ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ - చైతన్య నక్షత్ర
మండలానికి అలంకరణ.
జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు అవ్యక్త బాప్ దాదా
జ్ఞానసితారలతో మాట్లాడుతున్నారు -
ఈరోజు జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు తన యొక్క
నక్షత్రమండలాన్ని చూడడానికి వచ్చారు. సితారల మధ్యకి జ్ఞానసూర్యుడు,
జ్ఞానచంద్రుడు ఇద్దరు వెనువెంట వచ్చారు. సాకారసృష్టిలో సూర్యుడు, చంద్రుడు మరియు
సితారలు కలిసి ఉండవు. కాని ఇక్కడ చైతన్య సితారలు, సూర్యుడు, చంద్రుడు వెనువెంట
ఉన్నారు. ఇది సితారల యొక్క అలౌకిక సంఘటన. కనుక ఈరోజు బాప్ దాదా రకరకాలైన
సితారలను చూస్తున్నారు. ప్రతి సితారలో ఎవరి విశేషత వారికి ఉంది. చిన్న, చిన్న
సితారలు కూడా ఈ నక్షత్రమండలాన్ని చాలా మంచి శోభాయమానంగా తయారుచేస్తున్నాయి.
పెద్దవి పెద్దవే కానీ చిన్న సితారల యొక్క మెరుపు ద్వారా సంఘటన యొక్క శోభ
పెరుగుతుంది. ప్రతి ఒక్క సితార ఎంతో అవసరం అని బాబా ఇదే విషయాన్ని చూసి చాలా
సంతోషిస్తున్నారు. చాలా చిన్న సితార కూడా చాలా అవసరం. మహత్వ పూర్వకమైన కార్యం
చేసేవారు కనుక ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి యొక్క గొప్పతనాన్ని చూస్తున్నారు.
ఏ విధంగా అయితే హద్దు యొక్క కుటుంబంలో తల్లి, తండ్రి ప్రతి బిడ్డ యొక్క గుణాలు,
కర్తవ్యం, నడవడిక గురించే మాట్లాడుకుంటారు కదా! అదేవిధంగా బేహద్ తల్లి, తండ్రి
అయిన జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు బేహద్ పరివారం యొక్క సితారలందరి యొక్క
విశేషతల గురించి మాట్లాడుకుంటున్నారు. బ్రహ్మాబాబా అంటే చంద్రుడు ఈరోజు
నలువైపుల విశ్వం యొక్క కోనకోనలో మెరుస్తున్న తన యొక్క సితారలను చూసి సంతోషం
యొక్క ఊయలలో విశేషంగా ఊగుతున్నారు. జ్ఞానసూర్యుడైన బాబాకి ప్రతి ఒక్క సితార
అవసరం మరియు సితారల యొక్క విశేషతలు వినిపిస్తూ ఎంత హర్షితం అవుతున్నారంటే నన్ను
అడగవద్దు అంటున్నారు. ఆ సమయం యొక్క చిత్రం బుద్దియోగం ద్వారా తీయగలుగుతున్నారా!
సాకారంలో ఎవరైతే అనుభవం చేసుకున్నారో వారికి మంచిగా తెలుస్తుంది. ముఖం ఎదురుగా
వచ్చింది కదా? ఏమి కనిపిస్తుంది? నయనాలలో ముత్యాలు మెరిసేంతగా హర్షితం
అవుతున్నారు. ఈరోజు రత్నాల వ్యాపారి వలె తన రత్నాల యొక్క మహిమ చేస్తున్నారు.
మాకు ఏ మహిమ జరిగిందో అని మీరు అనుకుంటున్నారు కదా! మీ మహానత యొక్క మహిమ తెలుసా?
అందరికీ విశేషంగా ఒక విషయం యొక్క విశేషత లేదా మహానత
చాలా స్పష్టంగా ఉంటుంది. మహారథులైనా లేదా కాలిబలంవారైనా, చిన్న సితారలైనా లేదా
పెద్ద సితారలైనా కానీ అందరికీ బాబాని తెలుసుకునే విశేషత మరియు బాబా వారిగా అయ్యే
విశేషత ఉంది కదా! గొప్ప గొప్ప శాస్త్రాల యొక్క అథార్టీ ఉన్నవారు, పెద్ద, పెద్ద
వినాశీ టైటిల్స్ యొక్క అథార్టీ ఉన్నవారు కూడా బాబాని తెలుసుకోలేదు కానీ మీరందరు
తెలుసుకున్నారు. వారు ఇంత వరకు ఆహ్వానం చేస్తూనే ఉన్నారు. శాస్త్రవాదులైతే
ఇప్పటి వరకు లెక్క పెడుతూనే ఉన్నారు. విజ్ఞానులు తమ యొక్క ఆవిష్కరణలలో ఎంతగా
బిజీ అయిపోయారంటే వారికి బాబా యొక్క విషయాలు వినడానికి, అర్ధం చేసుకోవడానికి
ఖాళీయే లేదు. తమ యొక్క కార్యంలోనే నిమగ్నమై ఉన్నారు. ధర్మనేతలు తమ యొక్క ధర్మం
ఎక్కడ ప్రాయ:లోపం అయిపోతుందో అని ధర్మాన్ని సంభాళించుకోవడంలోనే నిమగ్నమై ఉన్నారు.
ఇలా ఎవరి విషయాలలో వారు బిజీగా ఉన్నారు, కానీ మీరు ఆహ్వానించడానికి బదులు కలయిక
జరుపుకుంటున్నారు. ఈ విశేషత, మహానత అందరికీ ఉంది. మాలో ఏ విశేషత లేదు, మాలో ఏ
గుణం లేదు అని భావించడం లేదు కదా! గుణసాగరుడైన బాబాకి పిల్లలుగా అవ్వటం అంటే
గుణవంతులుగా అవ్వటం. కనుక ప్రతి ఒక్కరిలో ఏదోక గుణం యొక్క విశేషత ఉంటుంది మరియు
బాబా ఆ విశేషతనే చూస్తారు. బాబాకి తెలుసు - రాజ్యపరివారంలో ప్రతి వ్యక్తికి ఎంత
సంపన్నత ఉంటుందంటే వారు బికారీగా అవ్వరు. అదేవిధంగా గుణసాగరుడైన బాబా యొక్క
పిల్లలు ఏ గుణం లేదా విశేషత లేనివారిగా ఎవరూ పిలవబడరు. కనుక అందరూ గుణవంతులు,
మహానాత్మలు, విశేషాత్మలు, చైతన్య నక్షత్ర మండలం యొక్క అలంకరణ. మీరందరు ఎవరో
అర్ధమైందా? నిర్భల ఆత్మలు కాదు, శక్తిశాలి ఆత్మలు. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు.
ఇటువంటి ఆత్మిక నషా సదా ఉంటుందా? ఆత్మీయతలో అభిమానం ఉండదు, స్వమానం ఉంటుంది.
స్వమానం అంటే స్వ అంటే ఆత్మ యొక్క గౌరవం. స్వమానం మరియు అభిమానంలో తేడా ఉంది.
సదా స్వమానం యొక్క సీట్ పై సెట్ అయ్యి ఉండండి. అభిమానం యొక్క సీట్ ని వదిలేయండి.
అభిమానం యొక్క సీట్ పైపైకి చాలా అలంకరించి కనపడుతుంది. చూడడానికి
విశ్రాంతినిచ్చేదిగా, మనస్సుకి ఇష్టమైనదిగా ఉంటుంది. కానీ లోపల ముళ్ళు యొక్క
సీట్ గా ఉంటుంది. ఈ అభిమానం యొక్క సీట్ ఎలాంటిదంటే ఒకరినొకరు చూసి మాకు కూడా
కావాలి అని అనుకుంటారు. ఫలానా ఫలానా వారు అనుభవం చేసుకున్నారు మేమెందుకు
చేసుకోకూడదు అనుకుంటారు. వదలలేరు, కూర్చున్నప్పుడు మాత్రం ముళ్ళులాగానే
అనిపిస్తుంది. కనుక ఇలా పైకి కనిపించే, మోసం చేసే అభిమానం యొక్క సీట్ పై
కూర్చోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి. స్వమానం యొక్క సీట్ పై సదా సుఖీగా, సదా
శ్రేష్టంగా, సదా సర్వప్రాప్తి స్వరూపంగా అనుభవం చేసుకోండి. బాబాని
తెలుసుకున్నారు, కలుసుకుంటున్నారు. మీ యొక్క ఈ విశేషతను స్మృతిలో ఉంచుకుని సదా
సంతోషంలో ఉండండి. చంద్రుడు సితారలను చూసి సంతోషిస్తున్నారు అని చెప్పాను కదా!
అదేవిధంగా మీరు బాబాని అనుసరించండి.
ఈవిధంగా స్వమానం యొక్క సీట్ పై స్థితులై ఉండేవారికి,
సదా తమని తాము విశేషాత్మగా భావించి విశేషత ద్వారా ఇతరులను కూడా విశేషాత్మగా
చేసేవారికి, చంద్రుడు మరియు సూర్యుడిని సదా అనుసరించేవారికి, నమ్మకధారి,
ఆజ్ఞాకారి, సుపుత్రులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.