సత్యతా శక్తి ద్వారా విశ్వపరివర్తన.
ఈరోజు ఈ సభ ఏ సభ? ఇది విధి విధాతల యొక్క సభ. సిద్ధి
దాతల యొక్క సభ. ఈ విధంగా మిమ్మల్ని మీరు విధి విధాత లేక సిద్ధి దాతగా
భావిస్తున్నారా? ఈ సభ యొక్క విశేషతలను తెలుసుకుంటున్నారా? విధి విధాతల యొక్క
విశేషమైన శక్తి ఏమిటో తెలుసా? సత్యత అంటే రియాల్టీ. దీని ద్వారా సెకనులో
సర్వులను విధి ద్వారా సిద్ధి స్వరూపంగా చేస్తారు. సత్యతయే గొప్పది. సత్యతకే
విలువ ఉంది. ఆ సత్యత అంటే గొప్పతనం గురించి స్పష్ట రూపంలో తెలుసా? విశేషమైన విధి
సత్యత ఆధారంగానే ఉంది. మొదటి పునాది - స్వ జ్ఞానం అంటే మీ స్వరూపంలో సత్యతను
చూడండి. అసలు స్వరూపం ఏమిటి కానీ మిమ్మల్ని మీరు ఏవిధంగా భావించేవారు. అంటే
మొట్టమొదటి సత్యం - ఆత్మ స్వరూపం. ఈ సత్యం తెలియనప్పుడు మీలో మహానత ఉందా?
మహానుగా ఉండేవారా లేక మహాన్ అయిన వారి యొక్క పూజారిగా ఉండేవారా? ఎప్పుడైతే
మిమ్మల్ని మీరు తెలుసుకున్నారో అప్పుడు ఏవిధంగా అయ్యారు? మహాన్ ఆత్మగా అయ్యారు.
సత్యత యొక్క అధికారంతో ఇతరులకు కూడా చెప్తున్నారు - మనం ఆత్మలం అని. అదేవిధంగా
సత్యమైన తండ్రి యొక్క సత్య పరిచయం లభించడం ద్వారా అధికారంతో చెప్తున్నారు,
పరమాత్మ మా తండ్రి అని. వారసత్వం యొక్క అధికారంతో చెప్తున్నారు - బాబా మా వాడు
మరియు మేము బాబా వాళ్ళము అని. అదేవిధంగా మీ యొక్క రచన సృష్టిచక్రం యొక్క సత్య
పరిచయం యొక్క అధికారంతో వినిపిస్తున్నారు - ఇప్పుడు ఈ సృష్టిచక్రం సమాప్తి అయ్యి
మరలా రిపీట్ అవుతుంది అని. ఇది సంగమయుగం, కలియుగం కాదు అని చెప్తున్నారు. మొత్తం
విశ్వంలోని విద్వాంసులు, పండితులు, అనేక ఆత్మలు శాస్త్రాల ప్రమాణంగా ఇది కలియుగం
అని భావిస్తారు కాని పంచపాండవులైన మీరు అంటే కోట్లలో కొద్దిమంది ఆత్మలు
ప్రతిజ్ఞ చేస్తున్నారు ఇది కలియుగం కాదు, సంగమయుగం అని. ఏ అధికారంతో
చెప్తున్నారు? సత్యత యొక్క మహానత కారణంగా చెప్పగలుగుతున్నారు. విశ్వానికి సందేశం
ఇస్తున్నారు - రండి మరియు వచ్చి అర్ధం చేసుకొండి అని. నిద్రపోతున్న కుంభకర్ణులను
మేల్కొల్పి చెప్తున్నారు - సమయం వచ్చేసింది అని. సత్యమైన తండ్రి, సత్యమైన
శిక్షకుడు, సత్యమైన గురువు ద్వారా లభించిన సత్యతాశక్తి ఇదే. మీరు అనుభవం
చేసుకుంటున్నారు ఇదే సత్యత.
సత్యానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి సత్యం అంటే
నిజం, రెండు సత్యం అంటే అవినాశి. కనుక బాబా సత్యం కూడా మరియు అవినాశి కూడా.
అందువలనే బాబా ద్వారా ఏదైతే పరిచయం లభించిందో అది సత్యం అంటే నిజం మరియు అవినాశి.
భక్తులు కూడా బాబా యొక్క మహిమ చేస్తారు - సత్యం, శివం, సుందరం అని. సత్యం అని
భావిస్తారు మరియు అవినాశి అని కూడా భావిస్తారు. గాడ్ ఈజ్ ట్రూత్ అంటే సత్యమే
భగవంతుడు అని అంటారు. అంటే బాబా ద్వారా సత్యత యొక్క అధికారం లభించింది. ఈ
వారస్వతం కూడా లభిస్తుంది కనుక తీసుకోవాలి. సత్యత యొక్క అధికారం కలిగిన వారి
యొక్క మహిమ కూడా విన్నారు. వారి యొక్క గుర్తు ఏమి ఉంటుంది? సింధీ భాషలో ఒక
సూక్తి ఉంది - సత్యానికి తిరుగు లేదు.
ఇంకా అంటారు కదా - సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదు.
మిమ్మల్ని కూడా కదిలింపచేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు కదా! ఇది అబద్దం,
కల్పన అని చెప్తారు. కానీ మీరు సత్యత యొక్క మహానత యొక్క నషాలో సదా సంతోషం యొక్క
ఊయలలో ఊగుతూ ఉంటారు. ఎంతగా వారు చలింపచేయడానికి ప్రయత్నం చేసినా అంతగా ఏమౌతుంది?
మీది ఊయల, ఊపేకొలదీ ఇంకా ఊగుతూ ఉంటుంది. మిమ్మల్ని చలింపచేయటం లేదు మీ ఊయలని
ఊపుతున్నారు. కనుక వారికి ఇంకా ధన్యవాదాలు చెప్పండి, మేము బాబాతో పాటూ ఊగుతాము
మీరు ఇంకా ఊపండి అని. మిమ్మల్ని కదపటం లేదు కానీ ఊపుతున్నారు అని అనుభవం
చేసుకుంటున్నారా! కదలటం లేదు కానీ ఊగుతున్నారు కదా! సత్యతాశక్తి మొత్తం
ప్రకృతినే సతో ప్రధానంగా చేసేస్తుంది. యుగాన్నే సత్యయుగంగా తయారుచేసేస్తుంది.
సర్వ ఆత్మలకు సద్గతి యొక్క అదృష్టం తయారుచేస్తుంది. ప్రతి ఆత్మ మీ సత్యతాశక్తి
ద్వారా తమ యొక్క శక్తిననుసరించి తన ధర్మంలో, తన సమయంలో గతి తర్వాత సద్గతిలోనే
అవతరిస్తారు. ఎందుకంటే సంగమయుగంలో విధి విధాతల ద్వారా, అంతిమం వరకు కూడా బాబాని
స్మృతి చేసే విధి యొక్క సందేశం తప్పకుండా లభిస్తుంది. కొంతమందికి వాణి ద్వారా,
కొంతమందికి చిత్రాల ద్వారా, కొంతమందికి సమాచారాల (వార్తలు) ద్వారా, కొంతమందికి
మీ యొక్క శక్తిశాలి వైబ్రేషన్స్ ద్వారా, కొంతమందికి అంతిమ వినాశనలీల యొక్క అలజడి
ద్వారా, కొంతమందికి వైరాగ్యవృత్తి యొక్క వాయుమండలం ద్వారా లభిస్తుంది. ఇలా
సైన్స్ సాధనాలు అన్ని ఈ సందేశం ఇచ్చే కార్యంలో మీకు సహయోగం ఇస్తాయి.
సంగమయుగంలోనే ప్రకృతి సహయోగి అయ్యే పాత్రను ప్రారంభిస్తుంది. ప్రకృతిపతికి మరియు
మాస్టర్ ప్రకృతిపతులకు సర్వ ఏర్పాట్లు చేస్తుంది. అన్ని వైపుల నుండి అవకాశం
లభిస్తుంది. తర్వాత ఏమి చేస్తారు? భక్తిలో మహిమ చేసారు కదా! ప్రకృతి తత్వాలు
అన్నింటినీ దేవతా రూపంలో చూపించారు. దేవత అంటే ఇచ్చేవారు. అంటే అంతిమంలో ఈ
ప్రకృతి తత్వాలన్నీ మీకు సహయోగం ఇచ్చే దాతగా అయిపోతాయి. సముద్రం కూడా మీకు
సహయోగం చేస్తుంది. నలువైపుల ఉన్న సామాగ్రిని భారత భూమికి తీసుకువచ్చే సహయోగం
చేస్తుంది. అందువలనే సాగరుడు రత్నాలతో నింపిన పళ్ళాలు తెచ్చాడు అని చెప్తారు.
అలాగే భూమి కంపించి, శ్రేష్ఠ ఆత్మలైన మీ కోసం విలువైన వస్తువులన్నింటినీ
భారతదేశంలో చేర్చడానికి సహయోగి అవుతుంది. ఇంద్రుడు గురించి చెప్తారు కదా - అంటే
వర్షం కూడా భూమిని శుభ్రం చేయటంలో సహయోగం చేయడానికి హాజరవుతుంది. ఇంత మురికిని
మీరు శుభ్రం చేయరు! కనుక మొత్తం ప్రకృతి యొక్క సహయోగం లభిస్తుంది. కొన్ని గాలికి
ఎగిరిపోతాయి, కొన్నింటిని వర్షం తీసుకువెళ్ళిపోతుంది. అగ్ని గురించి తెలుసు కదా!
కనుక అంతిమంలో ఈ అన్నితత్వాలు శ్రేష్ఠ ఆత్మలైన మీకు సహయోగం ఇచ్చే దేవతగా అవుతాయి.
మరియు సర్వ ఆత్మలు కూడా అనుభవం చేసుకుంటారు. వారే తిరిగి భక్తిలో ఇప్పుడు సహయోగం
ఇచ్చిన కారణంగా అవి దేవతగా అయ్యాయి, ఇలా కర్తవ్యం యొక్క అర్థాన్ని మర్చిపోయి,
తత్వాలకు కూడా దేవతల లేదా మనుష్యుల రూపాన్ని ఇచ్చేస్తారు. సూర్యుడు తత్వమే కానీ
మనుష్యరూపం ఇచ్చేశారు. విధి విధాత అయ్యి ఏ కార్యం చేయాలో అర్ధమైందా!
వారిది విధాన సభ మరియు ఇక్కడ విధి, విధాతల యొక్క సభ.
అక్కడ సభకి మెంబర్స్ ఉంటారు. ఇక్కడ అధికారిగా మహాన్ ఆత్మలు ఉంటారు. కనుక
సత్యతశక్తి యొక్క గొప్పతనం ఎంత ఉన్నతమైనదో అర్థమైందా! సత్యత పరుసవేదితో సమానం.
ఎలా అయితే పరుసవేది లోహాన్ని కూడా బంగారంగా చేస్తుందో అదేవిధంగా మీ సత్యతా శక్తి
ఆత్మని, ప్రకృతిని, సర్వ సామాగ్రిని, సర్వ సంబంధాలను, సంస్కారాలను, ఆహారాన్ని,
వ్యవహారాన్ని అన్నింటిని సతోప్రధానంగా చేస్తుంది. తమోగుణం యొక్క నామరూపాలను
సమాప్తి చేస్తుంది. సత్యతాశక్తి మీ పేరుని, రూపాన్ని సత్యంగా అంటే అవినాశిగా
చేస్తుంది. అర్థకల్పం చైతన్యరూపం మరియు అర్ధకల్పం చిత్ర రూపం. అర్ధకల్పం ప్రజలు
మీ మహిమ పాడతారు. మరో అర్ధ కల్పం భక్తులు మహిమ చేస్తారు. మీ మాట సత్యవచన మహారాజు
రూపంలో మహిమ చేయబడుతుంది. ఈ రోజు వరకూ కూడా మీ అరమాట వారికి లభించినా కానీ తమని
తాము గొప్పవారిగా భావిస్తారు. మీ సత్యతాశక్తితో మీ దేశం కూడా అవినాశిగా అవుతుంది.
వేషం కూడా అవినాశిగా అవుతుంది. అర్ధకల్పం దేవత యొక్క వేషంలో ఉంటారు, అర్ధకల్పం
దేవతా వేషం యొక్క స్మృతిచిహ్నం నడుస్తుంది. ఇప్పుడు అంతిమం వరకు కూడా భక్తులు
మీ చిత్రాలను కూడా వస్త్రాలతో అలంకరిస్తూ ఉంటారు. మీ కర్తవ్యం మరియు చరిత్ర
అన్నీ సత్యం అయిపోయాయి. మీ కర్తవ్యానికి స్మృతిచిహ్నంగా భాగవతాన్ని తయారు చేసారు.
చరిత్రల యొక్క అనేక కథలు తయారుచేసారు. ఇవన్నీ సత్యం అయ్యాయి. దీని ఆధారంగా
సత్యతా శక్తి కారణంగా సత్యం అయ్యాయి. మీ యొక్క దినచర్య కూడా సత్యం అయ్యింది.
భోజనం తినటం, అమృతం త్రాగటం అన్ని సత్యం అయిపోయాయి. మీ చిత్రాలను కూడా
మేల్కొల్పుతారు, కూర్చోపెడతారు, అన్నివైపుల త్రిప్పుతారు, భోగ్ (నైవేధ్యం)
చేస్తారు, అమృతం త్రాగిస్తారు. ప్రతి కర్తవ్యానికి మరియు ప్రతి కర్మకి
స్మృతిచిహ్నం తయారయ్యింది. ఇంత శక్తి గురించి తెలుసా? ఇంత అధికారంతో అందరికి
ప్రతిజ్ఞ చేస్తున్నారా లేక సేవ చేస్తున్నారా? క్రొత్త క్రొత్త వారు వచ్చారు కదా!
మేము కొద్దిమందే అని భావించకండి సర్వశక్తివంతుడు మీ తోడుగా ఉన్నారు. సత్యతా
శక్తి కలిగిన ఆత్మలు. మీరు అయిదుగురే కాదు, విశ్వరచయిత మీ తోడుగా ఉన్నారు. ఇదే
నిశ్చయంతో చెప్పండి. అంగీకరిస్తారా, అంగీకరించరా? చెప్పనా, ఎలా చెప్పాలి...
ఇలాంటి సంకల్పాలు అయితే రావటం లేదు కదా? ఎక్కడ సత్యత మరియు సత్యమైన తండ్రి
ఉంటారో అక్కడ సదా విజయం ఉంటుంది. నిశ్చయం ఆధారంగా అనుభవీ మూర్తి అయ్యి
మాట్లాడితే సఫలత సదా మీ వెంటే ఉంటుంది.
మీరందరు వచ్చారు. అలాగే బాప్ దాదా కూడా వచ్చారు. మీకు
కూడా రావలసి వస్తుంది, బాప్ దాదాకి కూడా రావలసి వస్తుంది. బాబా కూడా పరకాయం (శరీరం)
లోకి రావలసి వస్తుంది కదా. మీరు ట్రైన్లో కూర్చుంటున్నారు. బాబా పరకాయంలో
కూర్చోవలసి వస్తుంది. కష్టం అనిపిస్తుందా? ఇప్పుడైతే మీ మనవలు, మనవరాళ్ళు అందరూ
రావలసిందే. భక్తులు కూడా రావలసిందే అప్పుడేమి చేస్తారు. భక్తులైతే మిమ్మల్ని
అసలు కూర్చోనివ్వరు. ఇప్పుడైతే విశ్రాంతిగా కూర్చున్నారు. తర్వాత విశ్రాంతి
ఇవ్వవలసి వస్తుంది. అయినప్పటికీ మూడు అడుగుల స్థలం అయితే లభించింది కదా!
భక్తులైతే నిల్చునే తపస్సు చేస్తున్నారు. మీ చిత్రాలను చూడడానికి భక్తులకి క్యూ
పెడుతున్నారు. కనుక మీరు కూడా అనుభవం చేసుకోండి. సీజన్ యొక్క ఫలం అయితే
తినడానికి వచ్చారు కదా! క్రొత్త క్రొత్త పిల్లలకు బాప్ దాదా విశేష స్నేహం
ఇస్తున్నారు. ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు లాస్ట్ వచ్చిన పిల్లలు ఫాస్ట్ గా
వెళ్ళిపోతారు, సదా సంలగ్నత ద్వారా విఘ్నవినాశకులుగా అయ్యి, విజయీరత్నాలుగా
అవుతారు అని. లౌకికంలో కూడా పెద్దవారి కంటే చిన్నవారు పరుగు పెట్టడంలో చురుకుగా
ఉంటారు. అలాగే మీరందరు కూడా బాగా పరుగుపెట్టి నెంబర్ వన్లోకి రండి. బాప్ దాదా
ఉత్సాహ, ఉల్లాసాలతో ఉండే ఇలాంటి పిల్లలకు సదా సహయోగిగా ఉంటారు. మీ యోగం మరియు
బాబా యొక్క సహయోగం ఈ రెండిటి ద్వారా ఎంతగా కావాలంటే అంతగా ముందుకు వెళ్ళవచ్చు.
ఇప్పుడు ఇంకా అవకాశం ఉంది తర్వాత ఈ సమయం కూడా సమాప్తి అయిపోతుంది.
ఈవిధంగా సదా సత్యత యొక్క మహానతలో ఉండేవారికి, సర్వ
ఆత్మలకు విధి, విధాత, సద్గతిదాత, విశ్వాన్ని స్వయం యొక్క సత్యతా శక్తి ద్వారా
సతో ప్రధానంగా చేసేవారికి, సదా స్నేహి మరియు సహయోగి పిల్లలకు బాప్ దాదా యొక్క
ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఈ మురళీ యొక్క సారం -
1. సత్యతయే మహానత మరియు సత్యతకే విలువ ఉంది. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు
మరియు సత్యమైన గురువు వచ్చి ఆత్మ యొక్క, పరమాత్మ యొక్క, సృష్టిచక్రం యొక్క సత్య
పరిచయాన్ని ఇచ్చి సత్యతశక్తిని నింపుతున్నారు.
2. సత్యతాశక్తి ప్రకృతిని సతోప్రధానంగా, యుగాన్ని సత్యయుగంగా చేస్తుంది. సర్వ
ఆత్మలకు సద్గతి యొక్క అదృష్టాన్ని తయారుచేస్తుంది.
3. దేవత అంటే ఇచ్చేవారు. అంతిమంలో ప్రకృతి తత్వాలు అన్ని మీకు సహయోగం ఇచ్చే
దేవతగా అవుతాయి. ఈ విధంగా సహయోగం ఇచ్చిన కర్తవ్యానికి గుర్తుగా భక్తిలో తత్వాలకు
మనుష్య రూపాన్ని ఇచ్చేస్తారు.