08.10.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విజయీరత్నాలు, బ్రాహ్మణ కులభూషణ పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు

ఈరోజు బాప్ దాదా విజయీరత్నాలను చూస్తున్నారు. ఈరోజు భక్తులు విజయదశమి జరుపుకుంటున్నారు. భక్తులు అయితే కాలుస్తారు, పిల్లలైన మీరైతే కలయిక జరుపుకుంటారు. కాల్చిన తర్వాత కలయిక జరుపుకోవటం ఉంటుంది. భక్తి మార్గంలో రావణుడిని కాల్చిన తర్వాత విజయం పొందిన తర్వాత ఏ కలయిక చూపిస్తారు? భక్తి యొక్క విషయాలు అయితే మంచిగా తెలుసు కదా! రావణుడు చనిపోయిన తర్వాత ఏ స్థితి ఉంటుంది? దాని గుర్తు ఏమిటి? అన్నా చెల్లెళ్ళ పండుగ. ఇది సోదర స్థితి, సోదరుల దృష్టికి గుర్తు - సేవ మరియు స్నేహం. స్నేహానికి గుర్తుగానే ఈ పండుగను చూపించారు మరియు సేవకి గుర్తుగా దీపావళిని చూపించారు. సేవ యొక్క సఫలతకి ఆధారం సోదరస్థితిని చూపించారు. ఇది లేకుండా దీపావళి జరుపుకోరు. దీపావళి లేకుండా రాజ్యతిలకం పెట్టుకోలేరు. కనుక ఈ రోజు యొక్క స్మృతిచిహ్నం విజయీదశమి జరుపుకున్నారు. దీనికి ఆధారం మొదట అష్టమి జరుపుతారు. అష్టమి లేకుండా విజయం రాదు. కనుక ఎంత వరకు చేరుకున్నారు? అష్టమి జరుపుకున్నారా? అందరు నవదుర్గలుగా అయ్యారా? అష్టశక్తులు మరియు శక్తివంతుడు ఒకరు. సర్వశక్తివంతునితో పాటు అష్టశక్తి స్వరూపంగా ఇలా నవదుర్గలుగా అయ్యారా? దుర్గ అంటే దుర్గుణాలను సమాప్తి చేసి సర్వగుణ సంపన్నంగా అవ్వటం. అప్పుడే దసరా జరుపుతారు. బాప్ దాదా పిల్లలు దసరా జరుపుకున్నారా అని చూడడానికి వచ్చారు. ప్రతి ఒక్కరికి ఎవరికి వారికి మంచిగా తెలుసు మరియు అంగీకరిస్తున్నారు కూడా. నేను దసరా జరుపుకున్నానా లేక అష్టమి జరుపుకున్నానా అని. అవినాశి అగ్గిపుల్ల వేసారా లేక కొద్ది సమయం కోసం అగ్గిపుల్ల వేసారా? రావణుడిని కాల్చారా? లేదా రావణుడి యొక్క సర్వ వంశాన్ని కాల్చారా? రావణుడిని సమాప్తి చేసారా లేక రావణరాజ్యాన్ని సమాప్తి చేసారా?

ఈరోజు వతనంలో బ్రహ్మాబాబా యొక్క ఆత్మిక సంభాషణ నడుస్తుంది - ఏ సమయంలో జరిగింది? క్లాస్ సమయంలో బాప్ దాదా కూడా పిల్లల యొక్క ఆత్మిక సంభాషణ వింటున్నారు. చాలామంది పిల్లలను దసరా జరుపుకున్నారా అని అడిగితే జరుపుకున్నాము అనే దానిలో చేతులు ఎత్తడంలేదు, జరుపుకోలేదు అనే దానిలో చేతులు ఎత్తడం లేదు. ఒకవేళ వ్రాయిస్తే జవాబు ఇవ్వటంలో కూడా చాలా చతురంగా ఉన్నారు. అసత్యం చెప్పటంలేదు కానీ స్పష్టంగా కూడా వ్రాయటంలేదు. 3,4 జవాబులు అందరికీ వస్తాయి. వాటిలో ఏదోక జవాబు ఇస్తున్నారు. కనుక బ్రహ్మాబాబా యొక్క ఆత్మిక సంభాషణ నడిచింది. బ్రహ్మాబాబా అయితే ఇంటి యొక్క ద్వారం తెరిచేటందుకు పిల్లలను ఆహ్వానం చేస్తున్నారు. కానీ ఈరోజు యొక్క ప్రశ్నకి జవాబు కాగితం రూపంలో కాదు కానీ అందరి మనస్సు యొక్క సంకల్పం బాబా ముందు స్పష్టంగా ఉంది. క్లాస్ సమయంలో దాదీ ప్రశ్న అడుగుతున్నారు మరియు బాప్ దాదా అందరి జవాబులు ఏమిటో చూస్తున్నారు. జవాబు యొక్క సారం అయితే చెప్పేశాను ఇక చెప్పాల్సిన అవసరం లేదు అని మీకు బాగా తెలుసు. జవాబు చూస్తూ బ్రహ్మాబాబా ఏమి చేసారు? చాలా మంచిపని చేసారు. బ్రహ్మాబాబా యొక్క విశేషత సంపన్న సంస్కారం మీకు తెలుసు. విశేష సంస్కారం యొక్క పాత్రనే అభినయించారు, అది ఇప్పుడు ఏమౌతుంది? ఆ విషయానికి ఆదికాలంలో బ్రహ్మాబాబా యొక్క ప్రవేశత యొక్క జీవితంతో సంబంధం ఉంది. ఎప్పుడైతే ఫలితం చూసారో అప్పుడు బ్రహ్మాబాబా ఆలోచనలో పడ్డారు మరియు చెప్పారు - ఈరోజు నా యొక్క ఒక విషయం పూర్తి చేయాలి అని. ఏమిటి? బ్రహ్మాబాబా చెప్పారు నాకు ఈరోజు తాళంచెవి కావాలి అని. ఏమి తాళంచెవి? అందరి బుద్ధులను పరివర్తన చేసే తాళంచెవి, సంపన్నంగా చేసే తాళంచెవి కావాలి అని. ఎలా అయితే ఆదిలో కూడా బ్రహ్మాబాబాకి తాళంచెవి యొక్క నషా ఉండేది, ఖజానా ఉంది. తాళంచెవి ఉంది కేవలం తెరవాలి అని. అదేవిధంగా ఈరోజు కూడా బ్రహ్మాబాబా సంపన్నంగా తయారుచేసే తాళంచెవి శివబాబాని అడిగారు. ఆ సమయంలో సాకారంగా అనుభవం చేసుకునే వారికి బ్రహ్మాబాబా, శివబాబా ఏవిధంగా ఆత్మికసంభాషణ చేసుకుంటున్నారో తెలుస్తుంది. ఇప్పుడు బ్రహ్మకి తాళంచెవి ఇవ్వనా? బ్రహ్మని ఎప్పుడైనా బాబా కాదు అంటారా? పిల్లలు కూడా కాదు అనటంలేదు, అవును అనటంలేదు.

బ్రహ్మాబాబా - పిల్లలను సదా సంపన్నంగా చూడాలని చాలా - చాలా కోరికతో ఉన్నారు. తయారవ్వాలి అని కాదు, ఇప్పుడే తయారైపోవాలి అని. ఎప్పుడైనా పిల్లల యొక్క విషయాలు వచ్చినప్పుడు బ్రహ్మాబాబా యొక్క ముఖం దీపావళిలా వెలిగిపోతుంది. ఈ విధంగా తీవ్ర ఉత్సాహం మరియు మాస్టర్ సాగరుని సమానంగా ఉన్నతమైన అల ఎంతగా వ్యాపిస్తుందంటే ఉత్సాహం యొక్క అలలలో పిల్లలందరినీ సంపన్నంగా చేసి దీపావళి జరపాలి అనిపిస్తుంది. బ్రహ్మాబాబా యొక్క సాకార చరిత్రలో కూడా ఇది అనుభవం చేసుకున్నారు - బ్రహ్మాబాబాకి ఒక మాట జన్మ యొక్క ఆది నుండి మంచిగా అనిపించేది కాదు అది ఏమిటి? తన యొక్క కార్యంలో కూడా అది మంచిగా అనిపించేది కాదు, పిల్లల యొక్క కార్యంలో కూడా మంచిగా అనిపించేది కాదు. ఎప్పుడో చేద్దాము? ఈ మాట మంచిగా అనిపించేది కాదు. ప్రతి విషయంలో వెంటనే చేసేవారు మరియు చేయించేవారు. సేవ యొక్క ప్లాన్ లో చూడండి, స్వ పరివర్తనలో చూడండి, ఇప్పుడిప్పుడే వెళ్ళండి, ఇప్పుడిప్పుడే చేయండి అనేవారు. ట్రైన్ యొక్క సమయం తక్కువగా ఉన్నా కూడా త్వరగా వెళ్ళండి ట్రైన్ ఆలస్యం అయిపోతుంది అనేవారు. కనుక ఏమి సంస్కారం ఉండేది? ఇప్పుడే - ఇప్పుడే అనేవారు ఎప్పుడో కాదు, ఇప్పుడే అనేవారు. ఏవిధంగా ఇప్పుడే, ఇప్పుడే అనే విశేష భాష ఉండేదో అదేవిధంగా ఇప్పుడు వతనంలో కూడా ఇప్పుడే అయిపోవాలి అనే భాష నడుస్తుంది. మరియు నవ్వు వచ్చే ఒక విషయం వినిపిస్తున్నాను అది ఏమిటి?

బ్రహ్మాబాబా స్వయం సంపన్నంగా అయిపోయిన కారణంగా పిల్లలు ఎప్పుడు, ఎప్పుడు అని ఎందుకు అంటున్నారో ఇది చూడటం లేదు. అందువలనే శివబాబాకి మాటిమాటికి చెప్తున్నారు వీరు ఎందుకు మారటంలేదు, వీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇప్పుటివరకు ఇది ఎందుకు అంటున్నారు. ఈ విషయంలో ఆశ్చర్యం అనిపిస్తుంది. డ్రామా యొక్క విషయం వేరు, ఇది నవ్వు వచ్చే రమణీయమైన విషయం. డ్రామా గురించి తెలియదు అని కాదు కానీ చూసి - చూసి స్నేహం కారణంగా అలా అనిపిస్తుంది. కనుక బాబా నవ్విస్తున్నారు. బాబాతో నవ్వుకోవడానికి అయితే అవకాశం ఉంది కదా! బాబా కూడా నవ్వుతున్నారు. ఇప్పుడు బ్రహ్మాబాబా ఏమనుకుంటున్నారో తెలుసుకున్నారు కదా? ఇప్పుడు ముక్తులుగా అయ్యి ముక్తిధామం యొక్క ద్వారం తెరవడంలో బాబాకి సహయోగి అవ్వండి. ఇదే బ్రహ్మాబాబాకి పిల్లల పట్ల శుభ ఆశ. మొదట ఈ దీపావళి జరుపుకోండి బాబా యొక్క శుభ ఆశాదీపంగా అవ్వండి. ఈ దీపం ద్వారా దీపమాల స్వతహాగానే మేల్కొంటుంది. అర్ధమైందా! మంచిది, అన్నా చెల్లెళ్ళ పండుగ గురించి తర్వాత చెప్పాను.

ఈవిధంగా బాప్ దాదా యొక్క శ్రేష్ట సంకల్పాన్ని సాకారంలోకి తీసుకువచ్చేవారికి, అవినాశి ధృఢసంకల్పం యొక్క అగ్గిపుల్ల వెలిగించి అవినాశి విజయీగా అయ్యేవారికి, సాకారబాబా సమానంగా సదా ఇప్పుడే అనే భాషను కర్మలోకి తీసుకువచ్చే వారికి, ఎప్పుడో అనేది సమాప్తి చేసి అందరికీ సాకార బాబా యొక్క మూర్తిని ముఖంలో చూపించేవారికి ఈ విధమైన విజయీరత్నాలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

కుమారీలతో - కుమారీలు అంటేనే ఎగిరే పక్షులు, అంటే సదా తేలికగా ఉండేవారు. కుమారీ అంటే ఏవిధమైన బరువు లేనివారు, తేలికైన వస్తువు పైకి వెళ్తుంది కదా! సదా పైకి వెళ్ళేవారు అంటే ఉన్నత స్థితిలోకి వెళ్ళేవారు. కనుక ఈ విధంగా ఉన్నారా? ఎంత వరకు చేరుకున్నారు? ఎవరైతే బాబా యొక్క శ్రీమతం ప్రకారం నడుచుకుని ఆ రేఖలో సదా ఉంటారో వారు సదా పైకి ఎగురుతూ ఉంటారు. కనుక రేఖ లోపల ఉండేవారు ఎవరు అవుతారు? సత్యమైన సీతలు. కనుక మీరు సత్యమైన సీతలు కదా? పక్కాయేనా? రేఖ బయటికి కాలు పెట్టారు. అంటే రావణుడు వచ్చేస్తాడు. రావణుడు ఎదురు చూస్తూ ఉంటాడు - ఎక్కడైనా కాలు బయట పెడితే తీసుకెళ్ళిపోదాము అని. కనుక కుమారీ అంటే సత్యమైన సీతగా ఉండాలి. ఇక్కడి నుండి బయటికి వెళ్ళి మారిపోకూడదు. ఎందుకంటే మధువనంలో వాయుమండలం యొక్క వరదానం యొక్క ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఎక్ స్ట్రా లిఫ్ట్ ఉంటుంది. అక్కడ శ్రమతో నడవవలసి ఉంటుంది. కుమారీలను చూసి బాప్ దాదాకు వేల రెట్లు సంతోషం ఉంటుంది. ఎందుకంటే కసాయివారి నుండి రక్షింపబడ్డారు. కనుక సంతోషం ఉంటుంది కదా! మంచిది, ఇప్పుడు పక్కా ప్రతిజ్ఞ చేసి వెళ్ళాలి.