17.10.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వ పరిస్థితులకు సమాధానం - ఎగిరే పక్షిగా అన్వండి.

అవ్యక్త వతనవాసి, సదా అతీతుడు మరియు సర్వులకు ప్రియమైన శివబాబా మాట్లాడుతున్నారు -

బాప్ దాదా పిల్లలందరికీ నయనాల భాషతో ఈ లోకానికి అతీతంగా అవ్యక్తవతనవాసి అయ్యే సైగ చేస్తున్నారు. ఏవిధంగా అయితే బాప్ దాదా అవ్యక్తవతనవాసియో అదేవిధంగా తతత్వం అనే వరదానం ఇస్తున్నారు. ఫరిస్తాల ప్రపంచంలో ఉంటూ ఈ సాకార ప్రపంచంలోకి కర్మ చేయడానికి రండి. కర్మయోగి అయ్యి కర్మ చేయండి మరలా ఫరిస్తా అయిపోండి - ఈ అభ్యాసం సదా చేస్తూ ఉండండి. నేను ఫరిస్తాల ప్రపంచంలో ఉండే అవ్యక్త ఫరిస్తాను అనే స్మృతిలో సదా ఉండండి. ఫరిస్తా అంటే ఈ వికారి ప్రపంచం అంటే వికారిదృష్టి లేక వృత్తికి అతీతంగా ఉండేవారు. ఈ అన్ని విషయాలకి అతీతంగా ఉండేవారు. సదా వారు బాబాకి ప్రియంగా మరియు వారికి బాబా ప్రియంగా ఉంటారు. ఇద్దరు ఒకరి స్నేహంలో ఒకరు ఇమిడి ఉంటారు. ఈ విధమైన ఫరిస్తాగా అయ్యారా? ఏవిధంగా అయితే బాబా అతీతంగా ఉంటూ శరీరంలో ప్రవేశించి కార్యం చేయడానికి వస్తారో అదేవిధంగా ఫరిస్తా ఆత్మలు కూడా కర్మబంధన యొక్క లెక్కతో కాకుండా సేవా బంధనతో శరీరంలో ప్రవేశించి కర్మ చేస్తారు మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతం అయిపోతారు. ఈ విధంగా కర్మ బంధన ముక్తులుగా అయిన వారినే ఫరిస్తా అంటారు.

బాబా వారిగా అయ్యారు అంటే దేహం మరియు దేహ ప్రపంచం యొక్క సంబంధం సమాప్తి అయిపోయింది. అందువలనే దీనిని మరజీవ జన్మ అంటున్నారు. కనుక పాత కర్మల యొక్క ఖాతా సమాప్తి అయిపోయింది, క్రొత్త బ్రాహ్మణజీవితం యొక్క ఖాతా ప్రారంభం అయ్యింది. మరజీవగా అయ్యాము ఇది అయితే అందరికీ తెలుసు, అంగీకరిస్తారు కూడా కదా! అయ్యారా లేక అవుతూ ఉన్నారా? ఏమంటారు? చనిపోతూ ఉన్నారా? చనిపోయారు అంటే వెనుకటి ఖాతా సమాప్తి అయిపోయింది. బ్రాహ్మణ జీవితం కర్మబంధన యొక్క జీవితంగా ఉండదు, కర్మయోగి జీవితంగా ఉంటుంది. యజమానిగా అయ్యి కర్మ చేస్తే కర్మబంధన అవ్వదు. ఏది కావాలంటే, ఎలా కావాలంటే, ఎంత సమయం కావాలంటే అంత సమయం కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించే విధంగా ఉంటారు. కనుక బ్రాహ్మణులు అంటే ఫరిస్తా. కర్మబంధన కలిగిన ఆత్మలు కాదు, సేవ యొక్క శుద్దబంధన కలిగినవారు. ఈ దేహం సేవార్థం లభించింది. మీ కర్మబంధన యొక్క కర్మలఖాతా జీవితం సమాప్తి అయిపోయింది. ఇది క్రొత్త జీవితం. ఇలా అందరు భావిస్తున్నారు కదా! ఇప్పటి వరకు పాత ఖాతా ఉండిపోలేదు కదా? మహారాష్ట్ర వారు ఏమని భావిస్తున్నారు? టీచర్స్ ఏమని భావిస్తున్నారు? కర్మల ఖాతా పూర్తి చేసుకోవటంలో తెలివైనవారా లేక బలహీనంగా ఉన్నారా? సమాప్తి చేసుకోవటం వస్తుంది కదా? ఫరిస్తా అయిపోతే శ్రమ నుండి విడిపించుకుంటారు. నడిచేవారు, పరుగుపెట్టేవారు, జంప్ చేసేవారు వీరందరికంటే ఉన్నతంగా ఎగిరేవారిగా అయిపోతే శ్రమ నుండి ముక్తులు అయిపోతారు కదా! అనాదిరూపంలో అయితే ఇక ఎగిరేవారే అంటే ఆత్మ ఎగిరే పక్షి కానీ నడిచేపక్షి కాదు కానీ బరువు కారణంగా అనాది సంస్కారాన్ని మర్చిపోయింది. ఫరిస్తాకు బదులు కర్మబంధన కలిగినవారిగా, ఎగిరే పక్షిగా ఉండడానికి బదులు పంజరంలో పక్షిలా అయిపోయింది. ఇప్పుడు మరలా ఎగిరేపక్షి యొక్క అనాది సంస్కారాన్ని ప్రత్యక్షం చేయండి అంటే ఫరిస్తా రూపంలో స్థితులై ఉండండి. తతత్వం యొక్క వరదానిగా అవ్వండి. దీనినే సహాజపురుషార్ధం అని అంటారు. భిన్న, భిన్న పరిస్థితులలో ఏమి చేయము, ఎలా చేయము...... ఇలా శ్రమ చేస్తూ పరిస్థితి పెద్దదిగా మరియు మీరు చిన్నవారిగా అయిపోతున్నారు. పరిస్థితి శక్తిశాలిగా మరియు మీరు బలహీనంగా అయిపోతున్నారు. ఏ పరిస్థితిలో అయినా ప్రకృతి ఆధారంగా ఏదైనా పరిస్థితి వచ్చినా, మీ తనువు యొక్క సంబంధంతో ఏదైనా పరిస్థితి వచ్చినా, లౌకిక, అలౌకిక సంబంధం ఆధారంగా ఏదైనా పరిస్థితి వచ్చినా, మీ యొక్క లేదా ఇతరుల యొక్క సంస్కారాల ఆధారంగా ఏదైనా పరిస్థితి వచ్చినా, సర్వ పరిస్థితులలో ఎందుకు, ఏమిటి అనే దానికి ఒకే సమాధానం - ఎగిరే పక్షిగా అవ్వండి. అప్పుడు పరిస్థితి క్రింద ఉండిపోతుంది, మీరు ఉన్నతంగా ఉంటారు. పై నుండి చూసినప్పుడు క్రింద ఉన్న వస్తువు ఎంత పెద్దది అయినా చిన్నదిగానే కనిపిస్తుంది. అందువలన సర్వ పరిస్థితులను సహజంగా దాటే సహజమైన మార్గం ఫరిస్తా అవ్వండి, ఎగిరే పక్షిగా అవ్వండి. కనుక సహజ పురుషార్థం ఏమిటో అర్థమైందా! ఇది నా స్వభావం, సంస్కారం, బంధన అంటున్నారు. మరజీవ అయిన తర్వాత కూడా ఈ నాది అనే బంధనను సమాప్తి చేయలేదా? ఫరిస్తా యొక్క భాష నాది, నాది అని కాదు. ఫరిస్తా అంటే నాది అనే దాని నుండి నీది అయిపోతుంది. నాది, నాది అనేది నరకవాసీగా చేస్తుంది మరియు నీది నీది అనేది సింహాసనాధికారిగా చేస్తుంది. కనుక ఫరిస్తాగా అవ్వటం అంటే నాది, నాది అనే బంధన నుండి ముక్తులుగా అవ్వటం. అలౌకిక జీవితంలో కూడా నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు. ఈవిధమైన ఫరిస్తాగా అయ్యారా? మహారాష్ట్ర వారు ఏవిధంగా అవుతారు? ఫరిస్తాగా అవ్వటం వస్తుంది కదా? అన్ని సమస్యలకు ఒకే సమాధానం స్మృతి ఉంచుకోవాలి - ఎగిరే పక్షిగా అవ్వాలి మరియు తయారుచేయాలి. అర్ధమైందా!

ఈ విధంగా బాబా సమానంగా అవ్యక్త రూపధారి ఫరిస్తా స్వరూపులకు, నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరు లేరు అనే స్మృతిలో ఉండేవారికి, ఈ విధమైన అతీతము మరియు ప్రియమైన స్థితిలో ఉండేవారికి, సదా కర్మేంద్రియాజీత్, కర్మయోగి, కర్మాతీతస్థితి యొక్క అభ్యాసంలో ఉండేవారికి, సదా బంధనముక్తులుగా అయ్యి సేవ యొక్క సంబంధంలో ఉండేవారికి, ఈవిధంగా బాబా సమానంగా తతత్వం యొక్క వరదాని పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.