02.10.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సదా కలయిక యొక్క ఊయలలో ఊగేటందుకు ఆధారం.

సర్వ అలజడుల నుండి విడిపించేవాడు, సర్వప్రాప్తి స్వరూపంగా తయారుచేసే జ్ఞానసాగరుడైన శివబాబా మాట్లాడుతున్నారు: -

ఈరోజు స్మృతిలో ఉండే నలువైపుల పిల్లలకు బాప్ దాదా సాకారంగా, లేదా ఆకారంగా సన్ముఖంగా చూస్తూ స్మృతికి జవాబుగా కోటిరెట్లు ప్రియస్మృతులు ఇస్తున్నారు. కొంతమంది తనువు ద్వారా, కొంతమంది మనస్సు ద్వారా కలయిక యొక్క సంకల్పంలో ఒకని స్మృతిలో స్థితులై ఉన్నారు. బాప్ దాదా అయితే ఖజానా ఇచ్చారు. సాకారం ద్వారా, ఆకార అవ్యక్త రూపం ద్వారా సర్వ ఖజానాలకు యజమానిగా చేసేసారు. ఎప్పుడైతే సర్వ ఖజానాలకు యజమానిగా అయ్యారో ఇక ఏమి మిగిలి ఉంది? ఏమైనా ఉందా? బాప్ దాదా యజమానులకు సలామ్ చేయడానికి వచ్చారు. చూడటంలో అయితే మాస్టర్ గా అయిపోయారు ఇక ఏమి మిగిలి ఉంది? విన్నదాని లెక్క తీయండి మరియు వినిపించిన వారి లెక్క తీయండి. చాలా విన్నారు, చాలా వినిపించారు. వింటూ వింటూ వినిపించేవారిగా కూడా అయిపోయారు. ఇతరులకి చెప్పేవారికి ఇంకా ఏమి చేప్పాలి? మీ పాట ఉంది కదా! అనుభవం యొక్క పాట పాడతారు - పొందవలసినదంతా పొందాము ఇక పొందవలసినది ఏముంది అని. ఇది ఎవరి పాట? బ్రహ్మాబాబాదా లేక బ్రాహ్మణులదా? మీ పాట ఇదే కదా? కనుక బాబా కూడా అడుగుతున్నారు - ఇక ఏమైనా మిగిలి ఉందా? అని. బాబా మీలో ఇమిడి ఉన్నారు, మీరు బాబాలో ఇమిడి ఉన్నారు, ఎప్పుడైతే ఇమిడి ఉన్నారో ఇక ఏమి మిగిలి ఉంది? ఇమిడిపోయారా లేక అవుతున్నారా? ఏమి అంటారు? నది మరియు సాగరుని యొక్క మేళా అయితే అయ్యింది కదా! ఇమిడిపోవటం అంటే కలయిక జరుపుకోవటం, కనుక కలయిక జరుపుకున్నారు కదా? సాగరుడు, గంగ నుండి వేరుగా లేరు, మరియు గంగ, సాగరం నుండి వేరుగా లేదు. గంగ మరియు సాగరుని యొక్క అవినాశి కలయిక. ఇమిడిపోయారు అంటే సమానంగా అయిపోయారు. సమానంగా అయ్యేవారికి బాప్ దాదా కూడా స్నేహంతో శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈసారి బాప్ దాదా కేవలం చూడడానికి వచ్చారు. యజమానుల యొక్క ఆజ్ఞను అంగీకరించి కలుసుకునేటందుకు వచ్చారు. యజమానులను కాదు అనలేరు కదా. అలాగే అనే పాఠం ద్వారా హజరు అయ్యారు. అలాగే తతత్వం యొక్క వరదానాన్ని బాప్ దాదా ఆదికాలం నుండి ఇస్తున్నారు. సంకల్పం మరియు స్వరూపం రెండింటిలో తతత్వం యొక్క వరదానీలు. ధర్మం మరియు కర్మ రెండింటిలో తతత్వం యొక్క వరదానీలు. ఈ విధమైన వరదానులు, సదా సమీపంగా మరియు సమానత యొక్క అనుభవీగా ఉంటారు. బాప్ దాదా ఇటువంటి సమీప మరియు సమానమైన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. అమృతవేళ నుండి రోజు యొక్క సమాప్తి సమయం వరకు కేవలం ఒక మాట ధర్మం మరియు కర్మలోకి తీసుకువస్తే సదా కలయిక యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. ఈ కలయిక యొక్క ఊయలలో ఊగుతూ ఉంటే ప్రకృతి మరియు మాయ రెండూ ఊయలను ఊపే దాసీగా అయిపోతాయి. సర్వఖజానాలు మీ శ్రేష్ట ఊయల యొక్క శృంగారంగా అయిపోతాయి. శక్తులను, గుణాలను శ్రమతో ధారణ చేయవలసిన అవసరం ఉండదు కానీ అవే స్వయం మీ అలంకరణగా అయ్యి మీ ఎదురుగా వస్తాయి. ఈ విధమైన కలయిక యొక్క ఊయలలో బాబా మరియు మీరు సమానంగా అంటే ఇమిడి ఉంటారు. ఈ ఊయలలో ఊగడానికి ఆధారం ఒకే మాట - బాబా సమానంగా అవ్వాలి. సమానంగా లేకపోతే ఇమడలేరు. ఒకవేళ ఇమడడం రాకపోతే సంగమయుగాన్ని పోగొట్టుకున్నట్లే. ఎందుకంటే సంగమయుగమే నది మరియు సాగరుని కలిపే మేళా. మేళా అంటే ఇమిడిపోవటం, కలయిక జరుపుకోవటం. కనుక ఇమడడం వస్తుందా? మేళా జరుపుకోకపోతే ఏమి చేస్తారు? అలజడి అవుతారు. అయితే కలయిక లేకపోతే ఝంజాటం. పిల్లలు అంటారు ఒంటరిగా ఉన్నాము అని, బాబా అంటారు అసలు ఒంటరిగా ఉండకూడదు అని. దేనిలో ఒంటరి అంటున్నారో దానిలో కూడా బాబా తోడు వస్తున్నారు. సంగమయుగమే కంబైండ్ గా ఉండే యుగం. బాబాతో అయితే వేరు కాలేరు కదా! సదా తోడుగా ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ఝంజాటంలో చిక్కుకుపోతున్నారు. అలజడులు అనేకం ఉంటాయి, ఒకటి కాదు. మేళా అనేది ఒకటే. మేళాలో ఉంటే అలజడి సమాప్తి అయిపోతుంది. ఇప్పుడైతే సంపన్నత యొక్క ప్రాలబ్దిగా అవ్వండి. అల్పకాలిక ప్రాలబ్ధాన్ని సమాప్తి చేసి సంపూర్ణత యొక్క, సంపన్నత యొక్క ప్రాలబ్దాన్ని అనుభవంలోకి తీసుకురండి.

ఈవిధంగా బాబా సమానంగా, సదా బాబా కలయిక యొక్క ఊయలలో ఊగేవారికి, పొందవలసినదంతా పొందాము అనే ప్రాప్తి స్వరూప ఆత్మలకు, సదా ప్రతి సంకల్పం, మాటలో, కర్మలో అలాగే అనేవారికి, ఈ విధమైన సర్వ శ్రేష్ట ఆత్మలకు, సాకారం ద్వారా, ఆకారం ద్వారా కలయిక జరుపుకునే దేశ విదేశాలలోని పిల్లలందరికీ పిల్లల నుండి యజమానులుగా అయ్యేవారికి సలామ్ మరియు ప్రియస్మృతులు వెనువెంట శ్రేష్ట ఆత్మలకు నమస్తే.