15.04.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


నెంబర్‌వన్ అదృష్టవంతుల యొక్క గుర్తులు.

ఈరోజు భాగ్యవిధాత బాబా తన యొక్క శ్రేష్టభాగ్యశాలి ఆత్మలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ ప్రయత్నం ద్వారా అదృష్టరేఖను ఎంత వరకు గీసుకుంటున్నారో చూస్తున్నారు. నెంబర్ వారీగా పురుషార్థం అనుసరించి ఉన్నారు, కొంతమంది నెంబర్ వన్ అదృష్టాన్ని తయారుచేసుకున్నారు, కొంతమంది రెండవనెంబర్ అదృష్టాన్ని తయారు చేసుకున్నారు. మొదటి నెంబర్ అదృష్టవంతులు సర్వప్రాప్తి స్వరూపంగా ఉంటారు. సర్వగుణాలలో అయినా, జ్ఞానం యొక్క ఖజానాలో అయినా, సర్వశక్తుల యొక్క ఖజానాలో అయినా, ప్రాప్తుల యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. ఇటువంటి అదృష్టవంతులకు జీవితంలో ఇప్పటి నుండే అప్రాప్తి వస్తువు అనేది ఏదీ ఉండదు. ప్రతి సెకను, ప్రతి సంకల్పంలో, ప్రతి శ్వాసలో లెక్కలేనంత ఖజానాతో ఉంటారు. అటువంటి ఆత్మల జీవితంలో ప్రతి అడుగులో ఎగిరేకళ యొక్క అనుభూతి అవుతుంది. నలువైపుల అనేక రకాల ఖజానాలు కనిపిస్తాయి. ప్రతి ఆత్మ స్నేహంతో అనాది స్వరూప సంబంధంలో తమ వారిగా అనుభవం చేసుకుంటారు. ప్రతి ఆత్మ ఒకే బాబా యొక్క సంతానం కనుక సోదరులుగా అనిపిస్తారు. ప్రతి ఆత్మ పట్ల ఇదే శుభభావన, శుభకామన ప్రత్యక్ష రూపంలో ఉంటుంది - సర్వ ఆత్మలు శాంతిగా, సుఖీగా అవ్వాలి అని. బేహద్ పరివారం మరియు బేహద్ స్నేహం ఉంటుంది. హద్దులో ఉంటే దు:ఖం ఉంటుంది, బేహద్దులో దు:ఖం ఉండదు. ఎందుకంటే బేహద్దులోకి రావటం ద్వారా బేహద్ సంబంధం, బేహద్ జ్ఞానం, బేహద్ వృత్తి, బేహద్ ఆత్మిక స్నేహం ఇవి దుఃఖాన్ని సమాప్తి చేసి సుఖస్వరూపంగా తయారు చేస్తాయి. ఆత్మిక జ్ఞానం అనగా ప్రతి ఆత్మ యొక్క, కర్మ కథ యొక్క, సంస్కారాల యొక్క జ్ఞానమే (లైట్) కాకుండా శక్తి (మైట్) కూడా ఉంటుంది. అందువలన ఏది చూస్తున్నా, వింటున్నా, సంప్రదింపుల్లో, సంబంధంలోకి వస్తూ, ప్రతి కర్మలో అతీతంగా మరియు అతి ప్రియంగా ఉంటారు. అతీతంగా మరియు ప్రియంగా అయ్యే సమానత ఉంటుంది. ఏ సమయంలో అతీతంగా అవ్వాలి, ఏ సమయంలో ప్రియంగా అవ్వాలి - ఈ పాత్ర అభినయించే విశేషత ఆత్మని సుఖీగా మరియు శాంతిగా చేస్తుంది. అత్మిక సంబంధం ఉన్న కారణంగా, బుద్ధి ఏకాగ్రంగా ఉన్న కారణంగా నిర్ణయ శక్తి, ఎదుర్కునే శక్తి, ఇముడ్చుకునే శక్తి ఇలా సర్వశక్తులు ఉన్న కారణంగా ప్రతి ఆత్మ యొక్క పాత్ర మరియు తమ యొక్క పాత్ర తెలుసుకుని పాత్రలోకి వస్తారు. అందువలనే అచంచలంగా మరియు సాక్షిగా ఉంటారు. ఈ విధమైన అదృష్టవంతులైన ఆత్మలు ప్రతి సంకల్పం మరియు కర్మలో, ప్రతి విషయాన్ని త్రికాలదర్శి స్థితిలో స్థితులై చూస్తారు. అందువలనే ప్రశ్నార్ధకం అనేది సమాప్తి అయిపోతుంది. ఇది ఎందుకు? ఇది ఏమిటి? ఇవి ప్రశ్నార్థకాలు, సదా ఫుల్‌స్టాప్ పెట్టాలి. అందరికి మూడు బిందువుల యొక్క తిలకం పెట్టబడి ఉంది కదా? దానిలో ఆశ్చర్యార్ధకం ఉండదు. కొత్తదేమి కాదు, ఏమయ్యింది అనరు, ఏమి చేయాలి అంటారు. వీరే నెంబర్ వన్ అదృష్టవంతులు. మీరందరు నెంబర్ వన్ అదృష్టవంతుల జాబితాలో ఉన్నారు కదా! అందరికీ ఫస్ట్ క్లాస్ అంటే ఇష్టం కదా! అందరు బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవడానికే వచ్చారు. చంద్రవంశీయులుగా అవ్వడానికి తయారేనా? సూర్యవంశీయులు అంటే ఫస్ట్ క్లాస్. సదా మీ శ్రేష్ట అదృష్టాన్ని స్మృతిలో ఉంచుకుని సమర్ధ స్వరూపంలో ఉండండి. ఇలాగే అనుభవం చేసుకుంటున్నారు కదా! బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అవే మన గుణాలు. సదా మీ అనాది, అసలైన స్వరూపం యొక్క స్మృతిలో ఉంటున్నారు కదా! మాయ యొక్క నకిలీ స్వరూపం యొక్క నకిలీ వేషం వేసేవారిగా అవ్వటం లేదు కదా! డ్రామా వేసేటప్పుడు నకిలీ ముఖాలు పెట్టుకుంటారు కదా! ఏవిధమైన గుణాలో, ఏవిధమైన కర్తవ్యమో ఆవిధమైన ముఖం పెట్టుకుంటారు. నకిలి స్వరూపం చూసి నవ్వు వస్తుంది కదా! అదేవిధంగా మాయ కూడా నకిలీ గుణాలు మరియు కర్తవ్యం యొక్క స్వరూపం తయారుచేస్తుంది. కొందరిని క్రోధిగా, కొందరిని లోభిగా చేస్తుంది. కొందరిని దు:ఖిగా, కొందరిని అశాంతిగా చేస్తుంది. అసలైన స్వరూపం ఈ విషయాలకు అతీతమైనది కనుక సదా ఆ స్వరూపంలో స్థితులయ్యి ఉండండి. ఏవిధంగా అయితే భక్తిలో చివరిగా మునగటం కూడా ఉంటుంది కదా. దానికి కూడా గొప్పతనం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా సాగరంలో మునిగేటందుకు వచ్చారు. నింపుకునేటందుకు వచ్చారు. అన్ని విధి విధానాలు ఇక్కడి నుంచే ప్రారంభం చేస్తున్నారు, సంగమయుగమే కలయిక యొక్క యుగం. ఈరోజు బెహద్ రోజు.

ఈవిధంగా శ్రేష్ట అదృష్టవంతులకు, సదా సంతోషం యొక్క ఖజానాతో సంపన్నంగా అయ్యేవారికి, సర్వులకు సుఖం యొక్క మార్గం చెప్పేవారికి, మాస్టర్ సుఖదాతలకు, సదా సర్వుల కష్టాలను తొలగించే వారికి, విఘ్న వినాశకులకు - ఈ విధమైన శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీజీతో బాప్ దాదా యొక్క మహావాక్యాలు - మహావీరుల శ్రేష్ట సేవ యొక్క స్వరూపం ఏమిటి? ఏవిధంగా అయితే సర్వశక్తులు చిత్రంలో కూడా చూపించారు ఈ అన్ని శక్తులలో విశేషంగా సేవార్ధం ఏ శక్తి కావాలి? అందరు వాణీ ద్వారా, భిన్న భిన్న సాధనాల ద్వారా ప్లాన్స్, ప్రోగ్రామ్స్ ద్వారా సేవ చేస్తున్నారు. మీ యొక్క విశేషమైన సేవ ఏమిటి? మీ పాత సృష్టి యొక్క చరిత్రలో ఉంది కదా - మొదట్లో పక్షుల ద్వారా సందేశం పంపించేవారు, అవి సందేశం ఇచ్చేసి మరలా తిరిగి వచ్చేసేవి. అలాగే మీ సేవ ఏమిటి? వారు పక్షుల ద్వారా సందేశం పంపించేవారు, మీరు సంకల్పశక్తి ద్వారా ఏ ఆత్మకైనా సేవ చేయలేరా! సంకల్పం అనే బటన్ నొక్కగానే అక్కడికి సందేశం చేరుకోవాలి. ఏవిధంగా అయితే అంత:వాహక శరీరం ద్వారా సహయోగం చేస్తున్నారో అదేవిధంగా సంకల్పశక్తి ద్వారా అనేక ఆత్మల సమస్యలను పరిష్కరించగలరు. మీ యొక్క శ్రేష్ట సంకల్పం ఆధారంగా వారి యొక్క వ్యర్థ లేక బలహీన సంకల్పాలను పరివర్తన చేయగలుగుతున్నారా! ఈ విశేషమైన సేవ సమయం అనుసరించి పెరుగుతూ ఉంటుంది. సమస్యలు ఏవిధంగా వస్తాయంటే స్థూలసాధనాలు కూడా సమాప్తి అయిపోతాయి. అప్పుడు ఏమి చేయాల్సి ఉంటుంది? స్వయం యొక్క సంకల్పాలను ఎంత శక్తిశాలిగా చేసుకోవాలంటే వాటి యొక్క ప్రభావం చాలా దూరం వరకు చేరుకోవాలి. ఎంత శక్తి ఉంటుందో అంత దూరం వరకు చేరుకుంటాయి. ఏవిధంగా అయితే వెలుగులో ఎంత శక్తి ఉంటే అంత దూరం వరకు చేరుకుంటుంది కదా! అదేవిధంగా సంకల్పంలో కూడా ఇంత శక్తి వస్తుంది మీరు ఇక్కడ సంకల్పం చేయగానే అక్కడ ఫలం లభిస్తుంది. ఏవిధంగా అయితే బాబా భక్తి యొక్క ఫలం ఇస్తున్నారో అదేవిధంగా శ్రేష్ట ఆత్మలైన మీరు పరివారంలో సహయోగం యొక్క ఫలం ఇస్తారు మరియు ఆ ఫలం రకరకాలైన అనుభవం చేయిస్తుంది, ఈ సేవ కూడా ప్రారంభం అవుతుంది.

క్రొత్త క్రొత్త వారిని చూసి, పరివారం యొక్క వృద్ధిని చూసి, సేవ యొక్క సిద్ధిని చూసి సంతోషం ఉంటుంది కదా! ఇక్కడ కూడా మీ యొక్క రాజధాని తయారు చేసుకుంటున్నారు. రాజధానిలో అన్ని రకాలైన ఆత్మలు కావాలి. సంప్రదింపుల్లో ఉండేవారు కూడా కావాలి, సేవాధారులు కూడా కావాలి, సంబంధీకులు కూడా కావాలి మరియు అధికారులు కూడా కావాలి. ఇప్పుడైతే ధ్వని వ్యాపిస్తుంది. ఇప్పుడు అందరు అక్కడికి, ఇక్కడికి వెళ్ళి ఈ ధ్వని ఎక్కడి ధ్వని అని ప్రయత్నం చేస్తున్నారు. వినిపిస్తుంది కానీ ఇప్పుడింకా స్పష్టంగా వినిపించడంలేదు. ఎక్కడినుండో ధ్వని వారికి వినిపిస్తుంది కానీ ఏ వైపు వెళ్ళాలి అనేది అర్ధం కావటం లేదు. ఎప్పుడైతే వాణీతో పాటు శ్రేష్ట సంకల్పం యొక్క శక్తి వారి వరకు చేరుకుంటుందో అప్పుడు వారికి స్పష్టంగా వినిపిస్తుంది. అప్పుడు ధ్వని స్పష్టంగా వినిపిస్తుంది, ఇప్పుడు ధ్యాస అనేది ప్రారంభం అయ్యింది.

సత్యయుగం యొక్క ఆది సంఖ్య యొక్క పరివారాన్ని మీ కళ్ళతో చూడగలరా, లేదా! లేదా స్వప్నంలో చూస్తారా? వార్తా పత్రికల ద్వారా వింటారా - ఏమవుతుంది? ఇప్పుడు ఒక వేయి మందిని కూడా ఉంచలేరు వారందరినీ ఎక్కడ ఉంచుతారు! బ్రాహ్మణజీవితంలో పరివారం అందరూ పరస్పరం చూసుకుంటారా లేక ఇంత పెద్ద పరివారం అని వింటారు. అంతేనా? అందరు మధువన భూమిలో కలిస్తే అలజడి అయిపోతుంది. సంఘటన యొక్క చిత్రం చూపించారు కదా అందరు వ్రేలు ఇచ్చారు అని. సూక్ష్మంలో అయితే ఇస్తారు కానీ ఇంత పెద్ద పరివారం అంటే పరివారాన్ని చూడాలి కదా! దీని కోసం ప్లాన్ తయారు చేసారా? సత్యయుగంలో అయితే కేవలం మీ యొక్క ప్రజలే ఉంటారు. ఇక్కడైతే మీ యొక్క భక్తులు కూడా వస్తారు. డబుల్ వంశావళి ఉంటుంది. భక్తులకు మా యొక్క ఇష్ట దేవతలందరు ఇక్కడే ఉన్నారు అని తెలిస్తే ఏమి చేస్తారు? వారు కూడా ఆగరు. ఇక్కడికే వచ్చేస్తారు. ఇప్పుడు కూడా కొంతమంది అలా వచ్చేస్తున్నారు కదా! మరి భక్తులైతే ఛాత్రకులుగా ఉంటారు.

బాప్ దాదా శక్తుల యొక్క ప్రత్యక్షత చూసి సంతోషిస్తున్నారు. సర్వశక్తివంతుడు గుప్తంగా ఉన్నారు మరియు శక్తులు ప్రత్యక్ష రూపంలో ఉన్నారు. కనుక శివుడు మరియు శక్తులను చూసి సంతోషిస్తున్నారు. బాప్ దాదా వతనం నుండి కూడా చూస్తూ ఉంటారు. ఎంత క్యూ పెడుతున్నారు ఇది కూడా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి చైతన్య మందిరాల బయట క్యూ ప్రారంభం అయిపోయింది కదా! పిల్లల యొక్క సేవ చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. బాబా కంటే కూడా లక్షరెట్లు ఎక్కువగా సేవ యొక్క మైదానంలోకి వచ్చారు మరియు ఇంకా వస్తారు కూడా!