04.10.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంకల్పశక్తి యొక్క గొప్పతనం.

సర్వసిద్ధి స్వరూపంగా తయారుచేసే బాప్ దాదా మాట్లాడుతున్నారు : -

బాప్ దాదా పిల్లలందరికీ అంతిమస్థితి అంటే సంపన్న మరియు సంపూర్ణస్థితి యొక్క శక్తిశాలి స్థితిని అనుభవం చేయిస్తున్నారు. ఈ స్థితిలో - సదా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి, మాస్టర్ జ్ఞానసాగర స్థితి, సర్వగుణాలలో సంపన్న స్థితి. ప్రతి సంకల్పంలో, ప్రతి శ్వాసలో ప్రతి సెకను సాక్షి దృష్టి మరియు సదా బాబా యొక్క సాథీ స్థితి, సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క శ్రేష్ట ఆత్మల స్నేహం, సహయోగం యొక్క సాథీ స్థితి అనుభవం అవుతుంది. సైన్స్ సాధనాలు దూర వస్తువులను సమీపంగా అనుభవం చేయిస్తున్నాయి కదా!అదేవిధంగా దివ్యబుద్ధి ద్వారా ఎంత దూరంగా ఉన్న ఆత్మలనైనా సమీపంగా అనుభవం చేసుకుంటారు. ఏవిధంగా అయితే స్థూలంగా మీతో పాటు ఉన్న ఆత్మని స్పష్టంగా చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, సహయోగం ఇస్తున్నారు మరియు తీసుకుంటున్నారు. అదేవిధంగా అమెరికాలో ఉన్న ఆత్మ అయినా కానీ దివ్యదృష్టి ద్వారా అంటే దివ్యదృష్టి అనేది ట్రాన్స్ కాదు, కానీ ఆత్మీయతతో నిండిన దివ్యదృష్టి - ఈ దృష్టి ద్వారా స్వతహాగా ఆ ఆత్మలకు ఆత్మ మరియు ఆత్మల యొక్క తండ్రి కూడా కనిపిస్తారు. ఆత్మని చూడాలి అని శ్రమ చేయవలసిన అవసరం ఉండదు, పురుషార్థం చేయవలసిన అవసరం ఉండదు, కానీ నేను ఆత్మను, అందరు ఆత్మలు అని అనుభవం అయిపోతుంది. శరీర అభిమానం ఏవిధంగా పోతుందంటే, ద్వాపరయుగం నుండి ఆత్మాభిమాని స్థితి ఏవిధంగా అయితే పోయిందో ఆవిధంగా పోతుంది. కేవలం ఆత్మ తప్ప ఇంకేది కనపడదు. ఆత్మ నడుస్తుంది, ఆత్మ చేస్తుంది. ఇలా సదా మస్తకమణి వైపు శరీరం యొక్క కళ్ళు మరియు మనస్సు యొక్క కళ్ళు వెళ్తాయి. బాబా మరియు ఆత్మ - ఇదే స్మృతి నిరంతరం మరియు స్వతహాగా ఉంటుంది. ఆ సమయం యొక్క భాష ఏవిధంగా ఉంటుంది? శ్రేష్టసంకల్పం యొక్క భాష ఉంటుంది. ఉపన్యాసం చెప్పేవారిగా కాదు, ఆత్మిక ఆకర్షణ చేసేవిధంగా ఉంటారు. చెప్పడం ద్వారా కాదు కానీ స్థితి ద్వారా, శ్రేష్టజీవితం యొక్క దర్పణం ద్వారా సహజంగానే స్వరూపాన్ని అనుభవం చేయిస్తారు. నోటికి బదులు నయనాలే స్వరూపం యొక్క అనుభవం చేయించడానికి సాధనంగా అవుతాయి. నయనాల భాషయే సంకల్పాల భాష, సంకల్పశక్తి మీ నోటి మాట కంటే ఎక్కువ పని చేస్తుంది. అందువలన కొద్దిగా కూడా వ్యర్ధం యొక్క అస్వచ్ఛత లేకుండా మీ సంకల్ప శక్తిని స్వచ్చంగా చేసుకోండి. దీనినే లైన్ క్లియర్ గా ఉండటం అంటారు.

ఈ సంకల్ప శక్తి ద్వారా చాలా కార్యాలు సఫలం అయ్యే సిద్ధిని అనుభవం చేసుకుంటారు. ఏ ఆత్మ అయినా లేదా ఏ స్థూల కార్యాలు అయినా, సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చే ఆత్మల యొక్క సంస్కారాలను అయినా, నోటి ద్వారా లేదా ఇతర సాధనాల ద్వారా పరివర్తన చేయటంలో సంపూర్ణ సఫలత అనుభవం కాకపోతే అలాంటి ఆశలన్నీ సంకల్పశక్తి ద్వారా సంపూర్ణంగా సఫలం అయిపోతాయి, అది కూడా ఎంత సహజంగా అంటే అది అయిపోయినట్లే. ఏవిధంగా అయితే నలువైపుల స్థూల ఆకాశంలో రకరకాల సితారలను చూస్తున్నారో అదేవిధంగా విశ్వంలోని వాయుమండలం అనే ఆకాశంలో నలువైపుల సఫలతా సితారలను మెరుస్తూ చూస్తారు. వర్తమాన సమయంలో ఆశా సితారలు మరియు సఫలతా సితారలు రెండు కనిపిస్తున్నాయి. కానీ అంతిమ సమయంలో, అంతిమస్థితిలో ఒకే బాబా యొక్క అంతంలో నిమగ్నమై ఉన్న శ్రేష్టస్థితిలో గల సఫలతా సితారలే ఉంటాయి. వారి ఆత్మిక నయనాలు, ఆత్మికమూర్తి దివ్య దర్పణం వలె పనిచేస్తాయి. ఈ దర్పణంలో ప్రతి ఆత్మ శ్రమ లేకుండా ఆత్మికస్వరూపాన్ని చూస్తుంది. సెకనులో ఈ దర్పణం ద్వారా ఆత్మిక స్వరూపం యొక్క అనుభవం అయిన కారణంగా బాబా వైపు ఆకర్షితం అయ్యిఓహో ప్రభు! అనే పాట పాడుతారు. దేహాభిమానం సహజంగా అర్పణ అయిపోతుంది. ఓహో మీ భాగ్యం ...... ఓహో నా భాగ్యం .... ఇలా భాగ్యం యొక్క అనుభూతి అయిన కారణంగా దేహం మరియు దేహసంబంధీకుల స్మృతిని త్యాగం చేసేస్తుంది. ఎందుకంటే భాగ్యం ముందు త్యాగం చేయటం చాలా సహజం. మీరందరు కూడా ఈ సహజ త్యాగం మరియు భాగ్యాన్ని తీసుకోవాలి అనుకుంటున్నారా లేక ఇచ్చేవారిగా అవ్వాలి అనుకుంటున్నారా? ఇన్ని సంవత్సరాలు శ్రమ చేసేకంటే అంతిమ సమయంలో సహజత్యాగం మరియు భాగ్యం తీసుకునేవారిగా అవుతాము అని ఆలోచించడం లేదు కదా? ఇది ఇష్టమా? అంతిమంలో సహజంగా తప్పకుండా అనుభవం చేసుకుంటారు కానీ ఎంత సమయం చేసుకుంటారు? ఎంత కొద్ది సమయం గ్రహిస్తారో అంత కొద్ధి సమయానికే ప్రాప్తి వస్తుంది. మీరందరు చాలా సమయం యొక్క సహయోగులు కనుక చాలా సమయం యొక్క రాజ్యాధికారి అవుతారు. అంతిమంలో వచ్చే బలహీన ఆత్మల పట్ల మహాదాని, వరదాని అయ్యి అనుభవం యొక్క దానం మరియు పుణ్యం చేయండి. ఈ విధంగా ఒక్క సెకను యొక్క శక్తిశాలి స్థితి ద్వారా చేసిన పుణ్యమే అర్దకల్పం పూజ్యనీయంగా మరియు మహిమాయోగ్యంగా చేస్తుంది. ఎందుకంటే అంతిమంలో సంపూర్ణ ఆత్మలైన మీ ద్వారా పొందిన ప్రాప్తి యొక్క అనుభవం మరియు సంపూర్ణ స్వరూపం యొక్క ప్రత్యక్షత యొక్క సంపన్న స్వరూపం అనుభవం చేసుకుని ఆ అంతిమ అనుభవాన్నే అంతిమ సంస్కారంగా తీసువెళ్ళి అర్ధకల్పం తమ ఇంటిలో విశ్రాంతి తీసుకుంటారు. కొంతమంది ప్రజలుగా, కొంతమంది భక్తులుగా అవుతారు. ఈ అంతిమ సమయం యొక్క స్థితి ఆధారంగా ద్వాపరయుగంలో భక్తి యొక్క సమయంలో అంటే శ్రేష్టభక్తి యొక్క మాలలో శిరోమణి ఆత్మలుగా అవుతారు. కొంతమంది విశ్వరాజ్యాధికారి రూపంలో చూసారు వారికి ప్రజలుగా అయ్యే సంస్కారం కారణంగా మీ రాజ్యంలో ప్రజలుగా అవుతారు. కొంతమంది అతి పూజ్యస్వరూపంలో చూస్తారు కనుక భక్త ఆత్మలుగా అయిపోతారు. ఇంత సిద్ధిని పొందేటటువంటి శ్రేష్ట స్థితి ఇది, ఈ శ్రేష్టతను అనుభవం చేసుకుంటున్నారా? సంకల్పఖజానా యొక్క గొప్పతనం తెలుసుకుంటూ శ్రేష్ట సంకల్పశక్తిని జమ చేసుకుంటున్నారా? అంతిమస్థితి ఏమిటో అర్థమైందా?

బాప్ దాదా కూడా ధ్వనికి అతీతంగా వెళ్ళాలా లేక ధ్వనిలోకే రావాలా? ధ్వనిలోకి తక్కువగా వచ్చే అభ్యాసం చేస్తే స్వతహాగానే ధ్వనికి అతీతంగా అయ్యే స్థితి ఆకర్షిస్తుంది. మొదటి గేట్ అయితే ధ్వనికి అతీతంగా వెళ్ళే గేట్ తెరుస్తారు కదా? ఎప్పుడు తెరుస్తారు? ఇతర ప్రారంభోత్సవాలు అయితే మధువనంలో చాలా చేస్తున్నారు. దీని యొక్క ప్రారంభోత్సవం ఎప్పుడు చేస్తారు? బాప్ దాదా ఒక్కరే చేస్తారా లేక అందరు కలిసి చేస్తారా? కనుక తయారుగా ఉన్నారా? మంచిది ఇంకోసారి దీని యొక్క లెక్క తీస్తాను. ఎందుకంటే లెక్క అయితే ఉండాలి కదా! మంచిది.

సర్వసిద్ధి స్వరూప ఆత్మలకు, సంకల్పశక్తి ద్వారా సర్వుల శ్రేష్ట కోరికలను పూర్తి చేసేవారికి, స్వయం యొక్క సంపన్న దర్పణం ద్వారా సర్వ ఆత్మలకు నిజస్వరూపాన్ని చూపించేవారికి, బాబాని ప్రత్యక్షం చేసే సర్వశక్తుల యొక్క వరదాని స్వరూప పుణ్య ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

టీచర్స్ తో - ఇది సేవాధారుల గ్రూప్. టీచర్స్ కాదు, సేవాధారులు. బాబా కూడా మొదట సేవాధారిగా అయ్యి వస్తారు. బాబా యొక్క అన్నింటికంటే మొదటి టైటిల్ - విశ్వ సేవాధారి, బాబా యొక్క టైటిల్ ఏదైతే ఉందో అదే పిల్లల యొక్క టైటిల్. సేవాధారిగా భావించడం ద్వారా స్వతహాగా నిర్విఘ్నంగా అయిపోతారు. ఎందుకంటే సేవాధారి అంటే త్యాగి మరియు తపస్వి, ఎక్కడ త్యాగం, తపస్సు ఉంటాయో అక్కడ భాగ్యం అనేది దాసీ వలె వారి ముందుకు వస్తుంది. కనుక అందరు సేవాధారులు కదా! లేకపోతే ఏమౌతుంది! ఒకవేళ మిమ్మల్ని మీరు టీచర్‌గా భావిస్తారు. భావిస్తే, వచ్చేవారు కూడా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత తమని తాము టీచర్‌గా భావిస్తారు. టీచర్ గా భావించడం ద్వారా స్టేజ్ (గద్దె) లభించాలి, ఏదోక స్థానం లభించాలి అనే సూక్ష్మకోరిక ఉత్పన్నం అవుతుంది. ఇది మాయ యొక్క చాలా పెద్ద విఘ్నం. టీచర్ అనుకుంటే సీట్ కావాలి, పేరు కావాలి, గౌరవం కావాలి. సేవాధారులు అంటే ఇచ్చేవారిగా ఉంటారు కానీ తీసుకునే వారిగా కాదు. కనుక నిమిత్త ఆత్మలైన మీరు ఏవిధంగా ఉంటారో మిమ్మల్ని చూసి సేవాధారులు కూడా అదేవిధంగా ఉంటారు.

అప్పుడు నలువైపుల త్యాగం తపస్య యొక్క వాతావరణం ఉంటుంది. ఎక్కడ త్యాగం, తపస్య యొక్క వాతావరణం ఉంటుందో అక్కడ సదా నిర్విఘ్నస్థితి ఉంటుంది. కనుక అందరు సేవాధారులు కదా! టీచర్ అనటం ద్వారా స్టూడెంట్స్ కూడా మేము కూడా తక్కువ కాదు అంటారు. సేవాధారి అనటం ద్వారా అందరు నెంబర్ వన్ కూడా మరియు ఎవరూ తక్కువ కాదు. కనుక మిమ్మల్ని మీరు సేవాధారిగా భావించండి మరియు నడవండి. అన్ని విఘ్నాలకు మూలం మిమ్మల్ని మీరు టీచర్‌గా భావించి స్టేజ్ తీసుకోవటం. అప్పుడు అందరూ ఫాలో టీచర్ అవుతారు కానీ ఫాలోఫాదర్ అవ్వరు. వృద్ధిని అయితే పొందుతూనే ఉన్నారు కానీ ఇప్పుడు వృద్ధితో పాటు విధిపూర్వక వృద్ధి పొందుతూ ఉండండి. విధి తక్కువగా ఉంటే వృద్ధిలో విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. కనుక విధి సంపన్న వృద్ధిని పొందేవారిగా అవ్వండి. శ్రమ చాలా మంచిగా చేస్తున్నారు.