24.10.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సత్యమైన ప్రేయసుల చిహ్నాలు.

ఈరోజు బాబా ఎక్కడకు వచ్చారు మరియు ఎవరిని కలుసుకునేందుకు వచ్చారో మీకు తెలుసా? విశేషంగా ఏ రూపంలో కలుసుకునేందుకు వచ్చారు? బాబా రూపం ఎలాంటిదో పిల్లల రూపం అటువంటిదే. కావున ఈరోజు బాబా కలుసుకునేందుకు ఏ రూపంలో వచ్చారో మీకు తెలుసా? పరమాత్మకు అనేక రూపాలు అన్న పొరపాటును ఏదైతే జనులు చేశారో అది పొరపా లేక సరైనదా? ఈ సమయంలో బాబా అనేక సంబంధాలతో, అనేక రూపాలతో కలుసుకుంటున్నారు. కావున సంబంధాల ఆధారంపై లేక కర్తవ్యం ఆధారంపై ఒక్కరి యొక్క అనేక రూపాలు ప్రత్యక్షంగా ఉన్నాయి కదా! మరి భక్తులు కూడా రైటే కదా! ఈరోజు బాబా ఏ రూపంలో కలుసుకునేందుకు వచ్చారు మరియు ఎక్కడ కలుసుకుంటున్నారు? నేటి ఉదయం మురళిలో ఆ సంబంధాన్ని గూర్చి విన్నారు. కావున తండ్రి ఏమౌతారు మరియు మీరేమౌతారు? ఈరోజు ఆత్మిక ప్రియుడు ఆత్మిక ప్రేయసులతో కలుసుకునేందుకు వచ్చారు. కలుసుకునేందుకు ఎక్కడకు వచ్చారు? ఆ కలుసుకునే స్థానము, అన్నింకన్నా ప్రియమైనది ఏది? ఆత్మిక ప్రియుడు ప్రేయసులైన మిమ్మల్ని ఆది సమయంలో ఎక్కడకు తీసుకువెళ్ళేవారో మీకు గుర్తుంది కదా! (సాగరం వద్దకు). కావున నేడు కూడా అన్ని ఖజానాలు మరియు గుణాలతో సంపన్నమైన సాగర తీరంలో వాటితోపాటు ఉన్నతమైన స్థితిరూపీ పర్వతంపై, శీతలతరూపీ వెన్నెలలో ఆత్మిక ప్రియుడు ఆత్మిక ప్రేయసులతో కలుసుకుంటున్నారు. సాగరము సంపన్నతతో కూడినదైతే పర్వతము ఉన్నత స్థితికి సంబంధించినది, సదా శీతల స్వరూపము చంద్రుని వెన్నెలది. మూడూ తోడుగా ఉన్నాయి కదా! నేడు ఆత్మిక ప్రేయసులను చూసి ఆత్మిక ప్రియుడు హర్షితులవుతున్నారు, వారు ఏ గీతమును గానం చేస్తున్నారు? (ప్రతిఒక్కరూ తమ తమ గీతాన్ని వినిపిస్తున్నారు). సాధారణంగా ఒకే గీతమును వినగలరు కాని బాబా అందరి గీతాలను వినగలరు. ప్రేయసులు తమ గీతాన్ని ఆలపిస్తున్నారు మరియు ప్రియుడు ఆ గీతానికి బదులిస్తున్నారు. ఏ గీతాలు పాడినా అన్నీ సరైనవే. ప్రతిఒక్కరి స్నేహపు గీతాలను బాబా కూడా స్నేహంతోనే వింటారు. ప్రేయసులకు ప్రియుడిని తలుచుకోవడం సహజమే కదా! ఈ ఆత్మిక ప్రేయసీ ప్రియులది సహజమైన నిరంతర స్హృతి యొక్క సంబంధము మరియు స్వరూపము. స్హృతి చేయవలసిన అవసరం ఏర్పడదు కాని మరిచిపోవాలన్నా మరిచిపోలేరు.

ఈరోజు ప్రతి ప్రేయసి యొక్క స్నేహమును చూసి ఏం గమనించారు? ప్రేయసులు అనేకులు మరియు ప్రియుడు ఒక్కరే. కాని, వీరు నా ప్రియుడే అని అనిపించేలా అనేక అనుభవాలు ఉన్నాయి! ఎందుకంటే ఆత్మిక ప్రియుడు స్నేహసాగరుడు. సాగరము హద్దులులేనిదిగా ఉంటుంది. కావున ఎంతమంది, ఎంత స్నేహం కావాలంటే అంత స్నేహాన్ని తీసుకున్నా సాగరము తరగనంతగా సంపన్నమైనది. కావున నాకు తక్కువ, మీకు ఎక్కువ అన్న మాటలే ఉండవు. తీసుకునేవారు ఎంత తీసుకున్నా స్నేహ భండారము నిండుగా ఉంటుంది. తీసుకునేవారు తీసుకోవడంలో నెంబర్వారీగా అయిపోతారు. కాని, ఇచ్చేవారు అందరికీ నెంబర్వన్గా ఇస్తారు. తీసుకునేవారు ఇముడ్చుకోవడంలో నెంబర్వారీగా అయిపోతారు. ప్రేమించడమైతే అందరికీ వస్తుంది. కాని, తోడును నిర్వర్తించడంలో నెంబర్ ఏర్పడుతుంది. 'నా ప్రియుడు' అని అందరూ అంటారు. కాని, నా అని అంటూ కూడా ఏంచేస్తారు? ఏం చేస్తారో తెలుసా? ఈరోజైతే ఆత్మిక సంభాషణ చేసేందుకు వచ్చారు, మురళి వినిపించేందుకు రాలేదు. మరి ఏంచేస్తారో చెప్పండి. నావారు అని కూడా అంటారు. కాని అప్పుడప్పుడు భ్రమణం చేసి కూడా వస్తారు. మళ్ళీ అన్నీ చ్టుటి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అలిసిపోతారో అప్పుడు, నా ప్రియుడు అని అంటారు. మరికొందరు ప్రేయసులు ఎన్నో వయ్యారాలు పోతుటాంరు. ఏం చేస్తారు? (దాదీ దీదీలతో) సాకారంలో మీముందే ఎన్నో వయ్యారాలు పోతుటాంరు కదా! మేము ఇలా చేస్తాము, మేము ఇలా నడుచుకుంటాము, మమ్మల్ని మార్చడం మీ పని, మేమైతే ఇలాగే ఉంటాము అంటూ బాబా మాటలను బాబాకే వినిపించే వయ్యారాలు చూపిస్తారు. ''ఎలా ఉన్నా అలా మీవారము'' అన్న ఈ మాటను చాలా బాగా గుర్తుంచుకుంటారు. నావారిగా ఉన్నా జోడిగా అయితే సరిగ్గా అవ్వాలి కదా! జంట సమానంగా లేకపోతే ఆ దృశ్యాన్ని చూసేవారు ఏమంటారు? ప్రియుడు అలంకరింపబడి మరియు ప్రేయసి అలంకరించబడకుండా ఉంటే శోభిస్తుందా? ప్రియుడేమో మెరుస్తున్న వస్త్రాలు ధరించి, ప్రేయసి నల్లని వస్త్రాలను లేక మచ్చలతో ఉన్న వస్త్రాలను ధరిస్తే బాగుంటుందా! మీరు స్వయం ఆలోచించండి. మీరేం భావిస్తారు, ఆ తర్వాత ఏమంటారు? మా మచ్చలను చెరిపేయడం మీ పనే కదా అని అంటారు. ప్రియుడు ఆ వస్త్రాలనే మార్చివేస్తున్నప్పుడు మరి దాన్ని ఎందుకు ధరించడం లేదు? ఆ మచ్చలను చెరపడంలో కూడా సమయాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ప్రియుడికి చెందినవారిగా అవ్వడం అనగా అందరి పరివర్తనా జరగడము. కావున పాత, నల్లని, అనేక మచ్చలతో కూడిన వస్త్రాల స్హృతిని ఎందుకు తీసుకువస్తారు! అనగా పదే పదే దానిని ఎందుకు ధరిస్తారు? మెరుస్తున్న వస్త్రాలను ధరించి ప్రకాశిస్తున్న అలంకారధారులుగా అయి ప్రియునితోపాటు ప్రకాశిస్తున్న లోకంలో ఎందుకు ఉండడం లేదు? అక్కడ ఎటువంటి మచ్చలు అంటుకోజాలవు.

కావున హే ప్రేయసులారా! సదా ప్రియుని సమానంగా సంపన్నంగా మరియు సదా ప్రకాశిస్తున్న స్వరూపంలో అనగా సంపూర్ణ స్వరూపంలో స్థితులై ఉండండి. ప్రియుడు ఇంకొక్క విషయంలో కష్టపడవలసి వస్తుంది. ఏ విషయంలో కష్టపడవలసి వస్తుందో మీకు తెలుసా? అది కూడా రమణీకమైన విషయమే. 'తోడుగా తీసుకువెళతాను' అని ప్రియుడు ఏ ప్రతిజ్ఞనైతే చేశారో దాన్ని గూర్చి ఏమంటారు? ప్రియుడేమో చాలా తేలికగా ఉంటాడు మరియు ప్రేయసులు ఎంత భారీగా అయిపోతారంటే వారిని తీసుకువెళ్ళడానికి ప్రియుడు ఎంతో కష్టపడవలసి వస్తుంది. మరి ఈ జోడి కూడా మంచిగా అనిపిస్తుందా? తేలికగా అవ్వండి అని ప్రియుడు అంటాడు. మరేం చేస్తారు? తేలికగా అవ్వడానికి సాధనమైన ఎక్సర్సైజ్ను చేయరు, మరి తేలికగా ఎలా అవ్వాలి? ఆత్మిక ఎక్సర్సైజ్ను గూర్చి అయితే తెలుసు కదా! ఇప్పుడిప్పుడే నిరాకారులుగా మళ్ళీ ఇప్పుడిప్పుడే అవ్యక్త ఫరిశ్తాలుగా, ఇప్పుడిప్పుడే సాకార కర్మ యోగులుగా మరియు ఇప్పుడిప్పుడే విశ్వసేవాధారులుగా క్షణంలో ఆ స్వరూపంగా అయిపోవడం... ఇది ఆత్మిక ఎక్సర్సైజ్. అలాగే ఇంకే భారమును తమపై పెట్టుకుంటారు? వ్యర్థం యొక్క భారము ఎంతో ఉంది. కావుననే తేలికగా అవ్వలేరు. కొందరు సమయం యొక్క వ్యర్థంలో, కొందరు సంకల్పాల వ్యర్థంలో ఉన్నారు, మరికొందరు శక్తులను వ్యర్థం చేస్తారు, కొందరు సంబంధ సంపర్కాలను వ్యర్థంగా చేసేసుకుంటారు. ఈ విధంగా భిన్న భిన్న రకాలుగా భారాలను పెంచుకున్న కారణంగా ప్రియుని సమానంగా డబుల్ లైట్గా అవ్వలేరు. సత్యమైన ప్రేయసులకు గుర్తు- 'ప్రియుని సమానంగా' అనగా ప్రియుడు ఎలా ఉన్నారో అలా సమానంగా అవ్వడము. కావున మీరందరూ ఎవరు? ప్రేయసులుగా అయితే ఉన్నారు కాని ప్రియుని సమానంగా ప్రేమ కలిగి ఉన్నారా? సమానతయే సామీప్యతను తీసుకువస్తుంది. సమానత లేకపోతే సమీపంగా కూడా ఉండజాలరు. పదహారువేల రాణులు ఉండేవారు అన్న గాయనం కూడా చేస్తారు. పదహారు వేలలో కూడా నెంబరైతే ఉంటుంది కదా! ఒకే ప్రియునికి ఎంతోమంది ప్రేయసులను చూపించారు. కాని, దాని అర్థాన్ని తెలుసుకోరు, ఆత్మికతను మరిచిపోయారు. కావున నేడు ఆత్మిక ప్రియుడు ఆత్మిక ప్రేయసులతో 'సమానంగా అవ్వండి' అనగా సమీపంగా అవ్వండి అని అంటారు. అచ్ఛా!

వెన్నెలలో కూర్చున్నారు కదా! శీతల స్వరూపంలో ఉండడం అనగా వెన్నెలలో కూర్చోవడము. సదా వెన్నెల రాత్రిలో ఉండండి. వెన్నెల రాత్రిలో వస్త్రాలు కూడా ప్రకాశవంతంగా అయిపోతాయి. ఎక్కడ చూస్తే అక్కడ మెరుస్తూ కనిపిస్తారు. మరియు సదా సాగర తీరంలో ఉండండి అనగా సదా సాగర సమానంగా సంపన్న స్థితిలో ఉండండి. ఎక్కడ ఉండాలో అర్థమైందా! ప్రియునికి ఈ తీరమే ప్రియముగా అనిపిస్తుంది. అచ్ఛా!

సదా ప్రియుని సమానంగా తోడు తోడుగా చేతిలో చేయి వేసి, స్నేహిగా, సహయోగిగా ఉండేవారికి. తోడు అనగా స్నేహము, చేయి అనగా సహయోగము ఇలా మాకు ఒక్క ప్రియుడు తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఇటువంటి స్థితిలో సదా సహజంగా ఉండేవారికి, ఇటువంటి సత్యమైన ప్రేయసులకు ఆత్మిక ప్రియుని యొక్క ప్రియ స్హృతులు మరియు నమస్తే.

వచ్చారు. మా వద్ద యమునాతీరం ఉందే కాని సాగర తీరమైతే లేదు కదా అని ఢిల్లీవారు భావించడం లేదు కదా! సంగమ యుగంలో సాగరం ఉంది, భవిష్యత్తులో నదీ తీరం ఉంటుంది. సంగమ యుగంలో సాగర తీరంలోనే మీరు ఆటలు ఆడారు కదా! కావున సంగమ యుగంలో సాగర తీరము ఉంది మరియు భవిష్యత్తులో యమునా తీరం ఉంటుంది. కావున ఢిల్లీ మరియు గుజరాత్వారి సంబంధం ఏమి? ఢిల్లీ యమునా తీరము మరియు గుజరాత్వారు గర్భా నాట్యం చేస్తారు. కావున యమునా తీరంలో చేసే రాస్(నాట్యము) ఎంతో ప్రసిద్ధమైనది కదా! కావున ఢిల్లీ మరియు గుజరాత్ ఇరువురూ వచ్చేసారు. అచ్ఛా! విదేశంవారు కూడా వచ్చారు. ఏవిధంగా విదేశంవారు- మీరు రండి, వచ్చి అన్నీచ్టుటివెళ్ళండి అని ఇప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు కదా! దీదీ రావాలని, దాదీలు రావాలని, ఫలానావారు రావాలని... ఆహ్వానిస్తూ ఉంటారు. ఏవిధంగా ఇప్పుడు కొద్ది సమయంవరకు అలా చ్టుటివస్తారో అలాగే భవిష్యత్తులో కూడా చ్టుటివచ్చేందుకు వెళతారు, క్షణంలో చేరుకుంటారు, ఎక్కువ సమయం పట్టదు. ఎందుకంటే అక్కడ ప్రమాదాలు జరగవు. కావున వేగమును నియంత్రించవలసిన అవసరం అక్కడ ఉండదు. ఒకేరోజులో మొత్తం అంతా చ్టుటిరాగలరు. మొత్తం ప్రపంచమంతినీ ఒక్కరోజులో చ్టుటిరాగలరు. ఈ అామిక్ ఎనర్జీ మీకు ఉపయోగపడనున్నది. వారంతా దానిని రిఫైన్ చేయడంలో నిమగ్నమై ఉన్నారు కదా! అవి మీకు ఎటువంటి దు:ఖమును ఇవ్వవు. అన్నింకన్నా ఎక్కువగా ఏ తత్వము సేవ చేస్తుంది? సూర్యుడు, సూర్య కిరణాలు భిన్న భిన్న రకాలుగా అద్భుతం చేసి చూపిస్తాయి. ఇవన్నీ మీకొరకే ఏర్పాటవుతున్నాయి. గ్యాసు వెలిగించే, బొగ్గులు, కర్రలు కాల్చే అవసరమే ఉండదు, అన్నింనుండి విముక్తులైపోతారు. అచ్ఛా- ఎన్నో అద్భుతాలను చూస్తూ ఉంటారు. వారు కష్టపడతారు మరియు మీరు ఫలాన్ని అనుభవిస్తారు. అప్పుడు ఈ వైర్లు మొదలైనవి వేయవలసిన శ్రమ కూడా ఉండదు. ఎటువంటి శ్రమ లేకుండా సహజమైన ప్రకృతి ద్వారా సహజప్రాప్తి ఏర్పడుతుంది. కాని, దీనికొరకు ప్రకృతి సుఖాన్ని తీసుకునేందుకు కూడా మీ వాస్తవిక నేచర్ను తయారుచేసుకోండి అప్పుడు ఈ నేచర్ ద్వారా సర్వసుఖాలను పొందగల్గుతారు. న్యాచురల్ నేచర్ అనగా అనాది సంస్కారము. వింటుంటేనే ఇంత మంచిగా అన్పిస్తే ఆ ప్రాలబ్ధము లభించినప్పుడు ఇంకెంత మంచిగా అనిపిస్తుంది! ఏవిధంగా ఇక్కడ పకక్షులు ఎగురుతాయో అలా అక్కడ విమానాలెగురుతాయి! ఎన్ని ఉంటాయి? ఏవిధంగా ఇక్కడ పకక్షుల గుంపు ఒక లైన్లో వెళుతుందో అలా అక్కడ విమానాల గుంపు వెళుతుంది. ఒకటి వెళితే ఇంకొకి వెళ్ళలేకుండా ఉండడం ఉండదు. ఇలా భిన్న భిన్న డిజైన్లలో విహంగయానం చేస్తాయి. రాజ్య కుటుంబంవారు తమ డిజైన్లో వెళతారు, షావుకార్లు తమ డిజైన్లో వెళతారు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దించుకోండి. ఇప్పుడు ప్రకృతిజీతులుగా అయినట్లయితే ప్రకృతి దాసిగా అవుతుంది. ఇప్పుడు ప్రకృతిజీతులుగా తక్కువగా ఉన్నట్లయితే ప్రకృతి దాసిగా కూడా తక్కువగా ఉంటుంది. అర్థమైందా? అచ్ఛా! మధువన నివాసులు ఎవరు? మధువన నివాసులకు ఏ టైటిల్ ఇద్దాము, క్రొత్త టైటిల్ ఏదైనా వినిపించండి. ఈ సమయంలో మధువనంలో క్రొత్తగా ఏ పరికరమును తీసుకువచ్చారు? ఫొటోస్ట్టా మిషిన్ను ప్టోరు కదా! కావున మధువన నివాసులు ఫొటోస్ట్టా కాపీలవంటి వారు. ఏవిధంగా బాబా ఉన్నారో అలా పిల్లలు ఉన్నారు. ఆ మిషిన్లో యథాతథంగా కాపీ అవుతుంది కదా! కొద్దిగా కూడా మార్పులేకుండా కాపీ చేయడం ఆ మిషిన్ యొక్క విశేషత. మరి మధువన నివాసులు కూడా ఫొటో కాపీయే! మధువనము మిషిన్ మరియు మధువన నివాసులు ఫొటో. కావున మీ ప్రతి కర్మ విధాత యొక్క కర్మ రేఖలను తెలియజేయాలి. కర్మ ద్వారానే భాగ్యరేఖను దిద్దుతారు. కావున మీ ప్రతి కర్మ శ్రేష్ఠభాగ్య కర్మరేఖలను దిద్దేవిధంగా ఉండాలి. ఏవిధంగా బాప్దాదా యొక్క ప్రతికర్మ స్వయంకొరకు మరియు అనేకులకొరకు భాగ్యరేఖను దిద్దేవిధంగా ఉందో అలా బాబా సమానంగా అవ్వండి. మధువనంలో ఎన్ని సాధనాలు, ఎన్ని సహయోగాలు, ఎంతి శ్రేష్ఠ సాంగత్యము లభించింది! మధువనపు భండారంలో అప్రాప్తి అనే వస్తువేదీ లేదు కావున సర్వవ్యాప్తి సంపన్నులు ఎలా అయిపోతారు! సంపూర్ణంగా అయిపోతారు కదా! ఏ విషయంలో లోటు ఉంది? లోటు అంటూ ఏదైనా ఉంటే అది స్వయం యొక్క ధారణలోనే ఉంది. మధువనంవారికి సదా ఒక నిజ సంస్కారము ఎమర్జ్ రూపంలో ఉండాలి. అది ఏమి? కర్మలో సఫలతను పొందేందుకు బ్రహ్మాబాబాలో ఏ స్వాఙభావిక సంస్కారము ఉండేది. మీ అందరికీ కూడా అదే సంస్కారము ఉండాలి. హాజీ అని అనడంతోపాటు 'ముందు మీరు', 'మొదట నేను' అని కాదు 'మొదట మీరు'. ఏవిధంగా బ్రహ్మాబాబా జగదాంబను ముందు ఉంచారో, ఏ స్థానంలోనైనా మొదట పిల్లలు. ప్రతి విషయంలోను పిల్లలను తమకన్నా ముందు ఉంచారు, జగదాంబను తమకన్నా ముందు ఉంచారు. 'మొదట మీరు' అని అనగలిగేవారే 'హాజీ' అని అనగలరు. కావున ముఖ్యమైన విషయము 'మొదట మీరు' కాని శుభభావనతో అనాలి. ఏదో నామమాత్రంగా అనడం కాదు. శుభచింతక భావనతో, శుభభావన మరియు శ్రేష్ఠకామన యొక్క ఆధారంపై 'మొదట మీరు' అని అనేవారు స్వయమే ముందుకువెళ్ళిపోతారు. మొదట మీరు అని అనడమే మొది నెంబర్లోకి రావడం. ఏవిధంగా బాబా జగదాంబను ముందు ఉంచినా, పిల్లలను ముందు ఉంచినా మళ్ళీ తానే నెంబర్ వన్గా అయిపోయారు కదా! ఇందులో ఏ విధమైన స్వార్థమునూ ఉంచలేదు, నిస్వార్థంగా మొదట మీరు అని చేసి చూపించారు. అలా మొదట మీరు అన్న పాఠమును పక్కా చేసుకోండి. వీరు చేసారంటే నేను చేసినట్లే. వీరు ఎందుకు చేసారు, నేనే చేయాలి, నేనెందుకు చేయకూడదు, నేను చేయలేనా అన్న భావము కాదు. తాను చేసినా బాబా సేవయే, నేను చేసినా బాబా సేవయే. ఇక్కడ ఎవరికీ తమ తమ వ్యాపారాలు లేవు కదా! ఇదంతా ఒక్క తండ్రి కార్యమే, అందరూ ఈశ్వరీయ సేవలోనే ఉన్నారు, గాడ్లీ సర్వీస్ అనే వ్రాస్తారు కదా, నా సర్వీస్ అనైతే వ్రాయరు కదా! ఏ విధంగా తండ్రి ఒక్కరో అలా సేవ కూడా ఒక్కటే అలాగే వారు చేసినా, నేను చేసినా అది కూడా ఒక్కటే. ఎవరు ఎంతగా చేస్తే వారిని అంతగా ఇంకా ముందుకు పోనివ్వండి. నేను ముందుకుపోవాలి అన్నది కాదు, ఇతరులను ముందుకు తీసుకువెళ్ళి మీరు ముందుకు వెళ్ళండి, అందరినీ తోడుగా తీసుకువెళ్ళాలి కదా! బాబా తోడుగా అందరూ వెళతారు అనగా పరస్పరంలో కూడా తోడుగా ఉంటారు కదా! ఎప్పుడైతే ఈ భావన ప్రతి ఒక్కరిలోకి వచ్చేస్తుందో అప్పుడు బ్రహ్మాబాబా ఫొటో కనిపిస్తుంది.
మధువన నివాసులను చూడడం అనగా బ్రహ్మాబాబాను చూడడం. ఎందుకంటే కాపీ అంటే అదే కదా! ఆపై ఇక మేము బ్రహ్మాబాబాను చూడనేలేదు అని ఇంకెవ్వరూ అనరు. మీ కర్మలు, మీ స్థితి బ్రహ్మాబాబాను స్పష్టంగా చూపించాలి. ఇది మధువన నివాసుల విశేషత, ఎందుకంటే మధువన నివాసులను అందరూ అనుసరిస్తారు. కావున మధువన నివాసులు ఒక్కొక్కరూ మాస్టర్ బ్రహ్మలు. ఇప్పుడు చూడండి, బ్రహ్మాబాబా ఫొటోను ఎవరికి ఇచ్చినా వారు ప్రేమగా సంభాళిస్తారు, అన్నింకన్నా పెద్ద కానుకగా దీనినే భావిస్తారు. కావున మీరందరూ కూడా బ్రహ్మాబాబా ఫొటోగా అయిపోండి. బ్రహ్మాబాబా సమానంగా అయిపోయినట్లయితే మీరు కూడా అమూల్య కానుకగా అయిపోతారు.