07.04.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మననశక్తి ద్వారా సర్వ శక్తుల స్వరూపం యొక్క అనుభూతి.

ఈరోజు బాప్ దాదా కల్పపూర్వపు తన ప్రియమైన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఏవిధంగా అయితే బాబా అతి స్నేహంతో పిల్లలను స్మృతి చేస్తున్నారో అదేవిధంగా పిల్లలు కూడా సదా బాబాని స్మృతి చేయటం మరియు బాబా యొక్క శ్రేష్ఠ మతంపై నడవటంలో నిమగ్నం అయ్యి ఉన్నారు. బాప్ దాదా పిల్లల యొక్క సంలగ్నత, పిల్లల యొక్క హృదయం లేక ప్రాణం, ప్రేమ లేక దయ సదా సేవ యొక్క సంలగ్నత చూసి ఆ విధమైన పిల్లలకు అవకాశం ఇస్తున్నారు. పిల్లల భాగ్యం వెనుక ఉన్న త్యాగాన్ని చూసి బాప్ దాదా పిల్లల త్యాగానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. పిల్లలందరికీ ఒకే సంకల్పం ఉంది - బాబా సమానంగా అవ్వాలి లేదా స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి అనే సంలగ్నత చూసి బాప్ దాదా సంతోషపడుతున్నారు. ఎలా ఉండేవాళ్ళం మరియు ఎలా తయారయ్యాం - ఈ తేడాను స్మృతిలో ఉంచుకుంటూ అందరూ ఈశ్వరీయ నషాలో ఉంటున్నారు. దీనిని చూసి బాప్ దాదా కూడా నషాతో చెప్తున్నారు - ఓహో సంగమయుగీ పిల్లలూ ఓహో .... ఎంత అదృష్టవంతులు అంటే ఇప్పటి అంతిమ జన్మ వరకు కూడా మస్తకంలో మహిమ ద్వారా, నోటి యొక్క పాటల ద్వారా మరియు చేతుల యొక్క చిత్రాల ద్వారా, నయనాల యొక్క స్నేహం ద్వారా మీ అదృష్టం యొక్క చిత్రం గీస్తున్నారు. ఇప్పుడు కూడా మీ శ్రేష్ఠ ఆత్మల శుభఘడియను స్మృతిచేస్తున్నారు మరలా ఎప్పుడు వస్తారు అని. ఆహ్వానం యొక్క పొగ వ్యాపించి ఉంది. మీరు ఎంత అదృష్టవంతులంటే స్వయం బాబా మీ అదృష్టం యొక్క మహిమ చేస్తున్నారు. అంతిమ భక్తులయితే మీ చరణాలను కూడా పూజిస్తున్నారు. కేవలం మీ చరణాలలోకి తీసుకోండి అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇంత మహాన్ ఆత్మలు. అందువలనే బాప్ దాదా కూడా చూసి సంతోషిస్తున్నారు. సదా మీ ఈ శ్రేష్ఠ స్వరూపాన్ని, శ్రేష్ఠ అదృష్టం యొక్క రేఖని స్మృతిలో ఉంచుకోండి. దీని ద్వారా ఏమౌతుంది? సమర్థ స్మృతి ద్వారా, సంపన్నచిత్రం ద్వారా చరిత్ర కూడా సదా శ్రేష్ఠముగా అవుతుంది. ఏవిధమైన చిత్రమో ఆవిధమైన చరిత్ర అంటారు కదా! ఏవిధమైన స్మృతియో ఆవిధమైన స్థితి అంటారు కదా! సదా సమర్ధ స్మృతి ఉంచుకుంటే సమర్థ స్థితి స్వతహాగానే తయారవుతుంది. సదా మీ యొక్క సంపూర్ణ చిత్రాన్ని ఎదురుగా పెట్టుకోండి. దీనిలో సర్వగుణాలు, సర్వశక్తులు ఇమిడి ఉన్నాయి. ఈ చిత్రం పెట్టుకోవటం ద్వారా చరిత్ర స్వతహాగానే శ్రేష్ఠంగా అవుతుంది. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మననశక్తి తక్కువ అవుతుందో అప్పుడు శ్రమ చేయవలసి వస్తుంది. రోజంతా ఇదే మననం చేస్తూ ఉండండి, మీ యొక్క శ్రేష్ఠ చిత్రాన్ని ఎదురుగా పెట్టుకుంటే మననశక్తి ద్వారా శ్రమ సమాప్తి అయిపోతుంది. చాలా విన్నారు, వర్ణన కూడా చాలా చేస్తున్నారు. అయినప్పటికీ నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు తమని తాము నిర్భలంగా ఎందుకు అనుభవం చేసుకుంటున్నారు, శ్రమ ఎందుకు అనుభవం చేసుకుంటున్నారు? కష్టం అనే సంకల్పం ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏమిటి? విన్న తర్వాత మననం చేయటం లేదు. ఎలాగైతే శారీరక శక్తి కోసం ఆహారాన్ని అరిగించుకునే శక్తి చాలా అవసరమో అదేవిధంగా ఆత్మ శక్తిశాలిగా అవ్వడానికి మననశక్తి అంతే అవసరం. మననశక్తి ద్వారా, బాబా ద్వారా విన్న జ్ఞానం యొక్క అనుభవీగా అవుతారు. ఎలా అయితే అరిగించుకునే శక్తి ద్వారా భోజనం రక్తం రూపంలో శారీరకశక్తిగా మారుతుందో అదేవిధంగా జ్ఞానం యొక్క ప్రతి పాయింట్, మననశక్తి ద్వారా స్వయం యొక్క శక్తి తయారవుతుంది. ఆత్మ అనే మొదటి పాయింట్ విన్న తర్వాత మననశక్తి ద్వారా స్మృతి స్వరూపంగా అవుతారు. దాని ద్వారా - నేను యజమానిని అనే సమర్ధత వస్తుంది. ఈ అనుభవం సమర్ధ స్వరూపంగా తయారుచేస్తుంది. కానీ ఎలా తయారయ్యారు? మననశక్తి ఆధారంగా అయ్యారు. ఆత్మ అనే మొదటి పాయింట్ యొక్క అనుభవీ స్వరూపంగా అయ్యారు కదా! అదేవిధంగా డ్రామా యొక్క పాయింట్ - కేవలం డ్రామా అని చెప్పటం, వినటం వరకు కాదు కానీ ఈ పాయింట్ ద్వారానే నడుస్తూ, తిరుగుతూ మిమ్మల్ని మీరు హీరో పాత్రధారిగా అనుభవం చేసుకుంటున్నారు అంటే మననశక్తి ద్వారా అనుభవీ స్వరూపంగా అవ్వటమే విశేష ఆత్మిక శక్తి. అన్నింటికంటే ఉన్నతోన్నతమైన శక్తి - అనుభవీ స్వరూపం.

అనుభవీలు ఎప్పుడూ అనుభవం యొక్క అథార్టీతో నడుస్తారు, అనుభవీలు ఎప్పుడూ మోసపోరు. అనుభవీలు ఎప్పుడూ అలజడి అవ్వరు, వినినటువంటి విషయాల ద్వారా విచలితం అవ్వరు. అనుభవీల యొక్క ఒక్క మాట వేలమాటల కంటే కూడా ఎక్కువ విలువైనదిగా ఉంటుంది. అనుభవీలు సదా తమ అనుభవం యొక్క ఖజానాలలో నిమగ్నం అయ్యి ఉంటారు అంటే సాగరుని యొక్క లోతులోకి వెళ్ళి ఖజానాలతో సంపన్నంగా ఉంటారు. ఇలా మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవీలు సదా శక్తిశాలిగా, మాయాఫ్రూఫుగా, విఘ్నప్రూఫుగా, సదా అంగధుని సమానంగా కదిలించేవారిగా ఉంటారు కానీ వారు కదలరు. కనుక ఇప్పుడు ఏమి చేయాలో అర్థమైందా!

శరీరం యొక్క సర్వరోగాలకు కారణం ఏదో ఒక విటమిన్ యొక్క లోపం, అదేవిధంగా ఆత్మ యొక్క బలహీనతకు కారణం - మననశక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవీగా అయ్యే విటమిన్ యొక్క లోపం. వాటిలో కూడా ఎ,బి,సి... ఇలా రకరకాలుగా ఉంటాయి కదా! అదేవిధంగా ఇక్కడ కూడా ఏదోక విటమిన్ యొక్క లోపం వస్తుంది. ఎ - ఆత్మ యొక్క విటమిన్, బి - బాబా యొక్క విటమిన్, సి - (సర్కిల్) డ్రామా యొక్క విటమిన్ అంటే సృష్టిచక్రం. ఇలా ఏమైనా తయారు చేసుకోండి. దీనిలో అయితే తెలివైనవారే కదా! కనుక ఏ విటమిన్ లోపంగా ఉందో అని పరిశీలన చేసుకోండి. ఆత్మ అనుభూతి యొక్క లోపం ఉందా? పరమాత్మ సంబంధం యొక్క లోపం ఉందా? డ్రామా గుహ్యత యొక్క అనుభవం లోపంగా ఉందా? సర్వశక్తుల స్వరూపం యొక్క అనుభూతి లోపంగా ఉందా? చూసుకుని ఆ లోపాన్ని మననశక్తి ద్వారా తొలగించుకోండి. వినే స్వరూపం లేక ఉపన్యాసం చెప్పే స్వరూపం - కేవలం వీటి ద్వారా ఆత్మ శక్తిశాలిగా తయారవ్వదు. జ్ఞానస్వరూపం అంటే అనుభవీ స్వరూపం, అనుభవాలను పెంచుకోండి మరియు దానికి ఆధారం - మననశక్తి. మననం చేసేవారు స్వతహాగానే మగ్నస్థితిలో ఉంటారు. మగ్నస్థితిలో యోగం జోడించవలసిన అవసరం ఉండదు కానీ నిరంతర యోగం యొక్క అనుభూతి చేసుకుంటారు. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు అంటే ప్రేమ సాగరంలో లీనమై ఉంటారు. ఎవరూ వేరు చేయలేని విధంగా లీనమై ఉంటారు. కనుక శ్రమ నుండి కూడా విడిపించుకోండి. బాహర్ముఖత వదిలారు కనుక శ్రమ నుండి కూడా విడిపించుకోండి మరియు అనుభవాల యొక్క అంతర్ముఖ స్వరూపంలో సదా లీనమై ఉండండి. అనుభవాలకు కూడా సాగరం ఉంది. ఒకటి, రెండు అనుభవాలు కాదు చాలా ఉన్నాయి. ఒకటి, రెండు అనుభవాలు చేసుకున్నాము అని ఇలా అనుభవం యొక్క చెరువులో స్నానం చేయకండి. సాగరుని పిల్లలు కనుక అనుభవాల యొక్క సాగరంలో ఇమిడిపోండి. చెరువు వంటి స్థితి కలిగిన వారి పిల్లలు కాదు కదా! ఈ ధర్మపితలు, మహాన్ ఆత్మలు అనబడేవారు చెరువులు. చెరువు నుండి వచ్చేసారు కదా! అనేక చెరువుల యొక్క నీరు త్రాగారు. ఇప్పుడు ఒకే సాగరునిలో లీనమైపోండి.

ఈవిధంగా సదా సమర్ధ ఆత్మలకు, సదా సర్వ అనుభవాల యొక్క సాగరంలో ఇమిడి ఉండే ఆత్మలకు, సదా తమ యొక్క సంపూర్ణచిత్రం మరియు శ్రేష్ఠ చరిత్రవంతులైన ఆత్మలకు, సదా శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు, సదా అంతర్ముఖి, సదా సర్వులను సుఖీగా తయారు చేసే ఆత్మలకు, ఈ విధంగా డబుల్ హీరో ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.