27.10.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


దీపావళి రోజు అవ్యక్త బాప్ దాదా చెప్పిన మహావాక్యా లు.

జ్ఞానసూర్యుడైన పరమాత్మ శివబాబా తన చైతన్య దీపాలతో మాట్లాడుతున్నారు -

ఈరోజు దీపాల యజమాని తన యొక్క దీపమాలను చూడడానికి వచ్చారు. ఈ చైతన్య దీపాలకు స్మృతిచిహ్నంగానే జడదీపాల యొక్క దీపావళిని జరుపుతున్నారు. భక్తులు జడచిత్రం మరియు జడ దీపాలతో దీపావళి జరుపుకుంటారు మరియు చైతన్య దీపాలైన మీరు, సదా జాగృతి దీపాలైన మీరు, దీపాల యొక్క యజమానితో పిల్లలుగా అయ్యి కలుసుకుంటున్నారు అంటే దీపావళి యొక్క మేళా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక దీపం ఎంత సుందరంగా మెరుస్తూ కనిపిస్తుంది! బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న దీపాలనే చూస్తున్నారు. ఇంత పెద్ద దీపమాల ఇంకెక్కడ ఉండదు. ఎన్నో స్థూల దీపాలు వెలిగించినా కానీ ఈవిధమైన అవినాశి, అమర జ్యోతిస్వరూపుల యొక్క దీపావళి ఎక్కడైనా జరుగుతుందా? ఈవిధమైన దీపావళిని, దీపరాజు, దీపరాణుల యొక్క మేళా ఎప్పుడైనా చూసారా? చూసేవారు కూడా మీరే మరియు జరుపుకునేవారు కూడా మీరే. బాప్ దాదా కేవలం గుజరాత్ యొక్క దీపాలనే చూడటం లేదు. బాప్ దాదా ఎదురుగా దేశ, విదేశాల యొక్క చైతన్య దీపాలు ఉన్నారు. 1000 మంది కంటే ఎక్కువ మంది అన్నయ్యలు, అక్కయ్యలు వచ్చారు. అందువలన క్రింద 3, 4 స్థానాలలో మురళి వింటున్నారు. క్రింద ఉన్నవారు క్రింద లేరు, బాప్ దాదా యొక్క నయనాలలో ఉన్నారు. ఇక్కడ స్థూలమైన స్థానం లేదు, కానీ బాప్ దాదా యొక్క నయనాలలో ఇటువంటి దీపాలకు సదా స్థానం ఉంటుంది.

ఈరోజు దీపరాజు తన యొక్క దీపరాణులకు అమరజ్యోతి యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. సదా అమరభవ. విదేశం వారు కూడా నవ్వుకుంటున్నారు. (డీనెస్ అక్కయ్య అమెరికా నుండి వచ్చారు) ఈమె ఒకరు కాదు, ఒకరిలో అనేకమంది ఉన్నారు. నలువైపుల దేశవాసీ పిల్లలు కూడా స్మృతిలో ప్రేమలో నిమగ్నం అయి ఉన్నారు. ఆ ప్రేమ ఆధారంగానే దూరంగా ఉన్నా కానీ సన్ముఖంగా ఉన్నారు. బాప్ దాదా బేహద్ దీపాల యొక్క దీపావళిని చూస్తున్నారు.

మధువనం యొక్క ప్రాంగణంలో ఈరోజు అనేకమంది పిల్లలు ఫరిస్తా రూపంలో హాజరై ఉన్నారు. సాకారరూపం యొక్క సభ అయితే చాలా చిన్నది కానీ ఆకారీ ఫరిస్తాల సభ చాలా పెద్దది. ఇప్పుడు ఏదైతే పెద్ద హాల్ తయారుచేస్తున్నారో అది కూడా చిన్నది అయిపోతుంది. సాగరుని పిల్లలు ఎంత పెద్ద హాల్ తయారుచేసినా కానీ పిల్లలు సాగరం సమానంగా అయిపోతే ఏం చేస్తారు! ఆకాశం మరియు భూమి ఈ బేహద్ హాలులో ఇమడగలవా! బేహద్ తండ్రి యొక్క పిల్లలు నాలుగు గోడల హద్దులో ఎలా ఉండగలరు! బేహద్ హాలులో ఈ నాలుగు తత్వాలు నాలుగు గోడలుగా పనిచేసే సమయం కూడా వస్తుంది.

ఎంత వరకు పెద్ద హాల్స్ తయారుచేస్తారు! ఈ ప్రకృతి భవిష్యత్తు యొక్క రిహార్సల్ ఇక్కడే అంతిమంలో చూపిస్తుంది. నలువైపుల ఏ తత్వం ద్వారా అలజడి వచ్చినా కానీ ప్రకృతిపతులైన మీరు ఉన్నచోట ప్రకృతి దాసి అయ్యి సేవ చేస్తుంది. కేవలం మీరు ప్రకృతిజీతులుగా అవ్వండి. ప్రకృతి యజమానులైన మిమ్మల్ని ఇప్పటి నుండి ఆహ్వానం చేస్తుంది. ప్రకృతి యజమానులైన మీకు హారం వేసే దివ్యదినం కూడా వస్తుంది. ఏ హారం వేస్తుంది? మంచి గంధం, పూసలహారం వేస్తుందా లేక వజ్రాలు, రత్నాల యొక్క హారం వేస్తుందా? ప్రకృతి సహయోగం అనే హారం వేస్తుంది. ఎక్కడ ప్రకృతిజీతుల పాదం ఉంటుందో, స్థానం ఉంటుందో అక్కడ ఏ నష్టం జరగదు. ఒకటి, రెండు ఇళ్ళ ముందు నష్టం జరుగుతుంది కానీ మీరు రక్షణగా ఉంటారు. ఇది జరుగుతుంది, తుఫాన్ వస్తుంది, భూకంపం వస్తుంది అని ఎదురుగా కనిపిస్తుంది. అది వారికి శూలంలా ఉంటుంది. ఇక్కడ మీకు ముళ్ళులా అనిపిస్తుంది. అక్కడ అరుస్తూ ఉంటారు, ఇక్కడ మీరు అచంచలంగా ఉంటారు. అందరూ స్థూల, సూక్ష్మ సహయోగం తీసుకోవడానికి మీ దగ్గరకు పరుగు పెడతారు. మీ స్థానం రక్షణా స్థానంగా అవుతుంది. అప్పుడు అందరి నోటి నుండి ఓహో ప్రభు నీ యొక్క లీల అపరం అపారం అనే మాట వస్తుంది. ధన్యులు, ధన్యులు మీరు పొందారు, మేము తెలుసుకోలేదు, పోగొట్టుకున్నాము అనే మాట నలువైపుల నుండి వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు? విధాత యొక్క పిల్లలు విధాతగా మరియు వరదాతగా అవుతారు. కానీ దీనిలో కూడా రక్షణ తీసుకునేవారు కూడా స్వతహాగా నెంబర్ వారీగా ఉంటారు. ఎవరైతే ఇప్పటి నుండి అంతిమం వరకు అంటే స్థాపన యొక్క ఆది నుండి ఇప్పటి వరకు కూడా సహయోగం యొక్క భావంలో ఉంటారో, విరోధ భావంలో ఉండరో, అంగీకరించడం, అంగీకరించకపోవటం ఇది వేరేవిషయం కానీ ఈశ్వరీయ కార్యంలో లేదా ఈశ్వరీయ పరివారం పట్ల విరోధ భావానికి బదులు కార్యం మంచిది లేక కార్యకర్త మంచివారు, ఇదే కార్యం పరివర్తన చేస్తుంది. ఇలా రకరకాలుగా సహయోగం యొక్క భావన కలిగిన వారు అటువంటి అవసర సమయంలో ఆ భావనకి ఫలంగా సమీప నెంబర్ లో ప్రాప్తి యొక్క అనుభవం చేసుకుంటారు. అంటే రక్షణకు అధికారిగా అవుతారు. ఇక ఈ భావనలో శాతం ఉన్నవారు ఆ శాతం ప్రకారం రక్షణ యొక్క బిందువు పొందుతారు. ఇక మిగిలినవారు అంటే చూస్తూ ఉండేవారు చూస్తూనే ఉండి పోతారు. ఎవరైతే ఇప్పుడు కూడా మీ కార్యం ఏమిటో చూస్తాము లేక మీకు ఏమి లభించిందో చూస్తాము, ఏదైనా జరిగినప్పుడు చూస్తాము ఇలా సమయం యొక్క నిరీక్షణలో ఉండేవారు రక్షణ తీసుకోవడానికి కూడా అధికారిగా కాలేరు. ఆ సమయంలో కూడా చూస్తూనే ఉండిపోతారు. మాకు ఎప్పుడు అవకాశం వస్తుందో అని నిరీక్షణలో ఉండిపోతారు ఇలా దూరంలో నిరీక్షణలో ఉండే ఆత్మలకు కూడా మీరు మాస్టర్ జ్ఞానసూర్యులుగా, విశ్వ కళ్యాణకారిగా అయ్యి శుభభావన, శ్రేష్టకామన యొక్క కిరణాలు నలువైపుల వ్యాపింపచేస్తారు. అప్పుడు ఎంత విరోధి ఆత్మలైనా పశ్చాత్తాపం యొక్క అగ్నిలో స్వయం కాలిపోతూ అశాంతిని అనుభవం చేసుకుంటారు మరియు మీరు శీతలదేవీలుగా అయ్యి దయ, కృప యొక్క శీతల కిరణాల ద్వారా విరోధి ఆత్మలను కూడా శీతలంగా చేస్తారు. ఆ సమయంలో వారు ఓ మాతా! ఓ మాతా! అంటూ విరోధికి బదులు మీ భక్తులుగా అయిపోతారు. వీరే మీ లాస్ట్ భక్తులు. కనుక విరోధి ఆత్మలకు కూడా అంతిమంలో భక్తి యొక్క బిందువు తప్పకుండా ఇస్తారు. వరదాని అయ్యి భక్తభవ యొక్క వరదానం ఇసారు. ఎందుకంటే విరోధులైనా మీ సోదరాత్మలే కదా! కనుక సోదరుల సంబంధం నిలుపుకునే వరదానిగా అయ్యారా? ఏవిధంగా అయితే ప్రకృతి మిమ్మల్ని ఆహ్వానం చేస్తుందో అదేవిధంగా మీరందరు కూడా సంపన్న స్థితిని ఆహ్వానిస్తున్నారా? ఈ దీపావళి జరుపుకోండి. వారు లక్ష్మిని ఆహ్వానిస్తున్నారు, మీరు దేనిని ఆహ్వానిస్తారు? వారైతే ధనదేవిని ఆహ్వానిస్తారు, మీరందరు ధనవాన్ భవ యొక్క స్థితిని ఆహ్వానం చేయండి. ఈ విధమైన దీపావళిని జరుపుకోండి. ఏమిచేయాలో అర్థమైందా? మంచిది

ఈవిధమైన దీపావళి యొక్క దీపాలకు, సదా సర్వఖజానాలతో సంపన్నంగా అయ్యే ధనవాన్ పిల్లలకు, సదా అమరజ్యోతి భవ పిల్లలకు, సదా ప్రతి ఆత్మకు శుభభావన యొక్క ఫలం ఇచ్చేవారికి, మహాదాని పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.