28.11.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పూర్వీకులైన మీపై సర్వ ఆత్మలకు ఆశలు.

గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ (వంశానికి ఆది పురుషుడు) మరియు గాడ్ ఫాదర్ బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ఈ రోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ (వంశానికి ఆది పురుషుడు) తన యొక్క మొత్తం వంశావళితో కలుసుకుంటున్నారు. ఎంత పెద్ద వంశావళి అనేది మీ అందరికీ తెలుసు. మీరందరు ఈ వంశావళి యొక్క ఆది పునాది, వంశవృక్షానికి మూల కాండము. మీ ద్వారా వంశావళి ఎలా వృద్ధి అవుతుంది ఈ అన్ని రహస్యాలు మంచిగా తెలుసుకుంటున్నారు కదా? ఏ ఆత్మను చూసినా లేక ఎవరితో సంప్రదింపుల్లోకి వచ్చినా మేము సర్వ ఆత్మలకు పూర్వీకులము మరియు మొత్తం వృక్షం యొక్క శాఖలు, ఉపశాఖలు, అందరికి మూల ఆధారం అంటే పునాది అనే స్మృతి ప్రత్యక్షరూపంలో ఉంటుందా? ఈ శ్రేష్ఠ స్మృతి ద్వారా స్వతహాగానే సమర్థ స్వరూపంగా అయిపోతారు. ఒకవేళ మూల ఆధారం అంటే పునాది బలహీనంగా ఉంటే వృక్షం అంతా బలహీనంగా అయిపోతుంది. పునాది శక్తిశాలిగా ఉంటే వృక్షం కూడా శక్తిశాలిగా ఉంటుంది. వృక్షంలో ప్రతి ఆకుకి బీజంతో పాటు కాండంతో కూడా సంబంధం ఉంటుంది. బీజం యొక్క శక్తి కాండం ద్వారానే శాఖలు, ఉపశాఖలకు చేరుతుంది. ఈ రోజులలో పూర్వ ఆత్మలైన మీ ద్వారా లేదా మూల ఆధారమైన మీ ద్వారా మీ వంశావళికి ఏ శక్తి కావాలి? పూర్వ ఆత్మలైన మిమ్మల్ని సర్వాత్మలు ఏ ఆశలతో స్మృతి చేస్తున్నారు? మాస్టర్ దాత, వరదాతలైన మీ ద్వారా ఏ శుభ కోరిక కోరుకుంటున్నారు? సర్వ ఆత్మల యొక్క అంటే మీ బేహద్ వంశావళి యొక్క శుభ సంకల్పం లేక కోరికలు తెలుసుకుంటున్నారా?

ఈ రోజులలో సర్వ ఆత్మల నుండి ఒకే మాట వినిపిస్తుంది. అందరిదీ ఒకటే మాట. రెండు ఘడియలు సుఖం, శాంతితో జీవించాలి అనుకుంటున్నారు. అశాంతిలో ఉన్నారు. సంపద సాధనాలు ఉన్నప్పటికీ సుఖం మరియు శాంతి యొక్క నిద్ర కళ్ళల్లో లేదు. ఈ రోజులలో చాలా మంది సత్యమైన సుఖం, శాంతి మరియు సత్యమైన సంతోషానికి దాహంగా ఉన్న కారణంగా ఆ మార్గం కోసం వెతుకుతున్నారు. అనేక అల్పకాలిక మార్గాలు అనుభవం చేసుకుంటున్నారు, కానీ సంతుష్టత అనుభవం అవ్వని కారణంగా ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా అనేక మార్గాల నుండి తిరిగి వచ్చేస్తున్నారు. ఇది కూడా కాదు .... ఇది కూడా కాదు .... అంటూ తిరిగి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇది కాదు, ఇది కాదు అనే అనుభవంలోకి వచ్చేస్తున్నారు. సరైన మార్గం వేరే ఏదో ఉంది అనే అనుభూతి చేసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో పూర్వీకులైన మీ కర్తవ్యం - దీపం వలె ఆ ఆత్మలకి మార్గం చూపించాలి. అమరజ్యోతి అయ్యి వారిని అంధకారం నుండి గమ్యానికి తీసుకురావాలి. ఇటువంటి సంకల్పాలు వస్తున్నాయా? పూర్వ ఆత్మలైన మేము సర్వ వంశావళి ముందు ఏదైతే చేస్తామో అదే మొత్తం వంశావళి వరకు చేరుతుంది అనే స్మృతి ఉంటుందా? పూర్వీకులైన మీ సంకల్పం విశ్వం యొక్క వాతావరణాన్ని పరివర్తన చేస్తుంది. పూర్వీకులైన మీ దృష్టి సర్వ వంశావళికి సోదరత్వాన్ని స్మృతి ఇప్పిస్తుంది. పూర్వీకులైన మీ యొక్క బాబా స్మృతి సర్వ వంశావళికి - మా యొక్క తండ్రి వచ్చారు అనే స్మృతి ఇప్పిస్తుంది. పూర్వీకులైన మీ యొక్క శ్రేష్ఠ కర్మ, వంశావళికి శ్రేష్ఠ చరిత్ర అంటే చరిత్ర నిర్మాణం యొక్క శుభ ఆశను ఉత్పన్నం చేస్తుంది.

అందరి దృష్టి పూర్వీకులైన మిమ్మల్నే వెతుకుతుంది. ఇప్పుడు బేహద్ స్మృతి స్వరూపంగా అవ్వండి. అప్పుడు హద్దు యొక్క వ్యర్ధ విషయాలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. వృక్షం తలక్రిందులుగా చూపించినప్పుడు బీజంతో పాటు కాండం కూడా పైనే ఉన్నతంగా ఉంది. డైరెక్ట్ బీజం మరియు ముఖ్యమైన రెండు ఆకులు, త్రిమూర్తి ఆత్మలతో పాటు సమీప సంబంధం కలిగిన ఆత్మలు కాండంలో ఉంటారు. అంటే ఉన్నతమైన స్థితి అయ్యింది! ఈ ఉన్నత స్థితిలోనే ఉంటే హద్దులోని విషయాలు ఎలా అనుభవం అవుతాయి? బాల్యంలో సోమరితనం యొక్క విషయాలుగా అనిపిస్తాయి. ఇప్పుడు మీ యొక్క బేహద్ వృద్ధాప్య స్థితిలోకి రండి. అప్పుడు సదా సర్వ అనుభవీ మూర్తిగా అవుతారు. బేహద్ వృద్ధాప్య స్థితి యొక్క వృత్తి ఏదైతే ఉందో దానిని స్మృతి ఉంచుకోండి. ఇప్పుడు ఇంకా ఎంత కార్యం మిగిలి ఉంది - సదా ఇదే స్మృతిలో ఉండండి. కానీ ఈ కార్యం అంతా సహజంగా ఎలా సంపన్నం అవుతుంది? ఏవిధంగా అయితే మీ యొక్క రచన అయిన సైన్స్ వారు విస్తారాన్ని సారంలోకి మలుస్తున్నారు. అతి సూక్ష్మ, శక్తిశాలి సాధనాలను తయారుచేస్తున్నారు. వీటి ద్వారా సమయం, సంపద, శస్త్రాలు తక్కువలో తక్కువగా ఖర్చు అవుతున్నాయి. మొదట వినాశనం యొక్క కార్యంలో ఎంత పెద్ద సేన, ఎన్ని శస్త్రాలు మరియు ఎంత సమయం ఉపయోగించేవారు! కానీ ఇప్పుడు విస్తారాన్ని సారంలోకి తీసుకువచ్చేసారు కదా! అదేవిధంగా మీరు కూడా మాస్టర్ రచయితగా అయ్యి స్థాపనాకార్యంలో సూక్ష్మశక్తి ద్వారా నిమిత్తంగా అయ్యి స్థూల సాధనాలను కార్యంలోకి తీసుకురండి. లేకపోతే స్థూల సాధనాల యొక్క విస్తారంలో సూక్ష్మశక్తి గుప్తం అయిపోతుంది. ఏవిధంగా అయితే వృక్షం యొక్క విస్తారంలో బీజం దాగిపోతుందో అదేవిధంగా స్థూలసాధనాల యొక్క విస్తారం ద్వారా సూక్ష్మశక్తి యొక్క శాతం తక్కువ అయిపోతుంది. పూర్వీకులైన మీ యొక్క అలౌకికత - సూక్ష్మశక్తి. పూర్వీకుల ద్వారా ఏదో విశేష శక్తి ఉత్పన్నం అవుతుంది అని దీని ద్వారా అందరు అనుభవం చేసుకోవాలి. వంశావళి మీ ద్వారా ఏదోక నవీనత కోరుకుంటుంది. సాధనాల యొక్క శక్తి, వాచాశక్తి ఇవైతే అందరి దగ్గర ఉన్నాయి. కానీ ఏ శక్తి అప్రాప్తిగా ఉంది? శ్రేష్ఠ సంకల్ప శక్తి, శుభ వృత్తి యొక్క శక్తి అప్రాప్తిగానే ఉన్నాయి. స్నేహం మరియు సహయోగం యొక్క దృష్టి ఇవి ఎవరి దగ్గర లేవు. కనుక ఓ పూర్వీకులు! మీ యొక్క వంశావళికి ప్రాప్తి యొక్క ఆశాదీపాన్ని వెలిగించి యదార్ధ గమ్యం వరకు తీసుకురండి. ఏమి చేయాలో అర్థమైందా? ప్రజలు ఏదైతే చేస్తున్నారో అదే మీరు కూడా చేస్తే ఇక మీరు ప్రత్యేకంగా ఏమి చేసినట్లు? మీరు భగవంతుని పిల్లలు, అతీతమైన వారు. ఇప్పుడు వాచా యొక్క బాంబ్స్ వేస్తున్నారు కానీ ఇవన్నీ బేబీ బాంబ్స్ (చిన్నవి) వేసారు, మనస్సు వరకు బాణం వేయలేదు.

ఇక ముందు ఏమి చేయాలి ఈ ప్లాన్ అయితే ఇవ్వాలి కదా! వీరు మంచి కార్యం చేస్తున్నారు అనే మాట వారి నోటి నుండి వస్తుంది. కానీ ఇది ఒకటే సరైన మార్గం అని మనస్సుతో రావాలి. నోటితో వ్యాపారం చేసేవారు చాలామంది ఉంటారు కానీ మనస్సుతో వ్యాపారం చేసేవారు కోట్లలో కొద్దిమంది ఉంటారు. మీరందరు మనస్సుతో వ్యాపారం చేసే పిల్లలు. కనుక ఇప్పుడు ఏమి చేస్తారు? ఇప్పుడు సర్వ ఆత్మలు పూర్వజ ఆత్మలైన మిమ్మల్ని గ్రహించాలి, ప్రాప్తి యొక్క అధికారాన్ని పొందాలి. ఈ విధమైన శక్తిశాలి సేవ యొక్క చక్రం తిప్పండి. ఏదో విన్నాం, మంచిగా విన్నాం అనడానికి బదులు ఏదో లభించింది అనే అనుభవం చేసుకోవాలి. మంచిగా చెప్తున్నారు అని కాదు మంచిగా తయారు చేస్తున్నారు అని అనాలి. తక్కువ ఖర్చు, తక్కువ శక్తి, తక్కువ సమయం, ఈ విధి ద్వారా సిద్ధిస్వరూపంగా అవ్వండి.

నలువైపుల ఉన్నటువంటి పూర్వజ ఆత్మలందరికీ, సదా సర్వుల యొక్క ఆశలను సదాకాలికంగా పూర్తి చేసేవారికి, అప్రాప్తి ఆత్మలకు ప్రాప్తి యొక్క బిందువుని అనుభవం చేయించేవారికి, సర్వులను అనేక మార్గాల నుండి విడిపించి ఒకే మార్గంలోకి తీసుకువచ్చేవారికి, ఈవిధంగా సర్వ ఆత్మలకు మూలాధారమైన వారికి, సదా సర్వ ఆత్మలను ఒకే బాబా యొక్క అధికారిగా చేసేవారికి ఈ విధమైన శ్రేష్ఠ పూర్వీకులకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.