26.11.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సహయోగియే సహజయోగి.

రాజఋషి, సహయోగి, సహజయోగి పిల్లలతో అవ్యక్త బాప్ దాదా మాట్లాడుతున్నారు-

ఈరోజు బాప్ దాదా తన యొక్క స్వరాజ్యాధికారి, రాజఋషి పిల్లలను మరియు భవిష్యత్తులో కాబోయే రాజవంశీ పిల్లలను చూస్తున్నారు. అందరూ సహయోగులు అంటే రాజఋషులు. వర్తమాన వరదాని సమయంలో బాప్ దాదా పిల్లలందరికీ విశేషంగా ఏ వరదానం ఇస్తున్నారు? సహజ యోగీభవ. ఈ వరదానాన్ని అనుభవం చేసుకుంటున్నారా? యోగులుగా అయితే చాలామంది అవుతారు కానీ సహజయోగులుగా సంగమయుగీ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలైన మీరు మాత్రమే అవుతారు. ఎందుకంటే మీకు వరదాత బాబా నుండి వరదానం లభించింది. బ్రాహ్మణులుగా అయ్యారు అంటే వరదానం పొంది వరదాని అయ్యారు. ఈ జన్మ యొక్క అన్నింటికంటే మొదటి వరదానం ఇదే. బాబా వరదాత, సమయం వరదాని, మరి మీరు వరదానం పొందే శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ వరదానాన్ని సదా బుద్ధిలో జ్ఞాపకం ఉంచుకోవటమే వరదానాన్ని జీవితంలోకి తీసుకురావటం. ఇటువంటి వరదానం ప్రాప్తించిన ప్రాప్తి స్వరూప ఆత్మగా భావిస్తున్నారా? లేక శ్రమ కూడా చేయవలసి వస్తుందా? సదా వరదాని ఆత్మలేనా? ఈ వరదానాన్ని సదా స్థిరంగా ఉంచుకునే విధి తెలుసా? అన్నింటికంటే సహజ విధి ఏమిటి? తెలుసు కదా! సదా సర్వులకి మరియు సేవలో సహయోగి అవ్వండి. సహయోగిగా అవ్వటమే సహజయోగిగా అవ్వటం. కొంతమంది బ్రాహ్మణాత్మలు సదా సహజయోగాన్ని అనుభవం చేసుకోలేకపోతున్నారు. యోగం ఏవిధంగా చేయాలి? బుద్ధిని ఎక్కడ స్థిరం చేయాలి? ఇంతవరకు ఈ ప్రశ్నలలోనే ఉన్నారు. సహయోగంలో ప్రశ్నలే ఉండవు. మరియు వెనువెంట మీకు వరదానం ఉంది, వరదానంలో శ్రమ ఉండదు. సహజంగా, స్వతహాగా, సదా ఉంటుంది. అంటే సహజయోగి అనే వరదానం పొందిన వరదాని ఆత్మ స్వతహాగానే నిరంతర యోగిగా ఉంటుంది. ఉండటం లేదంటే దానికి కారణం ఏమిటి? ప్రాప్తించిన వరదానాన్ని లేదా బ్రాహ్మణ జన్మ యొక్క అలౌకిక బహుమతిని సంభాళించటం రావటం లేదు. స్మృతి ద్వారా సమర్థంగా ఉండటంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. బ్రాహ్మణులు అయ్యి ఉండి సహజయోగిగా కాకపోతే ఇక బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఏముంది? వరదాని అయ్యి ఉండి కూడా సహజయోగిగా కాకపోతే ఇంకెప్పుడు అవుతారు? సహజయోగం అనేది మా జన్మతోనే లభించిన వరదానం అనే నిశ్చయం, నషా సదా స్మృతిలో ఉంచుకోండి. ఈ వరదానాన్నే సర్వాత్మల పట్ల సేవలో ఉపయోగించండి. సహజయోగిగా అవ్వటానికి సేవలో సహయోగిగా అవ్వటమే విధి.

అమృతవేళ నుండి మొదలుకుని సహయోగిగా అవ్వండి. మొత్తం దినచర్య యొక్క ముఖ్య లక్ష్యం - సహయోగి అవ్వాలి మరియు సహయోగం ఇవ్వాలి. అమృతవేళ బాబాతో మిలనం జరుపుకుని బాబా సమానంగా మాస్టర్ బీజరూపులుగా అయ్యి, మాస్టర్ విశ్వకళ్యాణకారిగా అయ్యి మీకు లభించిన శక్తుల ద్వారా సర్వాత్మల యొక్క వృత్తిని మరియు వాయుమండలాన్ని పరివర్తన చేయడంలో సహయోగులు అవ్వండి. బీజం ద్వారా వృక్షానికంతటికి ఆత్మిక జలాన్ని ఇచ్చే సహయోగులు అవ్వండి. దీని ద్వారా సర్వాత్మలు అనే ఆకులకి ప్రాప్తి అనే నీరు లభించినట్లుగా అనుభవం అవ్వాలి. ఈ విధంగా అమృతవేళ నుండి రోజంతటిలో ఏ పనులు అయితే చేస్తున్నారో ఆ ప్రతి కార్యంలో ఇదే లక్ష్యం పెట్టుకోండి - సహయోగం ఇవ్వాలి. వ్యవహారం యొక్క కార్యార్థం వెళ్తున్నా, కుటుంబ నిర్వహణ కార్యార్ధం వెళ్తున్నా సరే, అదేవిధంగా అలౌకిక సంబంధంలో ఉంటూ అలౌకిక సేవలో ఉంటున్నా సరే. లౌకిక వ్యవహారంలో కూడా స్వయం పట్ల లేదా తోడుగా ఉండేవారి పట్ల శుభభావన మరియు కామనతో వాయుమండలాన్ని ఆత్మికంగా తయారుచేసే సహయోగం ఇచ్చానా? లేక సామాన్య పద్ధతిలోనే మీ విధి నిర్వర్తించి వచ్చారా? పరిశీలించుకోండి. ఎవరికి ఏ వృత్తి అయితే ఉంటుందో వారు ఎక్కడికి వెళ్ళినా తప్పక వారి వృత్తిననుసరించే కార్యం చేస్తారు కదా! అదేవిధంగా మీ అందరి యొక్క విశేష వృత్తి ఏమిటంటే సహయోగిగా అవ్వటం. దానిని మీరు ఎలా మర్చిపోగలరు? ఇలా ప్రతి కార్యంలో సహయోగిగా అయితే సహజయోగిగా అయిపోతారు. ఒక్క సెకను కూడా సహయోగిగా కాకుండా ఉండకూడదు. మనస్సు ద్వారా లేదా వాచా ద్వారా లేదా సంబంధ సంపర్కాల ద్వారా, స్థూల కర్మ ద్వారా ఇలా ఏదోక రకంగా అయినా కానీ తప్పనిసరిగా సహయోగిగా అవ్వాలి. ఎందుకంటే మీరందరూ దాత యొక్క పిల్లలు. దాత యొక్క పిల్లలు సదా ఇస్తూనే ఉంటారు. మరి అయితే ఏమి ఇవ్వాలి? సహయోగం ఇవ్వాలి.

స్వపరివర్తన కొరకు కూడా స్వయం పట్ల సహయోగిగా అవ్వండి. ఏవిధంగా? సాక్షిగా అయ్యి స్వయంపట్ల శుభచింతన యొక్క వృత్తి కలిగి ఆత్మిక వాయుమండలం తయారు చేయటంలో సహయోగిగా అవ్వండి. ప్రకృతి తన వాయుమండలం యొక్క ప్రభావాన్ని అందరికీ అనుభవం చేయిస్తుంది - చలి, వేడి ..... ఇలా ప్రకృతి ప్రభావం వేస్తుంది. అదే విధంగా ప్రకృతిజీత్ - సదా సహయోగి, సహజయోగి ఆత్మలైన మీరు ఆత్మిక వాయుమండలం యొక్క ప్రభావాన్ని అనుభవం చేయించలేరా? సదా స్వయం పట్ల మరియు సర్వుల పట్ల సహయోగం యొక్క శుభభావన ఉంచుకుంటూ సహయోగి ఆత్మగా అవ్వండి. వారు ఇలా ఉన్నారు లేదా ఇలా చేస్తారు ...... ఇలా ఆలోచించకండి. ఎటువంటి వాయుమండలం అయినా, ఎటువంటి వ్యక్తులు అయినా - నేను సహయోగం ఇవ్వాలి అనుకోండి.

ఈ విధంగా బ్రాహ్మణాత్మలందరూ సహయోగులుగా అయిపోతే ఏమి అవుతుంది? అందరూ స్వతహాగానే సహజయోగులు అయిపోతారు. ఎందుకంటే సర్వాత్మలకి సహయోగం లభించటం ద్వారా బలహీనులు కూడా శక్తిశాలిగా అయిపోతారు. బలహీనత సమాప్తి అయిపోతే వారు కూడా సహయోగులుగా అయిపోతారు. ఏ రకమైన బలహీనత ఉన్నా అది కష్టాన్ని, శ్రమని అనుభవం చేయిస్తుంది. శక్తిశాలులకి అన్నీ సహజమే. అందువలన ఏం చేయాల్సి ఉంది? సదా అంటే తనువు ద్వారా లేదా మనస్సు ద్వారా లేదా ధనం ద్వారా అదేవిధంగా మనస్సు ద్వారా లేదా వాచా ద్వారా లేదా కర్మ ద్వారా సహయోగిగా అవ్వండి. మనస్సు ద్వారా లేదా వాచా ద్వారా చేయలేకపోతే కర్మ ద్వారా సహయోగిగా అవ్వండి. బాబాతో సంబంధం జోడింపచేసే లేదా బాబా యొక్క సంప్రదింపుల్లోకి తీసుకువచ్చే సహయోగిగా అవ్వండి. కేవలం సందేశం ఇచ్చే సహయోగిగానే కాదు మీ పరివర్తన ద్వారా సహయోగిగా అవ్వండి. మీకు బాబా నుండి లభించిన సర్వ ప్రాప్తుల యొక్క అనుభవాన్ని వినిపించి సహయోగిగా అవ్వండి. సదా హర్షితంగా ఉండే మీ ముఖం ద్వారా సహయోగిగా అవ్వండి, కొందరికి గుణదానం ద్వారా సహయోగిగా అవ్వండి, కొందరిలో ఉత్సాహ ఉల్లాసాలు పెంచే సహయోగిగా అవ్వండి. దేనిలో సహయోగి కాగలరో దానిలో సదా సహయోగిగా అవ్వండి. ఇదే సహజ యోగం. ఏమి చేయాలో అర్థమైందా? ఇది అయితే సహజమే కదా! ఏది చేయగలరో అది చేయండి, అన్నీ చేయలేకపోతే ఒక్కటి అయినా చేయగలరు కదా! మీలో ఉన్న ఒక్క విశేషతని కార్యంలో ఉపయోగించండి అంటే సహయోగిగా అవ్వండి. ఇది అయితే చేయగలరు కదా! నాలో ఏ విశేషత లేదు, ఏ గుణం లేదు అని అనుకోవటం లేదు కదా! ఎందుకంటే ఇది అసంభవం. బ్రాహ్మణులుగా అవ్వటమే గొప్ప విశేషత. బాబాని తెలుసుకోవటమే గొప్ప విశేషత అందువలన మీ విశేషత ద్వారా సహయోగిగా అవ్వండి. మంచిది.

ఈవిధంగా సదా సహయోగి అంటే సహజయోగులకి, సదా తమ శ్రేష్ఠ వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారుచేసే సహయోగి ఆత్మలకు, బలహీన ఆత్మలకు ఉత్సాహాన్ని ఇప్పించే సహయోగి ఆత్మలకు, అమృతవేళ నుండి ప్రతి సమయం సహయోగిగా అయ్యే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.