14.10.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వఖజానాల యొక్క తాళంచెవి ఒకే మాట - బాబా.

సర్వశ్రేష్ట భాగ్యవిధాత, పదమాపదమ్ భాగ్యశాలిగా తయారుచేసే బాప్ దాదా మాట్లాడుతున్నారు --
ఈరోజు భాగ్య విధాత బాబా తన యొక్క భాగ్యశాలి పిల్లలను చూస్తున్నారు. భాగ్యశాలిగా అయితే అందరు అయ్యారు కానీ భాగ్యశాలి అనే మాటలో కూడా - సౌభాగ్యశాలి మరియు పదమాపదమ్ భాగ్యశాలి, భాగ్యశాలి అనే మాట ఇద్దరికీ ఉంటుంది కానీ ఎక్కడ సౌ అంటే వంద మరియు ఎక్కడ పదమ్ అంటే కోటానుకోట్లు తేడా ఉంది కదా! భాగ్య విధాత ఒక్కరే, విధాత యొక్క విధి కూడా ఒకటే, సమయం మరియు వేళ కూడా ఒకటే అయినప్పటికీ నెంబర్‌వారీ. విధాత యొక్క విధి ఎంత శ్రేష్టమైనది మరియు సహజమైనది లౌకికంలో కూడా ఈ రోజులలో ఎవరికైనా గ్రహచారం కారణంగా అదృష్టం మారిపోతే ఆ గ్రహచారాన్ని తొలగించి శ్రేష్ట అదృష్టాన్ని తయారు చేయడానికి ఎన్ని రకాలైన విధులు తయారు చేస్తున్నారు! ఎంత సమయం, ఎంత శక్తి మరియు సంపద ఖర్చు చేస్తున్నారు! అయిన్పటికీ అల్పకాలిక అదృష్టం తయారవుతుంది. అది ఒక జన్మకి కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే వారు విధాత ద్వారా అదృష్టాన్ని మార్చుకోవటం లేదు. అల్పజ్ఞులు, అల్పసిద్ధులు పొందిన వ్యక్తుల ద్వారా అల్పకాలిక ప్రాప్తులు పొందుతున్నారు. అక్కడ అల్పజ్ఞ వ్యక్తులు కానీ ఇక్కడ విధాత. విధాత ద్వారా అవినాశి అదృష్టరేఖ గీసుకుంటున్నారు. ఎందుకంటే భాగ్యవిధాతలైన ఇద్దరు తండ్రులు ఈ సమయంలో పిల్లల ఎదురుగా హాజరై ఉన్నారు. భాగ్యవిధాత నుండి ఎంత భాగ్యం తీసుకోవాలంటే అంత తీసుకోవచ్చు. ఈ సమయంలోనే భాగ్యవిధాత భాగ్యం పంచి పెట్టడానికి వచ్చారు. ఈ సమయానికి డ్రామానుసారం వరదానం ఉంది. భాగ్యం యొక్క ఖజానా నిండుగా తెరిచి ఉంది. తనువు యొక్క బండారా, మనస్సు యొక్క, ధనం యొక్క, రాజ్యం యొక్క ప్రకృతి దాసీ అవ్వటం, భక్తులు తయారయ్యే ఇలా అన్ని భాగ్యాల యొక్క ఖజానాలు తెరిచి ఉన్నాయి. ఎవరికి కూడా విధాత ద్వారా స్పెషల్ ప్రాప్తి యొక్క అవకాశం ఏమి లభించడం లేదు. అందరికీ ఒకే విధంగా లభిస్తుంది. ఏ విషయాల కారణంగా బంధన కూడా లేదు. వెనుక వచ్చారు అని, ప్రవృతిలో ఉంటున్నారు అని, తనువుకి అనారోగ్యం అని, ఆయువు కారణంగా, స్థూల డిగ్రీ లేదా చదువు లేదు..... ఇలా ఏ రకమైన కారణాలతో బండారాకి బాబా తాళం వేయటంలేదు. రాత్రి, పగలు భాగ్య విధాత యొక్క బండారా నిండుగా మరియు తెరిచే ఉంటుంది. ఎవరైనా కాపలాదారిని ఉంచారా ఏమిటి? ఎవరు కాపలాదారి లేరు. అయినప్పటికీ చూడండి తీసుకోవటంలో నెంబర్ వారీ అయిపోతున్నారు. భాగ్యవిధాత నెంబర్ వారీగా ఇవ్వటంలేదు. ఇక్కడ భాగ్యం తీసుకోవడానికి క్యూలో కూడా నిలబడటంలేదు. ఇంత పెద్ద భాగ్యం యొక్క బండారా బాబా దగ్గర ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏది కావాలంటే అది తీసుకోవడానికి అధికారం ఉంది. ఏదైనా క్యూ ఉందా? అమృతవేళ నుండి చూడండి - దేశ, విదేశాలలో పిల్లలందరూ ఒకే సమయంలో భాగ్యవిధాతతో కలయిక జరుపుకుంటున్నారు, కలయిక జరిగే తీరుతుంది. అడగటం లేదు కూడా, ఉన్నతోన్నతమైన బాబాని కలుసుకోవటం అంటేనే భాగ్యం యొక్క ప్రాప్తిని పొందటం. 1. తండ్రి మరియు పిల్లల యొక్క కలయిక జరుగుతుంది. 2. ప్రాప్తి లభిస్తుంది. కలయిక కూడా జరుగుతుంది మరియు భాగ్యం అనే వస్తువు కూడా లభిస్తుంది. ఎందుకంటే ఉన్నత వ్యక్తులు ఎప్పుడు ఎవరినీ ఖాళీ చేతులతో పంపించరు. కనుక బాబా అయితే విధాత, వరదాత, నిండుగా ఉండే బండారా. కనుక వట్టి చేతులలో ఎలా పంపిస్తారు! అయినప్పటికీ భాగ్యశాలి, సౌభాగ్యశాలి, పదమాభాగ్యశాలి, పదమాపదమ్ భాగ్యశాలిగా ఇలా ఎందుకు అవుతున్నారు? ఇచ్చేవారు కూడా ఉన్నారు, భాగ్యం యొక్క ఖజానా కూడా నిండుగా ఉంది, సమయం యొక్క వరదానం కూడా ఉంది. ఈ అన్ని విషయాల యొక్క జ్ఞానం అంటే తెలివి కూడా ఉంది. తెలివి తక్కువ వారు కాదు. అయినప్పటికీ తేడా ఎందుకు వస్తుంది? (డ్రామానుసారం వస్తుంది అని చెప్పారు) డ్రామాకి కూడా ఇప్పుడు వరదానం ఉంది కనుక డ్రామా అని చెప్పకూడదు.

విధి కూడా ఎంత సరళమైనది! ఏవిధమైన శ్రమ కూడా చెప్పటంలేదు. మోసం చేయటంలేదు, ఖర్చు చేయించటంలేదు. విధి అనేది ఒకే మాటలో ఉంది. ఆ మాట ఏమిటి? తెలుసా? ఒక మాటే సర్వఖజానాలకు లేదా శ్రేష్ట భాగ్యానికి తాళంచెవి. అదే తాళంచెవి, అదే విధి. బాబా అనే మాటే తాళంచెవి మరియు విధి. కనుక తాళంచెవి అందరి దగ్గర ఉంది కదా?అయినప్పటికీ తేడా ఎందుకు? తాళంచెవి ఎందుకు చిక్కుకుపోతుంది? సవ్యంగా త్రిప్పడానికి బదులు అపసవ్యంగా త్రిప్పుతున్నారు. అంటే స్వచింతనకు బదులు పరచింతన చేయటం అంటే అపసవ్యంగా త్రిప్పటం. స్వదర్శనానికి బదులు పరదర్శనం, మారడానికి బదులు మార్చాలనుకునే భావన, స్వపరివర్తనకు బదులు పరపరివర్తన యొక్క కోరిక పెట్టుకోవటం, పని నాది పేరు బాబాది అనుకోవడానికి బదులు పని బాబాది, పేరు నాది అని ఇలా తాళంచెవి వ్యతిరేఖంగా త్రిప్పుతున్నారు. కనుక ఖజానా ఉన్నప్పటికీ భాగ్యహీనులు ఖజానాను పొందలేకపోతున్నారు. భాగ్యవిధాత యొక్క పిల్లలు కానీ ఎలా అవుతున్నారు? కొన్ని బిందువులు అడిగేవారిగా అవుతున్నారు. ఇక రెండవవారు ఏమి చేస్తున్నారు? ఈ రోజులల్లో ప్రపంచంలో అమూల్యఖజానాను లాకర్స్ లో లేక ఇనుప బీరువాలలో పెడతారు. వాటిని తెరిచేటందుకు డబుల్ తాళంచెవి ఉపయోగించాలి లేదా రెండు సార్లు చక్రం త్రిప్పితే వచ్చే విధంగా ఉంటాయి. ఒకవేళ ఆ విధి (పద్ధతి) రాకపోతే వారికి ఖజానా లభించదు. లాకర్స్ లో చూసే ఉంటారు కదా - ఒక తాళం మీరు వేస్తే, రెండవ తాళం బ్యాంక్ వారు వేస్తారు. కనుక డబుల్ తాళంచెవి ఉంటుంది కదా! ఒకవేళ మీరు మీ తాళంచెవి తీసుకెళ్ళి తెరుద్దాము అనుకున్నా అది రాదు. కనుక ఇక్కడ కూడా స్వయం మరియు బాబా ఇద్దరి స్మృతి అనే రెండు తాళాలు ఉండాలి. కొంతమంది పిల్లలు తమ యొక్క నషాలోకి వచ్చేసి నేను అన్నీ తెలుసుకున్నాను. నేను ఏది కావాలంటే అది చేయగలను, చేయించగలను అని అంటారు. బాబా మమ్మల్ని యజమానులుగా చేసారు అనే వ్యతిరేఖ నషాలోకి వచ్చేసి నేను అనే నషాలో బాబాతో సంబంధాన్ని మరిచిపోయి స్వయమే అన్నీ చేయగలను అని భావిస్తారు. అంటే ఒక తాళంచెవితో ఖజానా తెరవాలనుకుంటారు. అంటే ఖజానాల యొక్క అనుభవం చేసుకోవాలనుకుంటారు. కానీ బాబా యొక్క తోడు మరియు సహయోగం లేకుండా ఖజానా లభించదు. డబల్ తాళంచెవి కావాలి. కొంతమంది పిల్లలు బాప్ దాదా అంటే ఇద్దరు తండ్రులకు బదులు ఒకే తండ్రి ద్వారా ఖజానాలకు యజమాని అవ్వాలనుకుంటారు. దీని ద్వారా కూడా ప్రాప్తి నుండి వంచితం అయిపోతారు. మాకు నిరాకారునితో డైరెక్ట్ సంబంధం ఉంది, సాకారుడు కూడా నిరాకారుని నుండి పొందారు కదా! కనుక మాకు కూడా సాకారం యొక్క అవసరం ఏముంది? అని భావిస్తున్నారు. కానీ ఈ తాళంచెవి కూడా ఖండిత తాళంచెవి అవుతుంది. అందువలనే సఫలత లభించడం లేదు. నవ్వు వచ్చే విషయం ఏమిటంటే మీ పేరు బ్రహ్మాకుమారీ, కుమారులు అంటున్నారు మరియు సంబంధం శివబాబాతో పెట్టుకుంటున్నారు. మరి మిమ్మల్ని మీరు శివకుమారీ - కుమారులు అనుకోవచ్చు కదా! బ్రహ్మాకుమారీ - కుమారులు అని ఎందుకు అంటున్నారు? మీ ఇంటి పేరే శివవంశీ బ్రహ్మాకుమారీ - కుమారులు. కనుక ఇద్దరి తండ్రులతో సంబంధం ఉంది కదా!

రెండవ విషయం - శివబాబా కూడా బ్రహ్మ ద్వారానే స్వయాన్ని ప్రత్యక్షం చేసుకున్నారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను దత్తత తీసుకున్నారు. ఒంటరిగా చేయలేదు. బ్రహ్మతల్లే బాబా యొక్క పరిచయం ఇచ్చారు. బ్రహ్మతల్లే పాలన చేసి బాబా యొక్క వారసత్వానికి యోగ్యంగా చేశారు.

మూడవ విషయం - రాజ్యభాగ్యం యొక్క ప్రాప్తిలో కూడా ఎవరి వెంట వస్తారు? నిరాకారుడైతే నిరాకారి ప్రపంచవాసీ అయిపోతారు. సాకార బ్రహ్మాబాబాతోనే రాజ్యభాగ్యం యొక్క ప్రాప్తిని అనుభవిస్తారు. సాకారంలో హీరో పాత్ర అభినయించే సంబంధం బ్రహ్మతో ఉందా లేక నిరాకారుడితో ఉందా? ఎక్కువ సమయం సాకారునితో పాత్ర అభినయించాలా లేక నిరాకారునితో అభినయించాలా? కనుక సాకారుడు లేకుండా సర్వ భాగ్యం యొక్క ఖజానాకి యజమానిగా ఏవిధంగా అవుతారు? కనుక ఖండిత తాళంచెవి ఉపయోగించకూడదు. భాగ్య విధాత, బ్రహ్మ ద్వారానే భాగ్యం పంచి పెట్టారు. కనుక బ్రహ్మాకుమారీ, కుమారులు కాకుండా భాగ్యం తయారవ్వదు.

మీ స్మృతిచిహ్నంలో కూడా ఇదే మహిమ ఉంది - బ్రహ్మ భాగ్యం పంచేటప్పుడు నిద్రపోయారు అని, నిద్రపోయారా లేక పోగొట్టుకున్నారా? కనుక వ్యతిరేక తాళం చెవి ఉపయోగించకండి. డబుల్ తాళంచెవిని ఉపయోగించండి. డబుల్ తండ్రులు కూడా మరియు మీరు మరియు బాబా డబుల్! ఈ సహజ విధి ద్వారానే సదా భాగ్యం యొక్క ఖజానా పొంది పదమాపదమ్ భాగ్యశాలిగా అవుతారు. కారణాన్ని నివారణ చేసుకుంటే సదా సంపన్నంగా అవుతారు.

ఈవిధంగా భాగ్య విధాత యొక్క శ్రేష్ట భాగ్యవంతులైన పిల్లలకు, సహజవిధి ద్వారా విధాతను తమ వారిగా చేసుకునే వారికి, భాగ్యం యొక్క సర్వ ఖజానాలతో ఆడుకునే వారికి, బాబా - బాబా అనటం కాదు కానీ బాబాని తమ వారిగా చేసుకుని ఖజానాలు పొందే వారికి, ఈ విధమైన సదా అధికారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.