03.11.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


యుద్ద వీరునిగా కాదు, బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా అవ్వండి.

దూరదేశంలో ఉండే పరదేశీ బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ఈరోజు దూరదేశంలో ఉండే పరదేశీ తన యొక్క పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. పిల్లలకు కూడా స్వదేశం యొక్క స్మృతి ఇప్పించడానికి వచ్చారు మరియు సమర్ధంగా చేసి వెంట తీసుకువెళ్ళడానికి వచ్చారు. స్వదేశం స్మృతిలోకి వచ్చింది కదా? ఇది పరాయి దేశం మరియు పరాయిరాజ్యం దీనిలో అన్నీ పాతవే పాతవి కనిపిస్తాయి. వ్యక్తులను చూసినా, వస్తువులను చూసినా ఎలా కనిపిస్తాయి? అన్నీ శిధిలావస్థకు వచ్చేసాయి. నలువైపుల అంధకారం నెలకొని ఉంది. అటువంటి దేశంలో మీరందరు బంధనాలలో బందీ అయిన బంధనయుక్త ఆత్మగా అయిపోయారు. అటువంటి సమయంలో బాబా వచ్చి స్వ స్వరూపం మరియు స్వదేశం యొక్క స్మృతి ఇప్పించి బంధనముక్తులుగా చేసి స్వదేశం తీసుకువెళ్తున్నారు. వెనువెంట స్వరాజ్యాధికారిగా చేస్తున్నారు. కనుక పిల్లలందరు స్వదేశం వెళ్ళడానికి తయారుగా ఉన్నారా? మీరు ఒక డ్రామా చూపిస్తారు కదా - స్వర్గంలోకి వెళ్ళాలని ఉన్నా కానీ ఎవరో విశేషమైన వారు మాత్రమే వెళ్ళగలరు. అలాగే మీరు కూడా వెళ్తాము వెళ్తాము .... అనేవారు కాదు కదా? కర్మలఖాతా పూర్తి చేసుకున్నారా లేక ఇప్పుడు ఏదైనా కొద్దిగా ఉందా? మీ కర్మలఖాతా సమాప్తి యొక్క సమారోహం జరుపుకున్నారా లేక ఇప్పటి వరకు తయారీలు చేస్తున్నారా? అంతిమంలో ఈ సమారోహం జరుపుకుంటాము అని భావించడం లేదు కదా? సమాప్తి సమారోహం ఇప్పుడు జరుపుకున్నప్పుడే అంతిమంలో సంపూర్ణత యొక్క సమారోహం జరుపుకుంటారు. ఈ పాత కర్మలఖాతాను సమాప్తి చేసుకోవాలి. అది ఇప్పటినుండే చేయాలి అటువంటి చాలా సమయం యొక్క బంధనముక్త ఆత్మయే చాలా సమయం యొక్క జీవన్ముక్తి పదవిని పొందుతుంది. అంతిమం వరకు యుద్ధం చేసేవారు యుద్దవీరునిగానే ఉండిపోతారు. ఎవరైతే అంతిమం వరకు యుద్ధజీవితంలో ఉంటారో వారికి ఏమి ప్రాలబ్దం ఉంటుంది? వీరుని జీవితం అనేది బాల్యం. ఇప్పుడు స్వరాజ్యాధికారిగా అయిపోయారు కదా! స్మృతి యొక్క తిలకధారులుగా, బాబా యొక్క హృదయ సింహాసనాధికారులుగా అయ్యారు. సింహాసనాధికారులు వీరునిగా ఉంటారా? యుద్దానికి ప్రాలబ్దంగానే సింహాసనం మరియు కిరీటం లభించాయి. ఇది వర్తమాన ప్రాలబ్దం లేక ప్రత్యక్షఫలం. ఇది లభించలేదా? సంగమయుగం యొక్క ప్రాలబ్దం పొందారా లేక పొందాలా? ఏమి పాట పాడుతున్నారు? పొందవలసినదంతా పొందారా లేక పొందాలా? వర్తమాన ప్రాలబ్దంతో భవిష్య ప్రాలబ్దానికి సంబంధం ఉంది కదా! అంటే భవిష్యప్రాలబ్ధం 2500 సంవత్సరాలు అయితే వర్తమాన ప్రాలబ్ధం అంతిమంలో 5 నెలలు లేదా 6 నెలలు లేక 5 రోజులు, లేక 4 గంటలు...... ఇలా ఉంటుందా? లేక చాలా సమయం ఉంటుందా? ఒకవేళ సంగమయుగం యొక్క ప్రాలబ్దం చాలా సమయం లేకపోతే చాలా సమయం భవిష్య ప్రాలబ్దం ఎలా లభిస్తుంది? అక్కడ 2.500 సంవత్సరాలు అయితే ఇక్కడ 25 సంవత్సరాలైనా ఉండదా? డైరెక్ట్ బాబాకి పిల్లలుగా అయ్యి సంగమయుగం యొక్క సదాకాలిక వారసత్వం పొందకపోతే ఇంకేమి పొందినట్లు? సర్వఖజానాల యజమానికి పిల్లలుగా అయ్యి ఖజానాలతో సంపన్నంగా కాకపోతే యజమాని పిల్లలు అయ్యి ఏమి చేసినట్లు?

సఫలత మా యొక్క జన్మసిద్ధ అధికారం - ఇలా చెప్తూ సదా సఫలత యొక్క అనుభవం చేసుకోకపోతే జన్మసిద్ధ అధికారి అయ్యి ఏమి చేసినట్లు? భాగ్యవిధాత అయిన ఇద్దరి తండ్రులకు పిల్లలుగా అయ్యి సదా పదమాపదమ్ భాగ్యశాలిగా కాకపోతే ఇద్దరి తండ్రులకు పిల్లలుగా అయ్యి ఏమి చేసినట్లు? శ్రేష్టకర్మల యొక్క మరియు శ్రేష్ట చరిత్రను తయారుచేసుకునే అతి సహజవిధి, వరదాత అయిన బాబా ఇచ్చారు. అయినప్పటికీ సిద్ది స్వరూపంగా అవ్వకపోతే ఏమి చేసినట్లు?

యుద్ధం చేయటం, శ్రమ చేయటం, నెమ్మది నెమ్మదిగా విశ్రాంతిగా నడవటం ఇదే ఇష్టమా ఏమిటి? యుద్ధమైదానం ఇష్టంగా అనిపిస్తుందా? హృదయసింహాసనం ఇష్టం కాదా? ఒకవేళ సింహాసనమే ఇష్టం అయితే సింహాసనం దగ్గరికి మాయ రాదు. సింహాసనం దిగి యుద్దమైదానంలోకి వెళ్ళినప్పుడు శ్రమ చేయవలసి వస్తుంది. కొంతమంది పిల్లలు కొట్టుకోకుండా, దెబ్బలాడకుండా ఉండలేరు. ఒకవేళ ఎవరు దొరకకపోతే తమలో తామే ఏదో పునుగులాడుతూ ఉంటారు. యుద్ధం యొక్క సంస్కారం రాజ్యసింహాసనాన్ని కూడా వదిలించి యుద్ధమైదానంలోకి తీసుకువస్తుంది. ఇప్పుడు యుద్ధం యొక్క సంస్కారాన్ని సమాప్తి చేయండి. అప్పుడు చాలా సమయం యొక్క భవిష్య ప్రాలబ్దం పొందుతారు. అంతిమం వరకు యుద్ధం యొక్క సంస్కారం ఉంటే ఎలా అవుతారు? చంద్రవంశీ అవ్వవలసి ఉంటుంది.

సూర్యవంశీయుల యొక్క గుర్తు - సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. సదా అతీంద్రియసుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. చంద్రవంశీ రాముడిని ఎప్పుడు ఊయలలో ఊపరు, నాట్యం కూడా చూపించరు. యుద్ధం యొక్క అంబులపొదిని చూపిస్తారు. తరువాత రాజ్యభాగ్యం లభిస్తుంది. సగం రాజ్యభాగ్యం అంటే చాలా కాలం యొక్క రాజ్యభాగ్యం అవ్వలేదు కదా! అందువలన చాలా కాలం ఊయలలో ఊగుతూ ఉండండి. సర్వులతో కలిసి సంతోషంతో నాట్యం చేయండి. దీనినే సంగమయుగం యొక్క ప్రాలబ్ధ స్వరూపం అంటారు. పురుషార్థం అనే మాట ఎప్పటి వరకు అంటారు? ఇప్పుడిప్పుడే పురుషార్ధిగా, ఇప్పుడిప్పుడే ప్రాప్తి పొందేవారిగా ఉండాలి. సంగమయుగంలో పురుషార్ధి, సత్యయుగంలో ప్రాలబ్ది అని కాదు. సంగమయుగం యొక్క ప్రాలబ్దిగా అవ్వాలి. ఇప్పుడిప్పుడే బీజం వేయండి, ఇప్పుడిప్పుడే ఫలం తినండి. సైన్స్ వారు ఎలా అయితే ప్రతి కార్యంలో ప్రాప్తి వేగంగా పొందుతున్నారో అదేవిధంగా సైలెన్స్ శక్తి కలిగిన మీరు మీ వేగాన్ని వారికంటే తీవ్రం చేసుకోగలరు కదా! లేక ఒక జన్మలో చేస్తే రెండవ జన్మలో పొందే విధంగా ఉంటారా? వారు ధ్వని కంటే వేగంగా వెళ్ళాలనుకుంటున్నారు. అన్ని కార్యాలు సెకను కంటే తక్కువ సమయంలో చేయాలనుకుంటున్నారు. ఇంత మొత్తం విశ్వాన్ని వినాశనం చాలా కొద్ది సమయంలోనే చేసేవిధంగా వారు తయారైపోయారు. మరి స్థాపనకి నిమిత్తమైన ఆత్మలు సెకనులో చేయటం, సెకనులో పొందటం ఇటువంటి వేగాన్ని అనుభవం చేసుకోలేరా? కనుక ఇప్పుడు ఏమి చేయాలో అర్థమైందా! ప్రత్యక్షఫలం తినండి. ప్రత్యక్షఫలం ఇష్టంగా అనిపించడంలేదా? శ్రమ చేసే ఫలం మంచిగా అనిపిస్తుందా? శ్రమ అనే ఎండినఫలం తిని ఎంత బలహీనంగా అయిపోయారు అంటే నయనహీనులుగా, బుద్ధిహీనులుగా, శ్రేష్ట కర్మ హీనులుగా అయిపోయారు. ఇప్పుడు తాజా అయిన ప్రత్యక్షఫలం తినండి, శ్రమని ప్రేమలోకి మార్చుకోండి. మంచిది.

ఈవిధంగా సదా రాజ్యవంశీ సంస్కారం కలిగిన వారికి, సదా సర్వఖజానాలకు అధికారి అంటే పిల్లల నుండి యజమానులైన పిల్లలకు, సదా సంగమయుగం యొక్క ప్రాలబ్దం పొందే సంస్కారం కలిగిన వారికి, ప్రత్యక్షఫలం తినేవారికి, ఇటువంటి సదా ప్రాప్తి స్వరూపులకు, సదా సర్వబంధనముక్తులుగా, సంగమయుగీ జీవన్ముక్తులకు, సింహాసనాధికారి మరియు కిరీటధారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.