08.11.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


తేడాను సమాప్తి చేసుకునే సాధనం - తక్షణ దానం ద్వారా మహాపుణ్యం పొందండి.

గుణసాగరుడైన అవ్యక్త బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ఈరోజు బాప్ దాదా ఉదయం, వతనంలో జరిగిన బాప్ దాదా యొక్క పరస్పర ఆత్మిక సంభాషణ యొక్క కథను చిత్రాల సహితంగా వినిపిస్తున్నారు. కథ వినటానికి అందరికి అభిరుచి ఉంటుంది కదా! అయితే ఈరోజు యొక్క కథ ఏమిటి? బ్రహ్మాబాబా వతనం యొక్క తోటలో షికారు చేస్తున్నారు. షికారు చేస్తున్న సమయంలో ఎదురుగా ఎవరు ఉన్నారు? బాబా ఎదురుగా సదా ఎవరు ఉంటారు? ఇది అయితే అందరికీ మంచిగా తెలుసు కదా! బాబా పిల్లల యొక్క మాల స్మరణ చేస్తున్నారు. ఏ మాల స్మరణ చేస్తున్నారు? గుణాల యొక్క మాల స్మరణ చేస్తున్నారు. శివబాబా బ్రహ్మాబాబాను అడిగారు - ఏమి స్మరణ చేస్తున్నావు? అని. బ్రహ్మాబాబా చెప్పారు - నీ యొక్క పని ఏదైతే ఉందో అదే నా యొక్క పని, పిల్లల గుణాల యొక్క మాలను స్మరణ చేస్తున్నాను అని చెప్పారు. శివబాబా అడిగారు - ఏమేమి చూసావు? అని. ఏమేమి చూసి ఉంటారు? కొంతమంది పిల్లలకు కేవలం నెక్లెస్ వంటి మాల ఉంది మరియు కొంతమందికి పాదాల వరకు పెద్ద మాల ఉంది, కొంతమంది పిల్లలకు కొన్ని పేటల మాల ఉంది, కొంతమంది పిల్లలు మాలలతో ఎంతగా అలంకరించబడి ఉన్నారంటే ఆ మాలలే వారి వస్త్రం.

బ్రహ్మాబాబా వైరైటీ గుణాల యొక్క మాలలతో అలంకరించబడి ఉన్న పిల్లలను చూసి సంతోషించారు. ప్రతి ఒక్కరికీ మీ గుణాల యొక్క మాల గురించి తెలుసా? ఎంత అలంకరించబడి ఉందో మీ యొక్క చిత్రాన్ని చూసుకుంటున్నారా? బ్రహ్మాబాబా చిత్రకారునిగా అయ్యి చిత్రాలను గీస్తున్నారు. అంటే చిత్రంలో అదృష్ట రేఖలను గీస్తున్నారు. స్వయం యొక్క చిత్రం స్వయమే అంటే అదృష్ట చిత్రాన్ని గీసుకోగలరు కదా? ఫోటో తీయగలరు కదా? ఫోటో తీయటం వస్తుందా? మీదా లేక ఇతరులదా? మీ ఫోటో తీసుకోవటం వస్తుందా? ఈరోజు అందరి ఫోటోలు వతనంలోనే ఉన్నాయి. ఎంత పెద్ద కెమెరా అయి ఉంటుంది! కేవలం మీ ఫోటోయే కాదు, మొత్తం బ్రాహ్మణ పరివారం యొక్క ఫోటో ఉంది. మాలల యొక్క అలంకరణ చూస్తూ కొంతమంది పిల్లల యొక్క విశేషత ఏమి చూసారంటే - ప్రతి గుణం వజ్రం రూపంలో వెరైటీ రూపురేఖలు కలిగిన రంగుతో ఉంది. సబ్జక్టులు అయితే తెలుసు కదా? జ్ఞానం, యోగం, ధారణ మరియు సేవ.

జ్ఞానస్వరూపానికి గుర్తుగా ఏమి రంగు ఉంటుంది? జ్ఞానస్వరూపానికి గుర్తు - గోల్డెన్ కలర్ ( బంగారు రంగు) లైట్ గోల్డ్ కలర్ అయినందువలన ఆ ఒక్క వజ్రంలోనే సర్వరంగులు కనిపిస్తున్నాయి. ఒకే వజ్రంతో రకరకాల రంగులు కిరణాల వలె మెరుస్తూ కనిపిస్తున్నాయి. దూరం నుండి సూర్యుడు మెరుస్తున్నట్లు అనుభవం అవుతుంది. ఆ సూర్యుడి కంటే సుందర సూర్యుని వలె కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని రంగుల యొక్క కిరణాలు దూరం నుండే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వజ్రం ఎలా మెరుస్తుందో ఆ స్మృతికి గుర్తుగా చిత్రం ఎదురుగా వస్తుంది కదా? ఇది అయితే సహజమే కదా? ఇక్కడ స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా ఏమి చేస్తున్నారు? ఎరుపు రంగు ఉపయోగిస్తారు కనుక స్మృతికి గుర్తు - ఎరుపు రంగు. కానీ ఈ ఎరుపు రంగులో కూడా బంగారు రంగు కలిసి ఉంది. అందువలనే మీ యొక్క ఈ ప్రపంచంలో ఆ రంగే లేదు. చెప్పటానికి అయితే ఎరుపు రంగు అని వస్తుంది. ధారణకు గుర్తు - తెలుపు. కానీ ఆ తెలుపులో కూడా ఏవిధంగా అయితే చంద్రుని యొక్క ప్రకాశంలో లైట్ బంగారు రంగు కలపండి లేదా వెన్నెల రంగులో కొద్దిగా పసుపుపచ్చని రంగు కలిపితే అప్పుడు వెన్నెల ఎలా కనిపిస్తుంది అంటే కొద్దిగా బంగారు రంగు కలిసిన కారణంగా ఆ రంగు ఇంకా మెరుస్తూ చాలా సుందరంగా కనిపిస్తుంది సేవకి గుర్తు - ఆకుపచ్చరంగు. సేవ ద్వారా నలువైపుల పచ్చదనంగా చేస్తున్నారు కదా! ముళ్ళ అడవిని పూల తోటగా తయారు చేసేస్తున్నారు.

కనుక నాలుగు రంగులు ఏమిటో ఇప్పుడు విన్నారు కదా? ఈ నాలుగురంగుల వజ్రాల అలంకరించబడిన హారాలు అందరి మెడలో ఉన్నాయి. ఈ హారాల సైజ్ లో మరియు మెరుపు తేడా ఉంది. కొంతమందికి జ్ఞానస్వరూపం యొక్క హారం పెద్దగా ఉంది, కొంతమంది స్మృతి స్వరూపం యొక్క హారం పెద్దగా ఉంది. మరియు కొంతమందికి నాలుగు హారాలు కొంచెం తేడాలో ఉన్నాయి. నాలుగు రంగుల యొక్క అనేక హారాలు కల్గినవారు ఎంత సుందరంగా ఉంటారు? బాప్ దాదా అందరి యొక్క ఫలితం హారాల రూపంలో చూస్తున్నారు. దూరం నుండే వజ్రాలు మెరుస్తూ చిన్న - చిన్న బల్బ్ ల యొక్క లైన్ గా ఉంది. అప్పుడు ఈ చిత్రాల ద్వారా ఫలితం చూసి బ్రహ్మాబాబా చెప్తున్నారు - సమయం యొక్క వేగం అనుసరించి అందరి యొక్క అలంకారం పూర్తి అయ్యిందా? అని. ఎందుకంటే ఫలితంలో తేడా ఉంది. ఈ తేడాను ఏ విధంగా పూర్తి చేయాలి? బ్రహ్మాబాబా చెప్పారు - పిల్లలు శ్రమ అయితే చాలా చేస్తున్నారు. శ్రమతో పాటు అందరికీ కోరిక ఉంది, సంకల్పం కూడా ఉంది. ఇక ఏమి మిగిలి ఉంది? అందరికి తెలుసు కదా? జ్ఞానస్వరూపంగా అయితే అయ్యారు. కానీ తేడా ఉన్న కారణంగానే కొంతమంది నెక్లస్, కొంతమందికి పాదాల వరకు హారాలు ఉన్నాయి. అవి కూడా అనేక పేటలుగా ఉన్నాయి. వినేవారు ఒక్కరే, వినిపించేవారు ఒక్కరే, వీధి కూడా అందరికి ఒకటే మరియు విధాత కూడా ఒక్కరే, విధానం కూడా ఒక్కటే. కానీ తేడా ఏమి ఉంటుంది? సంకల్పం కూడా ఒక్కటే, సంసారం కూడా ఒక్కటే మరలా తేడా ఎందుకు?

బ్రహ్మాబాబాకీ ఈరోజు పిల్లలపై చాలా - చాలా స్నేహం వస్తుంది. అందరి చిత్రాలను సంపన్నంగా చేయడానికి తీవ్రమైన ఉత్సాహం వస్తుంది - ఇప్పుడిప్పుడే పిల్లలందరినీ హరాలతో అలంకరించాలి అని. బాబా అయితే అలంకరింప చేస్తారు. కానీ ధారణ చేసే సమర్థత కూడా ఉండాలి కదా! సంభాళించే సమర్థత కూడా ఉండాలి. కనుక బ్రహ్మబాబా శివబాబాను అడిగారు విషయం ఏమిటి? పిల్లలు వెంట రావడానికి సంపూర్ణంగా ఎందుకు అలంకరించుకోవటం లేదు? వెంట అయితే అలంకరించుకున్న వారే వెళ్ళగలరు. కారణం ఏమిటి? శివబాబా చెప్పారు చాలా చిన్న తేడా ఉంది. చాలా ఆలోచిస్తున్నారు. చాలా చేస్తున్నారు. కానీ కొంతమంది ఏదైతే ఆలోచిస్తున్నారో అది వెంటనే చేస్తున్నారు. అంటే ఆలోచించడం, చేయడం రెండూ వెనువెంట ఉంటున్నాయి. వారు సంపన్నంగా అయిపోతున్నారు మరియు కొంతమంది. ఏది ఆలోచిస్తున్నారో అది చేస్తున్నారు. కానీ ఆలోచించడం మరియు చేయటంలో కొంత ఆలస్యం అవుతుంది. చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. కానీ కొంచెం సమయం తర్వాత చేస్తున్నారు. ఆ సమయంలో చేయటం లేదు. అందువలన ఆ సమయంలో సంకల్పంలో ఉన్న తీవ్రత, ఉత్సాహం - ఉల్లాసాలు సమయంలో తేడా రావటం వలన శాతం తక్కువ అయిపోతున్నాయి.

ఏవిధంగా అయితే వేడి పదార్థం లేక తాజా పదార్థం అన్న దాని యొక్క అనుభవం మరియు చల్లబడిపోయిన లేదా నిలవ ఉన్న పదార్థం తిన్న దానికి ఉన్న అనుభవంలో తేడా ఉంటుంది కదా! తాజా పదార్థం యొక్క శక్తి మరియు నిలవ ఉన్న పదార్థం యొక్క శక్తిలో తేడా ఉంటుంది కదా! పదార్థం ఎంత గొప్పది అయినా నిలవ ఉన్న పదార్థం యొక్క ఫలితంలో తేడా ఉంటుంది కదా! అదేవిధంగా సంకల్పం చేసిన వెంటనే ఆ సమయంలోనే ప్రత్యక్షంలోకి తీసుకురావటం వలన వచ్చే ఫలితంలో మరియు ఈరోజు అలోచించి, రేపో ఎప్పుడో చేసిన దాని యొక్క ఫలితంలో తేడా ఉంది కదా! మధ్యలో సమయం తేడా వచ్చిన కారణం 1. శాతంలో తేడా వచ్చేస్తుంది. 2. సమస్యలనే విఘ్నాలు కూడా వచ్చేస్తాయి. అందువలనే ఆలోచించడం మరియు చేయటం వెనువెంట ఉండాలి. దీనినే తక్షణ దానం మహాపుణ్యం అంటారు. లేకపోతే మహాపుణ్యానికి బదులు పుణ్యం వస్తుంది. అంటే తేడా వచ్చేసింది కదా? మహాపుణ్యం యొక్క ప్రాప్తిలో, పుణ్యం యొక్క ప్రాప్తిలో తేడా ఉంటుంది. కనుక కారణం ఏమిటో అర్థమైంది? చిన్న కారణం అంతే, చేస్తున్నారు. కానీ ఇప్పుడే చేయడానికి బదులు ఎప్పుడో చేస్తున్నారు. అందువలన శ్రమ ఎక్కువ చేయవలసి వస్తుంది. కనుక బ్రహ్మాబాబా పిల్లలతో చెప్పారు - ఇప్పుడు ఈ కారణాన్ని నివారణ చేయండి అని. కనుక ఈరోజు కథ విన్నారు కదా? ఇద్దరి తండ్రుల మధ్య జరిగిన కథ ఇది. ఇప్పుడు ఏమి చేస్తారు? నివారణ చేయండి. నివారణ చేయడమే నిర్మాణం చేయడం అవుతుంది. కనుక స్వయంలో కూడా నవ నిర్మాణం మరియు విశ్వంలో కూడా నవ నిర్మాణం చేయాలి. మంచిది.

ఈవిధంగా సదా అలంకరించబడి ఉండే వారికి, ఆలోచించడం మరియు చేయడం సమానంగా చేసుకునేవారికి, సదా బాబా సమానంగా తక్షణమే దానం చేసి మహాపుణ్యం పొందే పుణ్యాత్మలకి, ఇద్దరి తండ్రుల యొక్క శుభ కోరికను పూర్తి చేసేవారికి, ఇటువంటి సంపన్న ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.