21.11.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


వదిలేస్తే వదిలిపోతాయి.

సదా కర్మబంధన్ముక్తుడు, బీజరూపి, వృక్షపతి అయిన శివబాబా మాట్లాడుతున్నారు -

సదా సహయోగి, సదా పిల్లలకి తోడు అయిన బాప్ దాదా తన సహయోగి పిల్లలకు, సదా తోడుగా ఉండే పిల్లలకు, ఈరోజు వతనం యొక్క రమణీయ విషయం వినిపిస్తున్నారు. మీరందరు కూడా ఆత్మిక రమణీయ మూర్తులు కదా! కనుక ఇలాంటి పిల్లలకు బాప్ దాదా కూడా రమణీయ విషయం చెపున్నారు. ఈరోజు వతనంలో బాప్ దాదా ఎదురుగా, చాలా సుందరమైన, అర్ధసహితమైన ఒక పెద్ద వృక్షం ప్రత్యక్షం అయ్యింది. వృక్షం చాలా సుందరంగా ఉంది మరియు వృక్షానికి అనేక కొమ్మలు ఉన్నాయి, ఆ కొమ్మలు కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా, కొన్ని లావుగా, కొన్ని సన్నగా ఉన్నాయి. కానీ ఆ అలౌకిక వృక్షంపై రకరకాలైన రంగురంగుల చాలా సుందరమైన పక్షులు ఉన్నాయి. ప్రతి ఒక్క పక్షి తమ తమ కొమ్మపై కూర్చుని ఉంది. పక్షులు ఉన్న కారణంగా వృక్షం చాలా సుందరంగా కనిపిస్తుంది. కొన్ని పక్షులు ఎగురుతూ ఎగురుతూ వచ్చి బాప్ దాదా వ్రేలుపై కూర్చుంటున్నాయి. కొన్ని వచ్చి భుజాలపై కూర్చుంటున్నాయి మరియు కొన్ని బాప్ దాదా చుట్టూ తిరుగుతున్నాయి. కొన్ని కొమ్మపై కూర్చుని దూరం నుండే నయనాలతో సంభాషణ చేస్తున్నాయి. చాలా సంతోషంగా కూడా ఉన్నాయి. కానీ మరికొన్ని ఇతర పక్షుల కలయిక యొక్క ఆటను చూస్తూ సంతోషపడుతున్నాయి, కానీ స్వయం సమీపంగా రావటం లేదు. ఈ దృశ్యం చూసి బ్రహ్మాబాబా నవ్వుకుంటూ చప్పట్లు కొట్టి ఆ పక్షులను పిలవటం ప్రారంభించారు. రండి పిల్లలూ! రండి పిల్లలూ!! అంటూ చాలా మధురంగా పిలుస్తున్నారు. అయినప్పటికీ ఆ పక్షులు రాలేదు. రెక్కలు కూడా ఉన్నాయి. రెక్కలు ఊపుతున్నాయి కూడా కానీ పాదాలతో కొమ్మను ఎంత గట్టిగా పట్టుకున్నాయంటే ఎగిరి సమీపంగా రాలేకపోతున్నాయి. తర్వాత ఏమయ్యింది? అనుకున్నా కానీ ఎగరలేకపోతున్నాయి. బాబా - బాబా అంటూ చాలా ప్రేమతో పిలుస్తున్నాయి, మాట్లాడుతున్నాయి. ఏమి మాట్లాడుతున్నాయి? ఎగిరింపచేయండి, ఎగిరింపచేయండి ...... అని అంటున్నాయి మరియు విడిపించండి, విడిపించండి..... అని అంటున్నాయి. బాప్ దాదా చెప్తున్నారు విడిపించండి, విడిపించండి అని అనటం కాదు, మీరు వదిలేస్తే వదిలిపోతాయి అని. కానీ ఆ పక్షులలో కొన్ని ఎంత చతురమైనవి, బలహీనమైనవి ఉన్నాయంటే ఆ కొమ్మను వదలాలి అనుకోవటం లేదు మరియు బాబా యొక్క తోడు కూడా కావాలనుకుంటున్నారు. చతురమైన పక్షులు రెండు విషయాలు కావాలనుకుంటున్నాయి మరియు బలహీన పక్షులు లేదా అమాయక పక్షులు వదలాలి అనుకుంటున్నాయి. కానీ ముక్తి పొందే యుక్తి రావటం లేదు. మరియు ఇంకా ఆ అమాయక పక్షులు అమాయకత్వం వలన ఇవి వదలాలి అని కూడా తెలియటం లేదు. ఆ పక్షులను చూసి బాప్ దాదా మాటిమాటికి ఇదే మాట చెప్తున్నారు - వదిలేస్తే వదిలిపోతాయి అని. కానీ వారు తమ మాట మాట్లాడుతూనే ఉంటున్నారు. బాప్ దాదా యుక్తి కూడా చెప్తున్నారు అయినా కానీ కొద్దిగా కొమ్మను వదిలి మరలా పట్టుకుంటున్నాయి. అందువలనే పిలుస్తూ, మాట్లాడుతూ ఉన్నాయి కానీ ఎగిరే పక్షిగా అయ్యి బాబాతో కలయిక యొక్క అనుభవం మరియు విశ్వపరిక్రమణ అంటే బేహద్ సేవ యొక్క పరిక్రమణ అనుభవం చేసుకోలేకపోతున్నాయి.

ఇప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు అడగండి - నేను ఎక్కడ ఉన్నాను? కొమ్మపై ఉన్నానా లేక బాబా భుజంపై ఉన్నానా? లేక వ్రేలుపై నాట్యం చేస్తున్నానా? లేక చుట్టూ తిరుగుతూ ఉన్నానా? మీ గురించి మీకు తెలుసు కదా? కనుక వదిలేయండి వదిలిపోతాయి అనే పాఠాన్ని ఎంత వరకు పక్కాగా చేసుకున్నాను? అని మిమ్మల్ని మీరు అడగండి. వదిలేస్తే వదిలిపోతుంది - ఈ పాఠం స్మృతి ఉందా? లేక ఇతరులు విడిపిస్తే విడిపించబడతాను అని అనుకుంటున్నారా? లేక బాబా విడిపిస్తే విడిపోతాను అని భావిస్తున్నారా? ఈ పాఠం చదువుకోవటం లేదు కదా? ఏరకమైన కొమ్మను అయినా మీ బుద్ధి రూపి పాదంతో పట్టుకుని కూర్చోలేదు కదా? ఏరకమైన పాత స్వభావ, సంస్కారాల కారణంగా లేక ఏదోక శక్తి యొక్క లోపం కారణంగా, నిర్బలంగా అయిన కారణంగా కొమ్మపై కూర్చుని ఉండిపోలేదు కదా? ప్రతి విషయంలో వదిలేస్తే వదిలిపోతుంది - ఇది ప్రత్యక్షంలోకి తీసుకువస్తున్నారా? ఇదే పాఠం బ్రహ్మాబాబాని నెంబర్‌ వన్ లోకి తీసుకువెళ్ళింది. ఆది నుండి వదిలేసారు అందువలనే వదిలిపోయాయి కదా! వారు నన్ను వదిలేస్తే వదిలిపోతాయి లేదా సంబంధీకులు వదిలేస్తే వదిలిపోతాయి అని ఆలోచించలేదు. విఘ్నాలు వేసేవారు విఘ్నం వేయటం వదిలేస్తే విడిపోతాను అనుకోలేదు. రకరకాల పరిస్థితులు కూడా నన్ను వదిలేస్తే విడిపోతాను అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పాఠాన్నే సదా స్వయంలో ప్రత్యక్షంగా చూపించారు. అలా మీరు కూడా ఫాలోఫాదర్ చేసారా? అలాంటివారినే ఎవరు చేస్తే వారే అర్జునులు అని అంటారు. అలా అర్జునులుగా అయిపోయారు కదా! అంటే బాబాకి అతి సమీపంగా, సమానంగా, కంబైండ్ గా అయిపోయారు. మీరందరు కూడా బాప్ దాదా కంబైండ్ అని చెప్తున్నారు కదా? కనుక మీరు కూడా ఆవిధంగా అయ్యారా? లేక అప్పుడప్పుడు ఒకవిధంగా, అప్పుడప్పుడు మరోవిధంగా ఉంటున్నారా? (ఆ సమయంలో కరెంట్ పోతూ, వస్తూ ఉంది) ఈ కరెంటు వలె చేయటం లేదు కదా! అప్పుడప్పుడు వదిలేస్తే వదిలిపోతుంది. అని, అప్పుడప్పుడు ఇతరులు వదిలిస్తే వదిలిపోతుంది అనే ఆట ఆడటం లేదు కదా? కరెంట్ కూడా ఆట ఆడుతుంది కదా? ఒకసారి వస్తుంది. ఒకసారి పోతుంది .... ఇది కూడా ఆట కదా! ఇలాంటి ఆట ఆడటంలేదు కదా? సదా ఉంటే మంచిగా అనిపిస్తుందా లేక రావటం, పోవటం మంచిగా అనిపిస్తుందా? కనుక ప్రతి విషయంలో అంటే స్వభావ పరివర్తనలో, సంస్కారాల పరివర్తనలో, ఒకరికొకరు సంప్రదింపుల్లోకి రావటంలో పరిస్థితులు, విఘ్నాలు దాటటంలో ఏ పాఠం ఫక్కా చేసుకోవాలి? స్వయం వదిలేస్తే వదిలిపోతాయి. పరిస్థితి మిమ్మల్ని వదలదు మీరు వదిలేస్తే వదిలిపోతుంది. ఇతర ఆత్మల యొక్క సంస్కారాల గొడవ కూడా వస్తుంది. ఈ విషయంలో కూడా నేను వదిలేస్తే వదిలిపోతాయి అని ఆలోచించండి. అంతే గానీ ఈ గొడవలు పోతే నేను విడిపోతాను అని భావించకండి. ఒకవేళ అది వదిలేస్తే విడిపోతాను అనుకుంటే ఆ గొడవ సమాప్తి అయ్యి రెండవది ప్రారంభం అవుతుంది. కనుక అవి వదిలేస్తే విడిపోతాను అని ఎంతవరకు ఎదురు చూస్తూ ఉంటారు! ఈ మాయ యొక్క విఘ్నాలు మరియు చదువు యొక్క పేపర్స్ సమయం అనుసరించి రకరకాలుగా రావలసిందే. కనుక పాస్ అవ్వాలంటే - నేను చదువుకుంటే పాస్ అవుతాను అనుకోవాలా లేక టీచర్ పేపర్ తేలికగా ఇస్తే పాస్ అవుతాను అనకోవాలా? ఏమి చేయాలి? నేను చదువుకుంటే పాస్ అవుతాను అనేదే సరైనది కదా? అలాగే ఇక్కడ కూడా అన్ని విషయాలలో నేను దాటి వెళ్ళిపోవాలి అని భావించండి. ఫలానా వ్యక్తి పాస్ చేయాలి, ఫలానా పరిస్థితి పాస్ చేయాలి అని ఆలోచించకండి. నేను పాస్ చేయాలి అని భావించండి. దీనినే వదిలేస్తే వదిలిపోవటం అంటారు. ఎదురుచూడకండి, తయారైపోండి. లేకపోతే పక్షులుగా కూడా అయ్యారు, రెక్కలు కూడా ఉన్నాయి మరియు చాలా సుందరంగా కూడా ఉన్నారు కానీ ఏ రకంగా అయినా అంటే స్వయం యొక్క సంస్కారాలు అయినా లేదా ఇతరుల యొక్క స్వభావ, సంస్కారాలను చూడటం మరియు వర్ణన చేసే బలహీనత ఉంటే మరియు పురుషార్ధంలో నిరాధారంగా కాకుండా ఆధారం తీసుకుంటే మరియు ఏదైనా వస్తువు లేక వ్యక్తి యొక్క తగుల్పాటు ఉన్నా, ఏదైనా గుణం లేక శక్తి యొక్క లోపం ఉన్నా .... ఇవన్నీ రకరకాలైన కొమ్మలు. కనుక ఈ కొమ్మలలో ఏ కొమ్మను పట్టుకుని కూర్చోలేదు కదా? ఒకవేళ ఏ కొమ్మనైనా పట్టుకుంటే సదా బాబా యొక్క వ్రేలు పట్టుకుని నాట్యం చేయలేరు అంటే సదా శ్రీమతం అనే వ్రేలు ఆధారంగా నడిచే సమీప ఆత్మలుగా అనుభవం చేసుకోలేరు. సదా ప్రతీ కర్తవ్యంలో బాబాకి సహయోగి కాలేరు అంటే భుజాలపై నాట్యం చేయలేరు. ఒకరు - సహయోగి, రెండవవారు - అప్పుడప్పుడు సహయోగి అప్పుడప్పుడు వియోగి. ఇలా ఎందుకు ఉంటారు అంటే వారు ఏదోక కొమ్మని పట్టుకుని ఉంటారు. అందువలన సహయోగికి బదులు వియోగి అయిపోతారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - నేనెవరు? అరమైందా! ఈరోజు ఏ పాఠం పక్కా చేసుకున్నారు? వదిలేస్తే వదిలిపోతాయి. పక్కా చేసుకున్నారు కదా! కొమ్మని పట్టుకోరు కదా! ఒకొక్కసారి స్వయంతో అలసిపోతున్నారు, ఒకొక్కసారి ఇతరులతో అలసిపోతున్నారు, ఒకొక్కసారి సేవతో అలసిపోతున్నారు. కొమ్మని పట్టుకుని తర్వాత అరుస్తున్నారు విడిపించండి. విడిపించండి....... పట్టుకున్నది. స్వయం, విడిపించేది బాబా. ఇలా ఎందుకు?అందువలన బాప్ దాదా సదా వదిలేసే యుక్తి చెప్తారు - వదిలేయాల్సింది స్వయం కదా! చేస్తే పొందుతారు. ఇది కూడా బాబాయే చేసేస్తే పొందేది కూడా ఎవరు పొందుతారు? చేయటం బాబా, పొందటం మీరా? అందువలనే బాబా చేసిచేయించేవారిగా అయ్యి మిమ్మల్ని నిమిత్తం చేస్తున్నారు. అయితే మహారాష్ట్ర మరియు రాజస్థాన్ లో అందరూ అందమైన పక్షులే కదా!

బొంబాయిలో మంచి పక్షులు ఉంటాయి కదా! రాజస్థాన్ లో కూడానా? అవ్వటానికి అయితే అందరూ బాబాకి అందమైన పక్షులే, రెక్కలు ఉన్న పక్షులు. కానీ కొమ్మని పట్టుకునే పక్షులా? లేక ఎగిరే పక్షులా అనేది పరిశీలించుకోండి. ఎంత ఎగిరింపజేసినా కొమ్మనే పట్టుకుని ఉంటారు. ఏ విషయానికి అయినా వశీభూతం అయ్యారు అంటే కొమ్మని కాళ్ళతో పట్టుకుని వశీకరణ మంత్రాన్ని మర్చిపోయి వశీభూతం అయిపోతున్నారు. మహారాష్ట్ర పక్షులు ఎలాంటివారు? ఎగిరేపక్షులు, మహారాష్ట్ర గ్రూపు మొత్తం ఎటువంటి పక్షులు? ఎగిరేవారేనా లేక కొమ్మని పట్టుకునేవారా? రాజస్థాన్ నుండి ఎటువంటి పక్షులు వచ్చారు? వదిలేస్తే వదిలిపోతాయా లేక వదిలేశారు మరియు వదిలిపోయాయా? అలసిపోయినప్పుడు కొమ్మని పట్టుకుంటున్నారు. రాజస్థాన్ లో పక్షులు చాలా సుందరమైనవి మరియు ప్రసిద్ధమైనవి. నాట్యం చేసే పక్షులు కదా! ఎవరికీ వశం అవ్వటం లేదు కదా! తిరుగుతూ ఉండే పక్షులు అంటే ఇది చేస్తాం లేదా ఇలా చేసి చూపిస్తాం అని చాలా ఆలోచిస్తారు. కానీ అలా చుట్టుప్రక్కల తిరుగుతూనే ఉంటారు కానీ ఎగరలేరు. అలాంటివారు కూడా చాలామంది ఉన్నారు. చేస్తాం, చేస్తాం, అవుతుంది, చూపిస్తాం , ఆలోచిస్తాం ........ ఇలా ఉంటారు. చేస్తాం, చూస్తాం ఇలా అనేవారు ఇలాంటివారే చుట్టుప్రక్కల తిరిగే పక్షులు. అయితే ఎటువంటి గ్రూపుని తీసుకువచ్చారు. బాబా వారీగా అయ్యారు అంటే అందరూ సుందర పక్షులే. బ్రాహ్మణులుగా అయ్యారు అంటే రంగు కూడా బావుంది. రంగు వచ్చేసింది మరియు రెక్కలు కూడా వచ్చేసాయి. ఇక మిగిలింది - వదిలేస్తే వదలటం. మంచిది, ఈ రోజు రమణీయమైన పిల్లలు వచ్చారు కదా! అందువలన బాప్ దాదా వతనం యొక్క రమణీయ విషయాలు వినిపించారు. మంచిది.

ఈవిధంగా సదా సమానంగా ఉండేవారికి, ఎగిరేపక్షులకు, సదా బేహద్ సేవ అనే పరిక్రమణ చేసేవారికి, సదా సర్వ కొమ్మల యొక్క బంధన నుండి ముక్తులు అయిన వారికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగిరిపోయే స్వతంత్ర పక్షులకు, సదా బాబా వ్రేలు పట్టుకుని నాట్యం చేసేవారికి అంటే శ్రీమతం ఆధారంగా సదా శ్రేష్ట సంకల్పం, మాట మరియు కర్మ చేసే శ్రేష్ట ఆత్మలకు బాబా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.