09.10.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అంతర్ముఖి ఆత్మలే సదా బంధనముక్తులుగా మరియు యోగయుక్తులుగా అవుతారు.

సదా బంధనముక్తుడు, ముక్తి -జీవన్ముక్తి దాత, సుఖసాగరుడైన శివబాబా మాట్లాడుతున్నారు:-
ఈరోజు బాప్ దాదా తన యొక్క సదా సహయోగి, సదా శక్తిస్వరూపులు, సదా ముక్తి మరియు యోగయుక్త విశేషపిల్లలను అమృతవేళ నుండి విశేషరూపంతో చూస్తున్నారు. బాప్ దాదా ప్రతి పిల్లవాని రెండు విషయాలు చూసారు. ఒకటి ఎంతవరకు ముక్తి అయ్యారు, రెండు జీవన్ముక్తులుగా ఎంత వరకు అయ్యారు? జీవన్ముక్తులు అంటే యోగయుక్తులు, బాప్ దాదా దగ్గర కూడా ప్రతి సెకను పిల్లల మనస్సు యొక్క సంకల్పాల రేఖలు స్పష్టంగా కనిపిస్తాయి. రేఖలను చూస్తూ బాప్ దాదా నవ్వుకుంటూ విశేషంగా ఒక విషయం యొక్క చిత్రాన్ని చూసారు, ఆ చిత్రంలో రెండు రకాలైన లక్షణాలను చూసారు.

1. సదా అంతర్ముఖి. దీని కారణంగా స్వయం కూడా సదా సుఖం యొక్క సాగరంలో ఇమిడి ఉన్నారు మరియు ఇతర ఆత్మలను కూడా సదా సుఖం యొక్క సంకల్పం మరియు వైబ్రేషన్ ద్వారా, వృత్తి ద్వారా, మాట ద్వారా, సంబంధ, సంప్రదింపుల ద్వారా సుఖం యొక్క అనుభూతి చేయిస్తున్నారు.

2. బాహర్ముఖి. వీరు సదా బాహర్ముఖతలో ఉండటం వలన బాహ్యం అంటే వ్యక్త భావం, వ్యక్తి యొక్క భావ, స్వభావాలు మరియు వ్యక్త భావం యొక్క వైబ్రేషన్, సంకల్పం, మాట మరియు సంబంధ, సంద్రింపుల ద్వారా ఒకరి నుండి మరొకరు ఇలా వ్యర్థాన్ని పెంపొందించేవారిగా ఉంటారు, సదా అల్పకాలిక నోటి యొక్క లడ్డు తింటూ మరియు ఇతరులకు తినిపిస్తూ ఉంటారు, సదా ఏదో ఒకరకమైన చింతనలో ఉండేవారిగా, ఆంతరంగిక సుఖం, శాంతి మరియు శక్తికి సదా దూరంగా ఉండేవారిగా, అప్పుడప్పుడు కొద్ది, కొద్దిగా మెరుపు అనుభవం చేసుకునేవారిగా ఉంటారు. ఈ విధమైన బాహర్ముఖి ఆత్మలను చూసారు.

దీపావళి వస్తుంది కదా! వ్యాపారస్తులు అయితే తమ ఖాతా చూసుకుంటారు. పాత ఖాతా, క్రొత్త ఖాతా చూసుకుంటారు. బాబా ఏమి చూస్తారు? బాబా కూడా ప్రతి పిల్లవాడు పాత ఖాతా ఎంత వరకు సమాప్తి చేసుకున్నాడు మరియు క్రొత్త ఖాతాలో ఏమేమి జమ చేసుకున్నారు అనే ఖాతా చూస్తారు. కనుక ఈరోజు ఒక తేడా చూస్తున్నారు. ఎందుకంటే నిన్న కూడా చెప్పాను కదా - బ్రహ్మబాబా ఇప్పుడు ఏ విషయం కోసం ఎదురుచూస్తున్నారు? (ప్రారంభోత్సవం కొరకు) ఈ ప్రారంభోత్సవం కొరకు ఏ తయారీలు చేస్తున్నారు? ఎవరిచేతనైనా ప్రారంభోత్సవం చేయించాలంటే ఏమేమి తయారు చేసారు? ఏయే వస్తువులు అవసరం? ప్రారంభోత్సవానికి ముందు రిబ్బన్ లేదా పూలమాల ఏదైతే కడ్తారో దానిని కత్తెరతో కట్ చేస్తారు అప్పుడు ప్రారంభం అవుతుంది. కత్తెరను దేనిలో పెడతారు? పువ్వులతో అలంకరించి ఉన్న పళ్ళెంలో పెడతారు అంటే ఏమిటి? బంధనముక్తులుగా అయ్యే ముందు స్వయాన్ని గుణాల యొక్క పుష్పాలతో సంపన్నం చేసుకోవాలి అప్పుడు స్వతహాగానే బంధనముక్తులుగా అయిపోయినట్లే. కనుక ప్రారంభోత్సవానికి ఏమి తయారు చేయాలి? ఒకవైపు స్వయాన్ని సంపన్నం చేసుకోవాలి. కానీ సంపన్నం చేసుకునే ముందు బాహర్ముఖత యొక్క బంధన నుండి ముక్తి అవ్వాలి. ఇలా తయారయ్యారా? బాహర్ముఖత యొక్క రసం బయటికి చాలా మంచిగా ఆకర్షితం చేస్తుంది. అందువలనే దీనిని కత్తిరించేయండి. ఈ రసమే సూక్ష్మబంధనగా అయ్యి సఫలత యొక్క గమ్యం నుండి దూరం చేస్తుంది. ప్రశంస ఉంటుంది కానీ ప్రత్యక్షత మరియు సఫలత లభించదు. అందువలనే ఇప్పుడు ప్రారంభోత్సవానికి తయారవ్వండి. ప్రారంభోత్సవానికి తయారయ్యేవారు - సదా పూలతోటలో బాప్ దాదా ద్వారా తయారైన పుష్పగుచ్చంలోని పుష్పాల యొక్క విశేషత అనే సువాసన తీసుకుంటారు మరియు దానిలోనే తత్పరులై ఉంటారు. అంటే వారి జీవితం అనే పళ్ళెంలో సదా పువ్వులే పువ్వులు ఉంటాయి. ఇలా తయారయ్యారా? దీనిలో నెంబర్ వన్ ఎవరు వస్తారు? మధువనం వారా లేక ఢిల్లీ వారా? గొప్ప కర్తవ్యం లభిస్తుంది. బాప్ దాదా వెంట ప్రాంభోత్సవానికి నిమిత్తం అవ్వటం. దీనికంటే ఉన్నతమైన భాగ్యం ఏమి ఉంటుంది? సమానమైన ఆత్మలే బాబా వెంట ప్రారంభోత్సవం చేస్తారు. ప్రారంభోత్సవం చేయటం అంటే సదాకాలికంగా సూక్ష్మవతనవాసి మరియు మూలవతనవాసి అవ్వటం అని భావించడం లేదు కదా! బ్రహ్మాబాబాతో పాటు మూలవతనవాసిగా అందరు అవుతారా లేక కొద్దిమందే అవుతారా? ఏమని భావిస్తున్నారు? అందరూ సేవాస్థానాన్ని వదిలేసి వెంటనే వెళ్ళిపోతారా? వెంట వెళ్తారా లేక ఆగిపోతారా? (వెంట వెళ్తాము) మంచిది - మరి బ్రహ్మాబాబా సూక్ష్మవతనానికి వెళ్ళిపోయారు మరి మీరు ఇక్కడ ఎందుకు కూర్చుని ఉండిపోయారు? అయితే ఏమి చేస్తారు? (దాదీని అడిగారు) (వెంట వెళ్తాము అని చెప్పారు) మంచిది - దాదీ, దీదీ ఇద్దరు వెంట వెళ్తారా? ఏమౌతుంది? ఇది కూడా విచిత్రమైన రహస్యం. ఇప్పుడు విశేషమైన విషయం ప్రారంభోత్సవానికి తయారేనా? ఢిల్లీ వారు తయారేనా? నిమిత్త సేవాధారులు ఏమని భావిస్తున్నారు. ఏ ఆశలు ఉండిపోలేదు కదా? (బాబాతో కలయిక మంచిగా అనిపిస్తుంది అని చెప్పారు) బాప్ దాదాయే వెళ్ళిపోతారు అయినా కానీ ఉంటారా? ఎప్పటి వరకు ఉండాలి? వెంట వెళ్ళేవారు ధర్మరాజుకి టాటా చెప్తారు అంటే ధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. మంచిది. బాబా మన యొక్క ఖాతా స్వచ్ఛంగా ఉండాలి అనుకుంటున్నారు. కొద్ధిగా కూడా పాత ఖాతా అంటే బాహర్ముఖత యొక్క ఖాతా, సంకల్ప రూపంలో లేదా సంస్కార రూపంలో కూడా ఉండకూడదు. సదా సర్వ బంధనముక్తులుగా మరియు యోగయుక్తంగా ఉండాలి వీరినే అంతర్ముఖి అని అంటారు. బాప్ దాదా ఈ బాహర్ముఖత యొక్క వాయుమండలాన్ని సమాప్తి చేసేటందుకు ఈ సంవత్సరం విశేషమైన సైగ చేస్తున్నారు. సేవ చేయండి, చాలా చేయండి కానీ బాహర్ముఖత నుండి అంతర్ముఖి అయ్యి చేయండి. ఆ సేవ అంతర్ముఖి యొక్క ముఖం ద్వారా జరుగుతుంది. సేవలో బాహర్ముఖతలోకి ఎక్కువగా వస్తున్నారు. అందువలనే సేవ బాగుంది, చాలా సేవ చేస్తున్నారు అనే మాటే పైకి వస్తుంది. వీరి యొక్క తండ్రి చాలా ఉన్నతమైనవారు, ఉన్నతోన్నతమైన వారు అనే ప్రత్యక్షత యొక్క సఫలత తక్కువగా వస్తుంది. అందువలన చెప్పాను కదా - బాహర్ముఖత యొక్క ఫలితం - ప్రశంసిస్తారు కానీ ప్రసన్నచిత్తులుగా కాలేరు. బాబా వారిగా అయిపోవాలి ఇదే ప్రసన్నచిత్రంగా అవ్వటం.

ఈవిధంగా సదా అంతర్ముఖి, సదా ప్రసన్నచిత్తంగా ఉండేవారికి, ఇతర ఆత్మలను కూడా ప్రసన్నచిత్తులుగా చేసేవారికి, సదా స్వయం గుణాలతో సంపన్నంగా, బాబా సమానంగా, సదా సుఖం యొక్క సాగరంలో ఇమిడి ఉండేవారికి, సదా ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు అనే సంలగ్నతలో నిమగ్నం అయ్యి ఉండేవారికి - ఇటువంటి శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.