23.11.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


త్యాగం యొక్క త్యాగం.

సదా సహయోగి, ఆజ్ఞాకారి సుపుత్రులైన పిల్లలతో అవ్యక్త బాప్ దాదా మాటాడుతున్నారు --

ఈరోజు బాప్ దాదా ఎవరిని కలుసుకునేటందుకు వచ్చారు? తెలుసా? ఈ రోజు అనేక భుజాలు కలిగిన బాబా తన యొక్క భుజాలతో అంటే సదా సహయోగి పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. విశేష సహయోగి ఆత్మలు బాబా యొక్క కుడిభుజంగా అయ్యి ప్రతి కార్యంలో ఎంత ఎవరెడీగా ఉన్నారని. బాప్ దాదా డైరెక్టన్ యొక్క సైగ చేయగానే కుడిభుజాలైన పిల్లలు అంటే విశేష భుజాలు అంటే ఆజ్ఞాకారి పిల్లలు - సరే బాబా, మేము సదా తయారు అని అంటారు. బాబా అంటారు - ఓ పిల్లలూ!, పిల్లలు అంటారు - సరే బాబా! ఇటువంటి విశేష భుజాలను బాబా చూస్తున్నారు. నలువైపుల ఉన్న విశేష భుజాలైన పిల్లల ద్వారా బాబా ఇవే మాటలు వింటున్నారు - అలాగే బాబా!, ఇప్పుడే చేస్తాము బాబా! మేము సిద్ధం బాబా! బాబా కూడా సదా అటువంటి పిల్లలను - మధురమైన పిల్లలు! సుపుత్రులైన పిల్లలు! విశ్వానికి అలంకరణ అయిన పిల్లలు! మాస్టర్ భాగ్య విధాతలు! మాస్టర్ వరదాత పిల్లలు! అంటూ పిలుస్తారు.

ఈరోజు బాప్ దాదా ఇటువంటి పిల్లల యొక్క పేర్లు లెక్కిస్తున్నారు. ఎంత మాల తయారుచేసి ఉంటారు? చెప్పండి! చిన్న మాలయా లేక పెద్ద మాల తయారయ్యిందా? ఆ మాలలో మీ నెంబర్ ఎక్కడ ఉంటుంది? అంతిమ ఫలితం యొక్క మాల గురించి చెప్పటం లేదు. వర్తమాన సమయంలో ఇటువంటి కుడిభుజాలు ఎంతమంది ఉన్నారు అని ఆ మాలను తయారు చేస్తున్నారు. వర్తమానం యొక్క నెంబర్ సహజంగా తీయవచ్చు కదా! మాల యొక్క నెంబర్ లెక్క పెడుతూ - పెడుతూ బ్రహ్మాబాబా ఒక విశేష విషయం చెప్పారు, అది ఏమిటి? ఈనాటి విశేషమైన విషయం - కుడిభుజాలు అంటే సహయోగుల యొక్క విషయం. ఈ సహయోగం యొక్క విషయంలో - ప్రవృత్తిలో ఉంటూ ప్రవృత్తికి అతీతంగా ఉండేవారు, వ్యవహారంలో ఉంటూ సదా అలౌకిక వ్యవహారం యొక్క ధ్యాస ఉంచుకునే అతీత మరియు బాబాకి ప్రియమైన విశేష పిల్లల యొక్క విశేషతను చూస్తున్నారు. వాయుమండలం అనే అగ్ని యొక్క సెగకు కూడా అతితంగా ఉన్నారు. బాప్ దాదా ఇటువంటి అగ్ని ప్రూఫ్ అయిన పిల్లలను చూసారు. లౌకికంలో ఉంటూ అలౌకిక పాత్రను అభినయించే డబుల్ పాత్రధారుల యొక్క మహిమ ఈ రోజు చేస్తున్నారు.

డబుల్ పాత్రధారుల యొక్క విశేషతలను వర్ణన చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఎంత అనాసక్తంగా ఉంటున్నారంటే - సంపాదించుకుంటున్నారు, ఆ సంపాదన ద్వారా సుఖసాధనాలను ఎంతగా కావాలంటే అంతగా సమకూర్చుకోవచ్చు, కాని సాధారణంగా తింటున్నారు, సాధారణంగా నడుస్తున్నారు మరియు సాధారణంగా ఉంటున్నారు. మొదట అలౌకిక సేవ కొరకు విశేషంగా ధనం తీసారు. లౌకిక కార్యం చేస్తారు, లౌకిక ప్రవృత్తి, లౌకిక సంబంధ, సంప్రదింపులు నిలుపుకుంటారు మరియు విశాలబుద్ధి కలిగి ఉంటారు. కనుక వారిని కూడా కోపగించుకోనివారు అంటారు. కానీ ఈశ్వరీయ సంపాదన యొక్క రహస్యాన్ని తెలుసుకుని రహస్యయుక్తంగా అయ్యి ధనం తీస్తారు. ఈ విశేషతలో గోపికలు (అక్కయ్యలు) కూడా తక్కువ కాదు. ఈ విధమైన గుప్త గోపికలు కూడా ఉన్నారు, లౌకికంలో ఆఫ్ పార్టనర్ అంటారు కానీ బాబాతో వ్యాపారం చేయటంలో ఫుల్ పార్టనర్ అవుతున్నారు. ఇటువంటి సత్యమైన మనస్సు కలిగిన, విశాల హృదయులైన గోపికలు కూడా ఉన్నారు, పాండవులు కూడా ఉన్నారు. చెప్పాను కదా - ఈరోజు ఇటువంటి పిల్లల యొక్క పేర్లు లెక్క పెడుతున్నారు. అలాగే ఎకానమి మరియు ఏకనామి పిల్లల యొక్క మాలను కూడా చూసారు - తమ సర్వ ఖజానాలు, సమయం, శక్తులు మరియు స్థూలధనం, లౌకికంలో పొదుపు చేసి అలౌకిక కార్యంలో ఏవిధంగా ఉపయోగిస్తున్నారు అని. తమ యొక్క విశ్రాంతి సమయాన్ని కూడా తమ కోసం ఉపయోగించుకోవటం లేదు, ధన సంపాదన ఉన్నప్పటికీ కూడా 75% అలౌకిక కార్యంలో ఉపయోగిస్తున్నారు, నిమిత్త మాత్రంగా లౌకిక కార్యాన్ని నిలుపుకుంటున్నారు. ఈ విధమైన త్యాగవంతులైన పిల్లలు సదా అవినాశి భాగ్యవంతులుగా అవుతారు. కానీ ఈ విధమైన యుక్తియుక్త పాత్రను అభినయించేవారు ఎక్కువ సంఖ్యలో లేరు. వేళ్ళతో లెక్క పెట్టగలిగేంత మంది ఉన్నారు. అయినప్పటికీ డబుల్ పాత్రను అభినయించే విశేష ఆత్మల యొక్క మహిమ తప్పకుండా వర్ణన చేయబడుతుంది. గుప్తదానమే మహాదానం. గుప్త మహాదాని యొక్క విశేషత త్యాగాన్ని కూడా త్యాగం చేస్తారు. శ్రేష్ఠకర్మకి ఫలం లభిస్తుంది అంటే ప్రత్యక్షఫలంగా సర్వుల ద్వారా మహిమ లభిస్తుంది. సేవాధారికి శ్రేష్ఠమహిమ యొక్క సీట్ లభిస్తుంది - గౌరవం, పదవి అనే సీట్ లభిస్తుంది. ఈ సిద్ధి తప్పక లభిస్తుంది. ఎందుకంటే ఈ సిద్ధులు మార్గం యొక్క ఆజ్ఞాపత్రాలు కానీ అంతిమ గమ్యం కావు. అందువలన వీటిని త్యాగం చేసే త్యాగవంతులుగా, భాగ్యవంతులుగా అవ్వండి. దీనినే మహాత్యాగం అంటారు.
ఇప్పుడిప్పుడే చేసారు, ఇప్పుడిప్పుడే తినేస్తే జమ అవ్వదు. ఈ అల్పకాలిక సిద్ధులు, కర్మ యొక్క ప్రత్యక్షఫల రూపంలో తప్పకుండా లభిస్తాయి. ఎందుకంటే సంగమయుగం ప్రత్యక్షఫలం ఇచ్చే యుగం. భవిష్య ఫలం అయితే అనాది నియమం అనుసరించి లభించవలసిందే కానీ సంగమయుగం వరదానియుగం. ఇప్పుడిప్పుడే చేసారు, ఇప్పుడిప్పుడే లభిస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే తినేయకూడదు. ప్రసాదంగా భావించి పంచి పెట్టేయండి లేక బాబా ముందు భోగ్ చేసేయండి. అప్పుడు ఒకటికి కోటిరెట్లు జమ అవుతుంది. కనుక వ్యాపారం చేయటంలో తెలివైనవారిగా అవ్వండి, అమాయకులుగా అవ్వవద్దు. విన్నారు కదా, వీరు రెండవ నెంబర్ వారు. మంచిది మూడవ నెంబర్ గురించి కూడా వింటారా? మూడవ నెంబర్ వారు - సేవలో సహయోగిగా తక్కువగా అవుతారు కానీ మొదట సీట్ తీసుకోవాలి అనుకుంటారు. సర్వఖజానాలు స్వయం యొక్క విశ్రాంతికి ఎక్కువగా ఉపయోగిస్తారు.

మొదటి నెంబర్ వారు - ఏకనామి మరియు ఎకానమి ఆత్మలు, రెండవ నెంబర్‌వారు - సంపాదించుకుంటారు, తినేస్తారు మరియు మూడవ నెంబర్ వారు - సంపాదన తక్కువ, తినటం ఎక్కువ. ఇతరుల యొక్క సంపాదన కూడా తినేసేవారిగా ఉంటారు. 1. శ్రేష్ఠ ఆత్మల భాగ్యం యొక్క లెక్క 2. త్యాగవంతులైన పిల్లలు ప్రత్యక్షఫలాన్ని, సర్వప్రాప్తులను త్యాగం చేస్తారు కానీ మూడవ నెంబర్ పిల్లలు వారి యొక్క లెక్క కూడా స్వయం స్వీకరిస్తారు. సంపాదించేవారు కాదు, కేవలం తినేవారిగా ఉంటారు. అందువలన నెంబర్ వన్ పిల్లలు బరువు దించుకునేవారు, వీరు బరువు పెంచుకునేవారు. ఎందుకంటే శ్రమ చేసిన సంపాదనతో తినటంలేదు. ఇలా తినే, త్రాగే ఆత్మలను కూడా చూసారు.

ఇప్పుడు మూడు నెంబర్స్ గురించి విన్నారు కదా? నేనెవరు? అని ఆలోచించారా? మంచిది అయినప్పటికి ఈ రోజు ఆత్మిక సంభాషణలో - ప్రవృత్తిలో ఉంటూ ఎకానమిగా మరియు ఏకనామిగా ఉండే పిల్లల యొక్క మహిమ మాటిమాటికి జరిగింది. మంచిది.

ఈవిధంగా సదా అలాగే బాబా, మేము హాజరు బాబా అని అనేవారికి, సదా స్వయం యొక్క త్యాగాన్ని కూడా త్యాగం చేసి ఇతరులను భాగ్యవంతులుగా చేసేవారికి, సదా బాప్ దాదాతో శ్రేష్ఠ వ్యాపారం చేసేవారికి, సదా సేవలో సర్వఖజానాలను ఉపయోగించే వారికి, ఈ విధంగా గుప్తదాని, మహాభాగ్యవాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.