయులే కానీ
ప్రత్యక్షంగా అవ్వటం లేదు. పాండవుల యొక్క పూజ కేవలం గణేశుడు మరియు హనుమంతుని
రూపంలోనే జరుగుతుందా? కాదు కానీ ఇంకా అనేకమంది దేవతలు ఉన్నారు. ఎవరైతే పొట్టలో
అన్ని విషయాలు దాచుకుంటారో వారే గణేశుడు. హనుమంతుడు అంటే తోకతో అసురీ
సంస్కారాలను అంటించేవారు. తోక కూడా సేవ కోసం ఉంది కావాలి - కావాలి అనే తోక కాదు.
పాండవుల యొక్క విశేషత విషయాన్ని లోపల ఉంచుకునేవారు, అక్కడ, ఇక్కడ
వ్యాపింపచేసేవారు కాదు. అందరు సంతుష్టంగా ఉన్నారు కదా! పాండవపతి మరియు పాండవులు
సదా కంబైండ్ గా ఉండాలి. పాండవపతి పాండవులు లేకుండా ఏమి చేయలేరు. ఏవిధంగా అయితే
శివశక్తులో అదేవిధంగా పాండవపతి. పాండవపతిని పాండవులు ఎలాగైతే ముందు పెట్టారో
అదేవిధంగా పాండవపతి పాండవులను ముందు పెట్టారు. కనుక కంబైండ్ స్వరూపం సదా స్మృతి
ఉంటుందా? ఎప్పుడు మిమ్మల్ని మీరు ఒంటరిగా అనుభవం చేసుకోవటం లేదు కదా? ఎవరొకరు
స్నేహితులు కావాలని అనుభవం చేసుకోవటం లేదు కదా! ఎవరికి చెప్పము, ఎలా చెప్పము అని
ఆలోచించటం లేదు కదా! ఎవరైతే కంబైండ్ రూపాన్ని అనుభవం చేసుకుంటారో వారి ముందు
బాప్ దాదా సాకారంలో సర్వ సంబంధాలతో ఎదురుగా వస్తారు. ఎంత సంలగ్నత ఉంటుందో అంత
త్వరగా బాబా ఎదురుగా వస్తారు. బాబా నిరాకారుడు, ఆకారుడు ఎలా మాట్లాడుతారు
అనుకోకండి. పరస్పరం మాట్లాడటంలో సమయం పడుతుంది. వారి కోసం వెతకవలసి ఉంటుంది.
బాబాని వెతకవలసిన లేదా కలుసుకోవడానికి సమయం ఉపయోగించవలసిన అవసరం లేదు. ఎక్కడ
పిలిస్తే అక్కడకి హాజరు అవుతారు. ఈ అనుభవం అవుతుందా? ఇప్పుడు ఏవిధంగా అయితే
ప్రత్యక్షంగా అనుభవం చేసుకుంటున్నారో అదేవిధంగా రోజు రోజుకి బుద్ధి ద్వారా కాదు,
ఎదురుగా అనుభవం చేసుకుంటారు - బాప్ దాదా వచ్చారు, ఎదురుగా వచ్చి చేయి
పట్టుకున్నారు. అనే అనుభవం అవుతుంది. అయితే దీని కొరకు - ఒక బాబా తప్ప మరెవ్వరు
లేరు అనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. అప్పుడు ఏవిధంగా అయితే సేవకులు తిరుగుతూ
ఉంటారో అదేవిధంగా బాప్ దాదా కళ్ళ ముందు నుండి తొలగరు. అప్పుడప్పుడు హద్దు యొక్క
వైరాగ్యం రావటం లేదు. బేహద్ వైరాగ్యం అయితే ఉండాలి. అందరు యజ్ఞ సేవ యొక్క పెద్ద
భాధ్యత అయితే తీసుకున్నారు. ఇప్పుడు కేవలం మేమందరం ఒకటే, మా అందరి యొక్క పని
ఒకటే ఇది ప్రత్యక్షంగా చూపించాలి. ఇప్పుడు ఒక పాట తయారు చేయాలి. అది ఏమిటి? అది
నోటి యొక్క పాట కాదు. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునే రికార్డ్ తయారుచేయాలి. ఈ పాట
అప్పుడు నలువైపుల మ్రోగుతుంది. గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. చిన్నవారికి
కూడా గౌరవం ఇవ్వాలి, పెద్ద వారికి కూడా గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ఈ గౌరవం యొక్క
రికార్డ్ తయారుచేయాలి. ఇప్పుడు నలువైపుల ఈ రికార్డ్ యొక్క అవసరం ఉంది.
స్వ ఉన్నతి మరియు విశ్వ ఉన్నతి రెండింటి ప్లాన్ వెనువెంట ఉండాలి. దైవీగుణాల
యొక్క గొప్పతనాన్ని మననం చేయండి. ఒకొక్క గుణాన్ని ధారణ చేయటంలో ఏమి సమస్య
వస్తుంది, దానిని సమాప్తి చేసి, ధారణ చేసి నలువైపుల సువాసన వ్యాపింపచేయండి,
అందరు అనుభవం చేసుకోవాలి. అర్థమైందా!