11.11.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బిందువు యొక్క గొప్పతనం.

జ్యోతిబిందు స్వరూపుడు శివబాబా నిరాకార జ్యోతిబిందు ఆత్మలతో మాట్లాడుతున్నారు -

ఈరోజు స్నేహసాగరుడైన బాబా తన యొక్క స్నేహీ పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. బాబా యొక్క స్నేహంలో దూర దూరాల నుండి పరుగు పెట్టుకుంటూ కలయిక స్థానానికి చేరుకున్నారు. బాప్ దాదా ఇటువంటి స్నేహీ ఆత్మలకు రిటర్ను‌గా స్నేహం మరియు సహయోగం సదా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు మరియు ఇస్తూనే ఉంటారు.

అన్ని స్థానాలలోని స్నేహి ఆత్మలు ఇప్పుడు కూడా సూక్ష్మఫరిస్తా రూపంలో ఈ కలయిక యొక్క సభలో ఎదురుగా ఉన్నారు. బాప్ దాదా డబుల్ సభను చూస్తున్నారు. 1. సాకార శరీరధారులు అయ్యి ఈ భూమిపై కూర్చున్నవారిని చూస్తున్నారు. 2. ఆకార శరీరధారి, వారికి ఈ భూమిపై స్థానం అవసరం లేదు, భూమికి అతీతంగా లైట్ రూపంలో లైట్ ఆసనధారిగా ఉంటారు. కొంచెం స్థానంలోనే చాలా మంది కనిపిస్తారు. ఈ రెండు సభలను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు.
బాప్ దాదా పిల్లల యొక్క స్నేహశక్తిని చూస్తున్నారు. స్నేహశక్తితో సెకనులో ఎంత దూరం నుండి అయినా సమీపంగా చేరుకుంటున్నారు. ఎంతగా స్నేహశక్తి ఉన్నతంగా ఉంటుందో అంతగా సమీపంగా చేరుకునే వేగం కూడా ఉన్నతంగా ఉంటుంది. ఎంతో అమూల్యరత్నాలు ఎదురుగా వస్తున్నారు! ఒకొక్క రత్నం యొక్క మహిమ చాలా ఉన్నతమైనది. ఏ మహారథీ యొక్క వర్ణన చేయను! దీపం దగ్గరికి దీపపు పురుగులు వస్తున్నాయి. పిల్లలందరికీ బాప్ దాదా సదా సహజయోగిభవ! అనే వరదానం ఇస్తున్నారు. కేవలం ఒక బిందువునే స్మృతి చేయండి. అన్నింటికంటే సరళమైనది - బిందువు. బాప్ దాదా కేవలం బిందువు యొక్క లెక్కయే చెప్తున్నారు. స్వయం కూడా బిందురూపం అవ్వండి, స్మృతి కూడా బిందువుని చేయండి మరియు డ్రామా యొక్క ప్రతి రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత లేదా చేసిన తర్వాత బిందువు పెట్టండి. ఒక బిందువులోనే మీరు, బాబా మరియు రచన అన్నీ వచ్చేస్తాయి. తెలుసుకోవటం కూడా ఏమి తెలుసుకోవాలి బిందువుని తెలుసుకోవాలి. చేసేది కూడా ఏమిటి - బిందువుని స్మృతి చేయాలి. ఈ బిందువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే సహజయోగిగా కాగలరు. ఎంత పెద్ద విస్తారం అయినా బిందువులో ఇమిడి ఉంటుంది. బీజం బిందువు. దీనిలోనే మొత్తం వృక్షం ఇమిడి ఉంటుంది. ఆత్మ బిందువు దానిలోనే 84 జన్మల యొక్క సంస్కారం నిండి ఉంది. 5,000 సంవత్సరాల యొక్క డ్రామా ఇప్పుడు సంగమయుగం యొక్క అంతిమంలో సమాప్తి చేస్తున్నారు, ఇప్పుడు డ్రామా యొక్క చక్రం పూర్తి అయిపోయింది. అంటే ఏ చక్రం అయితే పూర్తి అయిపోతుందో దానికి పుల్ స్టాప్ అంటే బిందువు పెట్టండి, బిందువు అయ్యి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. బిందువుతో పాటు బిందువు అయ్యి వెళ్ళాలి. ఇల్లు కూడా బిందువుల యొక్క ఇల్లు. ఆ బిందువులోనే సంకల్పం, కర్మ, సంస్కారం అన్నీ గుప్తం అయ్యి ఉన్నాయి అనగా బిందువు పెట్టబడి ఉంటాయి. బాబా సర్వగుణాల, సర్వజ్ఞాన, సర్వఖజానాల సాగరుడు ...... కానీ సాగరుడు కూడా బిందువు. సంబంధ, సంప్రదింపుల్లోకి వచ్చినప్పుడు కూడా అందరి మస్తకంలో ఏమి మెరుస్తుంది - బిందువు. సర్వకార్యకర్త ఎవరు? బిందువే కదా! భూమి నుండి చంద్రుని వరకు చేరుకున్నది కూడా బిందువే చేరుకున్నది. అలాగే మీరు శాంతిశక్తితో మూడు లోకాల వరకు ఏమి చేరుకుంటుంది - బిందువే చేరుకుంటుంది. కనుక సైన్స్ శక్తి, లేదా సైలెన్స్ శక్తి, నిర్మాణం చేసే శక్తి, లేదా నిర్వాణంలోకి వెళ్ళే శక్తి అన్నీ ఉన్నవి బిందువులోనే కదా! బీజం ద్వారా మొత్తం వృక్షం విస్తారం పొందుతుంది కానీ విస్తారం తర్వాత దేనిలో ఇముడుతుంది? బీజం అంటే బిందువులో ఇముడుతుంది. కనుక అనాది, అవినాశి బిందువు కదా! మీరు కూడా మూడులోకాల యొక్క జ్ఞానం, మూడు కాలాల యొక్క జ్ఞానం పొందుతున్నారు కానీ పొందేది ఎవరు? బిందువు. ఆది నుండి అంతిమం వరకు వెరైటీ పాత్ర అభినయించారు కానీ పాత్రధారి ఎవరు? ఎవరు పాత్ర అభినయించారు? బిందువే కదా? కనుక మొత్తం గొప్పతనం అంతా బిందువుకే ఉంది మరియు బిందువుని తెలుసుకున్నారు అంటే అన్నీ తెలుసుకున్నట్లే, అన్నీ పొందినట్లే. బిందురూపంలో స్థితులై ఏ సంకల్పం చేసినా, ఏ భావన పెట్టుకున్నా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా ఎలాగైతే బిందువు ఉన్నతమైనదో అదేవిధంగా ఈ అన్ని విషయాలు ఉన్నతంగా అవుతాయి అంటే స్వతహాగానే శ్రేష్టంగా అవుతాయి. ఆత్మికశక్తి కూడా బిందువే, ఇది స్థాపన యొక్క శక్తి మరియు వినాశనం యొక్క అణుశక్తి కూడా బిందువే, వినాశనం కూడా బిందువుతోనే జరుగుతుంది మరియు స్థాపన కూడా బిందువుతోనే జరుగుతుంది. సృష్టిచక్రం యొక్క ఆదిలో కూడా బిందువు అయ్యి దిగుతున్నారు మరియు అంతిమంలో కూడా బిందువు అయ్యి వెళ్ళిపోతున్నారు. కనుక ఆది - అంతిమ స్వరూపం కూడా బిందువు అయ్యింది. ఎంత సహజం అయిపోయింది! ఒక బిందువుని స్మృతి చెయటం కష్టమా? స్కూల్ లో కూడా పిల్లలకు బిందువు పెటడం సహజం అనిపిస్తుంది. ఎక్కడైనా పెన్సిల్ పడితే బిందువు అయిపోతుంది. ఇంత సహజమైనది స్మృతి ఉండటం లేదా? దీనికంటే సహజమైనది ఇంకేమైనా ఉందా? భక్తిలో అయితే చాలా పెద్ద పెద్ద రూపాలను స్మృతి చేస్తారు. బుద్ధి యొక్క భావన ద్వారా చిత్రం తయారుచేస్తారు. అప్పుడు భక్తి రుజువు అవుతుంది. ఇక్కడైతే జ్ఞానం ద్వారా, మీరు ఎదురుగా ఏమి పెట్టుకుంటున్నారు? బిందువు పెట్టుకుంటున్నారు. ఈ బిందువు యొక్క స్మృతి ద్వారా స్వయమే సిద్ధిస్వరూపంగా అవుతున్నారు. అయితే ఏది సహజం అయ్యింది? మీ బుద్ధిలో బిందువుని పెట్టుకోవటమా లేక ఆకారాన్ని పెట్టుకోవటమా? అందువలన సహజయోగిగా అవ్వండి. బిందువుని తెలుసుకుంటే సదా సహజం అవుతుంది. కనుక స్నేహానికి రిటర్నుగా సహజ సాధన ద్వారా సహజయోగిగా అవ్వండి. అందరు సహజయోగిగా అయ్యారు కదా! విస్తారంలోకి వెళ్తున్నారు, అందువలన కష్టంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే విస్తారంలోకి వెళ్ళటం ద్వారా చాలా ప్రశ్నార్థకాలు పెట్టాలి. ప్రశ్నార్థకం ఎలా అయితే వంకరగా ఉంటుందో అలాగే ఏమిటి? ఏమిటి?..... అనే వంకర మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. బిందువు అయ్యి విస్తారంలోకి వెళ్ళండి అప్పుడు సారం లభిస్తుంది. బిందువుని మర్చిపోయి విస్తారంలోకి వెళ్ళిపోతున్నారు, అందువలన అడవిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ సారం ఏమి ఉండదు. బిందురూపంలో స్థితులై ఉండేవారు సారయుక్తంగా, యోగయుక్తంగా, యుక్తీయుక్త స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారు. వారి యొక్క స్మృతి, మాట, కర్మ సదా సమర్థంగా ఉంటాయి. బిందువు అవ్వకుండా విస్తారంలోకి వెళ్ళేవారు సదా ఎందుకు? ఏమిటి? అనే వ్యర్థమాల మరియు కర్మలో సమయాన్ని, శక్తులను కూడా వ్యర్ధంగా పోగొట్టుకుంటారు. ఎందుకంటే అడవి నుండి బయటపడాలి కదా! కనుక సదా ఏమి స్మృతి ఉంచుకుంటారు? ఒకే విషయం - బిందువు. బిందువుని స్మృతి ఉంచుకోవాలి. సహజమే కదా? భాష తెలిసినా, తెలియకపోయినా కానీ అన్ని భాషలలో బిందువు ఒకటే కదా! మిగతా మాటలు తెలుసుకోలేకపోయినా బిందువు అనే మాటను తెలుసుకోగలరు కదా! అయితే ఏమి చేయాలో అర్థమైందా? బిందువు యొక్క మాటే అద్భుతం. బిందువుగా అయ్యి ఆజ్ఞ ఇస్తే అన్నీ తయారైపోతాయి. సంకల్పం అనే చప్పట్లు మ్రోగించగానే అన్నీ తయారైపోతాయి. బిందురూప స్థితి యొక్క చప్పట్లు ప్రకృతి కూడా వింటుంది, సర్వకర్మేంద్రియాలు కూడా వింటాయి మరియు సర్వ సహయోగులు కూడా వింటారు. బిందువుగా అయ్యి చప్పట్లు మ్రోగించడం (ఆజ్ఞ ఇవ్వటం) వస్తుందా? మంచిది.

సదా అనాది, అవినాశి స్వరూపంలో స్థితులయ్యేవారికి, బిందువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని సదా మహాన్ గా ఉండేవారికి, బిందు స్వరూపంగా అయ్యి సర్వఖజానాల యొక్క సారం పొందే సారయుక్త, యోగయుక్త, జీవన్ముక్తి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.